Priyanka Chopra reveals how she and Richard Madden completed intimate scenes in Citadel - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: రిచర్డ్‌తో బోల్డ్‌ సీన్స్‌.. బాడీ పార్ట్స్‌ అన్ని చేతులతో కప్పేసుకున్నాం

Apr 19 2023 1:43 PM | Updated on Apr 19 2023 1:53 PM

Priyanka Chopra Reveals How She completed Intimate Scenes In Citadel - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ స్టార్‌ హీరో రిచర్డ్‌ మాడెన్‌ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సీటాడెల్‌’. రస్సో బ్రదర్స్‌ నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్‌ ఈ నెల 28నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌లో  ప్రియాంకను అర్థనగ్నంగా చూపించారు. అంతేకాదు రిచర్డ్‌తో కలిసి బెడ్‌ రూమ్‌ సీన్స్‌ కూడా ఉన్నాయట. ఈ బోల్డ్‌ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఒకరికొకరు ఎలా సహకరించుకున్నారో తాజాగా ప్రియాంక చోప్రా వెల్లడించింది.

(చదవండి: సౌత్‌ ఇండస్ట్రీపై తాప్సీ సంచనల వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌)

‘సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో నటించాను. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించిన సమయంలో ఇద్దరం ఒకరికొకరం మద్దతుగా నిలిచాం. కొన్ని అసౌకర్యమైన యాంగిల్స్‌లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీలయ్యాం. కెమెరాలో మా బాడీ పార్ట్స్‌ స్పష్టంగా కనిపించకుండా చేతులతో కప్పి ఉంచుకునేవాళ‍్లం. రిచర్డ్‌ కూడా ఇక్కడ చేయి పెట్టుకో..అక్కడ కప్పేసేయ్‌ అని గైడ్‌ చేసేశాడు. ఇద్దరం ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నిహితంగా ఉండే సీన్స్‌ని పూర్తిం చేశాం’అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

 ఇక ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్-డీకే దర్శక ద్వయం ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తుంది. ఇండియన్‌ వెర్షన్‌లో ప్రియాంక పోషించిన పాత్రలో సమంత నటిస్తోంది. ప్రియాంక మాదిరే సమంత కూడా అంతే బోల్డ్‌గా నటిస్తుందా లేదా డోస్‌ని తగ్గించి చూపిస్తారా? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement