Director Shiva Nirvana gives clarity about Vijay-Samantha 'Khushi' movie - Sakshi
Sakshi News home page

Khushi Movie : సమంత-విజయ్‌ దేవరకొండల 'ఖుషీ' సినిమా ఆగిపోయిందా? ట్వీట్‌ వైరల్‌

Published Tue, Jan 31 2023 10:36 AM | Last Updated on Tue, Jan 31 2023 10:55 AM

Director Shiva Nirvana Clarity About Vijay Samantha Khushi Movie - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. కానీ సడెన్‌గా సమంత అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.

అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడం, తన పాత్రకు తగిన స్క్రీన్‌ స్పేస్‌ కేటాయించకపోవడంతో సామ్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్‌ ఇవ్వట్లేదని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా ఆగిపోయిందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఖుషి రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లయ్యింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement