బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం.
ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment