గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు.
(ఇది చదవండి: Priyanka Chopra: భారత్‌కు ప్రియాంక చోప్రా.. అలా తొలిసారిగా టూర్!)
అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియాంక తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా తనని క్రమశిక్షణగా వ్యవహరించమన్నారని తెలిపింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.
ప్రియాంక మాట్లాడుతూ.. 'చదువు కోసం 12 ఏళ్ల వయసులోనే యూఎస్ వెళ్లా. అక్కడి కల్చర్ నాకు అలవాటైంది. అక్కడి వాతావరణానికి నా జుట్టు మొత్తం రాలిపోయింది. నా ఫేస్ అంద విహీనంగా మారిపోయింది. నాలుగేళ్ల తరువాత ఇండియాకు తిరిగి వచ్చా. ఇంటికి తిరిగొచ్చాక మేం ఉండే టౌన్‌లోనే ఓ స్కూల్‌లో చేరా. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కొంతమంది అబ్బాయిలు నా వెంటపడుతూ మా ఇంటి వరకు వచ్చేవారు.' అంటూ చెప్పుకొచ్చింది. ఒక రోజు రాత్రి జరిగిన భయంకరమైన సంఘటనను ప్రియాంక వివరించింది.
(ఇది చదవండి: మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!)
ప్రియాంక వివరిస్తూ.. 'ఒక రోజు రాత్రి ఓ అబ్బాయి మా బాల్కనీలోకి దూకాడు. అది చూసి నేను అరుస్తూ నాన్న దగ్గరకి పరిగెత్తా. దీంతో నాన్న నా గది కిటికీనీ పూర్తిగా క్లోజ్ చేశాడు. అంతేకాకుండా నాకు కొన్ని కండీషన్స్ పెట్టారు. యూఎస్‌లాగా ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఇక్కడ జీన్స్‌లను వేసుకోకూడదు. చాలా క్రమశిక్షణతో మెలగాలి. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా తోడుగా ఒక వ్యక్తిని పంపించేవారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. మా ఫాదర్ అలా ఎందుకు చేశారో ఇప్పుడర్థమైంది. ఆయనను కోల్పోవటం దురదృష్టకరం.' అని తెలిపింది. కాగా.. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. త్వరలో ఆమె లవ్ ఎగైన్, జీ లే జరాలో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment