
హీరోయిన్ సమంత సినిమాలు చేయక చాలారోజులైంది. మధ్యలో ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసింది తప్పితే యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టింది. మరోవైపు త్రలాలా పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్.. 'శుభం' పేరుతో ఓ మూవీని త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కటివరకు బాగానే ఉంది కానీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో చేయడం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)
హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. తర్వాత కొన్నాళ్లకు తన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని 'శాకుంతలం' సినిమా ప్రమోషన్ల టైంలో బయటపెట్టింది. తర్వాత కొన్నాళ్లపాటు చికిత్స తీసుకుంది. మధ్యలో 'ఖుషి' తప్పితే మరో మూవీ చేయలేదు.

ప్రస్తుతం సమంతని చూస్తే చాలావరకు మాములుగానే కనిపిస్తోంది. కానీ తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో మాత్రం హాస్పిటల్ బెడ్ పై పడుకుని సెలైన్ ఎక్కించుకున్నట్లు ఫొటోని షేర్ చేసింది. దీంతో ఇంకా సమంతకు అనారోగ్యం తగ్గలేదా అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!)
Comments
Please login to add a commentAdd a comment