Cannes film festivals
-
చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్‌లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్‌పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్‌లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్‌లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్‌పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్‌లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్‌లో పింక్ లుక్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
Cannes Film Festival 2023: కాన్స్ కాలింగ్
బాలీవుడ్ నటి – నిర్మాత అనుష్కా శర్మకు కాన్స్ నుంచి కాల్ వచ్చిందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఈ నెల 16 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో ΄ాల్గొనవలసిందిగా జ్యూరీ నుంచి అనుష్కా శర్మకు ఆహ్వానం అందిందట. ఈ వేడుకల్లో ‘టైటానిక్’ ఫేమ్ హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్తో కలిసి కొందరు మహిళా విజేతలకు అవార్డులు అందిస్తారట అనుష్కా శర్మ. ఇక గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకోన్, సోనమ్ కపూర్, ఆలియా భట్ వంటి తారలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈసారీ పలువురు నాయికలు అక్కడ సందడి చేసే చాన్స్ ఉంది. -
36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కెరీర్లో హిట్ సాధించిన సినిమాల్లో 'టాప్ గన్' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టాప్ గన్: మేవరిక్' రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ప్రదర్శించారు. 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్‌గా రావడం, కేన్స్ ఫెస్టివల్లో ప్రీమియర్ వేయడంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. ఈ మూవీని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీని రూ. 12 వందల కోట్ల బడ్జెట్‌తో జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ రచనా సహకారం అందించారు. కాగా 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌ను సుమారు 25 ఏళ్లుగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈసినిమా సిరీస్‌తో టామ్ క్రూజ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్లో మంచి హిట్ ఇచ్చిన టాప్ గన్ సీక్వెల్‌కు మాత్రం 36 ఏళ్లు పట్టింది. అయితే ఈ సీక్వెల్‌ను మూడేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అక్షయ్‌కుమార్‌కి కరోనా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కోసం ఎంతో ఎదురుచూశాను. కానీ కోవిడ్ పాజిటివ్ రావడంతో ఈవెంట్లో పాల్గొనలేకపోతున్నా. టీం అందరికీ శుభాంకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గతేడాది ఏప్రిల్‌లోనూ అక్షయ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరంగా ఉండనున్నారు. ఈ ఈవెంట్లో నయనతార, తమన్నా, ఏఆర్ రెహమాన్, ఆర్ మాధవన్ సహా పలువురు సెలబ్రిటీలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పేట్‌పై నడవనున్నారు. Was really looking forward to rooting for our cinema at the India Pavilion at #Cannes2022, but have sadly tested positive for Covid. Will rest it out. Loads of best wishes to you and your entire team, @ianuragthakur. Will really miss being there. — Akshay Kumar (@akshaykumar) May 14, 2022 -
21 ఏళ్ల క్రితం ఇక్కడే నన్ను చెరబట్టాడు
పారిస్: హాలీవుడ్ మూవీ మొఘల్ హార్వీ వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కామాంధుడి వ్యవహారం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ఒకరు ఇటాలియన్ నటి ఏసియా అర్గెంటో. 1997లో కేన్స్ చలనచిత్రోత్సవానికి హాజరైన తనపై వెయిన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె అప్పట్లో ఆరోపించారు. తద్వారానే మరికొందరు సెలబ్రిటీలు ముందుకు రావటంతో ఆయన లీలలు బయటపడ్డాయి. అయితే తనపై జరిగిన దారుణంపై అర్గెంటో ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా స్పందించారు. భయానక అనుభవం... ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళలను జీవితాలను నాశనం అతనికి కేన్స్ ఓ వేదికగా ఉండేది. అప్పట్లో నేను నటించిన ఓ చిత్రానికి వెయిన్‌స్టీన్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. అందుకే చిత్ర యూనిట్ మొత్తానికి ఓ పెద్ద హోటల్లో పార్టీ ఇస్తానంటూ ఆహ్వానించాడు. తీరా నేను అక్కడికి వెళ్లే సరికి పార్టీ వాతావరణం లేదు. హోటల్ గదిలో వెయిన్‌స్టీన్ ఒక్కడే ఉన్నాడు. తిరిగి నేను బయలుదేరుతున్న సమయంలో మసాజ్ చేయాలంటూ నన్ను బతిమిలాడాడు. నన్ను దగ్గరికి లాక్కుని మృగంలా ప్రవర్తించాడు. భయంతో వణికిపోయా. నన్ను చిత్రవధలకు గురిచేస్తూ అత్యాచారం చేశాడు’ అంటూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. ‘నాలాగే చాలా మంది బాధితులు ఉంటారని అప్పుడే భావించా. అందుకే ఆయన విషయాలను వెలుగులోకి తెచ్చా. కానీ, ఇప్పుడు ఒక్కటే చెప్పదల్చుకుంటున్నా. ఆ రాక్షసుడు ఇకపై ఇక్కడ కనిపించడు. అది నాకు సంతోషాన్ని ఇస్తోంది. అవకాశాల కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి’ అని ఆమె ప్రసంగించారు. అర్గెంటో భావోద్వేగ ప్రసంగంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు వ్యక్తం చేశారు. చాలా ధైర్యంగా మాట్లాడారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే అదే సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని అంత వివరంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని? కొందరు ప్రశించగా, త్వరలో తాజాగా ఆమె ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేశారని.. దాని ప్రమోషన్ కోసం ఆమె ఇలా ప్రసంగం ఉంటారని మరికొందరు విమర్శిస్తున్నారు. నిర్మాత కమ్ దర్శకుడు అయిన వెయిన్‌స్టీన్ గురించి సుమారు 50 మంది నటీమణులు ఆరోపణలు గుప్పించగా, ఆ దెబ్బకు సొంత నిర్మాణ సంస్థ ‘ది వెయిన్‌స్టెయిన్’తోపాటు కీలక పదవులకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. -
అమ్మ బ్రహ్మదేవుడో..!
కేన్స్(ఫ్రాన్స్): ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత డిజైనర్ మిఖాయెల్ సింకో రూపొందించిన ‘సీతాకోకచిలుక’ దుస్తుల్లో రెడ్కాట్పై అదరగొట్టారు. తల్లివెంటే వెళ్లిన కూతురు ఆరాధ్య కూడా చిట్టిపొట్టి అడుగులతో ఆకట్టుకున్నారు. అంతకు ముందు రోజు నటి దీపికా పడుకొన్ సైతం కేన్స్‌లో అలరించారు. మే 8న ప్రారంభమైన 71వ కేన్స్ చిత్సోత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో నిర్మితమైన ఉత్తమ సినిమాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. భారతదేశం నుంచి.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నందితా దాస్ దర్శకత్వం వహించిన ‘మంటో’,, ధనుష్ నటించిన ‘‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ సినిమాలను ప్రదర్శిస్తారు. కాగా, కేన్స్‌లో భాగంగా మే11న కేన్స్‌లో 'ఇండియా డే' పేరిట తొలిసారిగా ఓ కార్యక్రమం నిర్వహించారు. భారత్-ఫ్రెంచ్ సినీ పరిశ్రమల భాగస్వామ్యంతో ఇరుదేశాల దౌత్యకార్యాలయాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. (రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్య హొయలు వీడియో, ఫొటో గ్యాలరీ కింద చూడండి) -
అందమైన భామలు... లేత మెరుపు తీగలు...
ఇంత పొడవాటి గౌనులు వేసుకుని అంత అందంగా ఎలా నడుస్తారు? పైగా ఎత్తు మడమల చెప్పులతో అంత వయ్యారంగా ఎలా వాక్ చేస్తున్నారు? మెడ, చెవులనంటి పెట్టుకున్న ఆ ఆభరణాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి.. అని కాన్స్ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంటున్న అందాల తారల గురించి అనుకోని వారుండరు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న ఈ ఉత్సవాలపైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తారల తళుకులను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదని సౌందర్యారాధకులు మురిసిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకూ ఆడవాళ్లందరూ పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు, వజ్రాభరణాలు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఎర్ర తివాచీపై ఈ తారలు చేసే క్యాట్ వాక్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తెగ తాపత్రయపడిపోతారు. అందుకే, పొరపాటున గౌను తొలగినా, ఎవరైనా జారి పడినా కెమెరా కన్ను నుంచి తప్పించుకోలేరు. గురువారం ప్రముఖ అందాల తార జూలియా రాబర్ట్స్ అలా ఓ విషయంలో కెమెరాలకు దొరికిపోయారు. అదేంటంటే... ‘జూలియా.. వాటె కలర్ యార్’ అనుకునే రేంజ్లో తెల్లగా ఉంటారీ బ్యూటీ. నలుపు రంగు గౌనులో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు జూలియా. ఆ గౌనులో ఆమె తెల్లని దేహం మెరిసిపోయింది. వజ్రాల కంఠాభరణం మినహా ఒంటి మీద వేరే ఏ ఆభరణం లేకపోయినా ఆమె తళుకులీనారు. ఎత్తు మడమ చెప్పులతో వచ్చిన జూలియా మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతానని భయపడ్డారేమో. వాటిని విడిచేసి, వట్టి కాళ్లతో మెట్లెక్కేశారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ తతంగాన్ని కెమెరా కళ్లు క్యాప్చర్ చేసేశాయి. మెట్లెక్కేసిన తర్వాత సహాయకుడు చెప్పులు తెస్తే, తొడుక్కున్నారామె. ఇదో విషయమా అనుకునేరు. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్లేమో లాంగ్ ఫ్రాక్స్, హై హీల్స్ వేసుకోవాలి. మగవాళ్లు సూటూ, బూటూ ధరించాల్సిందే. గతేడాది కొంతమంది తారలు ఎత్తు మడమ చెప్పులు కాకుండా ఫ్లాట్స్ వేసుకుని వస్తే, అనుమతించలేదు. వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. అలాంటిది జూలియా వట్టి కాళ్లతో మెట్లెక్కితే ఊరుకుంటారా?.. ఊరుకున్నారు. ఎందుకంటే ఆమె జూలియా రాబర్ట్స్ కాబట్టి. ఏదేమైనా ఇంట్లో ఉన్నప్పుడు జూలియా కాళ్లను చెప్పులు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పాదరక్షలు లేకుండా ఆమె కాసేపే నడిచినా పెద్ద టాపిక్ అయ్యింది. అయ్యో పాపం... అమల్! నటుడు జార్జ్ క్లూనే సతీమణి, నటి అమల్ క్లూనే పాపం ఇబ్బందిపడే పరిస్థితి తెచ్చుకున్నారు. భర్త చెయ్యి పట్టుకుని అందంగా నడుచుకుంటూ వచ్చిన అమల్ పొరపాటున తన పొడవాటి గౌను పైన కాలు వేశారు. రెండు చీలికల్లా డిజైన్ చేయబడిన ఆ గౌను అటూ ఇటూ కావడంతో అమల్ ఇబ్బందిపడిపోయారు. కంగారుగా గౌను సర్దుకుని, పాలిపోయిన మొహంతో ముందుకు సాగారామె. ఊడీ... పరమ మూడీ! రసవత్తరంగా జరుగుతున్న వేడుకల్లో ఆనందపడేవాళ్లూ, అలిగే వాళ్లూ ఉంటారు. అలా దర్శకుడు ఊడీ అలెన్ అలిగారు. తన కుమార్తె ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై ఊడీ అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ విషయం గురించి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ హాస్యనటుడు లారెంట్ లఫిట్టె జోక్ చేశారు. యూరోపియన్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీతో ఊడీని పోల్చారు లఫిట్టె. రోమన్ తన 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేసిన విషయం బయటకు రావడంతో, అభియోగాలు భరించలేక ఆయన ఏకంగా యూఎస్ నుంచి యూరోప్ పారిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారనీ, ‘మరి మీ మీద అత్యాచార ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా సరే మీరెందుకు రోమన్‌లా యూరోప్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అని లఫిట్టె చమత్కరించడంతో ఊడీ మొహం ఎర్రబారింది. లఫిట్టె మాటల్లో గూఢార్థం ఉంది. ఊడీ అత్యాచార యత్నం చేశారు కాబట్టే, యూఎస్‌లో ఎక్కువ సినిమాలు చేయడంలేదన్న భావం వ్యాఖ్యాత మాటల్లో కనపడింది. అది విని కొంతమంది నవ్వేసరికి, ఊడీ ముఖం కందగడ్డలా మారింది. లఫిట్టె ఇలా ‘రేప్ జోక్’ చేయడం కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొందరు హాలీవుడ్ నటీమణులు బాహాటంగానే అతణ్ణి విమర్శించారు. దాంతో ఊడీ మనసు కొంచెం శాంతించి ఉంటుంది. ఇదిలా ఉంటే... గురువారం ఈ వేడుకలకు హాజరైనవారిలో... నటీమణులు అన్నా కెండ్రిక్, చెరిల్ కోల్, నయోమీ వాట్స్, జెస్సికా చేస్టైన్, క్రిస్టెన్ స్టీవాట్ తదితరులు ఉన్నారు.