
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. అలాగే బ్లాక్‌బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎన్‌బీకే 108 సినిమా చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానని తెలిపారు.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. అలాగే బ్లాక్‌బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎన్‌బీకే 108 సినిమా చేస్తున్నారు.
చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, స్పందించిన వర్మ
కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!