Citadel
-
తారలు మెరిసే... ఫ్యాన్స్ మురిసే...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో రూ΄÷ందిన స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఇక రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్ రోల్స్‌లో దర్శక ద్వయం న్యూటన్ థామస్– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్ ‘సిటాడెల్’ తొలి సీజన్ 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘సిటాడెల్’కు సెకండ్ సీజన్ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. -
ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. ‘సిటాడెల్’ కోసం అన్ని కోట్లా?
సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే రూ. 2-3 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ స్టార్ హీరోయిన్ సమంత ఆ రికార్డులు బద్దలు కొడుతూ.. రూ. 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.తొలి హీరోయిన్గా రికార్డు!టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత ఇప్పటికీ ముందు వరుసలో ఉంటుంది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె కోసం చాలా మంది దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడింది సామ్. (చదవండి: వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. ఏమైందంటే?)ఇక ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్-హనీ బన్నీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సామ్ యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. అయితే ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. తన కష్టానికి తగ్గట్టే రెమ్యునరేషన్‌ని కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ. 10 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుందట. సౌత్ హీరోయిన్లలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత మొత్తంలో తీసుకోలేదు.సమంతకు కొత్తేమి కాదు..రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం సమంతకు కొత్తేమి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ రోజుల్లోనే తన పారితోషికాన్ని రూ. కోటికి పెంచేసింది. స్టార్ హీరోయిన్లు అంతా రూ. కోటి తీసుకుంటున్న సమయంలో.. సామ్ 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే ఐటమ్ సాంగ్స్‌కి కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి సమంతనే. (చదవండి: ప్రముఖ నటికి ఇదేం బుద్ధి? మరీ ఇంత మోసమా!)ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా తన మార్క్ చూపించబోతుంది. ఓ వెబ్ సిరీస్‌కి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్ సమంతనే అని చెప్పొచ్చు. అయితే పారితోషికం తగ్గట్టే నటన పరంగా కూడా సామ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. ఇక సీటాడెల్‌లో ఆమె లుక్, యాక్షన్ అదిరిపోయింది. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'సిటాడెల్' రిలీజ్‌పై ప్రకటన
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో రుస్సో బ్రదర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతో పాటుగా వరుణ్‌ధావన్ నటిస్తున్నారు. తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రేమ్ ప్రకటించింది.స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. ఈమేరకు టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌లలో సమంత దుమ్మురేపిందని టాక్. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్లో సమంత, వరుణ్ ధావన్‌లతో తెరకెక్కించారు. అయితే, ఈ సిరీస్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్‌లలో సమంత నటించినట్లు తెలుస్తోంది. -
నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. సుమారు ఏడాది తర్వాత ఆమె కెమెరాల ముందుకు వస్తుంది. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొచ్చింది. తన నటనతో, అందంతో సౌత్‌లో భారీగా అభిమానులను సంపాదించుకున్న సమంత..సిటాడెల్ వెబ్ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. దీని కోసం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ ఈవెంట్లో ఆమె సందడి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్ కోసం సమంత ఒక స్పెషల్ మీట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సమంతను కలుసుకునేందుకు భారీగా అభిమానులు వచ్చారు. ఎవరినీ నిరుత్సాహ పరచకుండా ఆమె అందరితో కలిసి ఫోటోలు దిగింది. అభిమానులు ప్రేమతో తెచ్చిన మంచి మంచి గిఫ్ట్స్ తీసుకుంది. ఓ మహిళా అభిమాని ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ కూడా ఎమోషనల్ అయింది. అంతే కాకుండా తన కోసం తయారు చేసిన 'వండర్ ఉమెన్' కేకును ఆమె కట్ చేసింది. అభిమానులు చూపించిన ప్రేమకు సమంత కూడా ఫిదా కావడంతో పాటు ఎమోషనల్ అయిపోయింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సమంత ప్రస్తుతం యాడ్ షూట్లతో బిజీగా ఉంది. ఇప్పటికే మోహన్‌లాల్‌తో ఒక యాడ్‌లో నటించింది. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కోలీవుడ్‌లో విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న ఒక ప్రాజెక్ట్‌లో సమంత నటించనుందని టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) Meeting her and taking pics with her is a dream ❤ Finally on 23-03-2024 I met my Favourite Actress and interacted with her like a friend 💗 Will cherish this memorable moment everyday in my life. Thank you @Samanthaprabhu2 for your time ❤️❤️ I love you ✨ #SamanthaRuthPrabhu pic.twitter.com/nYYFSYbeNy — HaRshi 🧚♀ (@Harshi_74) March 24, 2024 And Finally , dream of a fan boy from 12.5 Years became reality 🫶 Sam @Samanthaprabhu2 🥺❤️ You’re the best and I’ll love you forever and ever Words are falling short to describe how it is to be with you 🫶 Thanks a lot @sravan523 bro ❤️🤗#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/matmypuCZ9 — Anil Aniee (@Anil_Aniee) March 24, 2024 -
నా కెరీర్లో క్లిష్టమైన పాత్ర అది!
‘ఏ మాయ చేశావె’తో కథానాయికగా కెరీర్ ఆరంభించిన సమంత ఈ పద్నాలుగేళ్లల్లో సవాల్ అనిపించే పాత్రలు చాలానే చేశారు. హీరోయిన్గా యాభై చిత్రాలు చేసిన ఆమె ‘మహానటి’, ‘బేబీ’, ‘యశోద’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు. కానీ, ఇన్నేళ్ల కెరీర్లో ‘సిటాడెల్’లో చేసిన క్యారెక్టర్ తనకు చాలా క్లిష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో సమంత పేర్కొన్నారు. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి సమంత మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లోనే ‘సిటాడెల్’లో చేసిన రోల్ టఫ్ అనడానికి కారణం నేను శారీరకంగా బలహీనం (మయోసైటిస్ వ్యాధిని ఉద్దేశించి) గా ఉన్నప్పుడు ఆ షూటింగ్ జరిగింది. నా పరిస్థితి బాగాలేనప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సి రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ప్రియాంకా చోప్రా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో సమంత నటించారు. సమంత ఓ లీడ్ రోల్లో ‘ఫ్యామిలీ మేన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్, డీకే ఈ సిరీస్‌కి కూడా దర్శకులు. త్వరలో ‘సిటాడెల్’ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్ ఆల్రెడీ హిట్ అయినట్లే. ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో నటించాను. నేను చేయగలనని అనుకోలేదు. కానీ చేశాను. అందుకు గర్వంగా ఉంది’’ అని కూడా సమంత అన్నారు. -
సమంత ఫోటోలు వైరల్.. కొన్ని గంటల్లోనే 20 లక్షలకు పైగా లైక్స్
అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సమంత.. త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది. ఇంతలోనే బికినీలో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసి అందరికీ మరింత షాక్ ఇచ్చింది. ఇప్పుడా ఫోటోలు షోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రస్తుతం మలేషియాలో ఉన్న సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌తో పలు ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే సమంత తాజాగా విడుదల చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద రచ్చనే లేపుతున్నాయి. ఇప్పటి వరకు 10 మిలియిన్స్ ప్రేక్షకులు చూసిన ఈ ఫోటోలకు సుమారు 25 లక్షల వరకు లైక్స్ వచ్చాయి. బికినీలో ఉన్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేస్తున్నారు. (ఇదీ చదవండి: రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్ రాథోడ్ ఆవేదన) నిజానికి సమంత క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. అందుకే ఆమె మరింత ఫిట్‌గా ఉంటుంది. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ సమంత విషయంలో వయసు తగ్గుతుంది. అదెలాగంటే మెటబాలిక్ ప్రకారం ఆమె ఏజ్ 23 మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది. బరువు 50 కేజీలు మాత్రమే ఉన్నట్లు ఒక స్లిప్‌తో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఫైనల్లీ గుడ్‌న్యూస్ చెప్పిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా సుమారు 10 నెలలుగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. చివరగా శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత సినిమాలు ఒప్పుకోలేదు. కానీ ముందుగా ఒప్పందం ప్రకారం 'సిటడెల్' వెబ్‌సిరీస్ మాత్రం అనారోగ్యం ఉన్నా పూర్తి చేశారు. 2023లో ఖుషి సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన తర్వాత, తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడినట్లు ఉంది. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను సమంత పోస్ట్ చేశారు. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నట్లు అందులో అధికారికంగా ప్రకటించారు. 'ఇప్పటికే చాలామంది ఎప్పుడు మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నారు అని అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఫైనల్లీ ఆ సమయం వచ్చింది. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నాను. కొన్నిరోజుల పాటు నేను కూడా నిరుద్యోగిగా ఉన్నాను. నా స్నేహితులతో కలిసి ఆరోగ్య పోడ్‌కాస్ట్‌పై ఒక కార్యక్రమం చేశాం. త్వరలో దానికి సంబంధించిన వీడియో విడుదల అవుతుంది.' అని సమంత తెలిపారు. వీడియోలో, ఎరుపు రంగు దుస్తులలో మేకప్ లేకుండా కనిపించిన సమంత ఎంతో గ్లామర్‌గా ఉన్నారు. అలాగే సమంత కూడా పోడ్ కాస్ట్ గురించి మాట్లాడారు. గత డిసెంబర్లో తన ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రకటించిన ఆమె తిరిగి షూటింగ్స్లలోకి రావడం పట్ల తన ఉత్సాహాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమంత చివరిగా ఖుషీ చిత్రంలో కనిపించారు. తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్. ఇది హాలీవుడ్ యాక్షన్ సిరీస్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించారు. వీరిద్దరూ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రాజ్ DK నిర్మించిన ఈ సిరీస్ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. త్వరలో ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్టైల్‌గా సైక్లింగ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
అందమైన లొకేషన్స్‌లో స్టైల్‌గా స్లైక్లింగ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? సరే మీకోసం క్లూ ఇస్తాంలేండి. ఆమె ఓ పెద్ద స్టార్ హీరోయిన్. ఆ మధ్య ఓ అరుదైన వ్యాధిన పడి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లింది. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె సమంతనే. మయోసైటిస్ వ్యాధిని నుంచి కోలుకున్న సమంత.. ప్రశాంతమైన లైఫ్‌ని గడపడానికై విదేశీ పర్యటకు వెళ్లింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకుంటుంది. అందులో భాగంగానే విదేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత ఆస్ట్రీయాలో ఉంది. అక్కడ అందమైన లోకేషన్స్‌ని సందర్శిస్తూ.. వాటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆస్ట్రియాలో సెల్జ్ బర్గ్ అనే నగరానికి వెళ్లిన సమంత.. అక్కడ ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా..అవికాస్త వైరల్ అయ్యాయి. కొన్నాళ్ల పాటు సామ్ విదేశాల్లోనే గడపనుంది. (చదవండి: ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే) ఇక సినిమా విషయాలకొస్తే... విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. రాజ్ అండ్ డీజే దర్శకత్వంలో సామ్ నటించిన ‘సీటాడెల్’ వెబ్ రిలీజ్‌కు రెడీ రెడీ అవుతోంది. ప్రముఖ ఓఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 2024 ఆరంభంలో విడుదల కానుంది. ఈ సిరీస్ తర్వాత సమంత బాలీవుడ్ లో తాజాగా సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!
Samantha Hair Stylist Emotional post: స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన ఈమె.. విరామం తప్పేం కాదని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎన్నాళ్లపాటు అనేది చెప్పలేదు గానీ ఇది ఏడాదికి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఇది ఎందుకోసమా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామ్ హెయిర్ స్టైలిష్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె బ్రేక్‌కి అసలు కారణం బయటపెట్టాడు. ఆ చికిత్స కోసం హీరోయిన్ సమంత గతేడాది 'యశోద' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కి సరిగ్గా కొన్నిరోజుల ముందు 'మయోసైటిస్' అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు 'ఖుషి' మూవీ, 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్స్ పూర్తి చేసింది. ఇప్పుడు తాత్కాలికంగా నటనని పక్కనబెట్టి.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ) ఆత్రుతగా చూస్తుంటా 'రెండేళ్లు.. 1 మ్యూజిక్ వీడియో.. 3 సినిమాలు.. 7 బ్రాండ్ క్యాంపెయిన్స్.. 2 ఎడిటోరియల్స్.. లైఫ్ టైమ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలని పోగేసుకున్నాం. ఎండ వాన లెక్కచేయకుండా పనిచేశాం. నవ్వులు, కన్నీళ్లు, బాధలు.. ఇలా అన్నీ చిరునవ్వుతో స్వీకరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అద్భుతమైన జర్నీ చేశాం' 'చికిత్స తీసుకుంటున్న టైంలో మీరు మరింత బలం, శక్తి రావాలని కోరుకుంటున్నాను. ముందు కంటే డబుల్ ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం' అని హెయిర్ స్టైలిష్ట్ రోహిత్ భట్కర్ పోస్ట్ పెట్టాడు. దీంతో వైద్యం కోసం సమంత విదేశాలకు వెళ్తుందనే విషయం నిజమేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. View this post on Instagram A post shared by Rohit Bhatkar (@rohit_bhatkar) (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత
సమంత త్వరలోనే సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నరనే ప్రచారం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు ‘ఖుషి’, సిటడెల్’ ల షూటింగ్స్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ఏడాది పాటు రెస్ట్ తీసుకోనున్నారట. ఈ ఏడాది మొత్తం తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నారట. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తోంది. దీంతో పాటు సిటడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఇప్పటికే ఖుషి షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్.. తాజాగా సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు సిటడెల్ వెబ్‌సిరీస్ పూర్తయింది’అని రాసుకొచ్చింది. ఇక సిటడెల్ విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటడెల్‌కు ఇండియన్ వెర్షన్ ఇది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రలు పోషించారు. రీఎంట్రీ ఉంటుందా? సిటడెల్, ఖుషి చిత్రాల రిలీజ్ తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. అప్పుడు కూడా కనిపిస్తుందో లేదో అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్లన్నీ తిరిగి ఇచ్చేస్తుందట సమంత. ఏడాది తర్వాత అయినా సరే మాతో చిత్రం చేయండి అని అడ్వాన్స్ అందిస్తున్నా.. ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారట. దీంతో ఇకపై ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (చదవండి: హోటల్లో డైరెక్టర్ తనతోపాటే రాత్రి ఉండిపోమన్నాడు: సింగర్) -
ఒక్క వెబ్ సిరీస్.. రూ.2000 కోట్లు వృథా!
సినిమా చూడాలంటే ఒకప్పుడు థియేటర్ లోనే... ఏదేమైనా ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్స్ పెడుతున్నాయి. వందల కోట్ల లాభాలు దక్కించుకోవాలని చూస్తున్నాయి. కట్ చేస్తే ఘోరమైన నష్టాలు చూస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. స్వయంగా ఆ సంస్థ సీఈఓ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'సిటాడెల్' ఫ్లాప్ ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఖరీదైన వెబ్ సిరీసుల్లో 'సిటాడెల్' ఒకటి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మన దేశంలోనూ రిలీజైంది. చాలామందికి నచ్చే యాక్షన్ తరహా స్టోరీతోనే తీశారు. కానీ పెద్దగా ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.2000 కోట్లు. ఇప్పుడు అదంతా వృథా అయినట్లే! ఈ సిరీస్ మీద ప్రైమ్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అవన్నీ కూడా గంగలో కలిసిపోయినట్లే. (ఇదీ చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) సమంత కూడా ప్రియాంక చోప్రాతో తీసిన 'సిటాడెల్'.. ఇండియన్ వెర్షన్‌ని హీరోయిన్ సమంతతో తీశారు. 'ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. సమంతతో పాటు వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేశాడు. దీని షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఒరిజినల్ సిరీస్ మన దగ్గర ఆడలేదు. సమంత 'సిటాడెల్' హిట్ అయితే అమెజాన్‌కు కొంతైనా లాభాలు వస్తాయి. లేదంటే కష్టమే! ఉద్యోగులకు మూడింది 'సిటాడెల్' సిరీస్‌తో పాటు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగర్స్, ది ఫెరిఫెరల్ లాంటి షోలు కూడా ఫెయిలయ్యాయి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కోసమైతే ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. కానీ అది కూడా నిరాశపరిచింది. ఈ పరిణామాలన్నీ సీరియస్ గా తీసుకున్న అమెజాన్.. ఇలా ఫెయిలైన సిరీస్‌లను కొనసాగించడం ఆపాలని నిర్ణయించుకుంది. దీనికి బాధ్యులైన ఉద్యోగులని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక్కసారి దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలిసి రాదు! (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) -
సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!
అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారట. ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
క్లబ్లో ‘ఊ అంటావా మావా’ పాటకు సమంత చిందులు .. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సామ్‌కి జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. ఒకపక్క షూటింగ్ చేస్తూనే.. మరోపక్క విరామ సమయంలో సెర్బియా అందాలను వీక్షిస్తుంది సమంత. (చదవండి: సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక ) ఇక తాజాగా సెర్బియాలోకి ఓ క్లబ్‌కి వెళ్లిన సామ్.. సరదాగా ‘ఊ అంటావా మావా’ పాటకు స్టెప్పులేసి అలరించింది. సామ్ కాలు కదపగానే అక్కన ఉన్నవారంతా జోష్‌తో చిందేశారు. పక్కనే వరుణ్.. డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్ చేశాడు. బెల్గ్రేడ్ క్లబ్లో సమంత డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు కోలుకొని ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం పట్ల కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు ఇలా బీర్ కొడుతూ డ్యాన్స్ చేయడం అవసరమా? అని కామెంట్ చేస్తున్నారు. Samantha item song craze is unbelievable 🥵🥵#SamanthaRuthPrabhu #Pushpa pic.twitter.com/BNZ2V6BOwj — Actress Glam (@actressglam) June 10, 2023 -
రాష్ట్రపతిని కలిసిన సమంత
ఒక వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది సమంత. ప్రస్తుతం సామ్ బాలీవుడ్లో ‘సీటడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతోంది. తాజాగా సిటడెల్ టీమ్ అంతా భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ముని కలిశారు. రాష్ట్రపతి ముర్ము ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీటాడెల్ టీమ్ రెండు రోజుల క్రితం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. (చదవండి: ప్రేమ అప్పుడే పుట్టింది.. శాశ్వతంగా ఉండిపోతుంది: లావణ్య త్రిపాఠి ) ఈ ఫోటోలను హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘రాష్ట్రపతిని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’అని తెలిపాడు. ఇక సీటాడెల్ దర్శకులు రాజ్ అండ్ డీకే దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ముగారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమెకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. మా సీటడెల్ యాక్షన్ సిరీస్ అయినా చూసేందుకు ప్రయత్నిస్తా అని ఆమె చెప్పడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) What a privilege to meet the gently humorous and humble Smt Droupadi Murmu, Honourable President of India! @rashtrapatibhvn She likes comedies but said she would give our actioner a try! 😊 pic.twitter.com/t88hhUpcZg — Raj & DK (@rajndk) June 8, 2023 -
లండన్‌లో ‘సీటాడెల్’టీమ్‌తో సమంత, వరుణ్ ధావన్
-
రాత్రి ఓ యువకుడు ఏకంగా బాల్కనీలోకి దూకేశాడు: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. (ఇది చదవండి: Priyanka Chopra: భారత్‌కు ప్రియాంక చోప్రా.. అలా తొలిసారిగా టూర్!) అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియాంక తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా తనని క్రమశిక్షణగా వ్యవహరించమన్నారని తెలిపింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ప్రియాంక మాట్లాడుతూ.. 'చదువు కోసం 12 ఏళ్ల వయసులోనే యూఎస్ వెళ్లా. అక్కడి కల్చర్ నాకు అలవాటైంది. అక్కడి వాతావరణానికి నా జుట్టు మొత్తం రాలిపోయింది. నా ఫేస్ అంద విహీనంగా మారిపోయింది. నాలుగేళ్ల తరువాత ఇండియాకు తిరిగి వచ్చా. ఇంటికి తిరిగొచ్చాక మేం ఉండే టౌన్లోనే ఓ స్కూల్లో చేరా. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కొంతమంది అబ్బాయిలు నా వెంటపడుతూ మా ఇంటి వరకు వచ్చేవారు.' అంటూ చెప్పుకొచ్చింది. ఒక రోజు రాత్రి జరిగిన భయంకరమైన సంఘటనను ప్రియాంక వివరించింది. (ఇది చదవండి: మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) ప్రియాంక వివరిస్తూ.. 'ఒక రోజు రాత్రి ఓ అబ్బాయి మా బాల్కనీలోకి దూకాడు. అది చూసి నేను అరుస్తూ నాన్న దగ్గరకి పరిగెత్తా. దీంతో నాన్న నా గది కిటికీనీ పూర్తిగా క్లోజ్ చేశాడు. అంతేకాకుండా నాకు కొన్ని కండీషన్స్ పెట్టారు. యూఎస్లాగా ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఇక్కడ జీన్స్‌లను వేసుకోకూడదు. చాలా క్రమశిక్షణతో మెలగాలి. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా తోడుగా ఒక వ్యక్తిని పంపించేవారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. మా ఫాదర్ అలా ఎందుకు చేశారో ఇప్పుడర్థమైంది. ఆయనను కోల్పోవటం దురదృష్టకరం.' అని తెలిపింది. కాగా.. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. త్వరలో ఆమె లవ్ ఎగైన్, జీ లే జరాలో కనిపించనుంది. -
అది 'టార్చర్ సమయం'.. నెట్టింట సమంత షాకింగ్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే యాక్షన్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా, ఇండియన్ వెర్షన్లో వరున్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. చదవండి: పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని ప్రస్తుతం ముంబైలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. సిటాడెల్ సిరీస్ కోసం బాగానే కష్టపడుతుంది సమంత. ఇటీవలే షూటింగ్లో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను పోస్ట్ చేసిన సమంత తాజాగా మరో ఓ ఫోటోను షేర్ చేస్తూ 'ఇట్స్ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు. ఇందులో ఐస్ బాత్ టబ్‌లో కూర్చున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో ఐస్‌బాత్‌తో ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు -
ఎన్టీఆర్,సమంతను తిడుతు ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్లు
-
ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!
సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సిటాడెల్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించింది. ఈ సిరీస్ ఈనెల 28న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ప్రీమియర్ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్‌లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసింది. అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు నెగెటివ్‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో తాను భాగం కావడం పట్ల సామ్ తన కాస్తా ఎక్కువగానే ఎగ్జైట్ మెంట్ ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారుతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Warra Fake Accent 🤡🤡🤡 pic.twitter.com/WGJmElk2WC — 🐋 (@Bhaag_Saale) April 23, 2023 -
ఏప్రిల్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లేంటి?
ఓపక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సినిమాలు దంచికొడుతున్నాయి. దసరా, విరూపాక్ష సినిమాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మున్ముందు పట్టపగలే చుక్కలు చూపించేందుకు భానుడు సిద్ధమయ్యాడు. అయితే సినిమా వాళ్లు మాత్రం మా వినోదాత్మక కంటెంట్‌తో ప్రేక్షకులను ఇళ్ల నుంచి థియేటర్‌కు రప్పిస్తామని ధీమాగా చెప్తున్నారు. మరి ఈ వేసవి సెలవుల్లో రిలీజ్ కానున్న కొత్త సినిమాలు ఏంటి? అవి ఏయే రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఓటీటీలో వస్తున్న కొత్త కంటెంట్ ఏంటి? అసలు ఈ వారం థిటయేర్, ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం.. ► ఏజెంట్ - ఏప్రిల్ 28 ► పొన్నియన్ సెల్వన్ 2 - ఏప్రిల్ 28 ► రారా పెనిమిటి - ఏప్రిల్ 28 ► శిసు- ఏప్రిల్ 28 ఓటీటీలో సందడి చేసే సినిమాలు/ వెబ్ సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్ ► దసరా - ఏప్రిల్ 27 ► కోర్ట్ లేడీ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 26 ► నోవోల్యాండ్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27 ► ది గుడ్ బ్యాడ్ మదర్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27 ► ఎకా - ఏప్రిల్ 28 ► బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ - ఏప్రిల్ 28 అమెజాన్ ప్రైమ్ ► పత్తు తల - ఏప్రిల్ 27 ► సిటాడెల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 28 జీ5 ► వ్యవస్థ - ఏప్రిల్ 28 ► యూటర్న్ - ఏప్రిల్ 28 హాట్‌స్టార్ ► సేవ్ ది టైగర్స్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27 ► పీటర్ పాన్ అండ్ వెండీ - ఏప్రిల్ 28 బుక్ మై షో ► స్క్రీమ్ 6 - ఏప్రిల్ 26 సోనీలివ్ ► తురముఖమ్ - ఏప్రిల్ 28 -
చైకి గుర్తుగా టాటూ అలాగే ఉంచేసుకున్న సమంత.. ఫోటో వైరల్
సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు కలిసుంటే బావుండు అని కోరుకోని అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ చై-సామ్‌ల జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల పరంగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. కస్టడీ సినిమాతో చై ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాతో అభిమానులను పలకరించింది. రీసెంట్గా సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లిన సమంత సరికొత్త లుక్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అంతకు మించి సమంత ఒంటిపై నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చై పేరును టాటూ వేయించుకున్న సమంత ఇప్పటికీ ఆ టాటూను చెరపివేయలేదు. 'కొన్ని ఙ్ఞాపకాలను మర్చిపోలేం, టాటూలు కూడా అంతే'.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత మెడపై YMC అని రాసి ఉంటుంది. చైతో తొలిసారి నటించిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా సామ్ ఆ టాటూ వేయించుకుంది. ఇక మరో టాటూ ఆమె మణికట్టుపై ఉంటుంది. ఈ మూడు టాటూలు చైతూకి సంబంధించినవే కావడం విశేషం. -
లండన్‌లో సమంత.. ఆమె ధరించిన డైమండ్ జువెలరీ ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే ఆమె ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డేకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ లండన్‌లో జరిగింది. ఈ వేడుకలో సమంత బ్లాక్ డ్రెస్‌లో, డైమండ్ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్లో దర్శనమిచ్చింది.. అందులోనూ స్పెషల్ డైమండ్ జువెలరీతో మరింత అట్రాక్షన్‌గా కనిపించిది. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సమంత ధరించిన డ్రెస్, డైమండ్స్ నగలపైనే ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో దాదాపు రూ.65 వేల ఖరీదు చేసే విక్టోరియా బెక్‌హామ్ క్రోచెట్ ప్యాచ్‌వర్క్ స్కర్ట్ ధరించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే బల్గారీ డైమండ్ జ్యువెల్లరీతో మెరిసింది సామ్. సమంత ధరించిన స్నేక్ నెక్లెస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు కాగా, చేతికి వేసుకున్న బ్రెస్లైట్ ధర రూ.2.6 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియర్ షోకు హాజరైన పలువురు సెలబ్రిటీలను సమంత తన కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సమంత ధరించిన జువెలరీ ధర తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ డబ్బులతో ఏకంగా ఒక సినిమానే తీయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
లండన్‌లో ‘సీటాడెల్’టీమ్‌తో సమంత, వరుణ్ ధావన్
లండన్‌లో ‘సీటాడెల్’టీమ్‌తో సమంత, వరుణ్ ధావన్ -
బ్లాక్ డ్రెస్‌లో సమంత సరికొత్త లుక్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఈమధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్గా కేరళలో ఖుషి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు సిటీడెల్ కోసం లండన్ వెళ్లింది.రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డేకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ లండన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక, రిచర్డ్‌లతో పాటు సమంత, వరుణ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రిమియర్‌కు హాజరైన సమంత ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్లాక్ డ్రెస్‌లో, డైమండ్ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, పలువురు సెలబ్రిటీలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేశ్ కూతురు ఆశ్రిత సైతం సామ్ లుక్స్‌కి స్టన్నింగ్ అంటూ రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)