వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని! | Sonam Kapoor Breaks Down In Tears While Walking The Ramp, Pay Tribute To Rohit Bal Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: నడుస్తూనే ఏడ్చేసిన హీరోయిన్.. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ!

Published Sun, Feb 2 2025 3:57 PM | Last Updated on Sun, Feb 2 2025 5:09 PM

Sonam Kapoor breaks down while walking the ramp

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్‌ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో  భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సోనమ్  తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్‌కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. సోనమ్‌తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్‌కు నివాళులర్పించేందుకు ర్యాంప్‌ వాక్ చేశారు.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement