Akshay Kumar To Miss Cannes Red Carpet After Testing Covid-19 Positive - Sakshi
Sakshi News home page

Akshay Kumar: రెండోసారి కరోనా బారిన పడ్డ అక్షయ్‌ కుమార్‌

Published Sun, May 15 2022 9:07 AM | Last Updated on Sun, May 15 2022 10:56 AM

Akshay Kumar To Miss Cannes Red Carpet After Testing Covid-19 Positive - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌కి మరోసారి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022కోసం ఎంతో ఎదురుచూశాను. కానీ కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నా. టీం అందరికీ శుభాంకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. గతేడాది ఏప్రిల్‌లోనూ అక్షయ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి దూరంగా ఉండనున్నారు. ఈ ఈవెంట్‌లో నయనతార, తమన్నా, ఏఆర్‌ రెహమాన్‌, ఆర్‌ మాధవన్‌ సహా పలువురు సెలబ్రిటీలు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పేట్‌పై నడవనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement