Ramp Walk
-
Tamannaah Bhatia: ఫ్యాషన్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు (ఫోటోలు)
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్‌ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్‌తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఫ్యాషన్ షోలో మురిపించిన ముద్దుగుమ్మలు! (ఫొటోలు)
-
Paris Fashion Week 2024: ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో అందంగా మెరిసిపోయింది. ఆమె లేని ర్యాంప్‌వాక్ ఊహించలేం అన్నట్టుగా ఎర్రని దుస్తుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. గత కొన్నేళ్లుగా లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐష్ గ్రాండ్ ఫ్యాషన్ గాలాలో ఎప్పటిలాగానే తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. తనదైన స్టయిల్లో ఫ్లయింగ్ కిస్, నమస్తేతో ర్యాంప్ వాక్ అదుర్స్ అనిపించింది. View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) పారిస్‌లోని పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2025 సేకరణలో భాగంగా లోరియల్ పారిస్ షో "వాక్ యువర్ వర్త్" పేరుతో అందాల రాణులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా ర్యాంప్ వ్యాక్ చేశారు. ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో అలియా మెరవడం ఇదే తొలిసారి. -
మియా బై తనిష్క్ ఫ్యాషన్ ర్యాంప్‌పై మహిళల తళుక్కులు..(ఫొటోలు)
-
Hyderabad: రాకింగ్ ర్యాంప్ వాక్..! టాప్ మోడల్స్.. క్యాట్ వాక్!!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. -
దేశాధినేతల ర్యాంప్ వాక్! వైరల్ వీడియో
ఎప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? వారు ర్యాంప్ వాక్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఇదంతా నిజంగా కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన చమత్కారం ఇది.భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లతో సహా పలు దేశాధినేతలు భవిష్యత్ దుస్తులలో ర్యాంప్‌పై నడుస్తున్నట్లు ఏఐ రూపొందించిన వీడియోను చూపిస్తూ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇది ఏఐ ఫ్యాషన్ షో సమయం" అంటూ ఈ వీడియోకు మస్క్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది అత్యధికంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.నిమిషానికి పైగా నిడివిగల ఈ వీడియోలో ప్రధాని మోదీ, కమలా హారిస్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, టిమ్ కుక్, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, నాన్సీ పెలోసి, జి జిన్‌పింగ్, జస్టిన్ ట్రూడో, బిల్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నీ సాండర్స్, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు కనిపిస్తారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని కూడా ఇందులో చమత్కారంగా ప్రస్తావించారు.High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu— Elon Musk (@elonmusk) July 22, 2024 -
ఆంపిల్ ర్యాంప్
వారంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. నిత్యం కంప్యూటర్లతో తలమునకలవుతుంటారు.. అయితేనేం.. మోడల్స్‌కు మేమేం తీసిపోమంటూ.. అలవోకగా ర్యాంప్ వాక్ చేశారు.. అంతేకాదు.. ఆహూతులను ఆసాంతం అలరించారు.గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికైంది.. ‘ఆంపిల్ లాజిక్’ సంస్థ 15వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సంస్థ ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. క్రీడల, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు సంస్థ ప్రోత్సాహకాలను అందజేసి, సత్కరించింది. ఉద్యోగుల సహకారంతో సంస్థ దినదినాభివృద్ధి చెందుతుందని సీఈఒ మన్నె వెంకన్న చౌదిరి పేర్కొన్నారు. – లక్డీకాపూల్ -
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
విజయవాడ : ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన కాలేజీ విద్యార్థులు (ఫొటోలు)
-
Parineeti Chopra: పెళ్లయ్యాక తొలిసారి ర్యాంప్‌వాక్ చేసిన పరిణీతి చోప్రా (ఫొటోలు)
-
ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సిబ్బంది..ఇంతకీ ఏం జరిగిందంటే..
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్లా వాక్ చేశాడు. పాలిథీన్ కవర్నే కాస్టూమ్గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc — Censored Men (@CensoredMen) September 11, 2023 -
ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్
కృతి సనన్..ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అయితే ఆ స్టార్డమ్ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించి.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్:నేనొక్కడినే’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్ మూవీ వన్: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్నర లాన్లో క్యాట్‌వాక్ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి గణపత్:పార్ట్‌వన్ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. (చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
-
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
నోయిడా: నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది. అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాము. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మన్మోహన్ సింగ్ ఒక పిరికిపంద.. అమిత్ షా -
విశాఖలో ఆకట్టుకుంటోన్న తెలుగు అమ్మాయిల ప్రదర్శన
-
మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్.. పాత వీడియో వైరల్
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీటన్నిటికంటే ముందు స్మృతి మోడల్‌గా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిత్రం అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.బెంగాలీ-పంజాబీ కుటుంబానికి చెందిన స్మృతి.. 2000లో ఆతిష్, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్ అనే సీరియల్స్ ద్వారా తొలిసారి బుల్లితెరపై కనిపించారు. ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో తులసి విరాణిగా అందరికీ గుర్తుండిపోయారు. ఈ సీరియల్ ఆమెకు భారీ స్టార్‌డమ్‌ని సంపాదించిపెట్టింది. ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు అందుకున్నారు. అంతేగాక స్మృతి ఇరానీ 25 సంవత్సరాల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఆమె టాన్జేరిన్ స్లీవ్‌లెస్ టాప్, మినీ స్కర్ట్‌లో అద్భుతంగా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే టాప్ 9కి చేరుకోలేకపోయారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాంప్ వాక్ చేస్తున్న స్మృతి వీడియోను మీరూ చూడండి. View this post on Instagram A post shared by Cryptic Miind (@crypticmiind) కాగా 2003లో ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2011లో తొలిసారి 2017లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 2014లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అదే అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
విశాఖపట్నం : ర్యాంపులపై హోయలొలుకుతున్న వైజాగ్ బ్యూటీలు (ఫొటోలు)
-
సెమీ క్రిస్మస్.. స్టూడెంట్స్ ర్యాంప్ వాక్
-
హిజ్రాల హొయలు!
సాక్షి,చెన్నై: మిస్ హిజ్రా చెన్నై –2022 పోటీల ఆడిషన్స్ ఆ సంఘం ఆధ్వర్యంలో మొదలయ్యాయి. ఈ పోటీలకు అర్హులైన వారిని గురువారం చెన్నైలో ఎంపిక చేశారు. అక్టోబరు 15వ తేదీని హిజ్రాల ముప్పెరుం విళా చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. ఈ పోటీల ఆడిషన్స్ కీల్పాకం డాన్ బాస్కో స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగింది. 24 మంది హిజ్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మోడల్స్‌కు తామేమీ తీసి పోమన్నట్లుగా ర్యాంప్‌పై హొయలొలికించారు. ఇందులో 13 మంది మిస్ హిజ్రా చెన్నై పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పలు దశల్లో వడపోత చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 13న హిజ్రాల విద్య, ఉద్యోగంపై, 14న ఆరోగ్య సంరక్షణపై సదస్సు ఉంటుందని ఆ సంఘం నేత సుధా తెలిపారు. అలాగే ఫైనల్స్ చెన్నై కలైవానర్ అరంగం వేదికగా అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. முப்பெரும் விழாவாக சென்னையில் நடக்கும் திருநங்கைகளுக்கான ‘மிஸ் சென்னை 2022’ போட்டி.!#Chennai #Transgender https://t.co/vHkgUzTDFv — Behindwoods (@behindwoods) September 22, 2022 -
ఇదే నాకు తొలిసారి.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఏ మాత్రం తీరక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక..ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇండియన్ కోచర్ వీక్ 15వ ఎడిషన్ కోసం రష్మిక తొలిసారి ర్యాంప్ వాక్ చేసింది. ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ లెహంగా ధరించి, చిరునవ్వులు చిందిస్తూ రష్మిక చేసిన ర్యాంప్ వాక్ నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా తన తొలి ర్యాంప్ వాక్ అనుభవం గురించి చెప్పుకుంటూ తనకు సహాయం చేసిన వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ‘ఢిల్లీలో మొదటిసారి ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నాను. నేను ప్రో మోడల్ లాగా నడవడానికి చాలా ప్రయత్నం చేశాను.. కానీ అది వర్కౌట్ కాలేదు. నేను కేవలం నవ్వుతూ సరదాగా గడిపే నాకు ఈ ఫ్యాషన్ షో ఓ బ్లాస్ట్‌లా ఉంది. నా తొలి నడకకి సహాయం చేసిన వరుణ్‌కి థ్యాంక్స్. ఈ ర్యాంప్ వాక్ నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నేను మీ కళను ప్రేమిస్తున్నాను. మనం కలిసి మరిన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. నాకు సహాయం చేసిన అందరికి కృతజ్ఞతలు’ అంటూ రషఙ్మక రాసుకొచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
క్యాన్సర్‌ను జయించిన పిల్లలతో సెలబ్రిటీల 'మైరా' ర్యాంప్ వాక్
-
హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది
కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్ వీల్‌చెయిర్ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది.. పాటలు పాడుతూ.. కండరాల క్షీణత ‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్ వీల్‌చైర్ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని. సంగీతం క్లాసులు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్ టైమ్ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఉద్యోగం ఓ సవాల్... ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్లో కూర్చుంటే బాత్రూమ్కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్ బ్యాగ్ కూడా వీల్‌చెయిర్‌కు సెట్ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు. నన్ను నేను నమ్ముకున్నాను.. మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. ‘రైజింగ్ స్టార్’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది. అమితాబ్ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది. జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
'మోడ్రన్' మహోత్సవం (ఫోటోలు)
-
కిరణ్ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ
వినూత్న శైలి 'కె పార్టీ'కి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి అదుర్స్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఒక థీమ్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్‌లో కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్, బాలీవుడ్ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్‌లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధులకు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. -
ముత్యమంటి సొగసు
-
బొమ్మ కాదు.. ముద్దుగుమ్మ
-
కిర్రాక్ బ్యూటీ మాకు మేమే సాటి..
-
కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా
పిల్లలకు బాల్యం నుంచే సమయస్ఫూర్తి.. పరిస్థితులను ఎదుర్కొని నిలబడే తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అలవాటు చేయాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, బెంబేలెత్తడం చేస్తూంటే.. జీవితంలో ముందుకెళ్లడం కష్టమని బాల్యం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. నెటిజనలను ఫిదా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియదు. ఇక వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్ వాక్ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉంటారు చిన్నారులు. అలా వాక్ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు. (చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్) ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్ వాక్ పూర్తి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో: ఇంత దారుణమా.. మనుషులమేనా?!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు. కానీ ఈ చిన్నారి ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే View this post on Instagram A post shared by Beautiful and Wholesome World (@_beautiful_._world) -
Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా?
Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రాన్స్ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్ హూడీ’(సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు)ని డిజైన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్బెర్రీ మోడల్ లిజ్ కెనెడీ ‘సూసైడ్ ఏం ఫ్యాషన్ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Diet Prada ™ (@diet_prada) ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ‘డైట్ ప్రదా’ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్ చేస్తూ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేయగా.. దుమారం మొదలైంది. View this post on Instagram A post shared by @liz.kennedy_ చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ను ఆకాశానికెత్తిన అమెజాన్ బాస్ -
మీసం మెలేసిన మహిళ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?
మానవ రూపురేఖలను పోల్చేటప్పుడు ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, స్వరంలో, రూపంలో ఇరువురి మధ్య వ్యత్యాసం ఉండి తీరాలి.. అనే కొన్ని బలమైన ఆలోచనలు, తీర్మానాలు.. అందుకు భిన్నమైన జీవితాలను బలిపెట్టేలానే ఉంటాయి. అలాంటి భిన్నమైన వ్యక్తే ‘హర్మాన్ కౌర్’. ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి, గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమె!! బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్.. గడ్డం ఉన్న అమ్మాయి. ఆమెకు 11 ఏళ్ల వయసు వచ్చేసరికి.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు, మీసాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ చిన్న వయసులోనే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంది. చదువుకునే చోట, చుట్టుపక్కలా ఎన్నో అవమానాలు భరించింది. వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడల్లా నరకమే. ప్రతి ఐదురోజులకి బలంగా, దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది. ముట్టుకుంటే నొప్పిపుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించింది. లోపాన్ని అవమానంగా భావించి జీవితాన్ని అంతం చేసుకునేకంటే దాన్నే గుర్తింపుగా మలచుకొని ధైర్యంగా బతకడం కరెక్ట్ కదా అని! అంతే.. వాక్సింగ్ చేయించడం ఆపేసి, గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేప్ చేసుకుని, తలకు స్టయిల్‌గా క్లాత్ చుట్టి ప్రత్యేకమైన రూపాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే గడ్డం ఉన్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది. తన రూపాన్ని తన ఎడమ కాలిపై టాటూగా వేయించుకుంది. 2014లో ఆమె లండన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి, గడ్డంతో ఉన్న మహిళా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు, ఆమె అనేక బ్రాండ్లకు మోడల్‌గా మారింది. నేటికీ తన జీవితాన్ని పలు మాధ్యమాల సాయంతో ప్రపంచానికి తెలియజేస్తూ.. ఎన్నో మోటివేషన్ క్లాసులు ఇస్తూంటుంది. పరిష్కారం లేని సమస్యకు.. సమస్యనే పరిష్కారంగా మార్చుకోగల గుండె ధైర్యం ఎంతమందికి ఉంటుంది! అందుకే ఆమె అంటుంది.. ‘నా గడ్డానికి ఒక ప్రత్యేకతుంది. ఇదొక మహిళ గడ్డం’ అని. చదవండి: చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!! -
50 ప్లస్‌లో అదరగొడుతోంది..
ర్యాంప్ వాక్ అనగానే జిగేల్మనే లైట్ల వెలుగులు... ఆ వేదిక మీద అంతకన్నా జిగేల్మనే భామలు కళ్ల ముందు మెదులుతారు. కానీ, 50 ఏళ్ల వయసులో ముంబైకి చెందిన శ్రీమతి గీతా జెనా మోడలింగ్ చేస్తూ.. అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది. ‘‘ఒక వయస్సు తర్వాత మహిళలు ప్రకటనలలో తల్లులుగా మాత్రమే ఎందుకు కనిపించాలి? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే, మోడలింగ్‌ను వృత్తిగా ప్రారంభించాను. అందుకు నన్ను నేను మెరుగులు దిద్దుకున్నాను. నిజానికి టీనేజ్ నుంచి మోడల్ని అవాలని కల. దానికి తగ్గట్టే సరిగ్గా అప్పుడే గుజరాతీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది, కానీ, మా ఇంట్లో అందుకు ఒప్పుకోలేదు. కుటుంబ బంధం చదువుకునే వయసులోనే పెళ్లి చేసేశారు. చాలా ఏళ్లు కుటుంబ జీవనంలో బిజీగా ఉండిపోయాను. కానీ.. ఏదో వెలితి. నా సొంత గుర్తింపు కావాలనుకున్నాను. పిల్లలు పెరిగే వయసులో ప్రీ స్కూల్లో టీచర్‌గా చేరాను. కానీ, అక్కడ డ్రెస్ కోడ్ తప్పనిసరి. షిఫాన్ చీరలు అస్సలు కట్టకూడదని చెప్పారు. దాంతో ఆ నిబంధనలన్నీ పాటించాను. మూడేళ్ల క్రిందట.. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మోడలింగ్, బ్యూటీ కాంటెస్ట్‌లపై దృష్టి పెట్టేదాన్ని. 2019లో, నా కల నెరవేర్చుకునే సమయం పలకరించింది. ‘ఇండియా బ్రైనీ బ్యూటీ కాంటెస్ట్’లో పాల్గొనే అవకాశం రావడం, అందులో ఫస్ట్ రన్నరప్‌గా పోటీలో నిలవడం ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చింది. ఇప్పుడు 2021 సెకండ్ సీజన్లో, జ్యూరీ సభ్యులలో ఒకరిగా అవకాశం లభించింది. 50 ఏళ్ల వయసులో ర్యాంప్‌పై ఎలా నడవాలో నేర్చుకున్నాను. రన్నరప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత నా ప్రొఫైల్ బయటకు వచ్చింది. స్టార్టప్స్ నుంచి చిన్న బ్రాండ్ల వరకు మోడలింగ్‌కి అవకాశాలు వచ్చాయి. అయితే, నా వయస్సు తెలుసుకొని, వారు వెనక్కి తగ్గారు. ప్లస్ సైజ్ మోడలింగ్.. ప్లస్ సైజ్ మోడల్స్ విషయానికి వస్తే బాడీ ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. దీంతో ఈ విభాగంలో పనిచేయాలనుకున్నాను. కానీ, ఇందులోనూ నా ఫిట్నెస్ నాకు అవకాశాలు రానీయకుండా చేస్తుందని గుర్తించాను. ఒక జత ఫాన్సీ లోదుస్తులు, యాక్టివ్ వేర్ కోసం ఆన్లైన్లో విపరీతంగా శోధించాను. ఈ ప్రకటనలలో ఏ భారతీయ బ్రాండ్‌కు వయసు ప్రాతిపదికన సరైన మోడల్స్ లేరని తెలుసుకున్నాను. పాశ్చాత్య దేశాల్లో కూడా వయసు పైబడిన స్త్రీ లో దుస్తులకు మోడల్‌గా కనిపించదు. దీనివల్ల ‘ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఇక మీరు కొన్ని రకాల బట్టలు ధరించడానికి తగినవారు కాదని ఒక సందేశం పంపడంగా భావించాను. దీంతో లో దుస్తులతోపాటు అన్ని రకాల ఉత్పత్తులకు అన్ని వయసుల వారిని మోడలింగ్‌లోకి తీసుకోవాలని ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించాను. కాబట్టి ఇప్పుడు మోడలింVŠ మొదలు పెట్టాను. లోదుస్తుల వెబ్‌సైట్‌నూ ప్రారంభించాను. నలభై ఏళ్లు పైబడిన మహిళలు తమ ఏకైక ఎంపిక చీరలు, సల్వార్ కమీజ్ మాత్రమే అని భావించకూడదు. లో దుస్తుల బ్రాండ్ ఈ మూసను విచ్ఛిన్నం చేస్తే అది అన్నిరకాల జీవనశైలి బ్రాండ్లకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది’’ అని వివరిస్తోంది ఈ యాభై ఏళ్ల మోడల్ గీతా జెనా. -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్‌లో పాప్ మ్యూజిక్‌తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్‌లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్‌షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్‌షాప్‌లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్‌తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్‌తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్‌మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్‌వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్‌కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్‌వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్‌తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్‌రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్‌గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్‌బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్‌లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్‌క్రీమ్‌లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
‘ఈ రోజు తన ఆలోచనతోనే లేచాను’
ముంబై: ‘మీది మనోహరమైన నవ్వు.. స్నేహ పూర్వక మనస్తత్వం.. గొప్ప నటుడివి’ అంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చెప్పిన మాటాలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గుర్తుచేసుకున్నారు. 2016లో తన ఫ్యాషన్ ప్రదర్శనలో షో టాపర్‌గా ర్యాంప్ చేసిన నాటి సంఘటనను ఆయన సోషల్ మీడియాలో సోమవారం పంచుకున్నాడు. సుశాంత్ ఫ్యాషన్ షోకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడే సుశాంత్‌ను మొదటిసారి కలిసాను. అతడిని చూడగానే నా కొత్త కలెక్షన్స్‌కు సరిగ్గా సరిపోతాడని భావించి ఫ్యాషన్ షోలో ర్యాంప్ చేయాలని కోరాను. దానికి సుశాంత్ అంగీకరించి వెంటనే డ్రస్ ఫిట్టింగ్ కోసం ఇంటికి వచ్చాడు. ఆ దుస్తుల్లో సుశాంత్ చాలా అందంగా ఉన్నాడు’’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (సుశాంత్ ఇంట మరో విషాదం) అయితే ‘‘ర్యాంప్ వాక్ కోసం ప్రాక్టిస్ చేస్తుండగా సుశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు నేను నువ్వు గొప్ప నుటుడివి, ప్రతిభావంతుడి.. నీ నవ్వు మనోహరంగా ఉంటుంది. షోలో నీ నవ్వును ప్రదర్శించు చాలు అని చెప్పాను. అలాగే చేశాడు. షో టాపర్‌గా సుశాంత్ అద్భుతంగా కనిపించాడు. ఆ రోజు ఎప్పటికీ ప్రతిష్టాత్మక జ్ఞాపకం. ఈ రోజు అతడి ఆలోచనతోనే లేచాను. అతడి మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్న’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా సుశాంత్ ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టీవీ, సినీ నటులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు) View this post on Instagram I had met him only once before and then asked him to walk for the show as I felt he suited this collection. He immediately agreed and came home for fittings .. when he came for rehearsals he said he was nervous as he had not walked before and I remember telling him you are such a good actor you will be fine and just smile as your smile is endearing and charming .. He was wonderful in this show as he and @shraddhakapoor walked and made a lovely pair together and today this is a wonderful cherished memory forever .. I woke up this morning thinking about him & still can’t beileve it. It’s really sad and how I wish this had not happened. You will be dearly missed. #sushantsinghrajput #memories A post shared by Manish Malhotra (@manishmalhotra05) on Jun 15, 2020 at 1:59am PDT -
ర్యాంప్ వాక్ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి
సాక్షి, బెంగళూరు : ర్యాంప్ వాక్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరాని చెందిన షాలిని(21) ఓ ప్రముఖ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తమ కాలేజీలో నిర్వహించనున్న ఫ్రెషర్ డే కోసం స్నేహితులతో కలిసి ర్యాంప్ వాక్ ప్రాక్టీసు చేస్తోంది. శనివారం కాలేజీలో నిర్వహించిన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న షాలిని ర్యాంప్ మీదనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అయితే అంత చిన్నవయస్సులో గుండెపోటు అంటే నమ్మశక్యంగా లేదని ఆమె కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాలిని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
ఫ్యాషన్ షో : షో టాపర్‌గా సింధు అదరహో
-
బ్యూటీ క్వీన్.. వర్కవుట్‌తో విన్
ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతుంటారు. కదలికల్లో కవ్వింపు ఉంటుంది. అన్నింటా ‘రాణి’ంపు ఉట్టిపడుతుంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని వచ్చిన అమ్మాయిల తీరే మారిపోతుంది. దీనికి కారణం కాంటెస్ట్‌లో పాల్గొన్న సమయంలో వారితో చేయించే సాధన. ముఖ్యంగా ఫిట్నెస్–డైట్ రొటీన్ అని చెప్పాలి. నగరానికి చెందిన యువతులకు బ్యూటీ పోటీలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ కాంటెస్ట్‌లలో పాల్గొనే వారికిచ్చే శిక్షణకు సంబంధించి నిపుణులు చెబుతున్న విశేషాలివి... సాక్షి, సిటీబ్యూరో : అటు శరీరాన్ని, ఇటు బాడీ లాంగ్వేజ్‌ని తీర్చిదిద్దడానికి ఫిట్నెస్ అత్యవసరం.దీని కోసం వీరితో చేయించే సాధన క్రమం ఇలా ఉంటుంది. ⇔ మైండ్ అండ్ బాడీ: యువతుల దేహంతో పాటు మైండ్‌ని కూడా తప్పనిసరిగా ట్యూన్ చేస్తారు. దీని కోసం ఫ్రీనెక్ ఎక్సర్సైజ్లు, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అలాగే పర్వత త్రికోణాసన, అర్ధకటి చక్రాసన, వజ్రాసన తదితర ప్రాధమిక స్థాయి యోగాసనాలు వేయిస్తారు. ⇔ బాడీ బ్యాలెన్స్: శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడమే దీని ఉద్దేశం. ర్యాంప్‌వాక్ చేసేటప్పుడు సరైన విధంగా అడుగులు కదపడానికి పిలాటిస్ వ్యాయామం చేయిస్తారు. అలాగే దృష్టిని ఒకే చోట నిలుపుతూ మాట్లాడడానికి ఏకాగ్రత అవసరం. కాబట్టి యోగాని పిలాటిస్తో కలిపి ప్రత్యేక వర్కవుట్ చేయిస్తారు. ⇔ బాడీ ఎటాక్: సాధన ఊపందుకున్నాక చేయించే ప్రక్రియ ఇది. దీనిలో భాగంగా క్రీడాకారుల శైలి వ్యాయామాలు చేయిస్తారు. కేవలం బాడీ వెయిట్‌తో మాత్రమే చేసే వర్కవుట్స్ దీని స్పెషాలిటీ. వీటికి ఏరోబిక్స్ కూడా జత చేస్తారు. ⇔ బూట్ క్యాంప్: పచ్చని ప్రకృతి, సహజమైన వాతావరణంలో దీనిని చేయిస్తారు. ఇది సర్క్యూట్ స్టైల్ వర్కవుట్. పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్, లంజెస్, కెటిల్ బెల్స్, బాల్ వర్క్‌లతో పాటు స్కిప్పింగ్, రన్నింగ్, కాలిస్థెనిక్స్ వంటివి ఉంటాయి. మరికొందరితో కలిసి చేయాల్సిన వ్యాయామ విధానం ఇది. ⇔ బాడీపంప్: చాలామంది అమ్మాయిలకు తమకు ఫ్యాట్ ఉన్న విషయం తెలియదు. ఈ కాంటెస్ట్‌లలో ఏ మాత్రం ఫ్యాట్ ఉన్నా ఫలితం వ్యతిరేకం కాక తప్పదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొవ్వును కరిగించే వ్యాయామశైలి అయిన బాడీపంప్ను చేయిస్తారు. వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రయినింగ్ ఆధారంగా రూపుదిద్దుకున్న వ్యాయమం ఇది. లోయర్‌బాడీ కంటే అప్పర్ బాడీకి కాస్త ఎక్కువగా వెయిట్స్ ఉపయోగిస్తారు. ⇔ లెథల్ లెగ్స్: సరైన టోనింగ్ ఉంటేనే లోయర్ బాడీ లుక్ బాగుంటుంది. అందుకే లోయర్‌బాడీ టోనప్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందింది లెథల్ లెగ్స్. దీనిలో స్క్వాట్స్, లంజెస్, లెగ్ రైజర్స్, లెగ్ కిక్స్ వంటివి ఉంటాయి. ⇔ కూల్‌డౌన్: వ్యాయామాన్ని వార్మప్‌తో ప్రారంభించి తప్పనిసరిగా దేహం కూల్‌డౌన్ కావాలి. దీనికోసం కొన్ని రకాల సెల్ఫ్ స్ట్రెచ్‌లు కనీసం 10సెకన్లు అదే భంగిమలో ఉండేట్టు చేయిస్తారు. శవాసనంతో ఫిట్నెస్ రొటీన్ ముగిసిన తర్వాత వ్యక్తిగత సందేహాలను నివృత్తి చేసేందుకు 15నిమిషాల పాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. డైట్..వెరీ స్పెషల్ అందాల పోటీల్లో పాల్గొనే వారికి డైట్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఫ్యాట్లెస్గా అన్ని పోషకాలతో ఉంటుంది. తెల్ల బియ్యంతో వండిన అన్నం అసలు ఉండదు. ఇక అత్యధికంగా వినియోగించేవి కూరగాయలు. డైట్ విషయంలో టైమ్‌టేబుల్ ఏ మాత్రం మిస్సవకుండా జాగ్రత్త పడతారు. రోజుకు కనీసం గంటన్నర పాటు వ్యాయామాలు చేస్తున్నప్పుడు ముఖసౌందర్యం దెబ్బతినకుండా, మేని మెరుపు కోల్పోకుండా జాగ్రత్తగా డైట్‌ని తీర్చిదిద్దుతారు. పోషకాహార నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన వంటకాల మెనూ వీరికి వడ్డిస్తారు. ⇔ బ్రేక్ ఫాస్ట్: పుచ్చకాయ, బొప్పాయి పండు ముక్కలు, కీరదోసకాయ, టమాటా ముక్కలు, వెన్న తీసిన పెరుగు, వీట్ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్, ఎండు ఖర్జూరాలు, బాదం, ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన బీన్స్, ఓట్మీల్, కొతిమీర పచ్చడి, ఊతప్పం, వెజిటబుల్ సాంబార్, బటర్‌మిల్క్, కమలా పండ్లు, పైనాపిల్ జ్యూస్, వీట్‌బ్రెడ్, విభిన్న గింజధాన్యాలతో రూపొందిన మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తదితర సమాహారంగా ఉంటుంది. ⇔ లంచ్: టమాటా సలాడ్స్, క్యారెట్స్ లేకుండా ఇండియన్ గ్రీన్ సలాడ్స్, క్యాబెజీ రెడ్ ఆనియన్ సలాడ్స్, స్టీమ్డ్ అమెరికన్ కార్న్ చాట్, టమాటా సాస్‌తో గ్రిల్డ్ వెజిటబుల్స్, రోటీలు, మేతీ మూంగ్ దాల్, గోధుమ పిండి చపాతీలు ఉంటాయి. ⇔ డిన్నర్: స్టీమ్డ్ చికెన్, పప్పు, గోధుమ బ్రెడ్ రోల్స్, ఉడికించిన బ్రౌన్‌రైస్, చేపలు, పుదీనా పరాటాలు వంటివి రాత్రి డైట్‌కి ఉపయోగిస్తారు. తరచూ వెజ్సూప్లు, కొబ్బరి నీళ్లు, జల్జీరా జ్యూస్‌లు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తారు. ఇందులో పూర్తిగా కాకపోయినా కూసింతైనా ఫాలో అవగలిగితే కిరీటం సంగతేమో గానీ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడడం సాధ్యమే. అందుకే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచినవారు, ఫైనలిస్ట్‌గా మాత్రమే మిగిలినవారు కూడా ఈ కాంటెస్ట్ మా జీవితాన్ని మార్చేసింది అని చెబుతారు. -
హెయిర్ స్టైల్ గ్లో..కలర్‌ఫుల్ షో
-
మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది: అభిమానులు
‘దీపిక పదుకొనె’... అందం, అభినయం, అదృష్టాల కలబోత. అందుకే ఈ ముద్దుగుమ్మతో నటించాలని బాలీవుడ్ పరిశ్రమలో పెద్ద హీరోల నుంచి యువ హీరోల వరకూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ భామ షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి బడా హీరోలందరి సరసన నటించించారు. ఆయా చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా సాధించాయి. అంతేందుకు ఎన్నో వివాదాల మధ్య విడదలయిన ‘పద్మావత్’ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దీపికతో పాటు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్ర విజయంలో దీపిక అందం, అభినయం ప్రాధాన పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ‘పొడుగుకాళ్ల’ సుందరి అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలల్లో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తు హొయలొలికిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే కొన్ని రోజుల కిందటే ఈ భామ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్ర నిర్వహించిన ‘మిజ్వాన్ ఫ్యాషన్ షో’లో రణ్‌బీర్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇది చూసి వారి అభిమానులు వీరిరువురిని మరోసారి బిగ్‌స్క్రీన్ మీద చూడాలని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ఈ షోకు సంబంధించి రణ్‌బీర్‌తో ఉన్న ఫోటోలను దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలపై అభిమానులు భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు దీపిక మరోమారు రణ్‌బీర్‌తో కలిసి నటిస్తే బాగుంటుందని తెలపగా, మరికొందరు మీరిద్దరూ కలిసిపోయి మీ పాత బంధాన్ని కొనసాగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్స్ చూసి రణ్వీర్ అభిమానులు.. ‘మీరు రణ్‌బీర్‌తో కన్నా రణ్వీర్ సింగ్‌తో ఉంటేనే చాలా అందంగా ఉంటార’ని కామెంట్ చేశారు. గతంలో రణ్‌బీర్ - దీపిక ప్రేమించుకుని తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా వీరివురు ‘యే జవాని హే దివాని’, ‘తమాషా’ చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, దీపిక పదుకొనెల పెళ్లికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిరువురూ నవంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నట్లు వదంతులు షికారు చేస్తున్నాయి. కానీ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ర్యాంప్‌పై ‘సై’నా..
-
వారెవ్వా.. మాగ్నోవా
అందమైన భామలు.. లేత మెరుపు తీగలై క్యాట్‌వాక్ చేసుకుంటూ వస్తుంటే, అబ్బాయిలు నవ మన్మథులై ర్యాంప్‌పై నడిస్తే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్ షో కనుల నిండుగా జరిగింది. అంతకుముందు కళాశాలలో ‘ఛలో’ హీరో నాగశౌర్య సందడి చేశారు.లేటెస్ట్ డిజైన్ డ్రెస్సుల్లో మెరుపుతీగల్లా మగువలు, హుందాతనం ఒట్టిపడే దుస్తుల్లో మగవారు.. ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకున్నారు. కొత్తదనం డిజైన్లతో విద్యార్థులు క్యాట్‌వాక్ చేస్తుంటే సహచరులు సందడి చేశారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంబీఏ విభాగం, స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యంగ్ మేనేజర్, మార్కెటింగ్, సెల్ఫ్ ఈవెంట్స్, కో–ఆర్డినేషన్ ఈవెంట్స్, ట్రెజర్ హంట్, పోస్టర్ మేకింగ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. అనంతరం జరిగిన నృత్యాలు ఆకట్టుకున్నారు. నైపుణ్యాలు పెంచుకోండి పాఠ్యాంశాలను నేర్చుకోవడంతో పాటు ఆ అంశాల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్స్టిట్యూట్స్ సెక్రటరీ డాక్టర్ ఆర్.మనోజ్‌కుమార్ తెలిపారు. మాగ్నోవా–2018 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, డీన్ రాజేష్ సి.జంపాల, డైరెక్టర్ బాబూరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంచేందుకు తమ కళాశాలలో ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాగ్నోవా కన్వీనర్ రమేష్ చంద్ర, మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులు బి.సుమలత, కె.విజయ్, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
ర్యాంప్‌పై స్టైల్ వాక్ చేసిన అమితాబ్
-
లాక్మేలో న్యూ లుక్
ఇండియన్ ర్యాంప్‌పై తొలి ట్రాన్స్‌జెండర్ రిపోర్టర్స్ డైరీ అంజలి లామా (32). నేపాల్ ‘అమ్మాయి’. వచ్చే నెల ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయబోతోంది. ఒక ట్రాన్స్ జెండర్ మోడల్ తొలిసారి ఇండియన్ ర్యాంప్‌పైకి వెళ్లబోవడమే ఇందులోని సంచలనం. అంజలి అమ్మాయి కాదు. అబ్బాయి. నవీన్ వైబా అనే అబ్బాయి! అతడు అంజలిగా మారడమే ఒక విశేషమైతే, ఏకంగా గ్లామర్ వరల్డ్‌లో పాదం మోపడం మరీ విశేషం. ఈ న్యూస్ తెలియగానే ‘సాక్షి’ ఆమెను అభినందించింది. ఆమెతో ముచ్చటించింది. అంజలి మనోభావాలివి. ఇంట్లోంచి.. వెళ్లగొట్టారు నేపాల్‌లోని నువాకట్ నా బర్త్ ప్లేస్. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే సమాజంలో లైంగికపరంగా ఉన్న వైరుధ్యాలను చూస్తూ పెరిగాను. అబ్బాయిలు, అమ్మాయిలు తమదైన సహజ స్వభావంతో ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తున్నప్పుడు అందుకు భిన్నంగా.. నా ప్రవర్తన, ఆలోచనలు ఉండడం గ్రహించాను. అమ్మతో నాకు ఎక్కువ దగ్గరితనం. నా ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలే. ఎప్పుడూ వాళ్లతో ఉండేవాడిని. వాళ్లతో కంఫర్ట్‌గా అనిపించేది. నేనూ దాదాపుగా ఒక అమ్మాయిలా మారిపోయాను. అందరూ నన్ను వింతగా చూడడం మొదలైంది. చివరకు నా ప్రవర్తనతో తలెత్తుకోలేకపోతున్నామంటూ నా కుటుంబం కూడా నన్ను తరిమేసింది. గ్లామర్ ఫీల్డ్ ‘ఛీ’ కొట్టింది చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖాట్మాండులో మోడలింగ్ ట్రైనింగ్ పూర్తి చేశాను. ఒక మ్యాగజీన్ కవర్ పేజీ కోసం ఏర్పాటు చేసిన ఫోటో షూట్‌తో.. నా జీవితం ప్రారంభం అయినప్పఅయింది. అయితే అడుగడుగునా నా ప్రయాణం కష్టంగా మారింది. అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తగిలాయి. ట్రాన్స్ జెండర్ అనే ఏకైక కారణంతో గ్లామర్ ప్రపంచం నన్ను తిరస్కరించింది. చాలా ఏడ్చాను. స్నేహితులు, బంధువులు అంతా ఈ వృత్తిని వదిలేయమని సలహా ఇచ్చారు. కాని నేను వదిలిపెట్టలేదు. నా పై నాకున్న నమ్మకంతో, ట్రాన్స్జెండర్లు గ్లామర్ ఫీల్డ్‌కు పనికిరారనే అపోహ తొలగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు నడిచాను. ప్రతిష్టాత్మకమైన లాక్మే ఫ్యాషన్ వీక్ దాకా రాగలిగాను. నాకు ఇష్టమైన మోడల్ ఆండ్రియానా లిమా. బ్రెజిల్. నేనింకా పైపైకి ఎదగాలి పూర్తిగా నా ప్రొఫెషన్పైనే దృష్టి పెట్టాను. మోడల్‌గా ఉంటూనే ఇంకా పెద్ద పోటీల్లో పాల్గొని గెలవాలనేది నా కోరిక. మోడలింగ్ రంగంపైనే పూర్తిగా నా దృష్టి ఉంటుంది. ఇక్కడే నా స్థానాన్ని ఏర్పరచుకుంటా. కానీ ఇందుకు నేను చాలా కష్టపడాలి. దేశంలో ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీ అయిన ఎల్జీబీటీ (లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ పీపుల్) హక్కుల పట్ల ఎవరికి పట్టింపు లేదు. మమ్మల్ని ఈ సమాజం అంగీకరించడం చాలా కష్టం. అయినప్పటికీ, నేను మాత్రం అతి కష్టమ్మీద అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ స్థాయికి వచ్చాను. నా విజయాలతో నాతోటి వారికి స్ఫూర్తిని కలిగించడం నా బాధ్యతగా భావించి పని చేస్తాను. ఫిట్నెస్ గురించి అంజలి ఆహారం మితంగా తీసుకుని.. తగిన మోతాదులో నీళ్లు తాగుతాను. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్‌గా ఉంచుకుంటాను. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఎంపికయిన తర్వాత, ఇప్పుడిప్పుడే జిమ్‌కు వెళ్లడం మొదలు పెట్టాను. నా సలహా ఒక్కటే.. మన శరీర తత్త్వాన్ని తెలుసుకుని, దానికి తగ్గ పని చెప్పాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేచురల్‌గా, సింపుల్‌గా ఉండాలి. అదే మన అందాన్ని కాపాడుతుంది. – ఎస్.సత్యబాబు -
అందమైన ఆత్మవిశ్వాసం
ఆసిడ్ బ్యూటీ ఇన్ న్యూయార్క్ దాక్కోవాల్సింది దాడికి గురైనవారు కాదు. దాడి చేసినవారు. బహిష్కృతులు కావలసింది బాధితులు కాదు. బాధించినవారు. బూడిదలో నుంచి ఫీనిక్స్‌లు మాత్రమే లేవవు. రేష్మా వంటి ఆడపిల్లలు కూడా ఎగురుతారు. రెక్కల్లో బలం గుండెల్లో ధైర్యం ఊపిరి నిండా ఆత్మవిశ్వాసం... జీవితం చూపుడు వేలు ఆడిస్తే రేష్మా దాని వైపు చూపుడువేలు ఆడించింది. ‘ఎస్... ఇది నా జీవితం... నువ్వు ఓడించలేవు... ఖబడ్దార్’... అంది! మొన్నటి సెప్టెంబర్ 8న న్యూయార్క్‌వాసులు ఒక గొప్ప సౌందర్యాన్ని చూశారు. ముఖం కాలి, ఒక కన్ను లొత్తబోయి, చూడ్డానికే కలవరం కలిగే ఒక ముఖం ఉన్న అమ్మాయి ఎంతో ధైర్యంతో ర్యాంప్‌వాక్ చేయడం వాళ్లు చూశారు. ఒక్క క్షణం ఆశ్చర్యం. ఒక్క క్షణం కలవరం. మరు నిమిషం హర్షాతిరేకాలతో కరతాళధ్వనుల తాకిడి. ‘రేష్మా... రేష్మా’... గ్యాలరీ నుంచి ప్రోత్సాహకరంగా అరుపులు. ఆసిడ్ దాడికి ముందు రేష్మ- బ్యూటీ. ఆసిడ్ దాడి తర్వాత కూడా బ్యూటీనే. ఆసిడ్ బ్యూటీ. గాయం దేహాన్ని ఛిద్రం చేసుండొచ్చు. కాని ప్రయాణాన్ని కాదు. ఇది రేష్మ కథ. నా పేరు రేష్మా. మాది ఉత్తరప్రదేశ్. మా అక్క, నేను అక్కడే పుట్టాము. మా నాన్న మా జీవనం కోసం ముంబై వచ్చాడు. అక్క పెళ్లి ఉత్తరప్రదేశ్‌లోనే జరిగింది. అయితే అక్కకూ బావకూ భేదాభిప్రాయాలు వచ్చాయి. అక్క మా దగ్గరకు వచ్చింది. చిన్న కుటుంబ సమస్యే అనుకున్నాము. కాని మా బావ తీవ్రంగా మా అక్క మీద పగ పట్టాడని మాకు తెలియదు. 2014లో ఒక రోజు నేను, మా అక్క చాలా రోజులైందని మా సొంత ఊరు వెళ్లాము. బంధువులను కలిసి స్టేషన్లో రైలు కోసం నిలబడి ఉన్నాము. ఒక్కసారిగా కొంతమంది మమ్మల్ని చుట్టు ముట్టారు. ఏం జరుగుతున్నదో తెలిసేలోపే నా ముఖం భగ్గున మండింది. లక్షలాది గాజు పెంకులు దిగబడిన బాధ. తీవ్రమైన మంట. జ్వలనం. ఆసిడ్... ఆసిడ్... మా అక్క పెద్దగా కేకలు వేసింది. వచ్చినవాళ్లు తొట్రుపడి పారిపోయారు. వారిలో మా బావ ఉన్నాడని తర్వాత తెలిసింది. వాస్తవానికి వాళ్లు వచ్చింది మా అక్క మీద దాడి చేయడానికి. కాని ఇద్దరం బురఖాలలో ఉండటంతో నేనే మా అక్క అనుకున్నారు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నరకం మొదలైంది ఆసిడ్ దాడి తర్వాత నరకం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో బంధువులంతా తలా కొంత వేసుకుని నాకు చికిత్స చేయించారు. అయితే కనీసం పది లక్షలు ఉంటేనే కాని ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి చేయడం సాధ్యం కాదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆడపిల్ల బతుకు నాశనం కాకూడదని తెలిసిన వాళ్లంతా అంత డబ్బూ పోగేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించారు. కాని నాకు తెలియదు. ఆ సర్జరీలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయిన నా ముఖాన్ని కనీసం మానవ ముఖంగా చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రమేనని! ఆసిడ్ దాడి నుంచి కోలుకున్న రేష్మా ఖురేషీ వీడియోల ద్వారా బ్యూటీ టిప్స్ చెబుతున్నారు. ఆమె ‘లిప్‌స్టిక్’ గురించి చెప్పిన వీడియోను 15 లక్షల మంది వీక్షించారు. ఇదే కాదు ఇండియన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఆధ్వర్యంలో రేష్మా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటున్నారు. నా జీవితం మారింది సర్జరీ పూర్తయిన తరువాత ఒక రోజు నా ముఖాన్ని నన్ను చూసుకునే అనుమతి ఇచ్చారు. చూసుకున్నాను. పెద్దగా ఆర్తనాదం చేశాను. దేవుడా... ఎందుకిలా చేశావు అని గుండెలు బాదుకుని ఏడ్చాను. నా ముఖం ముఖంలా లేదు. అసలది ఏ ముఖమూ కాదు. నా రెండు కళ్లు ఉండవలసిన స్థానంలో లేవు. ఒక కన్ను పూర్తిగా పోయింది. ముడతలు పడిన ముఖం. కందిపోయిన చర్మం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏంచేస్తారు? నేను అదే చేద్దామనుకున్నాను. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. నేను మానసికంగా కుంగిపోవడం చూసిన మా అక్క, మా తల్లిదండ్రులు నన్ను ముంబైలోని ‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ అనే సంస్థకు తీసుకువెళ్లారు. ఆ సంస్థ వారు నాకు కౌన్సెలింగ్ చేశారు. నాలో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఆ సంస్థలో వలంటీరుగా చేరాను. వారు గతంలో రేఖ అనే ఆసిడ్ బాధితురాలికి చికిత్స చేయించారు. ఆమె పరిచయం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. రేఖ, నేను ఇద్దరం ఒకరికొకరం ఆలంబనగా నిలిచాం. క్రమంగా నేను ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో మోడల్ని అయ్యాను. ఆసిడ్ దాడి చట్టం ప్రకారం ఆసిడ్ దాడి చేసిన వారికి కనీసం పది సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. రేష్మా విషయంలో ఆమె బావను అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని బెయిల్ మీద విడుదల చేశారు. మరో ఇద్దరికి మాత్రం శిక్ష విధించారు. వారే స్ఫూర్తి... ‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ సంస్థ వారి మాటలు నాకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఆసిడ్‌ను బహిరంగంగా అమ్మకూడదని ‘ఎండ్ ఆసిడ్ సేల్’ పేరిట ఉద్యమం చేశాను. 2013లో సుప్రీంకోర్టు ఆసిడ్‌ను నిషేధించిందని మనకు తెలుసు. కాని ఇప్పుడు అన్ని ప్రదేశాలలోను విచ్చలవిడిగా దొరుకుతోంది. చట్టం చేయడం కంటే ఆ చట్టాన్ని అమలు చేయడమే ముఖ్యమని నా ప్రచారం సాగుతున్నది. మరపురాని సంఘటన... ఫ్యాషన్ వీక్... న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ నుంచి నాకు ఆహ్వానం అందింది. సెప్టెంబరు 8, గురువారం నాడు నేను అక్కడ ర్యాంప్ వాక్ చేశాను. అందరి కెమెరాలు నన్ను చూసి క్లిక్ క్లిక్‌మన్నాయి. ఆ షోలో నాకు ప్రసంగించే అవకాశాన్ని ఇచ్చారు. నాకు తెలుసు... ఇది వ్యక్తిగత ప్రసంగం కాదని... నా మాటలు బాధితురాలైన ప్రతి స్త్రీకి ఉత్తేజాన్ని ఇవ్వాలని. అందుకే ఇలా అన్నాను- ‘ఆసిడ్ దాడి జరిగినా సరే న్యూయార్క్‌కు రావడం, అందునా అందానికి విలువ ఇచ్చే వేదిక మీద ఆత్మవిశ్వాసమే అందం అని చాటి చెప్పగలగడం నాకు సంతోషంగా ఉంది. ఇతర ఆసిడ్ బాధితులు నన్ను చూడాలని, నా ద్వారా ప్రేరణ పొందాలని కోరుకుంటున్నాను. మన గురించి మనం తెలుసుకోవడమే అందంతో సమానం. మాలాంటి వాళ్లం జీవితాన్ని గడపడానికి ఎంతో ధైర్యం కావాలి. కాని అదేమీ పెద్ద కష్టం కాదని చెప్పదలుచుకున్నాను. మిగిలిన ఆసిడ్ బాధితులను కూడా నా లాగే ధైర్యంగా బయటకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. వారు ఏది చేయగలరో ఆ పని చేయమని పిలుస్తున్నాను’ అని ఉద్విగ్నంగా ప్రసంగించాను. ఇది నా జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తాను. అందరూ నా మాటలను స్వాగతిస్తూ పెద్దగా చప్పట్లు కొట్టారు. అవి ప్రపంచమంతా వినపడాలని నా కోరిక. - డాక్టర్ వైజయంతి -
అందమే ఆనందం
సాక్షి, సిటీబ్యూరో: కాసింత సౌందర్య పోషణ ఉంటే కొండంత ఆత్మవిశ్వాసంతో అందంగా మెరిసిపోవచ్చునని చెబుతూ నిర్వహించిన అందాల అతివల ర్యాంప్‌వాక్ ఆకట్టుకుంది. కొంపల్లిలో బుధవారం అనూస్ సెలూన్ అండ్ క్లినిక్ 17వ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘షో’లో మోడల్స్ మెరిశారు. సినీ తార(నేను శైలజ ఫేం) ధన్యా బాలకృష్ణ సెలూన్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు ప్రదీప్‌రావు, సీహెచ్ అనూరాధ, అన్నపూర్ణ, సుష్మ, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
సన్నీలియోన్‌కు మరో ఘనత!!
బాలీవుడ్ బాంబ్‌షెల్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్తింపు పొందబోతోంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఆమె ఉబ్బి తబ్బిబ్బు అయిపోతోంది. ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో తాను నడవబోతున్నట్లు సన్నీ ట్వీట్ చేసింది. ఇక ఇదే విషయం గురించి డిజైనర్ అర్చనా కొచ్చర్ కూడా ట్వీట్ చేసింది. తాను భారతదేశంలో పర్యటించినప్పుడు పొందిన అనుభూతులతో రూపొందించిన 'ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్' అనే డిజైనర్ దుస్తులను సన్నీ కోసం అర్చన ఇస్తున్నారు. Woohoo!! Dreams really do come true! Thank you @Archana_Kochhar pic.twitter.com/5M9ACJdRXI — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 So excited!A dream come true...I'm walking NewYork Fashion Week SS17 for Archana Kochhar Opening Show on the 8th Sep 2016 @Archana_Kochhar — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 The count down begins ! 8th September #NYFW16 #ArchanaKochhar #NYFW #FTLMODA #couture #fashionshow pic.twitter.com/jJ6EewhXpp — Archana Kochhar (@Archana_Kochhar) 1 September 2016 -
భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్
-
భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ ర్యాంప్‌పై నడుస్తూ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు. కరీనా త్వరలో తల్లి కాబోతున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించి బెబో ర్యాంప్‌పై మెరిసి.. షో స్టాపర్‌గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఆమె కళ్ల నిండా నీళ్లతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై కరీనా మాట్లాడుతూ.. ఇవి జీవితంలో ప్రత్యేకమైన క్షణాలని, తల్లి కాబోతున్న తనకు ఈ ర్యాంప్ వాక్ ఓ మధురమైన జ్ఞాపకమని, ప్రస్తుతం చాలా ఎమోషనల్‌గా ఉన్నానని అన్నారు. ఇంతకుముందు సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేయలేదని, ఇదే తొలిసారని చెప్పారు. అలాగే తన కోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందించినట్లు తెలిపారు. -
రిటైల్ షాప్‌లో మోడల్స్ సందడి
-
తారల తళుకులు..
-
చారిటీ స్పెషల్.. మెరిసిన డైనింగ్ హాల్
-
ర్యాంప్ వాక్ అదుర్స్
విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో బుధవారం జరి గిన వసుంధర డైమండ్ రూఫ్ బ్రాండ్ ప్రీ లాంచ్ కార్యక్రమం సందర్భంగా వజ్రాభరణాలతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. నెక్లెస్‌లు, చెవి దిద్దులు, హారాలు, విభిన్న రకాల గొలుసులు, బ్యాంగిల్స్, రింగ్స్ వంటి వజ్రాభరణాలు ధరించిన మోడళ్లు హల్చల్ చేశారు. హైదరాబాద్‌లో వజ్రాభరణాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ తన కార్యకలాపాలను నవ్యాంధ్రకు విస్తరించింది. హోటల్ గేట్‌వే ఎదురుగా ఏర్పాటు చేసిన వసుంధర డైమండ్ రూఫ్ షోరూంను గురువారం ప్రముఖ సినీ నటి శ్రీదేవి ప్రారంభిస్తారని షోరూమ్ అధినేత వసుంధర తెలిపారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. షోరూమ్ ప్రతినిధి ఆయుషి తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ (లబ్బీపేట) -
ర్యాంప్‌వాక్‌తో సానియా హల్చల్
-
హైటెక్ కళాపోషణ
ప్రొఫెషనల్స్ సైతం విస్తుపోయేలా డ్యాన్స్. మోడల్స్‌కి దీటుగా ర్యాంప్‌వాక్. కనువిందు చేసే గెటప్స్. వన్స్‌మోర్ అనిపించే షాయరీలు. అన్నీ కలబోసిన ఈ కార్యక్రమాన్ని కండక్ ్టచేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘హైఫై లైఫ్‌స్టైల్.. టైమ్ దొరికితే కాఫీషాప్స్... వీకెండ్స్‌లో పబ్స్!’ తమ మీదున్న ఇలాంటి అభిప్రాయానికి చెక్ పెడుతూ వీలు చేసుకుని మరీ ఈ ఈవెంట్ ద్వారా సోషల్ సర్వీస్ బాట పట్టారు టెకీ లు. సేవే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ).. ఇంతకుముందు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఈ కల్చరల్ ఈవెంట్ రొటీన్‌కు భిన్నమైనది. రోజంతా కంప్యూటర్లకు స్క్రీన్స్‌కు కళ్లప్పగించే టెకీలు.. తమలోని సృజనను తట్టిలేపారు. ఆటపాటలతో అందరికీ కనువిందు చేశారు. కాలేజీ రోజుల్లో ఫ్రెషర్స్, ఫేర్వెల్ డేస్ అప్పుడు చేసిన అల్లరికి.. కొంచెం హుందాతనం, ఇంకొంచెం ప్రొఫెషనలిజం జోడించి పర్ఫెక్ట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇటీవల గంటన్నర పాటు జరిగిన యాన్యువల్లో ఏడాదంతా గుర్తుండిపోయే అభినయం చూపారు. అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) జనరల్ మైకేల్ ములిన్స్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏడీపీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, డెలాయిట్, టీసీఎస్, ఐబీఎం... ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 200 కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాలు పంచుకొన్నారు. ఎవరికి ప్రావీణ్యమున్న కళల్లో వాళ్లు తమ సత్తా చూపించారు. ఒక్కో థీమ్.. ఒక్కో తీరు.. ఒకరు శాస్త్రీయ సంగీతంలో ఓలలాడిస్తే... కొందరు కామెడీ స్కిట్స్ చేసి కడుపుబ్బా నవ్వించారు. డ్యాన్స్‌ల కోసం ప్రొఫెషనల్స్ తరహాలో కొరియోగ్రాఫర్స్ సహాయం తీసుకున్నారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఒకరు ఏంజల్, ఇంకొకరు వాల్ పెయింటింగ్, మరొకరు లగాన్ గెటప్.. ఇలా ఒక్కో థీమ్‌కు ఒక్కో తరహా డ్రెసింగ్‌తో అలరించారు. బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌కి స్టెప్పులు వేశారు. ఇక ఏడీపీ ఉద్యోగులు 12 మంది మెడ్లీ సాంగ్‌పై పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో స్టేజ్ మీదికి ఎంట్రీ ఇచ్చిన టీమ్ సభ్యులు.. ముఖాలపై డ్రాగన్ స్పార్క్లింగ్స్తో సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించారు. ఇక క్యాపిటల్ ఐక్యూ నుంచి గ్రూప్ డ్యాన్స్ వీక్షకులను సైతం కాలు కదిపేలా చేసింది. ఇక అమ్మాయిల క్యాట్‌వాక్‌తో హొయలు పోతే.. అబ్బాయిలు ర్యాంప్‌పై మోడల్స్‌లా గాంభీర్యం ప్రదర్శించారు. ఒంటినిండా టాటూస్, ఫంకీ హెయిర్‌స్టైల్స్‌తో, హాలీవుడ్ హీరోస్తో పోటీ పడ్డారు. ఇలా ఎక్కడో మరచిపోయిన తమలోని టాలెంట్‌ను మరోసారి వెలికి తీసి ఓ వెలుగు వెలిగారు. స్ట్రెస్ రిలీఫ్.. జాబ్ టెన్షన్స్‌కు చెక్ పెట్టడానికి టెకీలు ఈవెంట్స్‌ను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసి తమ సత్తా చాటుతున్నారు. వచ్చామా.. చేశామా అన్నట్టు కాకుండా.. ఇందుకోసం నిపుణుల దగ్గర కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఎంచుకోవడమే కాదు, రిహార్సల్స్‌లో చెమటోడ్చి.. వాటిని సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్నారు. డ్యాన్స్, ర్యాంప్వాక్లే కాదు.. కామెడీతో పాటు సామాజిక అంశాలపై స్కిట్స్ కూడా చేస్తున్నారు. - సిరి ఫండ్స్ ఫర్ రిలీఫ్: వందలాది కంపెనీలు ఎంతో ఉత్సాహంతో ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాయి. ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడం సంతోషాన్నిస్తోంది. వచ్చిన స్పాన్సర్ ఫండ్‌ను అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలకోసం ఉపయోగిస్తునాం. ఈ ఈవెంట్ ఓ కాజ్కు ఉపయోగపడేదే కాదు, ఐటీ ఉద్యోగులకు తమ టాలెంట్ ప్రదర్శించే అవ కాశాన్ని కూడా కల్పించింది. - రమేష్ లోకనాథన్, ప్రెసిడెంట్, హైసీ -
ఆరుపదుల్లోనూ అందంగా...
సాధారణంగా ‘ఫ్యాషన్’ అనగానే అందరూ ‘యువతకు మాత్రమే’ కదా... అనుకుంటారు. ఫ్యాషన్ షోలు.. ర్యాంప్ వాక్‌లు వారికోసమేనని భావిస్తుంటారు. కానీ ఫ్యాషన్ ఒక వయసుకు మాత్రమే చెందినది కాదు. అన్ని వయసుల వారికీ ‘ఫ్యాషన్ మంత్ర’ అవసరమైనదే! బాలీవుడ్ తారలు హేమమాలిని, షబానా అజ్మి, శోభా డే, కిరణ్ ఖేర్...లు ఆరుపదుల వయసులోనూ అందంగా కనిపిస్తుంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు వారు అప్పటి ట్రెండ్స్‌ను అనుసరించారు. వయసు పైబడ్డాక వచ్చిన హుందాతనాన్ని తమ వేషధారణతో అందంగా మలచుకుని ఇప్పటికీ అబ్బురపరుస్తుంటారు. వార్ధక్యం ఓ వరంగా భావించే అందరూ తమ శరీరాకృతికి తగిన వేషధారణతో ఎదుటివారి ప్రశంసలను పొందుతుంటారు. ప్రయత్నిస్తే ‘ఫ్యాషన్ ఐడల్’ అనే కితాబును మీరూ పొందవచ్చు. నూరేళ్లలో కేవలం నూరు వసంతాలు మాత్రమే చూస్తారనుకుంటే పొరబాటు. ప్రతి మాసం వసంత ం, ప్రతి రుతువు ప్రీతికరమైన క్రతువు కావాలంటున్నారీ నారీనరులైన నిత్యయువకులు. యాభై ఏళ్లుగా తడబడని అడుగులతో మడమ తిప్పని సినీ రాఘవ ఓ ఉదాహరణ. ఎనభైమూడేళ్ల ఈ వయసులోనూ నా మనసుకు ఇరవై మూడే... అంటున్న సింగీతం మరో తారా తార్కాణం. పొట్ట చెత్తబుట్ట కాదనీ... మేనిని మెరిపించే పోషకాల సెజ్జ అని, యౌవనపాఠాలకు ఒజ్జ అనీ చెప్పే రేఖ మాటలను మీ చేతి రేఖలుగా చేసుకోండి. నిత్యయౌవనులైన వాళ్లను ఫాలో అవ్వండి. ఎప్పటికీ యంగ్ఫెలోస్గా ఉండండి. వీళ్లు... కదంతొక్కుతూ, పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ఉండే యువపెద్దలు. వీళ్లు... ఆరుపదుల్లో పదహారుల స్ఫూర్తి పరవళ్లు తొక్కే ఉరవళ్ల వాగులు.ఇక కృష్ణా రామా అనుకునే వయసులో యువతకు గీతోపదేశాలూ, చెడు పట్ల అసురసంహారాలు చేసీ, చేయించే వృద్ధయువతరం వీళ్లు. క్యాలెండర్ సాక్షిగా పుట్టి,తేదీలూ, ఏడాదుల పరంగా మాత్రమే యువకులై... ప్రవృత్తిపరంగా మాత్రం ఎముకలు కుళ్లీ, వయసు మళ్లీ ప్రవర్తిస్తుంటే వాళ్లలో నెత్తురు మండించీ, శక్తులు నిండించీ స్ఫూర్తిని రగిలించే సీనియర్ సిటిజెన్స్ వీళ్లు. వీరినుంచి పాఠాలు నేర్చుకుని తమ యువజన హృదయాలను మరింత స్ఫూర్తిమంతం చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మా ‘ఫ్యామిలీ’ అన్ని పేజీలనూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ యువపెద్దలకూ, పెద్దయువకులకూ సలాం చేస్తూ అంకితం చేస్తోంది సాక్షి ఫ్యామిలీ. కేశాలంకరణ ... షబానా అజ్మికి ప్రత్యేకం! బాలీవుడ్ తార షబానా అజ్మి ఆధునిక, సంప్రదాయ వేషధారణలలో కనువిందు చేస్తుంటారు. ‘దుస్తులు సౌకర్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంగా ఉండగలం’ అంటూ ఈ వయసు వారికి మరిన్ని సూచనలు ఇస్తున్నారు. ‘కేశాలంకరణలో ఆధునికంగా కనిపించడానికి ఇష్టపడతాను. అందుకే షార్ట్ హెయిర్ కట్ని ఎంచుకుంటాను. మెరుపులీనే మేకప్‌కి దూరంగా ఉంటాను. కనులు, కేశాలు, చర్మ నిగారింపు మీద దృష్టిపెడతాను. చీరలో, పైజామా కమీజ్‌లో సంప్రదాయతను ఒలికించడమే కాదు... జీన్స్, స్కర్ట్స్ వంటి ఆధునిక దుస్తులు కూడా భయం లేకుండా ధరిస్తాను.’ ఆధునికం... శోభా డే! నవలా రచయిత్రిగా, సామాజికవేత్తగా శోభా డే పేరు చాలా మందికి సుపరిచితమైనది. 66 ఏళ్లు నిండినా ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణలో ఇప్పటికీ ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉంటారు శోభా డే! ‘ఎలాంటి వస్త్రధారణలో అయినా సంప్రదాయ అలంకరణ వస్తువులను పక్కన పెట్టేయాలి. సిల్క్ స్కార్ఫ్ మెడలో వేసుకుంటే మెటాలిక్ కాపర్, వెండి, ప్రాచీన కాలంనాటి నగలుగా కనిపించే చుంకీ ఆభరణాలు వయసును ఉన్నదానికన్నా తక్కువగా చూపిస్తాయి. పెద్ద కంఠహారం ధరిస్తే మెడపై ముడతలు కూడా కనిపించవు.’ కళాత్మకం... కిరణ్ ఖేర్! వెండితెర, బుల్లితెర నటిగా, టెలివిజన్ కార్యక్రమాలలో అతిథిగానూ కిరణ్ ఖేర్ అందరికీ సుపరిచితమే! పేరు చెప్పగానే ఆమె ఆహార్యం గ్రాండ్‌గా కళ్లముందు కదులుతుంది. పెద్ద అంచులున్న చీరలు, పెద్ద పెద్ద ఆభరణాలను ఆమె ధరిస్తారు. ‘ప్రాచీన కళకు ప్రతిరూపంగా నిలిచే ఆభరణాలు ఏ లోహంతో తయారైనవైనా నా అలంకరణ సామగ్రిలో భాగమైపోతాయి. ఎంబ్రాయిడరీ, చేనేత చీరలు నన్ను మరింత హుందాగా చూపిస్తాయి. అందుకే వాటినే ఇష్టపడతాను.’ సంప్రదాయం... హేమమాలిని! అందానికి సరిపోలే అర్థంలా కనిపిస్తారు హేమమాలిని. నాడు - నేడు నిగనిగలాడే మేని వర్చస్సు, దానికి తగ్గ అలంకరణ, వేషధారణతో ఆరుపదులు దాటినా ఆకర్షణీయత ఆమె సొంతం. ‘ఏజ్ లెస్ బ్యూటీ’గా పేరున్న హేమమాలిని అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారు. ‘శరీరం ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్, యోగా-ప్రాణాయామం, డ్యాన్స్.. నన్ను ఇప్పటికీ యవ్వనంగా ఉంచుతున్నాయి. శాకాహారభోజనమే తీసుకుంటాను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. అయితే ఈ సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. రెండు కప్పుల గ్రీన్ టీతో నా దినచర్య మొదలవుతుంది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకుంటుంటాను. రాత్రి ఎనిమిదిలోపు భోజనం ముగిస్తాను. మేకప్‌లో ముందుగా కళ్లకు ప్రాముఖ్యం ఇస్తాను. ఎక్కడకు వెళ్లినా కళ్లకు కాజల్, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటాను. రోజూ క్లెన్సింగ్ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటాను. సంప్రదాయ వస్త్రధారణ నాకు బాగా నప్పుతుంది. చీరలు వయసుకు తగిన హుందాతనాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. అందుకే రకరకాల చీరలను ధరించడానికి ఇష్టపడతాను. అయితే ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా జాగ్రత్తపడతాను.’ -
రెండు నిమిషాల నడకకు.. 10 లక్షలు!!
ఒక నెల రోజులు కష్టపడితే సామాన్యంగా ఎంత సంపాదిస్తారు? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయల వరకు సంపాదించొచ్చు. కానీ, అందాల తార సమంత కేవలం రెండంటే రెండే నిమిషాలు అలా.. అలా నడిచి ఎంత సంపాదించిందో తెలుసా.. అక్షరాలా 10 లక్షల రూపాయలు!! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. స్టార్ డమ్ ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించాలనే సూత్రాన్ని చక్కగా పాటిస్తోంది సమంత. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు భారీ ఓపెనింగ్స్‌తో బిజి బిజీగా గడిపేస్తోంది. ఇది హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల ఫ్యాషన్ షోలో సమంత ర్యాంప్‌పై తళుక్కుమంది. అందుకోసం సమంతకు ముట్టిన మొత్తం పది లక్షల రూపాయలు. ఓ గార్మెంట్ సంస్థకు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ కాంట్రాక్టు ఒప్పుకొన్నందుకు వచ్చే డబ్బుతో పాటు.. ర్యాంప్‌పై ఇలా నడిచినందుకు మరో పదిలక్షలు ఎక్స్ట్రా పుచ్చుకుందట. తమ డిజైన్లను కొనుగోలుదారులకు పరిచయం చేయాలంటే .. ఫ్యాషన్ డిజైనర్లకు సమంత లాంటి స్టార్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా వాక్ చేసే స్టార్లను షో స్టాపర్స్ అంటారు. ఆ స్టార్ డిమాండ్‌ను బట్టి డిజైనర్‌కు పేరు వస్తుంది. ప్రస్తుతానికి ఫ్యాషన్ డిజైనర్లలో చాలామంది ఇలాగే చేస్తున్నారు. అదే సమంత లాంటి క్రేజీ హీరోయిన్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. -
ర్యాంప్ వాక్ రోల్ మోడల్స్
సక్సెస్‌ను మించిన ఫ్యాషన్ ఏముంది? సక్సెస్ఫుల్ పర్సన్‌ను మించిన మోడల్స్ ఎవరుంటారు? అందాలను ఒలకబోస్తూ, వయ్యారాలు పోయే ప్రొఫెషనల్ మోడల్స్.. విజయాలకు ప్రతీకలైన నారీమణుల ముందు దిగదుడుపే కదా. దీనినే నిరూపిస్తున్నాయి ఇటీవల నగరంలో నిర్వహిస్తున్న కొన్ని ఫ్యాషన్ షోలు. ర్యాంప్ ‘షో’ అంటే మోడల్స్‌కు మాత్రమే పరిమితమనే సూత్రాన్ని తిరగరాస్తూ.. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారికి ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న ఈ తరహా షోలు సూపర్‌హిట్ అవుతున్నాయి. హుందాగా మెరిసిపోయే పొడవాటి వేదిక.. దాని మీద వయ్యారంగా సాగే నడక. పేరు ర్యాంప్‌వాక్. పొలిటీషియన్స్ నుంచి వెండితెర ప్రముఖుల దాకా అతిరథ మహారథుల వంటి అతిధులు, నిర్విరామంగా వెలిగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు, వీటన్నింటి మధ్యలో తడబడకుండా నడవడమే కష్టం. ఇక వయ్యారాలు ఒలకబోయాలంటే.. ప్రొఫెషనల్ మోడల్స్‌కు మాత్రమే సాధ్యం అనుకునేవారు ఒకప్పుడు.. అయితే సిటీలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ర్యాంప్‌వాక్‌కు పెరుగుతున్న క్రేజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు పెళ్లయి, తల్లులయినా ఫిట్నెస్ను మెయిన్టైన్ చేస్తూ దానికి తమ సక్సెస్ అనే బ్యూటీని అదనంగా జత చేస్తూ ఆహూతుల మనుసులు గెల్చుకుంటున్నారు. వారిలో కొందరు మహిళలతో సిటీప్లస్ సంభాషించింది. ఫస్ట్ అండ్ బెస్ట్... ఫ్యాషన్ రంగంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడూ ర్యాంప్వాక్కి ఓకె చెప్పలేదు. అయితే మొన్న జరిగిన ఒక చారిటీ ఈవెంట్లో మాత్రం పార్టిసిపేట్ చేశాను. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి నేపథ్యం ఉన్న షోలో పాల్గొన్నాననే కాకుండా ఆత్మవిశ్వాసం ఉట్టిపడే నడకతో అందరి హర్షధ్వానాలు అందుకోవడం ఆనందాన్నిచ్చింది. -అయేషా లఖోటియా, ఫ్యాషన్ డిజైనర్ ఫిట్ ఫర్ షో.. రోజూ ఇంటికి ఫిట్నెస్ ట్రైనర్ వస్తారు. రోజుకి రెండు గంటలు అన్ని రకాల వ్యాయామాలు చేస్తాను. మనం ఫిట్‌గా, పర్ఫెక్ట్గా ఉన్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే పెళ్లయినా, తల్లయినా ర్యాంప్‌వాక్‌కు జంకాల్సిన పనిలేదు. నాలుగైదు సార్లు ర్యాంప్ వాక్ చేశాను. అందరి ముందు మోడల్ తరహాలో నడవడం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆ ఆత్మవిశ్వాసం నాకు అవసరమైనదే. - బీనా మెహతా, బిజినెస్ ఉమెన్ మంచి వేదిక ర్యాంప్‌వాక్ అంటే మోడల్స్‌కే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన ప్రతినిధులుగా వాటిని రిప్రజెంట్ చేస్తూ మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఇది చక్కని వేదిక. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. - పూర్ణిమ మండవ, సెలబ్రిటీ వెల్నెస్ కోచ్ ఇది ఇంటర్నేషనల్ స్టైల్... విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వాళ్లతో ర్యాంప్‌వాక్ చేయించడం మన దగ్గర ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఇది విదేశాల్లో సర్వసాధారణం. సక్సెస్ఫుల్ పర్సన్స్‌తో రూపొందిన కేలండర్స్ కూడా విడుదల చేస్తారు. -కరుణా గోపాల్, ఫ్యూచర్ సిటీస్ ఆనందంగా ఉంది.. విభిన్న రంగాల్లో విజయవంతమైన మహిళల్ని ర్యాంప్‌పై చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మహిళలు ర్యాంప్ వాక్ చేస్తుంటే హాజరైన మహిళలు సైతం మరింత బాగా స్పందిస్తారు. ఎందుకంటే వారితో తమని ఐడెంటిఫై చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా మోడలింగ్, గ్లామర్ రంగాలకు సంబంధం లేని మహిళలతో ఒక షోని నిర్వహిస్తే చూడాలని ఉంది. - రేణు సుఖేజా, కొరియోగ్రాఫర్ - ఎస్.సత్యబాబు -
వాక్ ఫర్ చారిటీ
-
ర్యాంప్ కంటే కెమెరానే ఇష్టం: కృతి సనన్
ర్యాంప్ మీద హొయలొలికిస్తూ క్యాట్ వాక్ చేయాలంటే అంత సులభం ఏమీ కాదట. దానికంటే సినిమాల్లో చేయడమే చాలా సులభమని చెబుతోంది '1.. నేనొక్కడినే' హీరోయిన్ కృతి సనన్. గతంలో ఆమె తరుణ్ తహిల్యానీ, రోహిత్ బల్ లాంటి ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేసింది. దానివల్ల తన ఆత్మవిశ్వాసం పెరిగినా, ఇప్పటికీ ర్యాంపు మీదకు వెళ్తే చాలా భయపడతానని, కెమెరా ముందయితే సులభంగా చేయగలుగుతున్నానని కృతి చెప్పింది. ర్యాంప్ మీద నడిచేటప్పుడు ఎదురుగా ప్రేక్షకులు ఉంటారని, వాళ్లను చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కొన్ని నిమిషాల పాటు ఉండాలని చెప్పింది. అదే కెమెరా ముందయితే తప్పులు చేసినా మళ్లీ దిద్దుకోడానికి వీలుంటుందని కృతి తెలిపింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి.. అక్కడి ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. తర్వాత ఈసీఈ గ్రూపుతో బీటెక్ చేసింది. ఐదేళ్ల వయసులో తొలిసారిగా ర్యాంపు మీద నడిచింది. అప్పట్లో మధు సప్రే, మిళింద్ సోమన్ లాంటి పెద్ద నటీనటులతో కలిసి ఆమె మోడలింగ్ చేసింది. టీవీ ప్రకటనల్లో నటించేటప్పుడే తనకు కెమెరా అంటే ఇష్టం ఏర్పడిందని, తర్వాత షూటింగ్‌ను ఎంజాయ్ చేశానని చెప్పింది. తెలుగులో మహేష్ బాబు సరసన '1.. నేనొక్కడినే' సినిమా తర్వాత బాలీవుడ్లో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ సరసన 'హీరోపంతీ' సినిమాలో నటించింది. కంగనా రనౌత్, దీపికా పదుకొనే, అనుష్కా శర్మలకు మంచి ఫ్యాన్ అయిన కృతి.. కేవలం గ్లామర్ డాల్‌గానే ఉండాలని అనుకోవడంలేదు. అన్ని రకాల పాత్రలు చేస్తానంటోంది. -
ఎర్ర తివాచీ చిన్నబోయింది
అందాల తారలు ఎర్ర తివాచీపై క్యాట్‌వాక్ చేస్తుంటే చూడటానికి అదో హాయి. పైగా ఐశ్వర్యా రాయ్ లాంటి సౌందర్య రాశి హంస నడకలు నడిస్తే చూడడానికి రెండు కళ్లూ చాలవు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ఐష్ చేసే ర్యాంప్ వాక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే ఈ ఉత్సవాలపై సినీ అభిమానుల దృష్టి ఉంటుంది. పదమూడేళ్లుగా క్రమం తప్పకుండా ఐష్ ఈ వేడుకల్లో మెరుస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఓ ప్రముఖ సౌందర్య సాధనం తరఫున ఎర్ర తివా చీపై హంస నడకలు నడవడానికి సమాయత్తమయ్యారు. కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్‌తో కలిసి ఆమె బుధవారం ముంబయ్ నుంచి ఫ్రాన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం సజావుగా సాగి ఉంటే, శుక్రవారం కేన్స్ చిత్రోత్సవాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేసి ఉండేవారు. కానీ, ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కారణంగా ఐష్ లండన్ దాటలేకపోయారు. ఈ అందాల సుందరి ఆగమనం కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ వార్త నిరాశపరిచింది. అందాల సుందరి పాదాలను మోయడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర తివాచీ సైతం చిన్నబోయిందంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంది. కానీ, మొదటి రోజు మిస్సయ్యారు. రెండో రోజు గురించి తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు కూడా మిస్సయితే అప్పుడు వేరే తేదీల్లో ఐష్‌తో ర్యాంప్ వాక్ చేయించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 14న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు 25 వరకు సాగుతాయి. ఇది ఇలా ఉంటే.. చిత్రోత్సవాల ప్రారంభం నాడు మల్లికా శెరావత్ ర్యాంప్ వాక్ చేశారు. -
ఫ్యాషన్‌షోలో కేక పుట్టించిన సానియా
-
అలాంటివి నాకు చేతకాదు
‘‘ర్యాంప్‌లపై నడవడానికి నేను మోడల్ని కాను.. హీరోయిన్ని’’ అంటూ చిర్రుబుర్రులాడారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మిస్సు కస్సుబుస్సుల వెనుక, ఈ క్యాట్‌వ్యాక్ వెనుక ఓ కథ ఉంది. ‘జో రివాజ్’ అనే ఉత్తరాదికి చెందిన వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసి డర్‌గా ఉన్నారు తమన్నా. ఈ కంపెనీ పబ్లిసిటీలో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించడానికి పూనుకున్నారు సదరు షోరూమ్ యాజమాన్యం. దానికి సంబంధించిన యాడ్ ఫిలింలో తమన్నాను నటింపజేయాలనుకున్నారు. ఈ యాడ్‌ఫిలింలో కంపెనీకి సంబంధించిన చీరలను ధరించి ర్యాంప్‌పై అందంగా తమన్నా క్యాట్‌వాక్ చేయాలి. అయితే... తమన్నా ర్యాంప్‌పై నడవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో అవాక్కవ్వడం సదరు కంపెనీవారి పనైంది. క్యాట్‌వాక్ చేయడం మిల్కీబ్యూటీకి చేతకాదని అర్థమవ్వడంతో ఎలా నడవాలో తెలియజేయడానికి ఓ ట్రయల్వాక్ని ఏర్పాటు చేశారు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఈ సందర్భంలో కోపం రావాల్సింది వాళ్లకైతే, అందుకు భిన్నంగా వాళ్లపై అగ్గిమీద గుగ్గిలమైపోయారట తమన్నా. ‘నేనేమైనా మోడల్ని అనుకుంటున్నారా? హీరోయిన్ని. ఇలాంటి చెత్త నడకలు నడవడం నాకు చేతకాదు’’ అంటూ వాళ్లపై ఫైర్ అయిపోయారు. దాంతో షాక్ తిన్న యాజమాన్యం ఏదో బుజ్జగించి మూడు రోజుల పాటు తమన్నాకు క్యాట్వాక్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారట. ఎట్టకేలకూ కార్యక్రమం చివరి రోజున ఓ మోస్తరుగా నడిచి పర్వాలేదనిపించారట తమన్నా.