కోవిడ్‌ను జయించిన 92 ఏళ్ల లతా మంగేష్కర్‌.. కానీ! | Lata Mangeshkar Recovered From Covid And Pnemonia Says Minister | Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: కరోనా నుంచి కోలుకున్న లతా మంగేష్కర్‌

Published Sun, Jan 30 2022 7:47 PM | Last Updated on Sun, Jan 30 2022 7:53 PM

Lata Mangeshkar Recovered From Covid And Pnemonia Says Minister - Sakshi

Lata Mangeshkar Latest Health Update: ప్రముఖ లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్‌ తాజాగా కోవిడ్‌ను జయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, రెండు రోజుల క్రితమే వెంటిలేటర్‌ కూడా తీసేసినట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా న్యూమోనియా నుంచి కూడా లతాజీ కోలుకున్నట్లు వివరించారు. అయితే మరికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే వైద్యుల బృందం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 8న కరోనాతో  లతా మంగేష్కర్‌ ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement