kushi
-
ఆ ఫోటోలు షేర్ చేయకండి.. నాకు పెళ్లి అవుతుందనే నమ్మకం లేదు: హీరోయిన్
సినిమా తారల ఆడంబరాలే బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. చాలా మంది కష్టాలు, కన్నీ ళ్లు అంతర్గతంగా ఉండిపోతాయి. చాలా మంది రకరకాల వ్యాధులతో బాధ పడుతుంటారు. అయినప్ప టికీ బయటకు నవ్వుతూ కనిపిస్తారు. అది ఏడవ లేక నవ్వడమే అన్నది ఎంత మందికి తెలుస్తుంది. చాలా మంది కేన్సర్ బారిన పడి నరకయాతన పడుతున్న వారూ ఉన్నారు. టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక నటి ముంతాజ్ (43) కన్నీటి కథ కూడా ఇలాంటిదే. ఆమె తెలుగు, తమిళ పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లలో ఆమె మెప్పించింది. కోలీవుడ్‌లో 'మోనీసా ఎన్ మోనాలిసా' చిత్రం ద్వారా నటి ముంతాజ్‌ను దర్శకుడు టీ.రాజేందర్ పరిచయం చేశారు . ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ముంతాజ్‌కు మా త్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ భామ కొన్ని కారణాలు ఏమైనా ఐటమ్స్ సాంగ్స్‌లో నటించి, శృంగార తారగా ముద్రవేసుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ పలు సినిమాల్లో నటించినా ఆ తరువాత సినీరంగం నుంచి కనుమరుగయ్యారు. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించారు. ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటే.. లారెన్స్ సినిమా తరువాత తెలుగులో రెండు చిన్న చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో ముంతాజ్ పేర్కొంటూ సడన్‌గా తన వెన్నుముక భాగం కదలడానికి కూడా వీలుపడక నొప్పి వచ్చిందన్నారు. ఆ నొప్పిని తట్టుకోలేకపోయానన్నారు. పలువురు వైద్యులు పరీక్షించినా సమస్య ఏమిటో చెప్పలేకపోయారన్నారు. అలా రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించానని చెప్పారు. ఆ తరువాత ఒక ఆప్పత్రిలో పరిశోధన చేయగా తనకు ఆటో ఇమ్యూన్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యాధి కారణంగా తన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకల జాయింట్స్ ఉన్నాయో ఆక్కడ భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు. దీంతో కూర్చోలేక, నిలబడలేక, శరీరాన్ని కదల్చలేక నరకయాతన పడ్డానని చెప్పారు. మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నానో తనకే తెలిసేది కాదన్నారు. అదే మానసిక వ్యాధి అని చెప్పారు. ఒకసారి రెండున్నర గంటల సేపు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూనే ఉన్నానని, తన మానసిక వ్యాధిని అర్ధం చేసుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చింది తన అన్నయ్యనేనని చెప్పా రు. ఆయన లేకుంటే తానీ పాటికి ఆత్మహత్య చేసుకునేదాన్నని అన్నారు. నాకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేదు తాను గ్లామరస్‌గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముంతాజ్ పేర్కొన్నారు. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని అన్నారు. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని వేడుకున్నారు. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్ తన కన్నీటి కథను పేర్కొన్నారు. -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ
-
‘ఖుషి’ చిత్రం మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్ (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక
నటి జ్యోతిక.. అప్పట్లో అజిత్, విజయ్, శింబు వంటి క్రేజీ హీరోలతో జత కట్టి విజయాలను అందుకున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో టైటిల్ పాత్రలో సత్తాచాటారు. అలాంటి సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత నటనకు కొంత కాలం దూరంగా ఉండి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అలా జ్యోతిక రెండవ ఇన్నింగ్‌లో నటించిన తొలిచిత్రం 36 వయదినిలే (36 వయసులో) మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: నానికి నోటిదూల అంటూ.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్) ఆ తర్వాత వరుసగా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి గతంలో ఖుషి, తిరుమలై వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా చివరిగా 2003లో తిరుమలై చిత్రంలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో గానీ 20 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతిక మళ్లీ కలిసి నటించబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. లియో చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని విజయ్ సరసన జ్యోతిక నటిస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. కాగా లియో చిత్రం అక్టోబర్ 19వ తేదీన తెరపైకి రానుంది. ఈలోగా విజయ్ 68వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) -
ప్రేమలో ముగినితేలుతున్న టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్లో ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉంటుంది. కొంచెం కొత్తగా ప్రేమ కథను చెబితే చాలు ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీలకు అతి ప్రాధాన్యత ఇస్తారు. హీరోలు సైతం తొలుత లవ్‌స్టోరీలు చేయడానికే ఇష్టపడతారు. ఆ తర్వాత కొంతకాలానికి మాస్ ఇమేజ్‌ని కోరుకుంటారు. ఆ తరహా సినిమాలు వర్కౌట్ అయితే సరే, ఏ మాత్రం తేడా కొట్టినా.. ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి తేరుకునేందుకు మళ్లీ ప్రేమ బాట పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ చెందిన కొంతమంది హీరోలు అదే పని చేస్తున్నారు. యాక్షన్‌ని నో చెప్పి ప్రేమలో మునిగితేలుతున్నారు. వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ బీజీగా ఉన్న హీరోలపై ఓ లుక్కేద్దాం. ప్యార్‌కి సై అంటున్న విజయ్ ‘లైగర్’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో విజయ్ యాక్షన్‌కి రాం రాం చెప్పాడు. హిట్ అందుకునేందుకు మళ్లీ ‘గీత గోవిందం’ పార్మెట్లోకి వెళ్లి పోయాడు. శివ నిర్మాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ మరో ప్రేమ కథా చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరశురాంతో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా లవ్‌స్టోరీనే. గీత గోవిందం చిత్రానికి ఇది సీక్వెల్. ఇలా విజయ్ యాక్షన్‌కి నో చెప్పి ఫ్యార్కి సై అంటున్నాడు. మరోసారి ప్రేమలో పడ్డ డీజే టిల్లు ప్రేమలో పడడమే పనిగా పెట్టుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా మళ్లీ లవ్‌స్టోరీలోనే కనిపించబోతున్నాడు ఈ టిల్లుగాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ఫేవరెట్ జానర్లోకి చైతూ రీఎంట్రీ మొదట్లో వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు నాగ చైతన్య. ఆ ముద్ర నుంచి బయట పడేందుకు మధ్య మధ్యలో యాక్షన్ చిత్రాలు చేశాడు. కానీ అవేవి హిట్ కాలేదు. అయినప్పటికీ యాక్షన్‌ని వీడలేదు. కానీ ఆ మధ్య విడుదలైన ‘కస్టడీ’ చైతు కల్లు తెరిపించింది. విడుదలైన తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో చై మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి తిరిగి వచ్చాడు. ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో లవ్‌స్టోరీ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఈ మధ్యే స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలంతా మళ్లీ లవ్‌స్టోరీలు చేస్తూ ప్రేమలో మునిగిపోతున్నారు. -
Vijay Deverakonda, Samantha Kushi Movie Trailer Photos: విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ స్టిల్స్
-
సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండోనేసియాలోని బాలి టూర్లో ఉంది. ఇప్పటికే షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన సామ్.. కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోనుంది. ఈ విషయం నిజమే. దీంతో ఆమె చికిత్స కోసమే ఈ విరామం తీసుకుందని అంటున్నారు. అయితే ఈ విషయమై విదేశాలకు వెళ్లబోతున్న సామ్.. ట్రీట్మెంట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన సమంత.. 'ఏ మాయ చేశావె' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాల చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) కెరీర్లో భాగంగా తెలుగుతో పాటు తమిళ సినిమాలూ చేసిన సామ్.. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్లో విలన్ తరహా పాత్ర చేసిన సమంత.. త్వరలో 'సిటాడెల్' సిరీస్‌తో అందరినీ ఎంటర్టైన్ చేయనుంది. అలానే ఈమె నటించిన 'ఖుషి'.. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతుంది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తను బాధపడుతున్నట్లు గతేడాది బయటపెట్టిన సమంత.. ఓవైపు సినిమాలు చేస్తూనే చికిత్స తీసుకుంది. అయితే పూర్తి మెరుగైన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లబోతుందని దీని కోసం రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయనుందని టాక్. బహుశా ఇది నిజం అయ్యిండొచ్చు ఏమో కానీ, ఈ మొత్తాన్ని ఓ హీరో దగ్గర అప్పుగా తీసుకుందనే ఓ రూమర్ మాత్రం తెగ వైరల్ అయింది. బోలెడంత ఆస్తి సంపాదించిన సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే అప్పు అనేది కచ్చితంగా ఫేక్‌న్యూస్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
విజయ్ సమంత కెమిస్ట్రీ..మళ్లీ అదే ఫార్ములా..
-
'ఖుషి' టైటిల్ సాంగ్.. ఈసారి కూడా అదే ఫార్ములా!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఫుల్ లెంగ్త్ ప్రేమకథతో తీస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఇది కూడా అలానే మెలోడీయస్‌గా ఉంది. అయితే మళ్లీ ఓ విషయాన్ని సేమ్ ఫాలో అయిపోయారు. (ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో స్టేజీపై చలాకీ చంటి!) తొలిపాట 'నా రోజా నువ్వే'లో మణిరత్నం సినిమా పేర్లతో లిరిక్స్ రాశారు. దీన్ని కశ్మీర్ లో షూట్ చేశారు. 'ఆరాధ్య' పాటని భార్యభర్తల ఉండే అనుబంధం నేపథ్యంగా రాశారు. దీన్ని లీడ్ రోల్స్ ఉండే ఇంటిలో షూటింగ్ చేశారు. టైటిల్ సాంగ్ ని టర్కీలో చిత్రీకరించారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఈ పాటలో హిందీ లవ్‌స్టోరీ మూవీస్‌లో ఎక్కువగా వినిపించే ప్యార్, ఆషికి లాంటి పదాలు కనిపించాయి. ఇప్పటివరకు రిలీజైన అన్ని పాటల్ని దర్శకుడు శివ నిర్వాణ రాశారు. బహుశా రాబోయే మిగతా సాంగ్స్ కూడా ఆయనే రాసి ఉంటారనిపిస్తుంది. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్న మూవీపై పాటల వల్ల మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఓపెనింగ్స్ మంచిగానే వస్తాయని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
పెళ్లి తర్వాత అలాగే ఉండాలనుకుంటున్నా విజయ్ దేవరకొండ
-
వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!
Samantha Hair Stylist Emotional post: స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన ఈమె.. విరామం తప్పేం కాదని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎన్నాళ్లపాటు అనేది చెప్పలేదు గానీ ఇది ఏడాదికి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఇది ఎందుకోసమా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామ్ హెయిర్ స్టైలిష్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె బ్రేక్‌కి అసలు కారణం బయటపెట్టాడు. ఆ చికిత్స కోసం హీరోయిన్ సమంత గతేడాది 'యశోద' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కి సరిగ్గా కొన్నిరోజుల ముందు 'మయోసైటిస్' అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు 'ఖుషి' మూవీ, 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్స్ పూర్తి చేసింది. ఇప్పుడు తాత్కాలికంగా నటనని పక్కనబెట్టి.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ) ఆత్రుతగా చూస్తుంటా 'రెండేళ్లు.. 1 మ్యూజిక్ వీడియో.. 3 సినిమాలు.. 7 బ్రాండ్ క్యాంపెయిన్స్.. 2 ఎడిటోరియల్స్.. లైఫ్ టైమ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలని పోగేసుకున్నాం. ఎండ వాన లెక్కచేయకుండా పనిచేశాం. నవ్వులు, కన్నీళ్లు, బాధలు.. ఇలా అన్నీ చిరునవ్వుతో స్వీకరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అద్భుతమైన జర్నీ చేశాం' 'చికిత్స తీసుకుంటున్న టైంలో మీరు మరింత బలం, శక్తి రావాలని కోరుకుంటున్నాను. ముందు కంటే డబుల్ ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం' అని హెయిర్ స్టైలిష్ట్ రోహిత్ భట్కర్ పోస్ట్ పెట్టాడు. దీంతో వైద్యం కోసం సమంత విదేశాలకు వెళ్తుందనే విషయం నిజమేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. View this post on Instagram A post shared by Rohit Bhatkar (@rohit_bhatkar) (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిపై కామెంట్స్ చేశాడు. ఇది చేసుకున్న తర్వాత ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో బయటపెట్టాడు. రౌడీ హీరో ప్రస్తుతం 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్-సమంత భార్యభర్తలుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఓ సాంగ్ లో వీళ్లిద్దరూ నెక్స్ట్ లెవల్ కెమిస్ట్రీ పండించారు. దీంతో విజయ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: 'ఖుషి' కొత్త సాంగ్.. సమంతకి కొత్త తలనొప్పి!) నాది కూడా ఇలానే ''ఖుషి'లోని నాకు ఇష్టమైన పాటల్లో 'ఆరాధ్య' ఒకటి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు ఆ దంపతులు ఎలా ఉంటారో ఇందులో చూపించారు. ఎంతో బ్యూటిఫుల్‌గా సాగే ఈ సాంగ్‌లో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చూపించారు. నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు గానీ ఫ్యూచర్ లో నా పెళ్లి లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నాను' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. రష్మికతో విజయ్? గతంలో చాలా సందర్భాల్లో విజయ్-రష్మిక మధ్య పెళ్లి చేసుకుంటారని అన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు కలిసి చేశారు. అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. దీంతో వీళ్లిద్దరూ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే రూమర్స్ వచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం అని క్లారిటీ ఇవ్వడంతో అంత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ విజయ్ పెళ్లిపై కామెంట్స్ చేయడంతో రష్మిక ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. (ఇదీ చదవండి: చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!) -
జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత
సమంత త్వరలోనే సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నరనే ప్రచారం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు ‘ఖుషి’, సిటడెల్’ ల షూటింగ్స్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ఏడాది పాటు రెస్ట్ తీసుకోనున్నారట. ఈ ఏడాది మొత్తం తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నారట. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తోంది. దీంతో పాటు సిటడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఇప్పటికే ఖుషి షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్.. తాజాగా సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు సిటడెల్ వెబ్‌సిరీస్ పూర్తయింది’అని రాసుకొచ్చింది. ఇక సిటడెల్ విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటడెల్‌కు ఇండియన్ వెర్షన్ ఇది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రలు పోషించారు. రీఎంట్రీ ఉంటుందా? సిటడెల్, ఖుషి చిత్రాల రిలీజ్ తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. అప్పుడు కూడా కనిపిస్తుందో లేదో అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్లన్నీ తిరిగి ఇచ్చేస్తుందట సమంత. ఏడాది తర్వాత అయినా సరే మాతో చిత్రం చేయండి అని అడ్వాన్స్ అందిస్తున్నా.. ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారట. దీంతో ఇకపై ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (చదవండి: హోటల్లో డైరెక్టర్ తనతోపాటే రాత్రి ఉండిపోమన్నాడు: సింగర్) -
'ఖుషి' కొత్త సాంగ్.. సమంతకి కొత్త తలనొప్పి!
Samantha Trolling: 'ఖుషి' సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. 'ఆరాధ్య' పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పిక్చరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్, ట్యూన్ వరకు ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికే 'నా రోజా నువ్వే' పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తుండగా, దానికి ఇది కాంపిటీషన్ లా కనిపిస్తుంది. అదే టైంలో ఈ సాంగ్ లోని ఓ సీన్ వల్ల సమంతకు కొత్త తలనొప్పి వచ్చినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) కొన్నాళ్ల పాటు బ్రేక్ సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయిపోయాయి. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం దృష్ట్యా ఓ ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని సామ్ భావించిందని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. సరే అది పక్కనబెడితే 'ఖుషి' సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది. పాటలు అవి చూస్తుంటే హిట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఆ ట్వీట్ వల్ల 'ఆరాధ్య' అని వచ్చిన ఈ పాటలో ఓ చోట.. సమంత కుడి చేతిపై విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేస్తున్నట్లు ఓ స్టిల్ ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్ ని బయటకు తీశారు. అందులో.. 'ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి' అని రాసుకొచ్చింది. అయితే అది 'వన్ నేనొక్కడినే' పోస్టర్ అని చాలామంది అన్నారు. ఇప్పుడు ఆ ఫొటోని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన బెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. No Hate But Sorry #Samantha Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8 — Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023 (ఇదీ చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
విజయ్-సమంత కొత్త పాట.. ఆ సీన్స్ అయితే!
హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' అని ప్రేమికులందరినీ కట్టిపడేశారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. 'ఆరాధ్య' అని సాగే ఈ పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఇది ప్రేమికుల గీతంలా నిలిచిపోయేలా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఇది టీజర్ అంటే.. 'సలార్' ఇలా ఉండుంటే మాత్రం!) ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యమందించారు. తెలుగు, తమిళంలో సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ అయితే హైలెట్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. 'నా రోజా నువ్వే' పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఈ సెకండ్ సింగిల్ 'ఆరాధ్య'తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాని తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) -
గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!
Samantha Ruth Prabhu Cryptic Post: సమంత పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'యశోద', 'శాకుంతలం'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో ఆశలన్నీ ప్రస్తుతం 'ఖుషి' పైనే పెట్టుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ ఫొటో పోస్ట్ చేసిన సామ్ అందరూ అవాక్కయ్యేలా చేసింది. గుర్తుపట్టలేనంతగా సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతోంది. గతేడాది 'యశోద' విడుదల సమయంలో ఈ సమస్య గురించి బయటపెట్టిన సామ్.. ఆ తర్వాత పలు సినిమాలతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. అయితే సామ్.. ఓ సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోనుందని ఈ మధ్య న్యూస్ వచ్చింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ వాల్తేరు వీరయ్య బ్యూటీ!) ఆరు నెలలు కష్టంగా తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పిక్ పోస్ట్ చేయగా.. అది సమంత అని గుర్తుపట్టడానికి కాస్త సమయం పట్టింది. మేకప్ లేకపోవడం లేదా అలసట వల్లో తెలియదు గానీ ఇందులో సమంత చాలా డల్ గా కనిపించింది. 'ఈ ఆరు నెలల చాలా సుధీర్ఘంగా, కష్టంగా గడిచాయి. ఫైనల్ గా దీన్ని ముగించాల్సిన టైమ్ వచ్చింది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చికిత్స కోసం అంత ఖర్చు? ఏడాదిపాటు సమంత బ్రేక్ తీసుకోనున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అలానే సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని, ఈ మొత్తం చికిత్స కోసం ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు కానుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత లేటెస్ట్ లుక్ మాత్రం అందరినీ అయోమయానికి గురిచేసింది. Our boss lady #SamanthaRuthPrabhu papped at Mumbai airport@Samanthaprabhu2 pic.twitter.com/ZXg7hmLvwa — ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 8, 2023 (ఇదీ చదవండి: బుల్లితెర నటి ఇంట్లో చోరీ) -
భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు
సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్ సినిమా తీసేందకు ప్లాన్ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్ కొట్టేందుకు స్కెచ్ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్-100'తో దర్శకుడు అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాంతో తాజాగా తన సత్తా చాటేందకు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా మంగళవారం అనే పాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్. ఇప్పటికే ఆయన టీజర్ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్ జగదీష్' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్ కొడతారేమో. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?) -
సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!
అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారట. ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!
తెలుగు స్టార్ హీరోలు 'పాన్ ఇండియా' జపం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి నిఖిల్ వరకు ఈ ప్రయత్నాల్లో ఫుల్ బిజీ బిజీ. ఈ తరహా సినిమాలు చేస్తున్నారు గానీ హిట్స్ మాత్రం చాలా తక్కువ. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు నెలకు ఒకటి రావడమే గగనమైపోయిన ఈ రోజుల్లో.. ఏకంగా ఓ నెలంతా అలాంటి చిత్రాలే వస్తే? బాక్సాఫీస్ కి బ్యాండ్, మూవీ లవర్స్ కి పండగ గ్యారంటీ. మీకు సినిమాలంటే బాగా పిచ్చి ఉండి, ఓ మంచి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగండి. ఎందుకంటే పాన్ ఇండియాతోపాటు సరైన మాస్ చిత్రాలన్నీ అదే నెలలో విడుదలకు సిద్ధమైపోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా వారానికొకటి చొప్పున నాలుగుకి పైనే బరిలో ఉన్నాయి. వీటితోపాటు తెలుగు సినిమా ఒకటి, డబ్బింగ్ మూవీ మరొకటి లైన్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం. (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) ప్రభాస్ ఊరమాస్! 'బాహుబలి' తర్వాత అలాంటి హిట్ ఎప్పుడు పడుతుందా? రచ్చ ఎప్పుడు చేద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిటింగ్. అయితే దీని తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు వందల కోట్లు సాధించాయి గానీ హిట్ కొట్టలేకపోయాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తీస్తున్న ఊరమాస్ మూవీ 'సలార్'పైనే. సెప్టెంబరు 28న ఇది రిలీజ్ కానుంది. ఇది హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవడం, సరికొత్తవి నమోదు కావడం పక్కా. రౌడీ హీరో ఈసారైనా? విజయ్ దేవరకొండ పాన్ ఇండియా వైడ్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేది ఈ సెప్టెంబరులోనే. అదే నెల 1వ తేదీన 'ఖుషి' చిత్రం రిలీజ్ కానుంది. ఇది హిట్ కావడం విజయ్ కి చాలా ముఖ్యం. ఎందుకంటే 'లైగర్'తో ఇండస్ట్రీని దున్నేస్తా అదీఇదీ అని గతేడాది ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. కట్ చేస్తే ఆ మూవీ బొక్కాబోర్లా పడింది. ఇప్పుడు హిట్ కొడితే ఓకే లేదంటే మాత్రం విజయ్ కి కష్టాలు తప్పవు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) షారుక్ కొట్టాల్సిందే! 2018లో 'జీరో' ఫ్లాప్ కావడంతో షారుక్ పునరాలోచనలో పడిపోయాడు. దాదాపు ఐదేళ్లపాటు బిగ్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో 'పఠాన్'తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాద్ షాలో పస తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే మరో హిట్ కచ్చితంగా కావాలి. ఇప్పుడది 'జవాన్'తో వచ్చేలా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దేశభక్తి ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తీశారు. సెప్టెంబరు 7న రానున్న ఈ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు సునామీ గ్యారంటీ. రామ్ ఈసారి మాత్రం! రామ్ పేరు చెప్పగానే అందరికీ 'ఇస్మార్ట్ శంకర్' గుర్తొస్తుంది. దీని తర్వాత రెడ్, ద వారియర్ చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో ఒకేసారి హిట్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాని ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తీస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్నారు గానీ ఇప్పుడు దాని విడుదల తేదీ మార్చారు. సెప్టెంబరు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలు కూడా! ఇలా పైన చెప్పినట్లు సెప్టెంబరులోని నాలుగు వారాల్లో నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు 'డీజే టిల్లు 2' మూవీ సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చంద్రముఖి 2' కూడా ఇదే నెలలో వచ్చే అవకాశముందని అంటున్నారు. డేట్ ఫిక్స్ అయితే గానీ క్లారిటీ రాదు. సో అదనమాట విషయం. సెప్టెంబరు రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. కాబట్టి దొరికిన ఈ టైంలో హైప్ పెంచుకోండి. ఎందుకైనా మంచిది ఏ మూవీకి వెళ్లి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడే ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టుకోండి! (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు(మంగళవారం)విజయ్ బర్త్‌డే కానుకగా ఖుషి మూవీలోని తొలి పాట 'నా రోజా నువ్వే.. అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ఇక ఈ పాటలో సమంతను చూస్తే ఆమె ముస్లిం యువతిగా కనిపించింది. ఇక ఈ పాటకు స్వయంగా శివ నిర్వాణ లిరిక్స్ అందించగా, హీషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఇక ఖుషి సినిమా ప్రేమకథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం యువతి, హిందూ యువకుడి మధ్య లవ్‌స్టోరీనే ఖుషి అని తెలుస్తుంది. ఇంతకుముందు సమంత బర్త్‌డే పోస్టర్లో ఆమె మెడలో తాళితో ఐటీ ఉద్యోగిగా కనిపించింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్సాంగ్లో ముస్లిం యువతిగా కనిపించింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
విజయ్, సామ్‌ల 'ఖుషీ' ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం రెడీ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇది వరకే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకి మాంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ను వదిలారు. ఖుషీ ఫస్ట్ సింగిల్‌ను మే9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను వదిలారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Musical blast begins with the first single of #Kushi on May 9th❤️🔥 In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️#NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/1kSZou8xn1 — Mythri Movie Makers (@MythriOfficial) May 4, 2023 -
'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్ చూశారా? ఫోటో వైరల్
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అటు విజయ్‌తో పాటు, సమంతకు కూడా ఎంతో కీలకం. లైగర్‌తో విజయ్, శాకుంతలంతో సమంత బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డారు. దీంతో ఖుషిపైనే ఆశలు పెట్టుకున్నారు. చదవండి: ఆడవాళ్లు మాత్రమే ఇంటిపనులు ఎందుకు చేయాలి: హీరోయిన్ ఇక ఇప్పటికే ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఇవాళ(శుక్రవారం)సమంత బర్త్‌డే కావడంతో ఖుషీ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. ఐడీ కార్డుతో స్టూడెంట్ గెటప్‌లో కనిపించింది సామ్. ఇక హీరో విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీల నుంచి సమంతకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి Happy Birthday @Samanthaprabhu2 ❤️ https://t.co/VAarKWvPSH — Vijay Deverakonda (@TheDeverakonda) April 28, 2023 -
ముగ్గురి ఆశలు ఖుషి పైనే..
-
షూటింగ్‌కి బోట్లో వెళ్లిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత నారోగ్యం కారణంగా చాలా కాలం ఆలస్యమైన ఈ మూవీ షూటింగ్.. ఈ మధ్యే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే మేకర్స్ మార్చి 23న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుషీ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేరళలో విజయ్, సమంతలపై ముఖ్యమైన సీన్స్‌ను చిత్రకరిస్తున్నారు. తాజాగా కేరళలో బోటింగ్ చేస్తూ ఓ వీడియోను విజయ్ షేర్ చేశారు. దీనికి రైడ్ టూ వర్క్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
‘ఖుషి’ సెట్లోకి సమంత.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన విజయ్
సమంత ఇప్పుడు ఫుల్ ఫిట్‌గా తయారైయింది. మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని హుషారుగా తిరుగుతోంది. జిమ్ కూడా చేస్తుంది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఖుషి’ సెట్లో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గతేడాదిలోనే స్టార్ట్ అయింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు మళ్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న సమంత ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్.. సామ్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికింది. మహిళా దినోత్సవంతో పాటు టాలీవుడ్లో13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్, శివ నిర్వాణ, మైత్రీ ప్రొడ్యూసర్స్ సమంతకు శుభాకాంక్షలు తెలియజేయగా.. ఆమె హ్యాపీ మూడ్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
విజయ్, సమంతల 'ఖుషీ' మూవీపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు సామ్ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో ఖుషీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. .యాక్షన్ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అంటూ పాపులర్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఫిల్మ్‌సర్కిల్స్‌లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 8 నుంచి ఖుషీ కొత్త షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తుంది. Heading towards next schedules #Kushi Action mode on🔥 With ace stunt master @PeterHeinOffl and my editor @PrawinPudi pic.twitter.com/nVkma5QyaJ — Shiva Nirvana (@ShivaNirvana) March 5, 2023 -
సమంత-విజయ్ ‘ఖుషి’ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్!
స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్‌ను కశ్మీర్లో జరపుకుంది. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ సినిమా షూటింగ్ మార్చిలో తిరిగి ప్రారంభ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం కాగా మయోసైటీస్ వ్యాధి కారణంగా సమంత షూటింగ్స్‌కి కొంచెం విరామం ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత ఇటీవల ముంబైలో జరిగిన హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్లో పాల్గొన్నారు. దీంతో త్వరలో ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ను కూడా షురూ చేయనున్నారామె. మార్చి మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్లో విజయ్, సమంతలు పాల్గొంటారని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే ‘ఖుషి’ ని గత ఏడాది డిసెంబరు 23న రిలీజ్ చేయాలనుకున్నారు.. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది రిలీజ్ కానుంది. చదవండి: ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం -
ప్రేమకథా చిత్రమ్
‘ప్రేమకథ’లు చూడ్డానికి బాగుంటాయి. గాఢమైన ‘ప్రేమ కథలు’ అయితే మనసులో నిలిచిపోతాయి. దుష్యంతుడు, శకుంతలది అలాంటి ప్రేమకథే. కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నా వీరి ప్రేమ బలమైనది కాబట్టే నిలబడింది. ఈ ప్రేమకథని త్వరలో వెండితెరపై చూడనున్నాం. మరికొన్ని ప్రేమకథలు కూడా రానున్నాయి. ఒక్కో ‘ప్రేమకథా చిత్రమ్’ది ఒక్కో కథ. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రేమకావ్యాల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ది ప్రత్యేకమైన స్థానం. కాళిదాసు రచించిన ఈ ప్రేమకథ ఆధారంగా ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమ చుట్టూ ఈ సినిమా సాగు తుందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ కొత్త ప్రేమకథతో ఖుషీగా రానున్నారు విజయ్ దేవరకొండ–సమంత. ఈ ఇద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘ఒక రొమాంటిక్ ప్రేమకావ్యం నిర్మాణంలో ఉంది’ అని విజయ్, ‘కుటుంబమంతా చూసి మంచి అనుభూతికి గురయ్యే సినిమా’ అని సమంత ‘ఖుషి’ అప్డేట్ అప్పుడు పేర్కొన్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటోంది యూనిట్. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో 2018లో వచి్చన లవ్‌స్టోరీ ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ‘గీత గోవిందం’కు సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చ్చింది . ఇదే నిజమైతో విజయ్ వెంట వెంటనే ప్రేమకథా చిత్రాల్లో నటించినట్లు అవుతుంది. ఇక అబ్బాయి, అమ్మాయి స్నేహం ప్రేమగా మారిన ఎన్నో కథలు వెండితెరపైకి వచ్చాయి. ప్రేక్షకుల మనసులను మెప్పించాయి. ఈ కోవలో రానున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అబ్బాయి సంజయ్ పీసపాటి, అమ్మాయి అనుపమా కస్తూరిల ప్రేమకథ ఇది. సంజయ్ పాత్రలో నాగ సౌర్య , అనుపమ పాత్రలో మాళవికా నాయర్ నటించారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ అంశాల మేళవింపుతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా, విరాజ్ అశి్వన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఫస్ట్ లవ్ కాన్సెప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక శ్రీదేవి ఎక్కడుంటే శోభన్‌బాబు అక్కడే ఉంటాడట. ఎందుకంటే ప్రేమంట. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఇందులో శోభన్‌బాబుగా సంతోష్ శోభన్, శ్రీదేవిగా గౌరి కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో ఫేమ్ సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఫోన్ నంబర్ నైబర్‌హుడ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో కాశ్మీర హీరోయిన్గా నటించగా, కిశోర్ డైరెక్టర్ చేశారు. ఈ చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇవి కాక మరికొన్ని ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. -
సమంత-విజయ్ దేవరకొండల 'ఖుషీ' సినిమా ఆగిపోయిందా? ట్వీట్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ సడెన్‌గా సమంత అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, తన పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ కేటాయించకపోవడంతో సామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఇవ్వట్లేదని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా ఆగిపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ నిర్వాణ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఖుషి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌కి ఫుల్స్టాప్ పెట్టినట్లయ్యింది. #khushi regular shoot will start very soon 👍 everything is going to be beautiful❤️ — Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023 -
సమంత హ్యాండ్ ఇవ్వడంతో.. సరికొత్త సినిమాతో విజయ్ దేవరకొండ
-
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
కృతిశెట్టి కు తలుపు తట్టిన గుడ్ న్యూస్
-
‘లైగర్’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్ దేవరకొండ
‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్ దేవరకొండ భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా ‘లైగర్’ నిలిచింది. ఈ మూవీ డిజాస్టర్ కారణంగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘జనగనమణ’ కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఒక మూవీ హిట్ కొట్టలేదనే కారణంగా తాను మాత్రం విరామం తీసుకోబోనని విజయ్ అంటున్నాడు. లైగర్ ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. ఈ సినిమా ద్వారా విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు విజయ్ చెప్పారు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. సామ్ అనారోగ్యం కారణంగా ‘ఖుషి’ షూటింగ్ నిలిచిపోయింది. ఆమె కొనుకోగానే మిగతా షూటింగ్ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
లైగర్ ప్లాప్ తో రౌడీలో మార్పు మొదలైందా..?
-
ఖుషీ సినిమా నా ప్రపంచాన్నే మార్చేసింది!
లెక్చరర్.. ఇంజినీర్.. ఓ డైరెక్టర్ ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన లెక్చరర్.. కంప్యూటర్‌తో దోస్తీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వార్తలతో మమేకమైన జర్నలిస్ట్.. మరిప్పుడు ఓ డైరెక్టర్. విభిన్న వృత్తుల్లో తనదైన ప్రతిభ చూపిన సంజనారెడ్డి మెగా ఫోన్ పట్టారు. ‘రాజుగాడు’ సినిమాతో వెండి తెరపై నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... హైదరాబాద్ (శ్రీనగర్ కాలనీ) : మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని వమరవల్లి గ్రామం. డిగ్రీ వరకు అక్కడే చదివాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఇద్దరం అమ్మాయిలం. చిన్నప్పుడు ఇంట్లో న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సినిమాలు కూడా చూడలేదు. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. ‘ఖుషీ’ ఎఫెక్ట్... వేసవి సెలవుల కోసం వైజాగ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాం. అప్పుడే ‘ఖుషీ’ సినిమా విడుదలైంది. నాకు సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది ‘ఖుషీ’ సినిమానే. నెల రోజులు వైజాగ్‌లో ఉంటే సంగం–శరత్ థియేటర్లో 27సార్లు ఈ సినిమా చూశాను. ఆ సమయంలో విడుదలైన ‘ప్రియమైన నీకు’ ఏడుసార్లు చూశారు. ఖుషీ చిత్రంలో ప్రతి సీన్ నన్ను ప్రభావితం చేసింది. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ యాటిట్యూడ్‌తో ఉండేవాళ్లం. సినిమాలపై అమితమైన ఇష్టం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ముచ్చటగా మూడు వృత్తుల్లో... ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పాఠాలు బోధించాను. ఆరు నెలలు లెక్చరర్‌గా పని చేశాక, హైదరాబాద్ వచ్చేశాను. సిటీలో మైక్రోసాఫ్ట్‌లో 8 నెలలు పని చేశాను. సాఫ్ట్వేర్ సాఫ్ట్‌గా ఉండడంతో.. సినిమాల మీద ఆసిక్తితో న్యూస్ రీడర్ అవుదామని ఎలక్ట్రానిక్ మీడియాలో చేరాను. కానీ జర్నలిస్ట్‌గా ప్రయాణం ప్రారంభిచాను. రెండేళ్లు మీడియాలో చేశాను. ఎంతోమంది బాలీవుడ్, టాలీవుడ్ నటులను ఇంటర్వ్యూ చేయడంతో భయం పోయింది. టాప్ హీరోలు, డైరెక్టర్లతో సరదాగా మాట్లాడేదాన్ని. అప్పుడు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి రావచ్చుగా... అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ సినిమాకు ఓ 10 రోజులు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత నటి అమల అక్కినేనితో యాడ్ ఫిలిం చేశాను. అది సక్సెస్ అవడంతో దర్శకత్వంపై అడుగులు వేసి కథ రాసుకున్నాను. ‘రాజుగాడు’ షూటింగ్లో... ఇదీ ‘రాజుగాడు’... కొద్దిపాటి అనుభవంతో కథలు రాసుకుంటున్న సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా రాజ్‌తరుణ్ పరిచయమయ్యారు. ‘క్లెప్టోమేనియా’ కాన్సెప్ట్‌తో రాసుకున్న కామెడీ కథ రాజ్‌తరుణ్‌కు నచ్చడంతో నిర్మాత అనిల్ సుంకరను కలిశాం. ఆయన మా కథను నమ్మి, సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. యూనిట్ సభ్యుల సహకారంతో పూర్తిస్థాయి కామెడీతో సినిమాను రూపొందించాం. ఇది తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ‘కరణం’ బయోపిక్ తీస్తా... నాకు కామెడీ, యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్, పైట్స్ ఉంటేనే సినిమా మరింత ఇష్టంగా చూస్తాను. కరణం మల్లేశ్వరి బయోపిక్ తీయాలని ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నాను. కథానాయిక కోసం ఎదురుచూస్తున్నాను. ఆమె స్వర్ణం ఎలా చేజార్చుకుంది? ఆమె కష్టాలు–ఇష్టాలు ప్రజలకు తెలియజేయాలి. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మించాలని ఉంది. ఇక నటుల్లో పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిటీలో ట్యాంక్‌బండ్ ఇష్టం. జర్నలిస్ట్‌గా చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం చుట్టేశాను. మహిళా దర్శకులు రావాలి... మహిళల్లో చాలా ప్రతిభ ఉంది. కానీ దర్శకత్వం వైపు అడుగులు వేయడం లేదు. డైరెక్షన్లో స్త్రీ–పురుష భేదం అనేది ఉండదు. సరికొత్త ఆలోచనలతో ఇష్టంగా పనిచేస్తే చాలు. మహిళలు భయాన్ని వదిలి, కష్టపడితే కచ్చితంగా ఇందులో రాణించొచ్చు. ముందుగా ఇండస్ట్రీ అనే భయాన్ని వదిలిపెట్టాలి. మేం చేస్తామని ముందుకు రావాలి. నేను ఒంటరిగా ఐదు దేశాలు చుట్టేశాను. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బుతో కారు కొనాలా? ట్రావెల్‌కి వెళ్లాలా? అనే సందిగ్ధంలో ట్రావెలింగ్‌కి వెళ్లాను. సింగపూర్, చైనా, మలేసియా, బ్యాంకాక్‌లను చుట్టేశాను. -
‘ఖుషి’ రికార్డును ఈ జంట బద్దలుకొట్టింది!
‘ఖుషి’ సినిమా క్లైమాక్స్ గుర్తుందా.. అప్పటివరకు కొట్టుకుంటూ, కీచులాడుకుంటున్న సిద్ధు-మధుమతి క్లైమాక్స్‌లో పెళ్లిచేసుకొని ఏకంగా 17మంది పిల్లల్ని కంటారు. మళ్లీ మధుమతి ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. ఆ సినిమాను ఈ బ్రిటన్ దంపతులు చూశారో-లేదో తెలియదు కానీ, పిల్లల విషయంలో మాత్రం ‘ఖుషి’ రికార్డును వీరు బద్దలుకొట్టారు. బ్రిటన్‌లోనే అత్యంత పే..ద్ద కుటుంబంగా పేరొందిన స్యూ రాడ్‌ఫోర్డ్-నియోల్ కుటుంబంలోకి తాజాగా 19వ చిన్నారి వచ్చి చేరింది. ఇప్పటికే 18 మంది పిల్లల్ని కన్న ఈ దంపతులు తాజాగా 19వ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నెలలో స్యూ రాడ్‌ఫోర్డ్ (41) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఫొయెబె విల్లో అని పేరుపెట్టారు. నిజానికి 2015 జూన్‌లో 18వ బిడ్డ హాలీ ఆల్ఫియా బ్యూకు జన్మనిచ్చిన తర్వాత ఇంక పిల్లలు కనడం మానేయాలని ఈ దంపతులు నిర్ణయానికొచ్చారు. కానీ, 19వ బిడ్డ పుట్టిన తర్వాత పిల్లల సంఖ్యను 20కి చేర్చాలని వీరు భావిస్తున్నారట. సొంత బేకరీని నడుపుకుంటూ ఈ పెద్ద కుటుంబభారాన్ని నియోల్ దంపతులు మోస్తున్నారు. రాడ్‌ఫోర్డ్ 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తొలిసారి గర్భవతి అయింది. ఆ తర్వాత వరుసగా పిల్లల్ని కంటూ వస్తున్న ఆమె.. తమ పిల్లల సంఖ్య 20 ఉంటే బాగుంటుందని బంధుమిత్రులు అంటున్నారని, కాబట్టి మరో బిడ్డను కనే అవకాశముందని చెప్పారు. రాడ్‌ఫోర్డ్-నియోల్ దంపతులకు క్రిస్ (27), సోఫీ (22), క్లోయి (21), జాక్ (19), డానియెల్ (17), ల్యూక్ (15), మిల్లీ (15), కేటీ (13), జేమ్స్ (12), ఎల్లీ (11), ఐమీ (10), జోష్ (9), మాక్స్ (7), టిల్లీ (6), ఆస్కార్ (4), కాస్పర్ (3), హల్లీ (13 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. వీరికి ఎల్ఫీ అనే ఆడబిడ్డ పుట్టినప్పటికీ 21వారాల వయస్సులో తను చనిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం పుట్టిన ఫొబెను 19వ బిడ్డగా వారు భావిస్తున్నారు. గంపెడు పిల్లల్ని పెంచేందుకు ఈ దంపతులకు ఏడాదికి రూ. 26.56 లక్షల వరకు ఖర్చు అవుతున్నదట. అయినా ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారపడకుండా సొంతంగానే వీరు పిల్లల్ని పెంచుతున్నారు. -
ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క హిట్‌తో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్‌గా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ పవన్ కెరీర్‌కే కాదు.. డైరెక్టర్ సూర్య కెరీర్‌కు కూడా చాలా ప్లస్ అయ్యింది. ఖుషి సినిమా తరువాత కొమరం పులి సినిమా కోసం మరోసారి కలిసి పని చేసిన పవన్, ఎస్ జె సూర్యలు ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. బ్లాక్ బస్టర్ హిట్‌తో తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమాకు సీక్వల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కథా కథనాల విషయంలో క్లారిటీ లేకపోయినా ఖుషి కాంబినేషన్ రిపీట్ అవ్వటం మాత్రం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.