
కేన్స్(ఫ్రాన్స్): ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత డిజైనర్ మిఖాయెల్ సింకో రూపొందించిన ‘సీతాకోకచిలుక’ దుస్తుల్లో రెడ్‌కాట్‌పై అదరగొట్టారు. తల్లివెంటే వెళ్లిన కూతురు ఆరాధ్య కూడా చిట్టిపొట్టి అడుగులతో ఆకట్టుకున్నారు. అంతకు ముందు రోజు నటి దీపికా పడుకొన్ సైతం కేన్స్‌లో అలరించారు.
మే 8న ప్రారంభమైన 71వ కేన్స్ చిత్సోత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో నిర్మితమైన ఉత్తమ సినిమాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. భారతదేశం నుంచి.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నందితా దాస్ దర్శకత్వం వహించిన ‘మంటో’,, ధనుష్ నటించిన ‘‘ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ సినిమాలను ప్రదర్శిస్తారు. కాగా, కేన్స్‌లో భాగంగా మే11న కేన్స్‌లో 'ఇండియా డే' పేరిట తొలిసారిగా ఓ కార్యక్రమం నిర్వహించారు. భారత్-ఫ్రెంచ్ సినీ పరిశ్రమల భాగస్వామ్యంతో ఇరుదేశాల దౌత్యకార్యాలయాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
(రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్య హొయలు వీడియో, ఫొటో గ్యాలరీ కింద చూడండి)





Comments
Please login to add a commentAdd a comment