Cannes 2018
-
సోనమ్ సందడి
‘ఫ్యాషన్ ఐకాన్’ సోనమ్ కపూర్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోనమ్ ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఈసారి కూడా అలానే వెళ్లారు. దాంతో పాటు ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో కూడా పాల్గొన్నారామె. రెడ్ కార్పెట్‌పై అందంగా క్యాట్ వాక్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌కు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాదీ సోనమ్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహీరా ఖాన్‌కి ఇదే ఫస్ట్ టైమ్. అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో మహీరా రెడ్ కార్పెట్‌పై అడుగులు వేసి, భేష్ అనిపించుకున్నారు. అన్నట్లు.. రేపు సోనమ్ ఇండియా వచ్చేస్తారు. -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షణ
-
అమ్మ బ్రహ్మదేవుడో..!
కేన్స్(ఫ్రాన్స్): ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత డిజైనర్ మిఖాయెల్ సింకో రూపొందించిన ‘సీతాకోకచిలుక’ దుస్తుల్లో రెడ్కాట్పై అదరగొట్టారు. తల్లివెంటే వెళ్లిన కూతురు ఆరాధ్య కూడా చిట్టిపొట్టి అడుగులతో ఆకట్టుకున్నారు. అంతకు ముందు రోజు నటి దీపికా పడుకొన్ సైతం కేన్స్‌లో అలరించారు. మే 8న ప్రారంభమైన 71వ కేన్స్ చిత్సోత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో నిర్మితమైన ఉత్తమ సినిమాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. భారతదేశం నుంచి.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నందితా దాస్ దర్శకత్వం వహించిన ‘మంటో’,, ధనుష్ నటించిన ‘‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ సినిమాలను ప్రదర్శిస్తారు. కాగా, కేన్స్‌లో భాగంగా మే11న కేన్స్‌లో 'ఇండియా డే' పేరిట తొలిసారిగా ఓ కార్యక్రమం నిర్వహించారు. భారత్-ఫ్రెంచ్ సినీ పరిశ్రమల భాగస్వామ్యంతో ఇరుదేశాల దౌత్యకార్యాలయాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. (రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్య హొయలు వీడియో, ఫొటో గ్యాలరీ కింద చూడండి) -
శ్రీదేవికి కేన్స్ ఘన నివాళి
లెజండరీ నటి, స్వర్గీయ శ్రీదేవికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘన నివాళి అర్పించనుంది. ఈనెల 16న లే మెజెస్టిక్ బీచ్ ఇందుకు వేదిక కానుంది. శ్రీదేవికి సంస్మరణార్థం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో.. ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాల్లోని విజువల్స్‌ను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు, ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్లు హాజరవనున్నారు. ఈ విషయాన్ని బోనీ కపూర్ ధ్రువీకరించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల పాటు తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శ్రీదేవి ప్రతిభను ప్రపంచం గుర్తించినందుకు తాను సంతోషపడతానన్నారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీదేవికి ఈ పేరు ప్రఖ్యాతులు లభించాయని పేర్కొన్నారు. ఆమె భౌతికంగా తమ మధ్య లేకపోయడం బాధకు గురిచేస్తున్నా.. ఆమె అద్భుత నటన ద్వారా అందరి మనసులలో చోటు సంపాదించుకోవడం ఆనందాన్నిస్తుందన్నారు. మరణానంతరం జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న శ్రీదేవికి.. ప్రస్తుతం కేన్స్ నివాళి అర్పించడం ద్వారా మరోసారి ఆమె ప్రతిభకు గుర్తింపు దక్కినట్లు భావిస్తున్నాని ఆనందం వ్యక్తం చేశారు. -
కేన్స్‌లో మెరిసిన దీపిక పదుకొనె