ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మద్దతు తెలిపారు. సినిమా రంగం సైతం వాటి షూటింగ్‌లను, రిలీజ్‌లను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ హీరో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ సాహసానికి పూనుకున్నాడు. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "ఆడు జీవితం" సినిమాలో మలయాళ టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జోర్డాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ఆపేయాలని అధికారులు కోరారు. అయితే వెనక్కి వచ్చి, తిరిగి మళ్లీ చిత్రీకరణ జరుపుకోవాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఉద్దేశ్యంతోనే సినిమా యూనిట్ ఆ ఆలోచనను విరమించుకుంది. (బాలీవుడ్ సింగర్‌ను వదలని కరోనా)
మరోవైపు సినిమా యూనిట్ ఏప్రిల్ 10 వరకు చిత్రీకరణ కోసం అక్కడి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది. తొలుత దీనికి అక్కడి అధికారులు అంగీకరించినప్పటికీ పరిస్థితి విషమిస్తున్నందున తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీంతో ఆడు జీవితం టీమ్ సభ్యులు 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. అన్నపానీయాలు సైతం అందుబాటులో ఉండట్లేదని, కేరళకు తిరిగి వద్దామన్నా విమానాల రాకపోకలు స్థంభించిపోయాయని పేర్కొన్నాడు. ప్రభుత్వ సాయం లేనిదే కేరళకు రావడం దాదాపు అసాధ్యమని వాపోయాడు. మా సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని లేఖలో అభ్యర్థించాడు. (కరోనాపై తొలి విజయం)
Comments
Please login to add a commentAdd a comment