Ram Charan Wife Upasana Tested Covid 19 Positive - Sakshi
Sakshi News home page

Upasana: షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఉపాసన, మెంటల్లి స్ట్రాంగ్‌గా ఉన్నానంటూ పోస్ట్‌

Published Wed, May 11 2022 1:25 PM | Last Updated on Wed, May 11 2022 7:32 PM

Ram Charan Wife Upasana Tested Covid 19 Positive - Sakshi

Upasana Tested covid-19 Positive: మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ సతిమణి ఉపాసన కొణిదెల షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గతవారం తాను కోవిడ్‌ బారిన పడ్డానని, ప్రస్తుతం కోలుకున్నానని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. చెన్నైలోని తన గ్రాండ్‌ పెరెంట్స్‌ను కలిసేందుకు కోవిడ్‌ టెస్ట్‌ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు

చదవండి: మహేశ్‌ బాబు హ్యాష్‌ ట్యాగ్ ఏంటో తెలుసా?

‘గత వారం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్‌ నన్ను కేవలం పారాసిటమల్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే వాడమని సూచించారు. ఈ మహమ్మారి సోకండంతో చాలా మంది నాకు నీరసించిపోవడం, హేర్‌ లాస్‌ అవ్వడం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలు ఏం నాలో కనిపించడం లేదు. ఎందుకంటే నాకు నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్‌ బయటపడింది. లేదంటే అసలు తెలిసేదే కాదు’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు.

చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement