రెండు నిమిషాల నడకకు.. 10 లక్షలు!! | samantha earns 10 lakhs for 2 minute ramp walk | Sakshi
Sakshi News home page

రెండు నిమిషాల నడకకు.. 10 లక్షలు!!

Published Wed, Aug 13 2014 6:12 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

రెండు నిమిషాల నడకకు.. 10 లక్షలు!! - Sakshi

రెండు నిమిషాల నడకకు.. 10 లక్షలు!!

ఒక నెల రోజులు కష్టపడితే సామాన్యంగా ఎంత సంపాదిస్తారు? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయల వరకు సంపాదించొచ్చు. కానీ, అందాల తార సమంత కేవలం రెండంటే రెండే నిమిషాలు అలా.. అలా నడిచి ఎంత సంపాదించిందో తెలుసా.. అక్షరాలా 10 లక్షల రూపాయలు!! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. స్టార్ డమ్ ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించాలనే సూత్రాన్ని చక్కగా పాటిస్తోంది సమంత. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు భారీ ఓపెనింగ్స్‌తో బిజి బిజీగా గడిపేస్తోంది. ఇది హైదరాబాద్‍లో జరిగిన రెండ్రోజుల ఫ్యాషన్‌ షోలో సమంత ర్యాంప్‌పై తళుక్కుమంది. అందుకోసం సమంతకు ముట్టిన మొత్తం పది లక్షల రూపాయలు.

ఓ గార్మెంట్ సంస్థకు సమంత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ కాంట్రాక్టు ఒప్పుకొన్నందుకు వచ్చే డబ్బుతో పాటు.. ర్యాంప్‌పై ఇలా నడిచినందుకు మరో పదిలక్షలు ఎక్స్‌ట్రా పుచ్చుకుందట. తమ డిజైన్లను కొనుగోలుదారులకు పరిచయం చేయాలంటే .. ఫ్యాషన్ డిజైనర్లకు సమంత లాంటి స్టార్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా వాక్ చేసే స్టార్లను షో స్టాపర్స్‌ అంటారు. ఆ స్టార్ డిమాండ్‌ను బట్టి  డిజైనర్‌కు పేరు వస్తుంది. ప్రస్తుతానికి ఫ్యాషన్‌ డిజైనర్లలో చాలామంది ఇలాగే చేస్తున్నారు. అదే సమంత లాంటి క్రేజీ హీరోయిన్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement