
కష్టపడితే కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. మరికొన్నిసార్లు అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓ హీరో చేయాల్సిన మరో హీరో చేసి హిట్ కొట్టడం, ఓ హీరోయిన్ కి రావాల్సిన అవకాశం లాస్ట్ మినిట్ లో మరో బ్యూటీకి దక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇక కీర్తి సురేశ్ అదృష్టం విషయానికొస్తే.. బాలనటిగా మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. 'నేను శైలజ' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. కానీ కీర్తి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రమంటే మాత్రం 'మహానటి' అని చెప్పొచ్చు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. అంతలా పేరు తెచ్చిన ఈ సినిమాకు తొలి ఆప్షన్ కీర్తి సురేశ్ కాదని మీకు తెలుసా?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మహేశ్ డబ్బింగ్ చెప్పిన 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)
'మహానటి' కోసం నిత్యామేనన్ సహా తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. కానీ చివరకు కీర్తి సురేశ్ దగ్గరకు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. అలానే తమిళంలో విజయ్ తో చేసిన 'భైరవ'లో కూడా తొలుత త్రిషని అనుకున్నారు. కానీ కీర్తి సెట్ అయింది. హిట్ కొట్టేసింది.
మహానటి తర్వాత చాన్నాళ్ల పాటు కీర్తి సురేశ్ కి సరైన మూవీస్ పడలేదు. దీంతో ఈమె పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అలాంటి టైంలో 'దసరా' సినిమా ఈమెకు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇందులో తొలుత సమంతని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అదృష్టం కీర్తిని వరించింది. అలా వేరే వాళ్లని అనుకుని వద్దనుకోవడం వాళ్లకు ఓ రకంగా బ్యాడ్ లక్ కాగా.. కీర్తి సురేశ్ కి విపరీతంగా కలిసొచ్చేసిందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment