ప్రియాంక భర్త డైరెక్ట్‌గా నన్నే అడిగాడు: హీరోయిన్ తల్లి | Madhu Chopra Responds on Priyanka Chopra Nick Jonas age gap | Sakshi
Sakshi News home page

Madhu Chopra: ప్రియాంక- నిక్‌ జోనాస్‌ పెళ్లి.. అది పెద్ద విషయం కాదు!

Published Wed, May 29 2024 7:21 PM | Last Updated on Wed, May 29 2024 7:45 PM

Madhu Chopra Responds on Priyanka Chopra Nick Jonas age gap

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయిన ప్రముఖ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా జన్మించారు.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్‌ గ్యాప్‌పై ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా స్పందించారు. ఈ జంట మధ్య పదేళ్ల వయసు తేడా ఉండడంతో ఎలాంటి ప్రభావం ఉందన్న విషయంపై ఆమె మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు వయసు అనేది పెద్ద మ్యాటర్‌ కాదని ఆమె అన్నారు.

మధు చోప్రా మాట్లాడుతూ.."ప్రియాంక, నిక్‌ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్బాయి మంచివాడు. ఒకరినొకరు బాగా చూసుకుంటారు. నేను వారి గురించి చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు వారి వయసు పట్ల ఏమైనా మాట్లాడతారు. కానీ అవేమీ నేను పట్టించుకోను. నిక్ ఇండియాకు వచ్చి ప్రియాంక లేనప్పుడు నన్ను లంచ్‌కి తీసుకెళ్లాడు. ప్రియాంక కోసం ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారని నిక్ నన్ను అడిగాడు. అన్ని లక్షణాలను అతనికి వివరించా. నా మాటలు విని నేను ఆ వ్యక్తిని కాగలనా? అని డైరెక్ట్‌గా అడిగాడు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలకు నేను ఆశ్చర్యపోయా. కానీ వెంటనే ఓకే చెప్పాను' అని వివరించారు.

కాగా.. ప్రియాంక, నిక్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కుమార్తె  జన్మించింది. వీరి మధ్య పదేళ్ల ఏజ్‌ గ్యాప్ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement