గాయపడిన ఐశ్వర్య రాయ్‌.. అయినా అక్కడికి ప్రయాణం | Aishwarya Rai Injured, But Leaves For Cannes Film Festival 2024 | Sakshi
Sakshi News home page

గాయపడిన ఐశ్వర్య రాయ్‌.. అయినా అక్కడికి ప్రయాణం

May 16 2024 9:18 AM | Updated on May 16 2024 9:48 AM

Aishwarya Rai Injured, But Leaves For Cannes Film Festival 2024

ప్రతి సంవత్సరం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌. ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్‌ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్‌లో ఎలా నడుస్తుంది. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్‌ కార్పెట్‌పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్‌లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.

ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్‌ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్‌లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్‌ కార్పెట్‌పై తన అందంతో కట్టిపడేస్తుంది.

ఐశ్వర్యతో పాటు  అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్‌లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్‌లో పింక్ లుక్‌లో కనిపించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement