
‘ఫ్యాషన్ ఐకాన్’ సోనమ్ కపూర్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోనమ్ ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఈసారి కూడా అలానే వెళ్లారు. దాంతో పాటు ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో కూడా పాల్గొన్నారామె. రెడ్ కార్పెట్‌పై అందంగా క్యాట్ వాక్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు.
కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌కు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాదీ సోనమ్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహీరా ఖాన్‌కి ఇదే ఫస్ట్ టైమ్. అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో మహీరా రెడ్ కార్పెట్‌పై అడుగులు వేసి, భేష్ అనిపించుకున్నారు. అన్నట్లు.. రేపు సోనమ్ ఇండియా వచ్చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment