వాషింగ్టన్: భారత్‌లో ఓట్ల లెక్కింపును అమెరికా బిలియనీర్,టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ ప్రశంసించారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 64 కోట్ల ఓట్లను ఒకేరోజు లెక్కించారని, కాలిఫోర్నియాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదని మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కాలిఫోర్నియాలో ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కాలిఫోర్నియా అమెరికాలోనే అత్యంత జనాభా ఉన్న రాష్ట్రం. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఓటర్లు నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కాలిఫోర్నియాలో ఎన్నికలను మెయిల్ పద్ధతిలో కూడా నిర్వహించారు.
మెయిల్ ద్వారా పడ్డ ఓట్లను లెక్కించడమే కాకుండా అవి అసలువేనని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వాళ్లకు ఓటింగ్‌లో ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం డిసెంబర్ 1 వరకు కల్పించారు.దీంతో ఇక్కడి ఫలితం అధికారంగా వెలువడలేదు.
కాలిఫోర్నియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఖాతాలో పడ్డాయి. కాలిఫోర్నియాలో హారిస్ 50 శాతానికిపైగా ఓట్లు సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌నకు కేవలం 36 శాతం మాత్రం ఓట్లు మాత్రమే వచ్చాయి.
India counted 640 million votes in 1 day.
California is still counting votes 🤦♂️ https://t.co/ai8JmWxas6— Elon Musk (@elonmusk) November 24, 2024
ఇదీ చదవండి: హష్ మనీ కేసులో ట్రంప్‌నకు ఊరట
Comments
Please login to add a commentAdd a comment