స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతుంది. అయితే గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. షూటింగ్ సీన్ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సమంతతో రిహార్సల్ జరిపించారు.
యాక్షన్ అనగానే లవ్ ఫీల్‌తో సామ్ ఆ డైలాగ్‌ను చెబుతుండగా, హ్యాపీ బర్త్‌డే సమంత అంటూ విజయ్ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ ఒక్కసారిగా అరవడంతో ఇది ఫేక్ రిహార్సల్ అని అర్థమయ్యింది. ఆ తర్వాత సెట్లోనే సామ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సర్‌ప్రైజింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Happy Birthday @Samanthaprabhu2 ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) April 28, 2022
Wishing you full happiness 😊
Let’s make a love story now :)
Love and hugs,
Vijay. https://t.co/5mEfpp4Wws
Comments
Please login to add a commentAdd a comment