Cost of Samantha's Myositis Treatment; Check Details - Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: చికిత్స కోసం అప్పు చేసిన సామ్.. నిజమేంటి?

Published Wed, Aug 2 2023 7:10 AM | Last Updated on Wed, Aug 2 2023 8:20 AM

Actress Samantha Myositis Treatment Cost Details - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండోనేసియాలోని బాలి టూర్‌లో ఉంది. ఇప్పటికే షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన సామ్.. కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోనుంది. ఈ విషయం నిజమే. దీంతో ఆమె చికిత్స కోసమే ఈ విరామం తీసుకుందని అంటున్నారు. అయితే ఈ విషయమై విదేశాలకు వెళ్లబోతున్న సామ్.. ట్రీట్‌మెంట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తమిళనాడుకు చెందిన సమంత.. 'ఏ మాయ చేశావె' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాల చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 

(ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా)

కెరీర్‌లో భాగంగా తెలుగుతో పాటు తమిళ సినిమాలూ చేసిన సామ్.. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్‌లో విలన్ తరహా పాత్ర చేసిన సమంత.. త్వరలో 'సిటాడెల్' సిరీస్‌తో అందరినీ ఎంటర్‌టైన్ చేయనుంది. అలానే ఈమె నటించిన 'ఖుషి'.. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతుంది.

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తను బాధపడుతున్నట్లు గతేడాది బయటపెట్టిన సమంత.. ఓవైపు సినిమాలు చేస్తూనే చికిత్స తీసుకుంది. అయితే పూర్తి మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లబోతుందని దీని కోసం రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయనుందని టాక్. బహుశా ఇది నిజం అయ్యిండొచ్చు ఏమో కానీ, ఈ మొత్తాన్ని ఓ హీరో దగ్గర అప్పుగా తీసుకుందనే ఓ రూమర్ మాత్రం తెగ వైరల్ అయింది. బోలెడంత ఆస్తి సంపాదించిన సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే అప‍్పు అనేది కచ్చితంగా ఫేక్‌న్యూస్.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement