
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈరోజు(మంగళవారం)విజయ్ బర్త్‌డే కానుకగా ఖుషి మూవీలోని తొలి పాట 'నా రోజా నువ్వే.. అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ఇక ఈ పాటలో సమంతను చూస్తే ఆమె ముస్లిం యువతిగా కనిపించింది. ఇక ఈ పాటకు స్వయంగా శివ నిర్వాణ లిరిక్స్ అందించగా, హీషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు.
ఇక ఖుషి సినిమా ప్రేమకథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం యువతి, హిందూ యువకుడి మధ్య లవ్‌స్టోరీనే ఖుషి అని తెలుస్తుంది. ఇంతకుముందు సమంత బర్త్‌డే పోస్టర్‌లో ఆమె మెడలో తాళితో ఐటీ ఉద్యోగిగా కనిపించింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌సాంగ్‌లో ముస్లిం యువతిగా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment