Samantha Hair Stylist Shares Emotional Post On Her Health As She Going To Abroad For Treatment - Sakshi
Sakshi News home page

Hair Stylist Emotional Post On Samantha: సమంతకు ఆ చికిత్స.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ!

Published Fri, Jul 14 2023 5:17 PM

Samantha Hair Stylist Emotional post Her Health - Sakshi

Samantha Hair Stylist Emotional post: స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన ఈమె.. విరామం తప్పేం కాదని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎన్నాళ్లపాటు అనేది చెప్పలేదు గానీ ఇది ఏడాదికి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఇది ఎందుకోసమా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామ్ హెయిర్ స్టైలిష్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె బ్రేక్‌కి అసలు కారణం బయటపెట్టాడు. 

ఆ చికిత్స కోసం
హీరోయిన్ సమంత గతేడాది 'యశోద' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కి సరిగ్గా కొన్నిరోజుల ముందు 'మయోసైటిస్' అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు 'ఖుషి' మూవీ, 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్స్ పూర్తి చేసింది. ఇప్పుడు తాత్కాలికంగా నటనని పక్కనబెట్టి.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయింది. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ)

ఆత్రుతగా చూస్తుంటా
'రెండేళ్లు.. 1 మ్యూజిక్ వీడియో.. 3 సినిమాలు.. 7 బ్రాండ్ క్యాంపెయిన్స్.. 2 ఎడిటోరియల్స్.. లైఫ్ టైమ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలని పోగేసుకున్నాం. ఎండ వాన లెక్కచేయకుండా పనిచేశాం. నవ్వులు, కన్నీళ్లు, బాధలు.. ఇలా అన్నీ చిరునవ్వుతో స్వీకరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అద్భుతమైన జర్నీ చేశాం' 

'చికిత్స తీసుకుంటున్న టైంలో మీరు మరింత బలం, శక్తి రావాలని కోరుకుంటున్నాను. ముందు కంటే డబుల్ ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం' అని హెయిర్ స్టైలిష్ట్ రోహిత్ భట్కర్ పోస్ట్ పెట్టాడు. దీంతో వైద్యం కోసం సమంత విదేశాలకు వెళ్తుందనే విషయం నిజమేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?)

Advertisement
 
Advertisement
 
Advertisement