Nick Jonas
-
బామ్మర్ది పెళ్లిలో సాంగ్ పాడిన నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రా డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు. మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) -
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
బికినీలో ప్రియాంక చోప్రా.. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై...
సెలబ్రిటీలు చేసే కామెంట్లు, వేసే ట్వీట్లు ఏమాత్రం నచ్చకపోయినా నెటిజన్లు సోషల్ మీడియాలో రుసరుసలాడుతారు. అలా సింగర్ నిక్ జోనస్ వేసిన ట్వీట్ చూసి నెట్టింట విరుచుకుపడుతున్నారు. నీ భర్తను అదుపులో పెట్టుకో అంటూ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?ఎలన్ మస్క్ రాజకీయాల్లో అడుగుపెట్టి తన కంపెనీ టెస్లా పేరును తనే చేతులారా నాశనం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందేంటో తెలుసా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత టెస్లా లాభాలు పుంజుకున్నాయి అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వాలీ అకౌంట్ నుంచి డిసెంబర్ 17న ఓ ట్వీట్ వేశారు. దీనికి మస్క్.. అవును, నిజమేనంటూ స్పందించాడు.నీ భర్తను అదుపులో పెట్టుకోఇది చూసిన నిక్ జోనస్.. 3000వ సంవత్సరం వరకు మమ్మల్ని మీరే నడిపించాలి అని రాసుకొచ్చాడు. ఇది కొందరికి మింగుడుపడలేదు. ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నారా? ప్రియాంక.. దయచేసి నీ భర్తను కాస్త అదుపులో పెట్టుకో, ఏంటి? ప్రపంచ కుబేరుడు మస్క్‌కు మద్దతిస్తున్నావా? ప్రియాంక.. మరింత ఆలస్యం కాకముందే నీ భర్త చేతిలోని ఫోన్ తీసేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Take us to the Year 3000. https://t.co/vk0sdBhrXS pic.twitter.com/CSG7ItCmES— Nick Jonas (@nickjonas) December 17, 2024చదవండి: Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది! -
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్‌లో సినిమా స్టార్స్ డ్యాన్స్‌తో హోరెత్తించారు.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్‌ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్‌లో సరదాగా చిందేశారు. Ananya is literally representing Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ప్రియాంక భర్త డైరెక్ట్‌గా నన్నే అడిగాడు: హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా జన్మించారు.అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా స్పందించారు. ఈ జంట మధ్య పదేళ్ల వయసు తేడా ఉండడంతో ఎలాంటి ప్రభావం ఉందన్న విషయంపై ఆమె మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు వయసు అనేది పెద్ద మ్యాటర్ కాదని ఆమె అన్నారు.మధు చోప్రా మాట్లాడుతూ.."ప్రియాంక, నిక్ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్బాయి మంచివాడు. ఒకరినొకరు బాగా చూసుకుంటారు. నేను వారి గురించి చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు వారి వయసు పట్ల ఏమైనా మాట్లాడతారు. కానీ అవేమీ నేను పట్టించుకోను. నిక్ ఇండియాకు వచ్చి ప్రియాంక లేనప్పుడు నన్ను లంచ్‌కి తీసుకెళ్లాడు. ప్రియాంక కోసం ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారని నిక్ నన్ను అడిగాడు. అన్ని లక్షణాలను అతనికి వివరించా. నా మాటలు విని నేను ఆ వ్యక్తిని కాగలనా? అని డైరెక్ట్‌గా అడిగాడు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలకు నేను ఆశ్చర్యపోయా. కానీ వెంటనే ఓకే చెప్పాను' అని వివరించారు.కాగా.. ప్రియాంక, నిక్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కుమార్తె జన్మించింది. వీరి మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నిక్-ప్రియాంక (ఫొటోలు)
-
Priyanka Chopra-Nick Jonas: చూడముచ్చటగా ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ (ఫొటోలు)
-
'నువ్వే నా జీవితంలో గొప్ప ఆనందం'.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది తన భార్య, బేబీతో కలిసి ఇండియాకు కూడా వచ్చాడు. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. తాజాగా నిక్ బర్త్ డే సందర్భంగా ప్రియాంక విష్ చేసింది. భర్తకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జోనాస్ తన జీవితంలో దొరికిన గొప్ప ఆనందం అని తెలిపింది. నిక్‌తో పాటు తన కుమార్తె మాల్టీ మేరీ ఫోటోను కూడా జతచేసింది. (ఇది చదవండి: ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్! ) ఇన్‌స్టాలో ప్రియాంక రాస్తూ.. 'నీ పుట్టిన రోజు జరుపుకోవడం నా జీవితంలో చాలా సంతోషమైంది. నాకు సాధ్యం కానీ మార్గంలో నడిపించారు. నీ ప్రపంచంలో నన్ను నీలా ప్రేమించేవారు లేరు. ఐ లవ్ యూ బర్త్ డే గాయ్. నీ కలలన్నీ భవిష్యత్తులో నిజమవ్వాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే బేబీ.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ప్రియాంక అభిమానులు సైతం నిక్ జోనాస్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక షేర్ చేసిన ఫోటోల్లో నిక్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటో, తన కూతురు మాల్టీ పాలు తాగిస్తున్న అందమైన ఫోటోలు ఉన్నాయి. కాగా.. ప్రియాంక, నిక్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబ రెండు రిసెప్షన్స్ కూడా నిర్వహించారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా మాల్టీ మేరీని స్వాగతించారు. (ఇది చదవండి: సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
'అబ్బో ఎంత ప్రేమో'.. వేదికపైనే ముద్దులు పెట్టిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. కాగా.. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! ) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. (ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ) అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది. కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ఇండియన్ సినిమాలపై చీప్ కామెంట్ చేసిన ప్రియాంక
దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ నటిగా ప్రియాంక చోప్రా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..) అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రియాంక హాజరయింది. అక్కడ ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరింది. దీంతో తముడుకోకుండా వెంటనే భారతీయ సినిమాలన్ని ‘హిప్స్ అండ్ బి**బిస్’ గురించే ఉంటాయి. ఒక రకంగా వాటిని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే, అది పాత వీడియో అయినప్పటికీ ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది. ప్రియాంక తీరుపై సోషల్ మీడియాలో ఒకరు ఇలా రియాక్ట్ అయ్యారు 'భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం చాలా బాధించిందని తెలుపుతూ అమెను ఇండియన్ సినిమాల్లో బ్యాన్ చేయాలి.' అని కోరాడు. మరోక వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను అమెరికన్‌ని.. ఆమెకు అమెరికన్ల నుంచి ప్రజాదరణ లేదు.. నిక్ జోనస్ భార్య అని చెప్పడం తప్ప ప్రియాంక గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడటం నేను వినలేదు.' అని తెలిపాడు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) -
ఆ డైరెక్టర్ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు) అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. (ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి) -
నేను డేటింగ్ చేసింది వీళ్లతోనే... ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
-
పెళ్లికి ముందు నాకు, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు ఉన్నాయి: హీరోయిన్
ప్రేమ, పెళ్లి రెండూ ఒకటి కావు. అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరే దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లి సక్సెస్ అవుతారు. మరికొందరు తొలిచూపులోనే ప్రేమించినవాడిని కాకుండా మలి చూపులో లవ్వాడిన వ్యక్తితోనే ఏడడుగులు వేస్తారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అదే కోవలోకి చెందుతుంది. బాలీవుడ్లో ఆమె ఎంతోమందితో ప్రేమాయణం సాగించింది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆమె తన జీవితంలోకి వచ్చేముందు ఎందరితోనో డేటింగ్ చేశాడు. తాజాగా ఈ విషయాల గురించి ప్రియాంక చోప్రా.. అలెక్స్ కూపర్ 'కాల్ హర్ డాడీ' పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడింది. 'నేను నిక్ జోనస్‌ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్ అవగానే మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి, మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఈ క్రమంలో నాతో పని చేసినవారితో డేటింగ్ చేసేదాన్ని. కొందరితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయి. కానీ నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నా. ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. అతడు కూడా నా కంటే ముందు చాలామందిని ప్రేమించాడు. కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నాను. అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను' అని చెప్పుకొచ్చింది ప్రియాంక. కాగా నిక్ జోనస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్.. ఇలా పలువురితో ప్రేమాయణం నడిపాడు. ఇకపోతే నిక్, ప్రియాంకలు కొంతకాలం పాటు డేటింగ్ చేశాక 2018లో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మాల్తీ అనే గారాలపట్టి ఉంది. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!
ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రోమ్ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ లిప్ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
ఇండియాకు ప్రియాంక చోప్రా.. అలా రావడం తొలిసారి!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్‌కు మారిపోయానని తెలిపింది. అయితే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. MY NEICE , MY CUTEST HOOMAN YALL 🥹❤️❤️❤️ LOVE OF MY LIFE 🥹🥹❤️❤️ MM is truly her mothers daughter 🫶🫶 my god🥹🥹 #PriyankaChopra pic.twitter.com/oCz874XKbe — k. (@karishmaokay) March 31, 2023 -
సిటాడెల్ కోసం ఫ్యామిలీతో ముంబై వచ్చిన ప్రియాంక చోప్రా
-
పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని చెప్పింది. దీంతో ప్రియాంక ప్రస్తుతం ఇండిస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 1997లో ప్రారంభమైన కమల్ చిత్రం షూటింగ్.. 26 ఏళ్ల తర్వాత సెట్‌పైకి! అలాగే అదే ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ విషయం చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నానంది. కాగా ప్రియాంక సరోగసికి వెళ్లడంపై ఆమెకు ప్రశ్న ఎదురవగా అసలు విషయం వెల్లడించింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయంతో వారితో గడపడానికే ఇష్టపడతాను. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టాను. అప్పట్లో నేను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను. అందుకే అండాలను దాచుకోమ్మని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్) సలహా ఇచ్చారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం! అమ్మ సలహా మేరకు 30 ఏళ్ల వయసులోనే నా అండాలను దాచిపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే నా కెరీర్లో ముందుకు వెళ్లాను. అనుకున్నది సాధించగలిగాను. నా లక్ష్యాలను చేరుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా తనకు పిల్లలను కనాలనే ఆశ ఉండేదని, కానీ తన భర్త నిక్ జోనస్ వయసు తక్కువ ఉండుటంతో తనకి అప్పుడే పిల్లలను కనే ఇష్టం ఉందో? లేదో? అనే అనుమానం ఉండేదని పేర్కొంది. ఆ కారణం చేతనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్‌కి కూడా ఒప్పుకోలేదంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. -
నన్ను ఓ మూలన పడేశారు.. అందుకే తప్పుకున్నా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా వెల్లడించింది. బాలీవుడ్లో తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురి కావడమేనని పేర్కొంది. కాగా.. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'తనను బాలీవుడ్లో ఓ మూలన పడేశారు. అంతేకాకుండా కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. బాలీవుడ్ రాజకీయాలతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది. అందుకే అమెరికా వచ్చేశా.' అని ప్రియాంక వివరించింది. ఆ సమయంలోనే తన మేనేజర్ అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను చూసి యూఎస్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పింది. మ్యూజిక్ కెరీర్ సక్సెస్ కాకపోతే సినిమాల్లో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించారని ప్రియాంక తెలిపింది. అందుకే క్వాంటికోలో నటించానని చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్‌లో అవకాశాలను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది. గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక.. నిక్ జోనస్‌ను 2018 డిసెంబర్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆమె రిచర్డ్ మాడెన్‌తో పాటు గూఢచారి పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. -
తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే కూతురు మాల్తీ మేరీని మాత్రం ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. అయితే రీసెంట్గా జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది. కాగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటినుంచి ఇంతవరకు పాప ముఖాన్ని చూపించలేదు. కానీ తొలిసారిగా మాల్తీ ఫేస్‌ను రివీల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా బిడ్డ బతుకుతుందనుకోలేదు.. సరోగసి సీక్రెట్స్ వివరించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం. ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. -
మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైన ఆమె దాదాపు మూడేళ్ల ఇండియాకు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ఫ్లకార్డులు, బొకేలతో స్వాగతం పలికారు. ఆమె వెంట భర్త నిక్ జోనస్, కూతురు కూడా ఉన్నారు. కాగా సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన తర్వాత ప్రియాంక భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. #PriyankaChopra spotted at Mumbai airport 🔥💃📷 @viralbhayani77 pic.twitter.com/FPLmDzwoLq — Viral Bhayani (@viralbhayani77) November 1, 2022 -
ప్రత్యేక జెట్‌లో నిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రియాంక చోప్రా గ్రాండ్ విషెష్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్‌లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్‌డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్‌ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్‌లో కూర్చొని భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్‌పై ఫోటోను కూడా పంచుకుంది. (చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది) కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనస్‌లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్‌తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. చదవండి: మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్ అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. చదవండి: 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్! లాస్ ఎంజల్స్లోని పిల్లల హాస్పిటల్లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రియాంక చోప్రా గారాల పట్టి పేరు ఏంటో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2018, డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ జంట.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా తల్లిదండ్రులైయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, పేరుని కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ప్రియాంక, నిక్‌లు తమ బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం చేశారట. మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్ పెట్టారట. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక కూతురు అమెరికాలోని శాండియాగోలో 2022, జనవరి 15న ఉదయం 8 గంటలకు జన్మించినట్లు ఉంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. ఇటీవల హాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. టీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో నటిస్తోంది. (చదవండి: బిడ్డ పుట్టాక కాజల్ ఫస్ట్ పోస్ట్, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హరహర మహాదేవ్.. శివుడికి ప్రియాంక-నిక్ జోనాస్ దంపతుల పూజలు
Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి తనదైన ముద్ర వేసుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచింది ప్రియాంక-నిక్ జోనాస్ జంట. ఇండియాలో ఘనంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ప్రియాంక చోప్రా. తన ఇన్‌స్టా స్టోరీలో 'మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ' అంటూ శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రియాంక గులాబీ రంగు గల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్ జోనాస్ కనిపించాడు. ప్రియాంక కజిన్ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది. -
పిల్లల కోసం ప్రియాంక రూ.149 కోట్లతో ఇల్లు!
గ్లోబల్ స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ ఇటీవలే సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! అయితే ఈ జంట తమ పిల్లల కోసం ఇప్పటికే ఓ ఖరీదైన ఇంటిని సిద్ధం చేశారట. ఈ మేరకు హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పిల్లలను దృష్టిలో పెట్టుకుని సుమారు మూడేళ్ల క్రితమే రూ.149 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిని సొంతం చేసుకున్నారట. ఈ విషయాన్ని పీపుల్స్ మ్యాగజైన్ ఒక ప్రత్యేక కథనంలో ప్రచురించింది. కాగా నిక్యాంక 2018లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఆ మరుసటి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారికోసం అక్కడ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దాని ఖరీదు 20 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.149 కోట్లు అని తెలుస్తోంది. ఆ ఇంటికోసం దంపతులు మూడు నెలలపాటు శ్రమించి అన్నీ తమకు నచ్చేలా అమర్చుకున్నారట. తమ పిల్లలతో గడిపే ప్రతి క్షణం మధుర జ్ఞాపకంగా నిలవాలన్నది వారి కోరిక అని, అందుకే ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. -
మొదటిసారి తల్లైన ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైంది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. సరోగసి ద్వారా తల్లైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
నిక్ జోనాస్‌కు ప్రియాంక రొమాంటిక్ విష్.. ఇంకొన్ని పంచుకోవాలని
Priyanka Chopra Gives New Year Kiss To Nick Jonas: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, శుభాకాంక్షలు తెలపడం వంటివి ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. వీళ్లందరికన్నా భిన్నంగా రొమాంటిక్‌గా విష్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియాంక విష్ చేస్తూ నిక్ జోనాస్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు నిక్ జోనాస్. ప్రియాంక తనను ముద్దు పెట్టుకునే ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్లో నిక్ జోనాస్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు 'మై ఫరెవర్ న్యూ ఇయర్ కిస్ (ఎప్పటికీ నా కొత్త సంవత్సరపు ముద్దు)' అని లవ్ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నిక్, ప్రియాంక అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోని ఇలాంటి మరికొన్ని రొమాంటిక్ క్షణాలను తమతో పంచుకోవాలని కోరుతున్నారు. 2021లో ఈ జంట చాలా బిజీగా గడిపింది. ప్రియాంక, నిక్ జోనాస్ విడిపోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి ప్రియాంక చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) ఇదీ చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ? -
'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్..
Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్ స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' ప్రమోషన్లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్సైట్ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 'మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్ ఆఫ్..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది. 'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్' సినిమాతోపాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్, అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది ప్రియాంక జోనాస్. -
వెడ్డింగ్ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక కీలక నిర్ణయం..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నుంచి విడిపోనుందా? అంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటికి ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చి రూమార్లకు ఫుల్స్టాప్ పెట్టింది ప్రియాంక. దీంతో వారి విడాకులపై వస్తున్న వరుస పుకార్లకు చెక్ పడింది. నిన్న (డిసెంబర్ 1న) ఈ గ్లోబల్ కపుల్ తమ మూడవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక-నిక్ జోనస్‌లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి: కూకట్పల్లి మాల్లో సల్మాన్ సందడి, వీడియో వైరల్ ఇదిలా ఉంటే తమ వెడ్డింగ్ యానివర్సరి సందర్భంగా ఈ జంటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక తన భర్త నిక్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుందట. త్వరలోనే నిక్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. కాగా నిక్ సైతం తనకు ఇండియన్ సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కాగా నిక్‌ను త్వరలోనే బాలీవుడ్ హీరోగా లేదా సింగర్‌గా పరిచయం చేసేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్ ఇందుకోసం బాలీవుడ్ దర్శక-నిర్మాతలతో ప్రియాంక చర్చలు జరుపుతోందని వినికిడి. మరి భర్త విషయంలో ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్న గ్లోబల్ స్టార్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. గతంలో నిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే తను బాలీవుడ్ మ్యూజిక్కు బాగా దగ్గరయ్యానని, తరచూ హిందీ పాటలు వింటానని చెప్పాడు. అవి తనకు బాగా నచ్చాయని, ఇండియన్ సినిమాలు, సంగీతాన్ని తనకు పరిచయం చేసిన ప్రియాంకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇక హిందీ చిత్రం పరిశ్రమకు కూడా తాను బాగా దగ్గరయ్యానని, బాలీవుడ్లో తనకు మంచి స్నేహితులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని అంతేగాక వారి ఇంట్లో ఏ వేడుక జరిగిన హిందీ పాటలు పెడతామని, అవి డ్యాన్స్ చేయించేంత జోష్ ఆ మ్యూజిక్‌లో ఉంటుందన్నాడు. ఇక తమ వెడ్డింగ్‌లో ఎక్కువగా బాలీవుడ్ సంగీతమే ప్లే చేశారని, అప్పుడు వాటికి తాను ఫిదా అయ్యానంటూ నిక్ జోనస్ చెప్పుకొచ్చాడు. మరొపక్క హాలీవుడ్ సినిమాలకు వరుసగా సంతకం చేస్తూ ప్రియాంక ప్రస్తుతం బాలీవుడ్‌ను పక్కన పెట్టింది. ఈ క్రమంలో తాను బాలీవుడ్‌కు దూరంగా కాకుండా తన నిక్‌ను హిందీ సినిమాలకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు ప్రియాంక సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ప్రియాంక దంపతులు క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. -
ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్
Priyanka Chopra-Nick Jonas Respond On Their Divorce Rumours With Instagram Post: సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక చోప్రా అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేరు తీసేసింది. అది చూసి అందరూ షాకయ్యారు. దీని అర్థం ఏంటి త్వరలోనే ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్? అచ్చం ఇలానే ఇటీవల విడిపోయిన టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్య జరగడంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ప్రియాంక తల్లి మధు చోప్ర స్పందిస్తూ ఖండించింది. ఇక ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేసి వారి విడాకులపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇవ్వకనే ఇచ్చింది. అయినా నిక్-ప్రియాంక విడాకులు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాజాగా ఈ జంట ఈ పుకార్లపై స్పందించింది. చదవండి: ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టారు. ఈ ఫొటోను నిక్ షేర్ చేస్తూ.. ‘అందరికి థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు! ప్రియాంక మీకు కూడా కృతజ్ఞతలు’ అంటూ ఫొటో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసి గ్లోబల్ కపుల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ‘వారు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నమాట’ అంటూ క్లారిటీ ఇచ్చిన నిక్కు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? దీంతో ‘మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ ఉండాలి’, ‘క్యూట్ కపుల్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక కూడా అదే ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా కృతజ్ఞతతో ఉన్నాను(ఫ్యామిలీ, ఫ్రెండ్స్). లవ్ నిక్ జోనస్. థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే ఈ జంట తమ విడాకులపై వస్తున్న రూమార్లకు ఈ ఫొటోతో ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిక్-ప్రియాంక 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్?
Samantha Comments On Priyanka Chopra Video: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వీరి విడాకులపైనే తెగ చర్చ జరుగుతోంది. దీంతో చై-సామ్‌ల విడాకుల మ్యాటర్ కూడా తెరపై వచ్చింది. సామ్ మాదిరిగానే ప్రియాంక నిక్ ఇంటి పేరు తీసేసింది. దీంతో ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించగా ఈ రూమార్లకు ఫుల్స్టాప్ పెడుతూ ప్రియాంక ఓ వీడియో వదిలిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. నిక్ జోనస్, జోనస్ బ్రదర్స్ కంటే తనకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటూ వారిని ఆటపట్టించింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే దీనిపై సమంత స్పందించింది. అమేజింగ్ అని క్యాప్షన్స్ ఇస్తూ ప్రియాంక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ వార్తల్లోకి ఎక్కింది. చదవండి: సమంతపై నెటిజన్ల ఫైర్ తన మాజీ భర్త నాగచైతన్య బర్త్‌డేకు విషెస్ చెప్పని సమంత తన పెంపుడు కుక్క హాష్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీ నింపేయడంతో పాటు ప్రియాంక వీడియోకు ప్రత్యేకంగా కామెంట్ చేయడం ఆసక్తి నెలకొంది. ఇక చై-సామ్ మాదిరిగా గ్లోబల్ కపుల్ కూడా విడాకులకు సిద్దమవుతున్నారా? అంటూ వారిపై రూమార్స్ రాగా వాటికి ప్రియాంక సమాధానం చెప్పకనే చెబుతూ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ క్రమంలో ప్రియాంక వీడియో సామ్ అమెజింగ్ అని కామెంట్ పెట్టడం, దానిని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఆసక్తిగా మారింది. దీని వెనక సామ్ అంతర్యం ఏంటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: మరో వ్యక్తితో ఎఫైర్.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్ కామెంట్స్ కాగా ఈ వీడియోలో ప్రియాంక 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్‌ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!
Because of This Reason Priyanka Chopra Delete Her Husband Nick Jonas Name: సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేర్లు తీసేసింది. అది చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అచ్చం ఇలాంటి సంఘటనే టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్యలో జరగడంతో అందరూ ప్రియాంక-నిక్ కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అనే ఊహాగానాలే రెకిత్తించారు. దీంతో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తల్లో నిజం లేదని, ప్రియాంక-నిక్‌లు చాలా సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం చేసింది. చదవండి: నిక్ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్ అలాగే ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేయడంతో పాటు భర్త షేర్ చేసిన వీడియోకు కామెంట్ పెట్టి రూమార్లకు చెక్ పెట్టింది. మరి అలాంటప్పుడు తన పేరు పక్కన నిక్ ఇంటి పేరు ఎందుకు తొలగించినట్లు అనే ప్రశ్నలు లెవనెత్తుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో పలువురు దీనికి కారణం ఇదేనంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని మంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక తన భర్త ఇంటి పేరు తొలగించిందని చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన చోప్రా, జోనాస్ అనే పదాలు కలిసి రావని, వాటిని తీసేస్తే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం లైఫ్ బాగుంటుందట. అందుకే ఆ రెండు పదాలను తొలగించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక కావాలనే ప్రియాంక పేర్లు తొలగించిందని, ఇది ఓ ఛాలెంజ్‌లో భాగమని మరికొందరూ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కానీ ప్రియాంక ఆ పేర్లు తొలగించడం వెనక ఏదో కారణం ఉండి ఉంటుందంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాంటే దానికి అసలు కారణం స్వయంగా ప్రియాంక చెప్పేవరకు వేచి చూడాల్సిందే. ఇటీవల నిక్-ప్రియాంక సొంత ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి వేడుకలను ఈ జంట సంతోషంగా వారి కొత్త ఇంటిలో జరుపుకున్నారు. అంతేగాక ఎప్పటి లాగే సోషల్ మీడియోలో కూడా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే వారి దాంపత్య జీవితం సాఫీగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. -
నిక్ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ్చిన వార్త షికారు కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తపై తెగ చర్చ జరిగింది. ఇందుకు కారణం ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో నిక్ జోనాస్ పేరు తొలగించడమే. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ వార్తలను ఖండించింది ప్రియాంక తల్లి మధు చోప్రా. అవన్ని వట్టి పుకార్లే అని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది ప్రియాంక. ఇదీ చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్ జొనాస్‌ను తన కామెంట్లతో ఓ ఆట ఆడేసుకుంది. నిక్ జొనాస్‌కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తనకే ఉన్నారని తెలిపింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: కూతురి విడాకుల వార్తలపై మధు చోప్రా స్పందన 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్‌ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ
Madhu Chopra Respond On Her Priyanka Chopra And Nick Jonas Divorce Rumors: గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ ప్రొఫైల్‌లో నేమ్ నుంచి భర్త నిక్ జోనస్ ఇంటి పేరును తీసేసింది. దీంతో టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య-సమంత బాటలోనే ఈ గ్లోబల్ జంట నడుస్తుందని, త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. చదవండి: Priyanka Chopra And Nick Jonas: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? ఈ నేపథ్యంలో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలపై స్పందించింది. సోమవారం సాయంత్రం ఆమె న్యూస్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రియాంక-నిక్‌ల విడాకులంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక-నిక్ విడాకులపై వస్తున్న వార్తలను నమ్మొద్దని, అవన్నీ వట్టి పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. అంతేగాక ఇలాంటి ఆసత్య ప్రచారాలను వైరల్ చేయొద్దని ఆమె నెటిజన్లను కోరింది. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి కాగా ఇటీవల ప్రియాంక-నిక్‌లు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గృహ ప్రవేశం చేసి కొత్త ఇంటికి మకాం మార్చిన ఈ జంట అక్కడ దీపావళి వేడుకులను ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. కాగా 2018 డిసెంబర్ 1న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు రోజుల పాటు వీరి వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. -
ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?
బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ప్రోఫైల్ పేరు నుంచి భర్త నిక్ జోనస్ పేరును తొలిగించింది. దీంతో అది చూసి ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ అంతా షాక్‌కు గురవుతున్నారు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా అసలేం జరిగింది, నిక్ పేరును ప్రియాంక ఎందుకు తొలగించారంటూ సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంతలు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విడాకుల ప్రకటనకు ముందుకు సామ్ తన సోషల్ మీడియా ఖాతాలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్ల్లో అక్కినేని పేరు తొలగించి ఎస్ అనే అక్షరం మాత్రమే పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సోషల్ మీడియా ఖాతాల పేర్లను మార్చడంతో ప్రియంక-నిక్కు మధ్య కూడా సంబంధం చేడిందా? ఏంటీ? అంటూ ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి అయితే ప్రియాంక తన పేరును మార్చడం వెనక అసలు విషయం ఏంటన్నది మాత్రం స్పష్టత లేదు. అసలు ఏమైంది, ఏం జరిగింది.. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా.. నిన్న, మొన్నటి వరకు వారి వెకేషన్స్ సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఇటీవల ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి, జోనస్‌తో తనకున్న అనుంబంధం గురించి చెబుతూ తెగ మురిసిపోయింది. చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా? అంతేగాక నిక్ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రియాంకపై తన ప్రేమను వ్యక్తం పరుస్తూ ఉండేవాడు. ఇటీవల అమెరికాలో వారి కొత్త ఇంటిలో దీపావళి వేడుకలను కూడా ఈ జంట జరుపుకున్నారు. మరి వారి రిలేషన్‌కు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు చెక్ పడాలంటే ప్రియాంక తన పేరు మార్చడంలో అంతర్యం ఏంటో క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. కాగా 2018 డిసెంబర్ 2వ తేదీన ఈ గ్లోబల్ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఈ జంట వివాహం జరిగింది. -
ఆ సెంటిమెంట్ గురించే చెప్పకపోతే నిక్ చంపేస్తాడు: ప్రియాంక చోప్రా
సాక్షి,ముంబై: బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్ కంటే గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా తన ఎంగేజ్మెంట్ రింగ్ సెంటిమెంట్ గురించి ప్రియాంక చోప్రా జోనాస్ చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్ చంపేస్తాడు అంటూ చమత్కరించింది. (Samantha: డబుల్ ధమాకా, అభినందనల వెల్లువ) ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్మెంట్ రింగ్ తనకు అత్యంత ప్రియమైన ఆభరణమని వెల్లడించింది. వాస్తవానికి తనజ్యుయల్లరీ ప్రతీదానికిఒక సెంటిమెంట్ ఉంటుందని అందుకేప్రతీదాన్ని అపురూపంగా చూసుకుంటానని తెలిపింది. ముఖ్యంగా తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మక మైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల రూపాయల ఈ డైమండ్ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్ ఉందంటూ బ్యాక్‌స్టోరీని వివరించింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా వివిధ సందర్భాలలో దీనిపై మాట్లాడుతూ ప్రత్యేకంగా ఉండేలా, అదీ పీసీ తండ్రికి సంబంధం ఉండేలా తమ ఎంగేజ్మెంట్ రింగ్‌ను టిఫనీస్నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు. కాగా సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి సంబరంగా జరుపుకున్న దీపావళి వేడుకల ముచ్చట్లను కూడా ఇటీవల షేర్ చేసింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రియాంక తన భర్త నిక్‌పై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 17న) నిక్ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్. అత్యంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ బేబీ’ అంటూ ప్రియాంక నిక్‌పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చూడచక్కని ఈ జంటను చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నిక్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా మాట్లాడడు. అతను నన్ను ఎంతో ప్రభావితం చేశాడు. అతని వల్లే మిర్చిలాగా ఘాటుగా ఉండే నేను ఎంతో కూల్‌గా మారిపోయాను’ అని తెలిపింది. కాగా ప్రస్తుతం యూకేలో సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కేవలం భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు అమెరికా వచ్చింది. ప్రస్తుతం ఈ భామ ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్’ అనే హాలీవుడ్ మూవీ నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
పదో తరగతిలో బాయ్‌ఫ్రెండ్.. ఓ రోజు ఇంట్లో అలా..ప్రియాంక లైఫ్ సీక్రెట్
గ్లోబల్ స్టార్ ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ప్రస్తుతం ఈమెకు హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతుంది .పైగా ఈమె పెళ్లి చేసుకున్నది కూడా హాలీవుడ్ కంపోజర్, నటుడు నిక్ జోనస్‌ను. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది ఈ గ్లోబల్ బ్యూటీ. ఎవరేమనుకున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడడం ప్రియాంకకి అలవాటు. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది ఆమె. తాజాగా ఈమె తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ అన్ ఫినిష్డ్ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది ప్రియాంక. తన పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ వింత సంఘటను కూడా చెప్పుకొచ్చింది. ‘పదోతరగతి చదువుతున్న సమయంలో ప్రియాంకకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడట. పేరు బాబ్. తన చలాకీతనం తనం చూసి ప్రేమ పడిపోయానని, అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పిన ప్రియాంక.. అతనితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన విషయాన్ని రివీల్ చేసింది. ఓ రోజు ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుండగా సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోనే దాచి పెట్టాను. ఆంటీని బయటకి పంపేంత వరకు లోపలే ఉండమని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చి అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అత్తయ్య సీరియస్ అయింది. నా జీవితంలో అత్తయ్యను అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు’అని పుస్తకంలో రాసుకొచ్చింది ప్రియాంక. -
'పదేళ్లలో ప్రియాంక చోప్రాకు విడాకులు తథ్యం'
Priyanka Chopra - Nick Jonas: పెళ్లి పెటాలకువడం మనకు పెద్ద మాటేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం అది చాలా మామూలు విషయం. హాలీవుడ్, బాలీవుడ్.. చివరికి టాలీవుడ్లో అయినా విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. బాలీవుడ్లో హృతిక్ రోషన్, ఆమీర్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్.. ఇలా ఎంతోమంది విడాకుల ట్రాక్ ఎక్కినవాళ్లే.. ఒకరికొకరు నచ్చకపోయినా జీవితాంతం అడ్జస్ట్ అయి కలిసుండటం కన్నా ఎవరి దారి వారి చూసుకోవడం బెటర్ అన్నది వారి సిద్ధాంతం. అయితే రానున్న కాలంలో ప్రియాంక చోప్రా కూడా ఇదే రూట్లో నడుస్తుందంటున్నాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. "ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం" అని చెప్తూ కేఆర్కే ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని మండిపడుతున్నారు. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. 'ప్రిడిక్షన్: అందరి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్కేను పబ్లిక్‌లో చితక్కొడుతారు', 'మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు', 'మీరు ప్రతిదాంట్లో తలదూర్చడం మానేస్తే బెటర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Prediction 03- Nick Jonas will divorce #PriyankaChopra within next 10 years! — KRK (@kamaalrkhan) July 10, 2021 సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించే కేఆర్కే మరికొన్ని విషయాల్లోనూ జోస్యం చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల సంతానానికి సరైన పేరు పెట్టనందున వాళ్లు భవిష్యత్తులో మంచి నటులుగా రాణించలేరని తెలిపాడు. బాలీవుడ్లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని జోస్యం పలికాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. Prediction 04- This actor will become a big star but after death of his father only! — KRK (@kamaalrkhan) July 10, 2021 -
అప్పుడు ప్రియాంకతో మాట్లాడే పరిస్థితిలో లేను: నిక్ జోనస్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ఇటీవల లైవ్ షో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లోని ది వాయిస్ రియాలిటీ షో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నిక్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్లో జాయిన్ చేయగా కొద్ది రోజుల కిందట డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అనంతరం వెంటనే యథావిధిగా ‘ది వాయిస్’ షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక ఛానల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిక్ తనకు జరిగిన ప్రమాదంపై తొలిసారిగా స్పందించాడు. అయితే నిక్ గాయపడిన అనంతరం తన భార్య ప్రియాంకకు ఈ సమాచారం అందించేందుకు ముందుగా మీ ఫోన్ ఎవరికి ఇచ్చారని హోస్ట్ అడగ్గా.. వెంటనే నిక్ తన పెద్ద అన్నయ్య కెవిన్ జోనస్‌కు ఇచ్చానని వెల్లడించాడు. దీనిపై నిక్ మాట్లాడుతూ.. ‘స్వయంగా నేనే ఈ విషయాన్ని ప్రియాంకతో చెప్పే పరిస్థితుల్లో లేను. నేను పడిపోగానే మెడికల్ టీం నా చూట్టు చేరింది. ఆస్పత్రికి తరలించేందుకు నన్ను హడావుడిగా గుర్నిపైకి ఎక్కించి అంబులెన్స్ దగ్గరికి తీసుకేవెళుతున్నారు. దీంతో ప్రియాంకతో నేను మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అప్పుడు కెవిన్ నాకు ఎదురుగా ఉన్నాడు. దీంతో నా ఫోన్ తీసి ప్రియాంకకు విషయం చెప్పమని ఇచ్చాను’ అంటూ నిక్ చెప్పుకొచ్చాడు. కేవిన్ జోనస్, జో జోనస్ కంటే నిక్ చిన్నవాడు. ఇక కేవిన్ మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన గురించి ప్రియాంక చెప్పుతుండగా నా నోటి నుంచి మాటలు రాలేదు. నేను అన్నయ్యనే అయినప్పటికి వారికి తండ్రి స్థానంలో ఉన్నాను. ఓ తండ్రి తన పిల్లలను అలాంటి పరిస్థితుల్లో చూసి సాధారణంగా ఉండలేడు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. -
రూ. 7.5 కోట్లు సేకరించాం: ప్రియాంక దంపతులు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆయా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి భారత్‌లోని కోవిడ్ బాధితుల కోసం నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 7.5 కోట్లు) సేకరించినట్లు తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే 3 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఆమె చెప్పారు. ఈ మొత్తం భారతదేశంలో కోవిడ్‌తో బాధపడుతున్న వారికి వెచ్చించాలని ప్రియాంక-నిక్ దంపతులు భావిస్తున్నారు. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల రూపాయల నిధులు సేకరించామని చెప్పారు. ఈ డబ్బును భారత్‌లో ఎలా వినియోగించనున్నారో వివరాలు అడుగుతూ గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సంభాషణను ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫండ్‌ను భారత్‌లో ఆక్సీమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు సతీజా చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. అదే విధంగా ఆపదలో ఉన్న భారత్‌కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తాను కోరినట్లు ప్రియాంక తెలిపారు. భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్‌కు వివరించినట్లు కూడా ప్రియాంక పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ లైవ్ షోలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. తాను తొందరగా కొలుకునేందుకు ప్రియాంక కారణమని, ప్రతి క్షణం తనను కనిపెట్టుకుని అన్ని విధాల సపర్యలు చేసిందని, గొప్ప భార్య అంటూ ప్రియాంక మీద నిక్ ప్రేమ కురిపించాడు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్కు స్వల్ప గాయాలయినట్లు, దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు సమాచారం. గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు వినికిడి. నిక్ యదావిధిగా సోమవారం మాత్రం తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్న వాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు. ప్రియాంక తన ప్రాజెక్ట్స్ కోసం లండన్, నిక్ జోనస్ లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు. మరోవైపు భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, తనభర్త నిక్ జోనాస్ కలిసి కోవిడ్ బాధితుల కోసం ‘టుగెదర్ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
ఆ హీరోతో బాత్రూంలో ప్రియాంక: నెటిజన్ల సెటైర్లు
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారి 'మెట్ గాలా' ఈవెంట్‌కు హాజరైన ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. అక్కడ రెడ్ కార్పెట్ హొయలు ఒలికించిన ఈ భామ 2017లో తన ప్రియుడు నిక్ జోనస్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ ఫ్యాషన్ ఈవెంట్‌కు సంబంధించిన పలు ఫొటోలను సింగర్ రీటా ఓరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక బ్లాక్ పాంథర్ నటుడు మైఖేల్‌తో మాట్లాడుతోంది. అయితే వీళ్లు కబుర్లు చెప్పుకుంటోంది బాత్రూమ్లో కావడం గమనార్హం. వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది కూడా అక్కడే ఉన్నారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు బాత్రూమ్లో చర్చలు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. మీకు వేరే చోటే దొరకలేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా ప్రియాంక 2018లో రెండోసారి 'మెట్ గాలా'కు హాజరవగా, 2019లో భర్త నిక్‌తో మరోసారి ఈవెంట్లో తళుక్కున మెరిసింది. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: భారతదేశానికి హాలీవుడ్ సాయం -
భారతదేశానికి హాలీవుడ్ సాయం
‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో హృదయవిదారక దృశ్యాలు కనిస్తున్నాయి. ఈ భయంకరమైన కరోనా వైరస్ మనల్ని కూడా ఇబ్బంది పెట్టి చాలా రోజులేం గడవలేదు. భారతదేశంలో ఉన్న మన అన్నదమ్ముల కోసం మీకు చేతనైనంత సాయం చేయండి. చేయూత చిన్నదైనా దాని ఫలితం మంచి చేస్తుంది’’ అని అమెరికన్ నటి మిండీ క్యాలింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే భారత దేశంలోని కోవిడ్ బాధితులకు సహాయం చేయాల్సిందిగా పలువురు హాలీవుడ్ ప్రముఖులు కోరుతున్నారు. జయ్ శెట్టి, రాధిక అంతర్జాతీయ రచయిత, పాడ్ క్యాస్టర్ జయ్ శెట్టి, అతని భార్య రాధికతో కలిసి ‘హెల్ప్ ఇండియా బ్రీత్’ అనే ఫండ్ రైజర్‌ను మొదలు పెట్టారు. ఒక మిలియన్ డాలర్ల (దాదాపు 7 కోట్లు) కనీస విరాళాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ నిధి విరాళ సేకరణను ప్రారంభించారు జయ్ శెట్టి దంపతులు. ఇందులో భాగంగా ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ స్మిత్ ఫ్యామిలీ, కెనడియన్ సింగర్–సాంగ్ రైటర్ షాన్ మెండెస్, అమెరికన్ వ్యాపారవేత్త రోహన్ ఓజా, రచయిత బ్రెండెన్ బుచార్డ్లు తలా 50 వేల డాలర్ల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఐటీ కాస్మోటిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జామీ కెర్న్ లిమా లక్ష డాలర్లను ప్రకటించారు. ఇక బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కలిసి కోవిడ్ బాధితుల కోసం ‘టుగెదర్ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు హాలీవుడ్ తారలు ఇండియాకి సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. -
ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..
లండన్: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్‌ను లండన్‌లో ప్రియాంక- నిక్ జోనాస్ దంపతులు 2021 ఆస్కార్ నామినేషన్ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్ ఫాంథర్ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి ఆస్కార్‌కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. 2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా ఉత్తమ చిత్రం కేటగిరీ ది ఫాదర్ జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య మాంక్ మినారి నోమాడ్ ల్యాండ్ ప్రామిసింగ్ యంగ్ వుమన్ సౌండ్ ఆఫ్ మెటల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఉత్తమ దర్శకుడు కేటగిరీ థామస్ వింటర్బర్గ్, (అనదర్ రౌండ్) డేవిడ్ ఫించర్, (మాంక్) లీ ఐజాక్ చుంగ్, (మినారి) క్లోస్ జావో, (నోమాడ్లాండ్) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ నటుడు కేటగిరీ రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్) చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్) గ్యారీ ఓల్డ్మన్, (మాంక్) స్టీవెన్ యూన్, (మినారి) ఉత్తమ నటి కేటగిరీ వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే) వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్) ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, (నోమాడ్‌ల్యాండ్) కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) డేనియల్ కలుయా, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్ మయామి) పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్) లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) ఉత్తమ సహాయ నటి కేటగిరీ మరియా బకలోవా, (బోరాట్ సబ్సీక్వెంట్ మూవీఫిల్మ్) గ్లెన్ క్లోజ్, (హిల్‌బిల్లీ ఎలిజీ) ఒలివియా కోల్మన్, (ది ఫాదర్) అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్) యుహ్-జంగ్ యూన్, (మినారి) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లీ ఐజాక్ చుంగ్, (మినారి) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్) ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ లవ్ అండ్ మాన్స్టర్స్ మిడ్నైట్ స్కై ములన్ ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్ టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్వర్డ్ ఓవర్ ద మూన్ ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్ సౌల్ వోల్ఫ్ వాకర్స్ (చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. నిరాశలో ఫ్యాన్స్) -
ప్రియాంకకు చేదు అనుభవం: జమీలా, నిక్ విడాకులు?
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తూనే హాలీవుడ్లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చొప్రా. ఈ క్రమంలో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని హాలీవుడ్‌కే మాకాం మార్చింది. ఈ క్రమంలో ప్రియాంక హాలీవుడ్ ఆరంగేట్రం చేసిన కొత్తలో తరచూ ఆమెకు చేదు అనుభవాలను ఎదురయ్యాయి. ఎన్నో సందర్భాల్లో ఇతర నటీనటులను చూసి ప్రియాంక అనుకుని అక్కడి వారు పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆమెకు ఈ సంఘటనలు చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా మరోసారి ప్రియాంక అలాంటి సంఘటనే ఎదురైంది. బ్రిటిష్ నటి జమీలా జమిల్ను చూసి ఓ ట్విటర్ యూజర్ ప్రియాంక అనుకొని పప్పులో కాలేశాడు. అంతటితో ఊరుకోకుండా ‘ఒకవేళ నిక్ జోనస్, జమీలా జమిల్లకు విడాకులు అయితే’ అంటూ ట్వీట్ చేశాడు. అది చూసిన జమీలా తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చింది. ‘భిన్నమైన భారత మహిళ, ఏ మాత్రం నాలా కనిపించని ప్రియాంక చొప్రా, ఆమె భర్త ఇద్దరూ హ్యాపీ ఉన్నారని నమ్ముతున్నా’ అంటూ తను ప్రియాంక కాదని అతడికి స్పష్టం చేసింది. అది చూసి ప్రియాంక స్పందిస్తూ.. ‘లాల్’ అంటూ హర్ట్, పంచ్ ఎమోజీలను జత చేసింది. కాగా జమీల బ్రిటిష్ నటి, మోడల్. అంతేగాక గుడ్ ప్లేస్ వంటి కామెడీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యహరించింది. లండన్ త్వరలో రాబోయే మరిన్ని షోలకు కూడా ఆమె జడ్జీగా, వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. A different Indian woman who doesn’t look anything like me. @priyankachopra 😬 I believe they are very happy together still. https://t.co/UoDS5PgXIl — Jameela Jamil 🌈 (@jameelajamil) February 26, 2021 కాగా కొన్నేళ్ల క్రితం ఏబీసీ విడుదల చేసిన ఎయిర్ క్వాంటికోలో ప్రియాంక బదులు నటి, మోడల్ యుక్తా ముఖే చిత్రాన్ని ప్రచురించారు. అలాగే 2019లో వచ్చిన ఓ మ్యాగజేన్లో మోడల్, రచయిత పద్మ లక్ష్మిని స్టోరికి ప్రియాంక ఫొటోలను ఉపయోగించారు. ఇక 2017లో అమెరికాలోని ఓ ఈవెంట్లోన పాల్గోన్న దీపికాను చూసి ప్రియాంక చొప్రాగా పొరబడ్డారు. దీంతో ప్రియాంక ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇది అన్యాయం, అజ్ఞానం. ఇది సరైనది కాదు. గోధుమ వర్ణంలో ఉండే ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు. ప్రపంచ జనాభాలో అయిదవ వంతు భారతీయులు ప్రపంచ సినిమాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అది మా బాధ్యత కూడా. మమ్మల్ని అలాగే చూడండి’ అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక డ్రెస్సింగ్‌పై విపరీతమైన ట్రోలింగ్ భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా.. -
అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోలేదు: హీరోయిన్
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడు వాళ్లు పెళ్లికి రెడీగా లేరట. ఈ విషయాన్ని ప్రియాంక తన పుస్తకం "ప్రియాంక చోప్రా జోనస్"లో రివీల్ చేసింది. నిజానికైతే 2019 వరకు పెళ్లిమాట ఎత్తకూడదని అనుకున్నారట. కానీ నిక్ భారత్ పర్యటనకు రావడం, పెళ్లి ప్రస్తావన తేవడం, కాదనలేక ఓకే చెప్పడం, వెంటనే పెళ్లి జరగడం చకచకా జరిగిపోయాయి. "వాస్తవానికైతే ఓ సంవత్సరం ఆలస్యంగా వివాహం చేసుకుందామనుకున్నాం. కానీ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నిక్ పెళ్లికి తొందర పెట్టాడు. మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఆలస్యం చేయడం అనిపించింది. అందుకని అప్పుడే ముహూర్తాలు చూసుకుని పెళ్లి పీటలెక్కాం" అని ప్రియాంక చెప్పుకొచ్చింది. వీరి పెళ్లై రెండు సంవత్సరాలవుతోంది. మొన్నటి ప్రేమికుల రోజున నిక్ తన అర్ధాంగికి గులాబీల పుష్పగుచ్ఛాలను కానుకగా పంపాడు. ప్రియాంక కూడా లాస్ ఏంజెల్స్‌లోని నిక్ నివాసాన్ని ప్రేమ సందేశంతో నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించిందట. ఇదిలా వుంటే పెళ్లికి ముందు వీళ్లిద్దరూ ఓ కండీషన్ పెట్టుకున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది, కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకుని తీరాల్సిందేనని నియమం పెట్టుకున్నారట. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) చదవండి: ప్రియాంక మెరిసిపోతూ.. నిక్ మురిసిపోతూ ఆ పాట కోసం దుస్తులు విప్పమన్నారు : ప్రియాంక -
ప్రియాంక మెరిసిపోతూ.. నిక్ మురిసిపోతూ
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు కొత్త ఇంట్లోకి మారారు. ఈ సందర్భంగా గృహప్రవేశం వేడుకను నిర్వహించారు. దీనికోసం ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ప్రియాంక అందంగా ముస్తాబైంది. వైట్ ట్యునిక్పై ఆరెంజ్ కలర్ దుపట్టా జతచేసిన డిజైనర్ దుస్తుల్లో ప్రియాంక కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ముసాబా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 2018లో డిసెంబర్ 2వ తేదీన నిక్ జోనస్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక కోసం ఆమె భర్త నిక్ ప్రత్యేకంగా లాస్ ఏంజెల్స్‌లో గతేడాది ఓ అందమైన విల్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు).లాక్డౌన్ సమయంలోనే ఈ దంపతులు కొత్త ఇంట్లోకి మారినట్లు ప్రియంక తన ఆటోబయోగ్రఫి ‘అన్ఫినిష్డ్’లో వివరించింది. 📸|| Some pics of Nick and Priyanka from her new book! pic.twitter.com/QzukPkW1MC — Daily Nick Jonas (@DailyNickJonas) February 8, 2021 భారతీయ సాంప్రదాయల ప్రకారం..గృహప్రవేశం వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తండ్రి అశోక్ చోప్రాకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. ఆత్మకథలో ప్రియాంక ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లతో ప్రియాంక బిజీబిజీగా గడుపుతోంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’ జనవరి 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ ఇటీవల లండన్ పూర్తి చేసుకున్నారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’లో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం ప్రియాంకను సంప్రదించింది. చదవండి: (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) (చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా) View this post on Instagram A post shared by House of Masaba (@houseofmasaba) -
ప్రియాంక వాటిని చాలా మిస్సవుతుందట..
లాస్ ఏంజెల్స్: బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌ను ఏలుతూ గ్లోబల్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. తన ప్రియుడు నిక్ జోనాస్‌కు ఇష్టమైన భారతీయ వంటకంపై, అలాగే తాను లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ మిస్ అవుతున్న భారతీయ వంటకాలపై క్లారిటీనిచ్చింది. తాజాగా ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఆమె, ఆమె భర్త జీహ్వకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. ఇంతకీ ఈ ముద్దు గుమ్మ మిస్సవుతున్న వంటకాలేంటో తెలుస్తే షాకవుతారు. ఆమె మిస్సవుతుంది భారతీయ సాంప్రదాయ వంటకాలైన దాల్, రోటీలనట. ఆమె ప్రతిరోజు వీటిని చాలా మిస్సవుతున్నట్లు వెల్లడించింది. ఇక తన భర్త నిక్కు ఇష్టమైన భారతీయ వంటకంపై ఆమె స్పందిస్తూ.. ఆయన ఫేవరెట్ ఇండియన్ ఫుడ్ కచ్చితంగా ఏదో ఒక పనీర్ ఐటం అయ్యింటుందన్నారు. ప్రియాంకకు ఇష్టమైన వంటకాల జాబితాలో బిర్యానీ, కబాబ్, చాట్ తదితర ఐటమ్స్ ఉన్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ మూవీ 'టెక్స్స్ట ఫర్ యూ' షూటింగ్ నిమిత్తం లండన్‌లో బిజీగా గడుపుతున్నారు. అలాగే ఓటీటీ వేదికగా త్వరలో విడుదలకానున్న తన తాజా చిత్రం 'వైట్ టైగర్' చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. -
పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను 2018లో ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే ఈ స్టార్ కపుల్ పెళ్లికు ముందు ఓ ఒప్పందం పెట్టుకున్నారంట. ప్రతి మూడు వారాలకోసారి కలుసుకోవాలని పెళ్లి సమయంలో నియమం పెట్టుకున్నట్లు ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు ప్రియాంక మాట్లాడుతూ.. ‘మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకోవాలని నియమం పెట్టుకున్నాం. వృత్తి రీత్యా ఇద్దరం ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది. అందుకే పెళ్లి సమయంలో ఈ నియమం పెట్టుకున్నాం. లేదంటే ఒకరికొకరం సమయం కేటాయించుకోవాలనే ధ్యాసే ఉండకపోవచ్చు కదా’ అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి: అది నాకు చాలా గౌరవంగా ఉంది: నిక్ జోనస్) కాగా, 2018లో డిసెంబర్ 2వ తేదీన ఈ గ్లోబల్ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ఇండియాలో జోధ్‌పూర్‌లోని ఉమైడ్ భవన్ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల మధ్య వీరి వివాహం రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో జరిగింది. అయితే ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’ జనవరి 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ ఇటీవల లండన్ పూర్తి చేసుకున్నారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. (చదవండి: ప్రియాంకకు ఏకంగా క్రికెట్ టీమే కావాలట!) -
ప్రియాంకకు ఏకంగా క్రికెట్ టీమే కావాలట!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎంత మంది పిల్లలు కావాలని అడిగిన ప్రశ్నకు ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చారు. నాకు పిల్లలంటే అంటే చాలా ఇష్టం. వీలైనంత ఎక్కువ మందిని కనాలని ఉంది. నిజంగా అదొక క్రికెట్ టీమ్ కావొచ్చేమో అంటూ చిలిపిగా నవ్వేశారు. ఈ సందర్భంగా తన కొత్త ఫోటోషూట్ పిక్స్‌ను షేర్ చేశారు. అంతేకాదు భర్త, పాప్ గాయకుడు నిక్కు తనకు వయసులో పదేళ్ల గ్యాప్ , కల్చరల్ గ్యాప్ గురించి అడిగినప్పుడు వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అసలు అలాంటి తేడాలు, అడ్డంకులేవీ తమ మధ్య లేవని, అందరిదంపతుల్లాగానే తామూ గడుపుతున్నామనిక్లారిటీ ఇచ్చారు. అడ్డంకులు గురించి ఆలోచించకుండా ఒకరి అలవాట్లను, ఇష్టాలను మరొకళ్లం అర్థం చేసుకుని జీవించాలి...నిక్ నీటిలో చేపలా కలిసిపోతాడు...సో ఏదీ కష్టం కాదని చెప్పారు. అలాగే కరోనా సంక్షోభం, క్వారంటైన్ సమయంలో భర్తతో ఎక్కువ సమయం గడిపే అవకాశం తనకు వచ్చిందని, ఇది నిజంగా చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎవరి కరియర్లో వాళ్లం బిజీగా ఉన్న టైంలో ఇంత టైం కలిసి గడపటం సాధ్యం కాదన్నారు. కాగా ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న ఈ గ్లోబల్ బ్యూటీ తాజాగా తన టీనేజ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇపుడు నెట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఒక సాధారణ అమ్మాయి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ సొంత చేసుకోవడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్గా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లడం లాంటి విషయాలతో తీసుకొస్తున్న తన అన్ఫినీష్డ్ బుక్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్రియాంక సిద్ధమవుతున్నారు. -
‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి జోరుగా సినిమాలు చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. లాక్డౌన్ పూర్తయిన వెంటనే హాలీవుడ్లో చిత్రీకరణలు ప్రారంభించారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారామె. కొన్ని నెలలుగా ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉంటున్నారామె. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. -
నా రియల్ లైఫ్ బాలీవుడ్ హీరో..
ముంబై: గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు ఈ నెలలో(డిసెంబర్ 2వ తేదీ) వారి సెంకడ్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక-నిక్‌లు వారి పెళ్లినాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఒకరికోకరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రియాంక వారి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. ‘రెండేళ్లు గడిచాయి.. కానీ జీవితాంతం వరకు’ అనే క్యాప్షన్‌తో తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా నిక్ జోనస్ కూడా వారి హిందూ వెడ్డింగ్ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘రెండు రోజులు.. రెండు సంప్రదాయాలు.. ఇప్పడు రెండేళ్లు. తన దేశంలోనే ప్రియాంకను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో.. నమ్మలేకపోతున్న. హిందూ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రియాంక’ అంటూ విషెస్ తెలిపాడు. (చదవండి: ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్) View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) నిక్ పోస్ట్‌కు ప్రియాంక ‘నా నిజ జీవితంలో బాలీవుడ్ హీరో.. ఐ లవ్ యు హ్యాండ్సమ్’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా ఆమెరికా పాప్ సింగర్ అయిన నిక్ జోనస్, ప్రియాంకలు కొంతకాలం ప్రేమించుకుని 2018 డిసెంబర్ 2న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. ఇండియాలో జోధ్‌పూర్‌లోని ఉమైడ్ భవన్ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల మధ్య ప్రియాంక-నిక్‌ల వివాహం రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో జరిగింది. (చదవండి: మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత అమ్మ నాతో..) -
ఐ లవ్ యూ ప్రియాంక..స్పెషల్ విషెస్
ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఒకటయ్యారు ఈ జంట. క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్ చేసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు పాప్‌స్టార్. దీనిపై ప్రియాంక స్పందించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది. అద్భుతమైన, అందమైన స్త్రీని వివాహమాడి సరిగ్గా రెండేళ్లు అయ్యిందని, 'హ్యాపి వెడ్డింగ్ అనివర్సరీ ఐ లవ్ యూ ప్రియాంక' అని నిక్ చేసిన పోస్ట్ పై ప్రియాంక స్పందించింది. (చదవండి: లాక్‌డౌన్‌పై కాజోల్ క్రేజీ క్యాప్షన్) 'నువ్వే నా బలం, బలహీనత, ఎల్లప్పుడూ నా వెంటే ఉండే నా ధైర్యం.. ఐ లవ్ యూ నిక్' అంటూ ప్రియాంక సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 2018 డిసెంబర్ 1న క్రైస్తవ పద్ధతిలో ఒకటైన ఈ జంట డిసెంబర్ 2వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్‌గా రెండుసార్లు రిసెప్షన్ చేసుకున్నారీ జంట. కుటుంబ సభ్యులు, బాలీవుడ్ నటీనటులు, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా ఇటీవల జర్మనీ యాక్టర్ కియానో రీవ్స్‌తో కలిసి షూటింగ్ ముగించింది. తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న 'ది వైట్ టైగర్'లో కనిపించనుంది. ఈ సినిమా 'అరవింద్ అడిగా' అనే బుక్ ఆధారంగా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావ్, ఆదర్ష్ గౌరవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. హాలీవుడ్లో 'వి కెన్ బీ హీరోస్'లో కూడా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమాను రాబర్ట్ రోడ్రిక్వేజ్ నిర్మించనున్నారు. -
నిక్-ప్రియాంకల పెళ్లి బంధానికి రెండేళ్లు..
ముంబై : బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు రెండవ వివాహ వార్సికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ తమన్నా దత్తా వీరికి యానివర్సిరీ విషెస్ తెలియజేస్తూ..ఎల్లప్పుడూ ప్రేమతో, సంతోషంగా ఉండండి అంటూ వారి పెళ్లిరోజు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ప్రేమ పక్షులుగా ఉన్న నికియాంకలు(నిక్ జోనాస - ప్రియాంక చోప్రా)లు 2018 డిసెంబర్1న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయంతో పాటు భారతీయ సంప్రదాయాన్ని కూడా ఆచరించి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. (నా భర్త, గోడ సాయం తీసుకున్నా: అనుష్క) డిసెంబర్1న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం,ఆ మరుసరి రోజు డిసెంబర్ 2న భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీ, ముంబై రెండు చోట్ల వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు.సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చివరగా స్కై ఈజ్ పింక్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన వైట్ టైగర్, రాజ్‌కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. అంతేకాకుండా ప్రియాంక హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. (కేజీయఫ్ కాంబినేషన్లో ప్రభాస్ ప్యాన్ ఇండియా) -
ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా(38) కొత్త హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. టెక్ట్స్ ఫర్ యూ పేరుతో రానున్న ఈ మూవీలో ప్రియాంకాకు హీరోయిన్గా నటించనున్నారు. అద్భుతమైన వ్యక్తులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా, ఇది తనకు గొప్ప గౌరవంగా ఉందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రియాంకాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. ముఖ్యంగా గ్రామీ అవార్డు విజేత సెలిన్ డియోన్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అవుట్ల్యాండర్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి నటించనున్నట్లు ప్రియాంకా ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని గ్రేస్ ఈజ్ గాన్, పీపుల్ ప్లేసెస్ థింగ్స్ , ది ఇన్ క్రెడిబుల్ జెస్సికా జేమ్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జిమ్ స్ట్రౌజ్ డైరక్ట్ చేస్తున్నారు. స్టోరీ విషయానికి వస్తే..తన కాబోయే భర్తను కోల్పోయిన విషాదాన్నుంచి తేరుకునేందుకు తన పాత ఫోన్ కు శృంగార సందేశాలు పంపుతూ వుంటుంది హీరోయిన్. అయితే యాదృచ్చికంగా ఆ నంబరు దాదాపు ఇదే వేదన అనుభవిస్తున్న మరో వ్యక్తికి కేటాయిస్తారు. అలా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించనున్నఈ మూవీ సోఫీ క్రామెర్ ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందింది. కాగా ప్రియాంక ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికో ద్వారా హాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram So excited to kick start this amazing movie with such incredible people! Jim Strouse, Sam Heughan, Celine Dion. It’s my honour. Let’s gooooo! @celinedion @samheughan #JimStrouse @sonypictures #ScreenGems A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Oct 27, 2020 at 11:28am PDT -
ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా
గతేడాది గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 మిలియన్ డాలర్లు(రూ.144 కోట్ల) వెచ్చించి లాస్ ఏంజెల్స్‌లోని స్థానిక ఎన్సివో ప్రాంతంలోని ఈ విల్లాను తమ సొంతం చేసుకున్నారు. కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకుని 2018 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయిన బాలీవుడ్ నటి ప్రియాంక, హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఉంటున్నారు. రోజంతా వర్కవుట్లు, పెంపుడు కుక్కతో ఉల్లాసంగా గడుపుతున్నారు. నిక్ సోదరుడు జో జోనాస్, అతని భార్య సోఫీ టర్నర్ కూడా ప్రియాంక ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటిని కొనుకున్నారు. దీనిని కూడా ఇంచుమించు 14 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. (చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..) లాస్ ఏంజెల్స్‌లోని ప్రియాంక చోప్రా లగ్జరీ ఇల్లును చూసిన ఎవరికైనా కళ్లకు మైకం కమ్మాల్సిందే. ఇంటిలోని ఒక్కో గది చూస్తుంటే మతి పోయేంత అందంగా, స్టైల్‌గా ఉంటుంది మరి. విశాలవంతమైన గదులు, ఆధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ఇది మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. రెండు అంతస్తులలో, అద్దాలు, గోడలతో సుందరంగా తీర్చిదిద్దారు. గార్డెన్, స్విమ్మింగ్ ఫుల్, జిమ్, ఐమాక్స్‌తో సహా అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. మరి ఇంతటి అందమైన ఇంటిని మీరు కూడా చూడండి..(మిస్ ఇండియాగా నేను: ఎవరో గుర్తుపట్టారా?! ) అందగత్తెలంతా ఒక్కచోట చేరారు -
పలు సంస్థలకు గ్లోబల్ జంట విరాళాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో దినసరి కూలీల, వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో కరోనా పోరుకు సెలబ్రిటీలంతా బడుగులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు సంబంధించిన స్టార్స్‌తో పాటు క్రీడాకారులు సైతం ప్రధాని సహాయ నిధికి విరాళాలు సంగతి తెలిసిందే. ఇక గ్లోబల్ జంట ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌లు కూడా పలు స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాకుండా తన అభిమానులను, అనుచరులను కూడా తగినంత విరాళం ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. (జనతా కర్ఫ్యూ: ఆత్మతో అక్కడ ఉన్నాను) (కరోనాపై పోరు: అక్షయ్ రూ.25 కోట్ల విరాళం) ‘ప్రస్తుతం ప్రపంచానికి మన సాయం చాలా అవసరం. ప్రపంచంలోని స్వంచ్చంద సంస్థలన్ని కోవిడ్-19పై పోరాడేందుకు జీతం లేని వారిని, తక్కువ జీతం ఉన్నవాళ్లకు, ఇళ్లు లేని వారికి, అదే విధంగా ఈ గడ్డు కాలంలో ప్రథమ పౌరులుగా సేవలందిస్తున్న డాక్టర్లకు, దినసరి కూలీలకు, సినీ పరిశ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులను, మన తోటి ఉద్యోగులను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. అందుకే నేను, నా భర్త(నిక్‌జోనస్) ఇప్పటికే @nokidhungry, @give_india, and @sagaftra, #IAHV, @friends_of_aseema, and #PMCares వంటి సంస్థలకు విరాళాలు ఇచ్చాం. ఈ సంస్థలు చేస్తున్న సాయానికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకోచ్చారు. అదే విధంగా ‘‘వాళ్లకు మీ మద్దతు చాలా ముఖ్యం. అలాగే మేము కూడా విరాళం ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ పోస్టులో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతి లింక్‌ను షేర్ చేశాను. విరాళం ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. ప్రపంచాన్ని ఓడించడానికి మనం కలిసి సహాయపడదాం రండి’’ @nickjonas అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు ప్రియాంక. (కరోనా ఎఫెక్ట్: సీఎం వేతనం కట్!) View this post on Instagram The world needs our help more than ever. These organizations are doing amazing work by helping those impacted by #Covid19. They are feeding the hungry (including children out of school), supporting doctors and first responders, helping low income and homeless communities, and supporting our colleagues in the entertainment industry. Nick and I have already donated to these charities: @unicef, @feedingamerica, @goonj, @doctorswithoutborders, @nokidhungry, @give_india, and @sagaftra, #IAHV, @friends_of_aseema, and #PMCares Fund. Thank you for everything you are doing. They need your support too, and we would implore you to donate as well. I have linked to each org with a swipe up in my stories...no donation is too small. Together we can help the world beat this. ❤️ @nickjonas A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Mar 30, 2020 at 8:34pm PDT కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసందే. మహమ్మారిపై పోరాడేందుకు హీరో అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు ఇవ్వగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్‌లు రూ. 50 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు. ఇటివల సెలబ్రిటీ జంట విరూష్కలు కూడా ప్రధాని సహాయ నిధికి విరాళం ఇచ్చినట్లు ప్రకటించినప్పటీకి ఎంతన్నది స్పష్టం చేయలేదు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 37, 000 కరోనా మరణాలు నమోదు కాగా.. 7.8 లక్షల మందికి కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి -
ఇషా హోలీ పార్టీ: ‘నా మొదటి హోలీ ఇదే’
ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో శుక్రవారం రాత్రి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ.. తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి ముంబైలో హోలీ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు హాజరైయ్యారు. భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాలి బింద్రే, హ్యూమా ఖురేషి తదితరులు పార్టీలో పాల్గొన్నారు. కాగా కత్రినా ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో ప్రియాంక దంపతులు, కత్రినా ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ప్రియాంక , నిక్ డ్యాన్స్ వీడియో వైరల్) రంగు నీళ్లలో తడుస్తూ.. ఒంటి నిండా రంగులు చల్లకుంటూ తారలంతా పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో మొదటిసారి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నట్లు నిక్ జోనాస్ తెలిపారు. ముఖం నిండా రంగులతో నిండిన ఇద్దరి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా మొదటి హోలీ (అయిదు రోజుల ముందు.) ఇండియాలో నా రెండవ ముఖ్యమైన ఇంటిలో అత్యంత దగ్గర వ్యక్తులతో జరుపుకోవడం సరదాగా ఉంది.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram My first Holi! (Five days early)So much fun celebrating with such incredible people here in my second home in India. #holi @_iiishmagish @anandpiramal @priyankachopra A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:12am PST View this post on Instagram She makes me smile a lot. #holi A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:15am PST View this post on Instagram @katrinakaif @vickykaushal09 ❤ __________________________________________ #katrinakaif #sidharthmalhotra #hrithikroshan #ranbirkapoor #salmankhan #salkat #rankat #india #bollywood #aliabhatt #deepikapadukone #ranveersingh #shraddhakapoor #kareenakapoor #vickykaushal #sonamkapoor #akshaykumar #srk #катринакаиф #индийскиефильмы #салманкхан #шахрукхкхан #ранбиркапур #анушкашарма #ритикрошан A post shared by FAN ACCOUNT (@katrinamykaif) on Mar 6, 2020 at 12:19pm PST -
ప్రియాంక , నిక్ డ్యాన్స్ వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు వాలెంటైన్స్ డేని గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఫిబ్రవరి 14 రోజున నిక్ జోనాస్ తన ఇద్దరు సోదరులతో కలిసి మిలాన్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్కి ముందు నిక్ జోనాస్, ప్రియాంకతో కలిసి ఓ పాటకు చిందులు వేశారు. 2018లో రణ్వీర్ సింగ్ నటించిన సింబా చిత్రంలోని ఆంఖ్ మేరే సాంగ్‌కి తమదైన స్టైల్లో స్టెప్పులు వేశారు. ఈ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని నిక్ జోనాస్ శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నా వాలెంటైన్‌తో ప్రీ షో డ్యాన్స్ పార్టీ’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (‘మారిపోయారు.. గుర్తుపట్టలేకపోతున్నాం!’) ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంకతో నిక్ వేసిన స్టెప్పులు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక ఈ క్యూట్ కపూల్కి నెటిజన్లు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తన ఇద్దరు సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లు కలిసి మిలాన్‌లో జరిపిన కాన్సర్ట్కి భారీగా క్రౌడ్ వచ్చారని వీడియో ద్వారా తెలిపాడు. (ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది: ప్రియాంక తల్లి) View this post on Instagram Pre show dance party with my forever Valentine. @priyankachopra #valentines A post shared by Nick Jonas (@nickjonas) on Feb 14, 2020 at 2:12pm PST -
ప్రేమ పక్షులు.. ఏడడుగులేస్తారా?
ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్ప్రైజ్ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం కూడదీసుకుంటూ ఇంకొకరు బిజీగా ఉంటారు. ఇలా ప్రేమలో పడ్డవాళ్లు, పడబోతున్నవాళ్లకు ఇది స్పెషల్ డే. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు. ప్రేమ జల్లులో తడుస్తూ ఒక జంట, ప్రేమ వరదలో మునుగుతూ ఓ జంట, ప్రేమగాలిలో తేలుతూ ఒక జంట ఉన్నారు. విఘ్నేష్, నయనతార మరి వీళ్లంతా పెళ్లి ఒడ్డుకి చేరుకుంటారా? నేటి ప్రేమికులు రేపటి భార్యాభర్తలవుతారా? కాలమే చెప్పాలి. నయనతార కాదల్ (ప్రేమ) లో ఉన్నారు. విఘ్నేష్ శివన్ రాసే కథల్లో ఉన్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమలో ఉన్నాం అని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. విఘ్నేష్‌ని హబ్బీ అని కూడా అంటారు నయన్. మరి పెళ్లి ఎప్పుడు? అంటే ఈ ఏడాదిలో పక్కా అనే వార్త వినిపిస్తోంది. ఆలియా భట్– రణ్‌బీర్ కపూర్ దీపికా పదుకోన్ – రణ్వీర్, ప్రియాంక చోప్రా – నిక్‌ల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా గమనిస్తున్న మరో లవ్‌స్టోరీ ఆలియా భట్– రణ్‌బీర్ కపూర్‌లది. ఆలియా, రణ్‌బీర్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్ల ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో యంగ్ బాలీవుడ్ కపుల్ టైగర్ ష్రాఫ్ – దిశా పటానీ. టైగర్‌తో లంచ్, డిన్నర్లో తరచూ కనిపిస్తుంటారు దిశా. టైగర్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా మిస్ అవ్వకుండా కనిపిస్తారు. మరి పెళ్లి ఎప్పుడంటే నవ్వేస్తారామె. టైగర్ ష్రాఫ్ – దిశా పటానీ తాప్సీకి కొంతకాలంగా బ్యాడ్మింటన్ మీద ఆసక్తి పెరిగిందని సరదాగా జోక్ చేస్తుంటారు. కారణం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో ప్రేమలో పడటమే. కానీ ఈ విషయాన్ని బయట ఎక్కువగా ప్రస్తావించరు. ‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అంటే అవును.. అవును అంటారు సీనియర్ హీరోయిన్లు మలైకా అరోరా, సుస్మితా సేన్. కారణం వాళ్ల కంటే వయసులో చిన్నవాళ్లతో ప్రేమలో ఉండటమే. అర్జున్ కపూర్ (34)– మలైకా అరోరా (46) ప్రేమలో ఉన్నారు. 44 ఏళ్ల సుస్మితా సేన్, 28 ఏళ్ల రోహ్మాన్ ప్రేమలో ఉన్నారు. వయసుది ఏముంది? ప్రేమ ముఖ్యం అంటారు వీళ్లు. మరి వచ్చే ఏడాది వేలంటైన్స్ డే లోపల ఈ జంటలన్నీ ఏడడుగులేస్తాయా? అంతదాకా వెళ్లకుండానే బ్రేకప్ అవుతారా? వేచి చూద్దాం. మథియాస్, తాప్సీ అర్జున్, మలైకా రోహ్మాన్, సుస్మిత -
మెరిసే..మెరిసే...
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు గోల్డెన్ గ్లోబ్స్. 2019 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల ప్రదానం కాలిఫోర్నియాలో జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలో ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ సందడి చేశారు. గులాబీ రంగు గౌను, డైమండ్ నెక్లెస్‌లో ప్రియాంక, నలుపు రంగు సూట్లో నిక్ మెరిశారు. ఈ ఫంక్షన్లో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా ఈ జంట నిలిచింది. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ -
నిక్, ప్రియాంక పార్టీ వీడియో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో భాగంగా వీరిద్దరూ ప్రేమగా హత్తుకుని, ముద్దాడిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. న్యూయర్ సందర్భంగా నిక్ జోనస్ తన సోదరుడితో కలిసి ఫ్లోరిడాలో లైవ్ మ్యూజిక్ షో ఇచ్చాడు. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, తహీరా కశ్యప్, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా కూడా పార్టీలో ఉన్నారు. వేడుకల్లో భర్త నిక్ జోనస్‌ను ఎంకరేజ్ చేస్తూ ప్రియాంక పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. కాగా నిక్ జోనస్ లైవ్ మ్యూజిక్ మధ్యలో స్టేజ్ కిందకు వచ్చి ప్రియాంకను స్టేజ్ మీదకు తీసుకెళ్లి హత్తుకుని ప్రేమతో ముద్దాడుతూ న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పారు. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నిక్, ప్రియాంకల ప్రపంచాన్ని మరిచిపోయి.. ప్రేమలో తేలిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గత ఏడాది ప్రియాంక నటించిన ‘స్కై ఈజ్ పింక్’ మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్ కుమార్ రావుతో కలిసి ‘ది వైట్ టైగర్’ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram Melting, melting 😍 The new years kiss 💋😭😍❤️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on Jan 1, 2020 at 2:33am PST -
‘బై బై వండర్ ల్యాండ్.. తిరిగి 2020లో కలుద్దాం’
కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే సెలబ్రిటీ జంటలంతా న్యూ ఇయర్ వేడుకల కోసం రొమాంటిక్ ప్రదేశాలను చుట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు కూడా కొత్త సంవత్సర వేడుకల కోసం కాలిఫోర్నియాలో వాలిపోయారు. తాజాగా క్రిస్మస్ వేడుకను అంగరంగా వైభవంగా జరుకున్న ఈ జంట న్యూయర్ వెకేషన్ కోసం కాలిఫోర్నియా సముద్ర తీరంలో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పడవలో తన భర్త నిక్ కాళ్లపై కుర్చుని సముద్రం మధ్యలో ఉన్న ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం షేర్ చేశారు. అప్పుడే బయటకు వచ్చిన సూర్యుని కిరణాలు వారిని తాకుతున్నట్లు అందంగా ఉన్న ఈ జంట ఫోటోలు చూసి నెటిజన్లు ఫీదా అవుతున్నారు. నిక్ ఒక చేతితో గ్లాసును, మరో చేతితో ప్రియాంకను పట్టుకుని ఉన్న ఈ పోస్టుకు ఇప్పటివరకు 1.6 మిలియన్ల లైక్స్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరు ఉన్న పడవ వైపు మరో పడవ వస్తున్నట్లు కనిపించే ఈ ఫోటోను చూసి హాలీవుడ్ నటుడు ‘మీ వైపుకు వస్తున్న బోటులో ఉన్నది నేనే’ అంటూ సరదాగా కామెంటు చేశాడు. View this post on Instagram Life as it should be. 🌊 ❤️📸 @divya_jyoti A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Dec 29, 2019 at 9:00am PST అలాగే ప్రియాంక బీచ్‌లో తెల్లని నైట్ గౌనులో చేతిలో గ్లాసు పట్టుకుని ఉన్న ఫోటోకి ‘ సో నో కంప్లైంట్స్’ అనే క్యాప్షన్‌తో సోమవారం తెల్లవారు జామున షేర్ చేశారు. కాగా కాలిఫోర్నియాలోని మమ్మొత్ మంచు కొండలపై విహరిస్తూ దిగిన వీరిద్దరు ఫోటోలను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. నల్లటి, తెలుపు రంగు ట్రాక్ సూట్ ధరించి, స్నో బూట్స్, హెల్మెట్స్‌తో ఉన్న ఈ ఫోటోకి ‘వింటర్ వండర్ ల్యాండ్‌కు బై.. తిరిగి 2020లో కలుద్దాం. ట్విన్నింగ్ ఈజ్ విన్నింగ్’ అనే క్యాప్షన్‌కు హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి షేర్ చేశారు. View this post on Instagram Bye winter wonderland.. you will be missed. See you in 2020 #twinning #twinningiswinning 📸 @stardust_moonshine A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Dec 27, 2019 at 9: -
జీజాజీ ఆగయా.. మీ అభిమానానికి ధన్యవాదాలు
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌లు అందరి కంటే అత్యంత ప్రియమైన జంట అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. పుట్టిన రోజు వేడుకలు, ప్రత్యేక రోజులలో ఒకరిని మించి ఒకరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ ప్రేమను కురిపించుకుంటారు. తాజాగా ఈ జంట మొదటి వివాహా వార్షిక వేడుకను జరుపుకుంది. పెళ్లి రోజును ప్రత్యేకంగా ఉంచడానికి ప్రియాంక తన బిజీ షెడ్యూల్లో కూడా అమెరికా వెళ్లి నిక్కు ఇష్టమైన కుక్కను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ నిక్‌పై ఈ గ్లోబల్ బ్యూటీ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటుంది. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. నిక్ జోనస్ నటించిన ‘జుమాంజీ: ది నెక్స్ట్ లెవల్’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ప్రియాంక తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో నిక్ ఎంట్రీ ఇవ్వగానే అభిమానులంతా ‘జీజాజీ ఆగయా’ (బావ వచ్చాడు) అంటూ థియేటర్లో గట్టిగా అరుస్తున్న వీడియోకు ‘భారత్ థియేటర్లో నిక్ జోనస్’ అనే క్యాప్షన్‌కు ‘నేషనల్ జీజు’ అనే హ్యాష్ ట్యాగ్‌కు జత చేశారు. అలాగే మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ ప్రియాంక రాసుకొచ్చారు. When @nickjonas enters a room in India... 😂😂😂😂 #NationalJiju Thank you for all the 💕 pic.twitter.com/y4TlJRvEkf — PRIYANKA (@priyankachopra) 16 December 2019 తాజాగా ఈ జంట మొదటి వివాహ వార్షిక వేడుకను జరుపుకున్న సందర్భంగా ప్రియాంక ‘అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. ఆనందం, ప్రేమ, ఉత్సాహం, అభిరూచులన్నింటినీ ఒకే క్షణంలో నాకు అందించారు. నన్ను మీ భార్యగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై హజ్బెండ్’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అలాగే నిక్ జోనస్ కూడా వారి పెళ్లి రోజున ‘ ఏడాది క్రితం నుంచి ఈ రోజు వరకు, ఎప్పటికీ నిన్ను నా హృదయంలో నింపుకున్నాను.. ఐ లవ్ యూ ప్రియాంక’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజ్‌కుమార్ రావుకు జోడిగా ‘వైట్ టైగర్’, ‘సూపర్ హీరోస్’ వెబ్‌సిరీస్ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిస్నీస్ ఫ్రోజన్’లో తన సోదరి పరిణితి చొప్రాతో కలిసి నటిస్తున్నారు. View this post on Instagram My promise. Then..today.. forever. You bring me joy, grace, balance, excitement, passion.. all in the same moment...thank you for finding me..Happy First wedding anniversary Husband.. @nickjonas ❤️💋 And Thank you to everyone for the love and good wishes. We feel blessed. A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Dec 1, 2019 at 1:38pm PST -
నిక్ జొనాస్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక
ముంబై : ‘వైట్ టైగర్’ సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్ స్టార్ మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. 2018 డిసెంబర్ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్ప్రైజ్ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన నిక్...‘ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక’ అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ఉంది. దీనిని 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు. దీని పేరు మీద ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉందంటే ప్రియాంకు డయానా అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. తాజాగా గినోను ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో డయానాను కూడా మేము ప్రేమిస్తున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఇక మొదటి పెళ్లిరోజు దగ్గరపడుతుండటంతో ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిలో ప్రియాంక, నిక్ కపుల్ ఈ వేడుకలను జరుపుకోబుతున్నారు. View this post on Instagram so much cute in the same frame. 😂🐶❤ happy almost anniversary baby. #repost @nickjonas • Pri came home with the absolute best surprise this morning. Please meet our new pup @ginothegerman I haven’t stopped smiling since I woke up this morning and finally realized what was going on. Thank you @priyankachopra ❤️ 🐕 A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Nov 26, 2019 at 2:28pm PST -
కొత్త ఇంటి కోసం రూ. 144 కోట్లు?
ముంబై: ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక తన కొత్త ఇంటి కోసం ఏకంగా రూ. 144 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు లాస్ఏంజెలెస్లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్ ఇంట్లో ఈ జంట నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని అమ్మేసి ఓ కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకున్నారు. ఈ క్రమంలో లాస్ఏంజెలెస్లోని ఎన్సివో ప్రాంతంలోని విలాసవంతమైన ఓ ఇల్లును ప్రియాంక, నిక్ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు). అలాగే నూతన భవనం కోసం నిక్ ఆగస్టులో తన బ్యాచిలర్ పాడ్‌ను కూడా అమ్మేశాడని వార్తలు వెలువడుతున్నాయి. ఇక కొత్త ఇంటి కొనుగోలుతో లాస్ఏంజెలెస్లో స్థానిక రియల్ ఎస్టేట్ రికార్డులను ప్రియాంక-నిక్ జంట బద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ ఇంటిలో ఏడు బెడ్ రూమ్‌లు, 11 బాత్రూమ్లు, ఇంటి ముందు విశాలమైన స్థలంతోపాటు అత్యాధునికమైన వసతులలో కూడిన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిక్ సోదరుడు జో జోనస్ అతడి భార్య సోఫియో టర్నర్ సుమారు రూ. 101 కోట్లు(14.1) మిలియన్లు ఖర్చు చేసి నిక్ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో మరో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘కొత్త ఇళ్లు కొనుక్కోవడం, పిల్లలకు జన్మనివ్వడం ప్రస్తుతం నా లిస్టులో ఉన్న విషయాలు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. రాబోయే పదేళ్లలో కచ్చితంగా పిల్లలను కంటాను. నాకంటూ పిల్లలను కలిగి ఉండటమే నా డ్రీమ్’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ‘స్కై ఈజ్ పింక్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రియాంక ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో ‘వైట్ టైగర్’ చిత్రంలో నటిస్తున్నారు.. -
నా బాయ్‌ఫ్రెండ్స్ నుంచి భర్త వరకూ..!
ఆకాశంలో సగం కాదు.. ఆకాశం మొత్తం తనే అయ్యారు ప్రియాంక. మామూలు ఆకాశం కాదు. సినీ వినీలాకాశం! నింగీ నాదే, నేలా నాదే అని చేతులు చాచారు. బాలీవుడ్ ఆమెదే అయింది. హాలీవుడ్ ఆమెదే అయింది. సినిమాలు.. సీరియళ్లు.. ప్రేమ.. పెళ్లి.. ఇప్పుడు..‘ది స్కై ఈజ్ పింక్’! ఈ చిత్రంతో ‘ప్రియాంక ఈజ్ ద స్కై’ అనిపించారు. ఈ ‘స్కై’ని సాక్షి అందుకుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ తీసుకుంది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్ అయి హాలీవుడ్ వరకూ వెళ్లిన మీ జర్నీ గురించి కొన్ని మాటలు... ప్రియాంక: ఈ ప్రయాణంలో చాలామంది సహాయం ఉంది. వాళ్లందరికీ ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అభినందనలే ఇంకా ఇంకా బాగా పని చేయడానికి ఉత్సాహాన్నిస్తాయి. ఎవరి అండా లేకుండా ఒంటరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. చాలా హార్డ్‌వర్క్ చేశాను. నా ముఖం మీదే తలుపులేసిన సందర్భాలున్నాయి. అలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురైనప్పటికీ నేను అదృష్టవంతురాలినే. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడే అవకాశాలు కూడా వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ‘సక్సెస్’ ఖాయం అని నా ఒపీనియన్. ‘ఇది మన కెరీర్‌కి ఉపయోగపడుతుంది’ అనిపించిన ఏ అవకాశాన్నీ తేలికగా తీసుకోలేదు. ఆ క్యారెక్టర్ల కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఇప్పటికీ పడుతున్నాను. ఎప్పటికీ కష్టపడతాను. ఈ జర్నీలో రాళ్ల బాట చూశాను. పూల బాటకు ఆ రాళ్ల బాట ఉపయోగపడింది. కొన్నిసార్లు కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి సమయాల్లో కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అయితే జీవితంలో నేను నమ్మేదేంటంటే... ప్రతి ఫెయిల్యూర్ని సవాల్‌గా తీసుకుని ఎదగాలని. నాకెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఇష్టం. మీరు నా కెరీర్‌ని గమనిస్తే అది అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అనే హద్దులను నటిగా చెరిపేయాలనుకున్నాను. నిర్మాతగా కూడా జస్ట్ కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాదల్చుకోలేదు. మా పర్పుల్ పెబెల్ పిక్చర్స్‌పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సినిమాలను, తమను కదిలించే కథలను చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. వరల్డ్ సినిమాల్లో ఉండటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. కథానాయికగా మరో మూడేళ్లల్లో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటారు. హీరోయిన్గా తమిళ చిత్రం ‘తమిళన్’ (2002)తో స్టార్ట్ అయ్యారు. ఇన్నేళ్ల కెరీర్ మీకు నేర్పించిన విషయాలేంటి? జీవితం చాలా నేర్పిస్తుంది. ఒడిదుడుకులను దాటుకుంటూ ఈదమని చెబుతుంది. అలాంటి క్లిష్టమైన సమయాల్లో ఓ ‘వారియర్’లా మారిపోవాలి. ఆటను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాలి. పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పుడు మనం ఎలా లేవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం ఫెయిల్యూర్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒక అపజయం తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మనకు మనమే ఆదర్శంగా నిలవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం నమ్మాలి. సమస్యలు ఎదురైనప్పుడు ‘మన బలం ఏంటి?’ అని ఆలోచించా. ఆ బలం తెలుసుకుని, ఆ దిశగా వర్కవుట్ చేయడం మొదలుపెట్టా. నా ముఖం మీదే తలుపులు వేశారని చెప్పాను కదా. అప్పుడు నేనేం కుంగిపోలేదు. మనల్ని మనం నిరూపించుకుంటే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో దాన్ని డిమాండ్ చేసే స్థాయిలో ఉంటాం అని నమ్మాను. నిరూపించుకోవడానికి కష్టపడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను. బాలీవుడ్ స్క్రీన్ మిమ్మల్ని బాగా మిస్సవుతోంది. మూడేళ్ల తర్వాత ‘ది స్కైజ్ ఈజ్ పింక్’తో మళ్లీ హిందీ తెరపై కనిపించారు. మీకెంతో ఇచ్చిన హిందీ పరిశ్రమను మిస్సవుతున్న ఫీలింగ్ లేదా? ‘జై గంగాజల్’ (2016) తర్వాత హిందీ సినిమా చేయాలనుకున్నాను. చాలా కథలు కూడా విన్నాను. అప్పటికే అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ టెలికాస్ట్ కూడా మొదలైంది. ఈ సిరీస్ త్రీ సీజన్స్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎక్కువ టైమ్ పట్టేసింది. హిందీ సినిమా చేయాలని ఉన్నా చేయలేకపోయాను. ఫైనల్లీ ‘ది స్కై ఈజ్ పింక్’తో మళ్లీ హిందీ ప్రేక్షకులకు కనిపించాను. ఈ మూడేళ్లల్లోనే సినిమాలపరంగా చాలా మార్పొచ్చింది. }‘ది స్కై ఈజ్ పింక్’ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం మళ్లీ హిందీలో చేయాలనా? కథ బాగా నచ్చిందా? నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ చదివాక ఇది పక్కన పెట్టేసే స్క్రిప్ట్ కాదనిపించింది. ‘కేర్‌టేకర్స్’ గురించి ఆలోచింపజేసిన కథ అది. నాకు తెలిసి వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరు. నాకు మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేని రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు మా అమ్మగారు పక్కనే ఉండి చాలా కేర్ తీసుకున్నారు. ఒక వ్యక్తికి బాగా లేకపోతే ఇంటిల్లిపాదీ బాధపడతాం. మనకు ఇష్టమైన వ్యక్తి మన కళ్లముందే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. అది ఆ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలు ఆ కథలో ఉన్నాయి. వ్యక్తిగతంగా మా నాన్నగారి పరిస్థితి చూశాను. అలాంటి అంశాలతో ఉన్న ఈ కథ నన్ను బాగా కదిలించింది. ‘ది స్కైజ్ ఈజ్ పింక్’కి నటిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు తీసుకోవడం ఎలా అనిపించింది? ఒక ఆర్టిస్ట్‌గా సినిమా చేసిన తర్వాత జస్ట్ ప్రమోట్ చేస్తే చాలు. వేరే ఏ బాధ్యతలూ ఉండవు. కానీ నిర్మాత బాధ్యత చాలా పెద్దది. ఒక సినిమాకి 150 మంది పని చేస్తున్నారంటే అందరి బాధ్యత ఒక్క నిర్మాతదే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చాలా పని ఉంటుంది. బరువైన బాధ్యత అయినా ఇష్టంగా చేశాను. ఎందుకంటే ‘ది స్కైజ్ ఈజ్ పింక్’ కథ అందరికీ చెప్పాలి. నటిగా తెరపై చెబుతాను. కానీ నిర్మాతగా కూడా చేస్తే ఇంకా సంతృప్తి ఉంటుందనిపించింది. అందుకే నేను ఒక నిర్మాతగా చేశాను. ఈ చిత్రం లొకేషన్లో మరచిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా? ఇది చాలా ఎమోషనల్ మూవీ. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పిన తర్వాత బరువైన మనసుతో ఇంటికి వెళ్లేదాన్ని. సినిమాలో అయేషా చౌదరి (జైరా వాసిమ్) కి ఆరోగ్యం బాగుండదు. జీవితకాలాన్ని పొడిగించాలంటే తను ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ దానివల్ల మంచాన పడే అవకాశం ఉన్నందున సర్జరీ చేయించుకోనని తల్లి అదితీ చౌదరీ (ప్రియాంకా చోప్రా)కి చెబుతుంది. కూతురి నిర్ణయాన్ని తల్లి ఆమోదిస్తుంది. ఓ తల్లి తన బిడ్డని కోల్పోవడం అంటే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవడానికి తల్లే కానవసరంలేదు. కానీ ఈ సీన్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ ఎలా చూపించాలని చిత్రదర్శకురాలు సోనాలీ బోస్ దగ్గర అడిగాను. అప్పుడామె ‘నా నిజజీవితంలో జరిగిన ఘటన ఇది. అనారోగ్యంతో నా కుమారుడు చనిపోయాడు’ అని చాలా ఎమోషనల్‌గా అన్నారు. అంతే.. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. ఆ రోజు షూటింగ్లో ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు కలిగిన ఆ బాధను ఎప్పటికీ మరచిపోలేను. ‘ది స్కైజ్ ఈజ్ పింక్’ అంటే చాలు.. నాకు ఎక్కువగా గుర్తొచ్చే విషయం ఇదే. సినిమాలో ఓ తల్లిగా కూతురి మీద మీకు అమితమైన ప్రేమ ఉంది. నిజజీవితంలో మీ అమ్మ మధు చోప్రాతో మీ బాండింగ్ గురించి? ఈ సినిమాలో తల్లి తన కూతుర్ని చాలా ప్రేమిస్తుంది. ఓ ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తుంది. నిజజీవితంలో మా అమ్మ నాతో అలానే ఉంటారు. మేమిద్దరం కలిసి పార్టీలకు వెళతాం లేదా వేరే ఈవెంట్స్‌కి వెళతాం. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆమెకు తెలుసు. నా బాయ్‌ఫ్రెండ్స్ నుంచి భర్త వరకూ ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన ప్రతిదీ మా అమ్మకు తెలుసు. నీ లైఫ్‌లో నీకు బెస్ట్ పర్సన్ ఎవరు? అంటే ‘మా అమ్మ’ అంటాను. నా తల్లి నాతో ఎలా ఉన్నారో నేను సినిమాలో అలానే ఉన్నాను. మీ భర్త నిక్ జోనస్ ‘స్కైజ్ ఈజ్ పింక్’ షూటింగ్ లొకేషన్‌కి వచ్చినప్పుడు కంట తడిపెట్టుకున్నారని విన్నాం. బహుశా మీరు ఎమోషనల్ సీన్లో నటిస్తున్నప్పుడే ఆయన ఎమోషన్ అయ్యారా? మా పెళ్లికి నాలుగు రోజుల ముందు వరకూ నేను ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. లొకేషన్‌కి నిక్ వచ్చేవాడు. షాట్ గ్యాప్‌లో మేమిద్దరం పెళ్లి పనుల గురించి మాట్లాడుకునేవాళ్లం. ‘పెళ్లి పనులు నేను చూసుకుంటాలే. నువ్వు కూల్‌గా షూటింగ్ చేసుకో’ అన్నారు. ఎందుకంటే ఇది ఎమోషనల్ మూవీ అని తనకు తెలుసు. నిక్ షూటింగ్ స్పాట్‌కి వచ్చిన రోజు ఎమోషనల్ సీన్ షూట్ జరుగుతోంది. మా సోనాలీకి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లుగా వినిపించిందట. చూస్తే.. తన పక్కనే ఉన్న నిక్ ఏడుస్తుండటం ఆమెకు కనిపించింది. ‘నీ భర్తను ఏడిపించేశావ్. ఇది చాలా గొప్ప సీన్’ అని ఆమె అన్నారు. ఫైనల్లీ.. హైదరాబాద్ బిర్యానీ గురించి? నేను ఫుడ్ లవర్ని. నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. – డి.జి. భవాని ఇక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్ అనిపించుకుని, విదేశాల్లో కొత్త నటిగా జర్నీ మొదలు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? వేరే దేశానికి వెళ్లి, ‘నేను ప్రియాంకా చోప్రా.. ఇండియన్ యాక్టర్‌ని’ అని పరిచయం చేసుకున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్. అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి. మామూలుగా చిన్న వయసులో కెరీర్ ఆరంభిస్తే, ఓ 30 ఏళ్లు వచ్చేసరికి సెటిల్ అయిపోతాం. బాలీవుడ్లో అలానే సెటిల్ అయ్యాను. కానీ, 30 ఏళ్లు దాటాక విదేశాల్లో కెరీర్లో మొదలుపెట్టడం సవాల్‌గా అనిపించింది. అయితే ఎంజాయబుల్గానే ఉంది. మీ భర్త నిక్ జోనస్‌తో విదేశాల్లో స్థిరపడటం ఎలా ఉంది? మ్యారీడ్ లైఫ్ ప్లాన్స్ గురించి? ముంబైకి దూరంగా ఉంటున్నాను. అయితే నేను ఎక్కడున్నా నా చుట్టూ నేను ప్రేమించేవాళ్లు ఉంటే చాలు.. నేను ఆనందంగా ఉంటాను. వైవాహిక జీవితం విషయానికి వస్తే... ప్రస్తుతం నా ‘విష్ లిస్ట్’లో ప్రధానంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి లాస్ ఏంజిల్స్‌లో ఇల్లు కొనడం.. రెండు.. తల్లి కావడం. మాతృత్వం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలని ఉంది. అయితే అది వచ్చే రెండు మూడేళ్లల్లో మాత్రం ఉండదనే అనుకుంటున్నాను. ►గత గురువారం కర్వా చౌత్ పండగ. ఉత్తరాదివారు జరుపుకునే పండగ ఇది. భర్త క్షేమం కోరి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడిని చూశాక ఆహారం తీసుకుంటారు. హిందీ పరిశ్రమలో చాలామంది తారలు ఉపవాసం ఉన్నారు. ఇది ప్రియాంకా చోప్రాకి తొలి కర్వా చౌత్. భర్తతో కాలిఫోర్నియాలో ఉన్న ప్రియాంకా కర్వా చౌత్ పండగ చేసుకున్నారు. ‘‘నా భార్య భారతీయురాలు. తను హిందు. తన సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చెప్పింది. తనంటే నాకు చాలా ప్రేమ, ఆరాధన. పండగ రోజు మేం చాలా సరదాగా గడిపాం’’ అని నిక్ జోనస్ ఈ పండగ ఫొటోను షేర్ చేశారు. ‘‘మై ఎవిరీథింగ్’’ అని ప్రియాంక పేర్కొన్నారు. -
మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!
మంచి భర్త దొరకాలంటే తన అక్కలాగే కఠిన ఉపవాసాలు చేయాలని బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా అన్నారు. గురువారం కార్వా చౌత్(ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు) సందర్భంగా పలువురు బాలీవుడ్ తారామణులు తమ భర్తల కోసం ఉపవాస దీక్ష చేశారు. వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైన పిగ్గీ చాప్స్ అక్కడే ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నిక్ జోనస్ సైతం భార్యతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ... ‘ నా భార్య భారతీయురాలు. తను హిందువు. అన్నింట్లోనూ అసమానమైనది. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు ఎన్నో విషయాలు వివరించింది. తనపై నాకున్న ప్రేమ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు అంటూ ప్రియాంకను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ క్రమంలో అందమైన జంట అంటూ ప్రియానిక్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రియాంక చెల్లెలు పరిణీతి చోప్రా కూడా అక్కాబావల ఫొటోలపై స్పందించారు. ‘ తను ఎప్పటినుంచో ఉపవాసాలు చేసింది. పరిపూర్ణమైన భర్తను పొందాలంటే ఇలాంటివి తప్పవని నిరూపించింది! నిజానికి భర్త కోసం ఉపవాసం చేయడం తనకు ఇదే మొదటిసారి!! మరి నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. కాగా మెట్లాగాలో చూపులు కలిపిన ప్రియాంక చోప్రా- నిక్ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రియాంక నటించి, నిర్మాతగా వ్యవహరించిన.. ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా విడుదల కాగా.. పరిణీతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్ జరుపుకొంటోంది. డిస్నీ ఫ్రోజెన్-2 సిరీస్‌లో చోప్రా సిస్టర్స్ ఎస్లా, అన్నా పాత్రలకు గాత్రదానం చేశారు. ఈ మూవీ నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram My wife is Indian. She is Hindu, and she is incredible in every way. She has taught me so much about her culture and religion. I love and admire her so much, and as you can see we have fun together. Happy Karva Chauth to everyone! A post shared by Nick Jonas (@nickjonas) on Oct 17, 2019 at 9:10pm PDT Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use . -
‘శాశ్వతంగా దూరమైపోతానని భయపడేవాడిని’
ఆస్పత్రికి వెళ్లడం ఏమాత్రం ఆలస్యమైనా తాను కోమాలోకి వెళ్లేవాడినని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ అన్నాడు. డయాబెటిస్ కారణంగా అందరికీ శాశ్వతంగా దూరమైపోతాననే భయం తనను వెంటాడేదని పేర్కొన్నాడు. టీనేజ్‌లో ఉండగానే నిక్ డయాబెటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మంగళవారం ఓ మ్యాగజీన్‌తో నిక్ మాట్లాడుతూ..‘13 ఏట బాగా బరువు తగ్గడం ప్రారంభమైంది. శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పుడు అమ్మానాన్న డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తే... నాకు టైప్-1 డయాబెటిస్ వచ్చిందని చెప్పారు. ఆనాటి నుంచి.. నాకేమైనా జరుగుతుందా? నేను బాగానే ఉంటానా? నేను సాధించాలనుకున్న లక్ష్యాలకు డయాబెటిస్ అడ్డంకిగా మారుతుందా? అనే ఎన్నో సందేహాలు వెంటాడేవి. నేను బాగానే ఉంటాను కదా అని మా తల్లిదండ్రులను పదేపదే అడిగేవాడిని. ఆనాడు ఒక్కరోజు ఆలస్యంగా ఆస్పత్రిలో చేరినా నేను కోమాలోకి వెళ్లేవాడిని. తర్వాత వైద్యుల సలహాలు, సూచనలతో డయాబెటిస్ చాలా చిన్న వ్యాధి అని, ఆరోగ్యకరమైన జీవనశైలితో దానిని అదుపు చేసుకోవచ్చని తెలుసుకున్నా అని తన టీనేజ్ నాటి సంగతులను చెప్పుకొచ్చాడు. కాగా ప్రియాంక చోప్రాతో ప్రేమలో పడిన నిక్ జోనస్ గతేడాది డిసెంబరులో ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో నెటిజన్లు నేటికీ ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసినప్పుడల్లా అభ్యంతరకర వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారు. ప్రియానిక్ జంట మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆనందంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక నిక్ సంగీత ప్రదర్శనలతో బిజీగా ఉండగా.. ప్రియాంక స్కై ఈజ్ పింక్ అనే బాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. -
ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక
ఇతరుల జీవితం గురించి మాట్లాడే హక్కు తనకు లేదని గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తాను జోక్యం చేసుకోనని..తన తమ్ముడు కూడా ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం కిందట తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ.. పెళ్లికి కొన్నిరోజుల ముందే ఆమెకు బ్రేకప్ చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోవడానికి సిద్ధార్థ ప్రవర్తనే కారణం అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం అతడు నటి నీలం ఉపాధ్యాయతో డేటింగ్ చేస్తున్నట్లు బౌ-టౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇటీవల గణేశ్ చతుర్థి సందర్భంగా సిద్ధార్థ నీలంతో కలిసి అంబానీ ఇంట వేడుకలకు హాజరయ్యారు. అదే విధంగా ప్రతీ పార్టీకి నీలంతో కలిసి సందడి చేస్తున్నాడు. ఈ పార్టీలకు ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా హాజరవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. ఇప్పటికే ఓ అమ్మాయికి ఆశలు కల్పించి వదిలేశారు. మళ్లీ ఇలా చేయడం సరైందేనా అంటూ ప్రియాంక కుటుంబ సభ్యులను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడి వ్యవహారం గురించి ప్రియాంకను ప్రశ్నించగా..‘ ఇతరుల జీవితం గురించి నేను పట్టించుకోను. వేరే వాళ్ల వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు. సిద్దార్థను కలిసినపుడు వాడినే వీటి గురించి అడిగితే బాగుంటుంది’ అని సమాధానమిచ్చారు. కాగా సిద్దార్థ- ఇషితాల నిశ్చితార్థానికి భర్త నిక్ జోనస్‌తో సహా ప్రియాంక హాజరైన సంగతి తెలిసిందే. -
‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ గ్లోబల్ కపుల్ ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లిన వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అందాల భామ ప్రియాంక సోమవారం తన భర్త నిక్ బర్త్ డే సందర్భంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రియాంక పెళ్లయిన తర్వాత నిక్ మొదటి బర్త్ డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు ప్రియాంక. గతంలో వారు సరదాగా, ఆనందంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫోటోలన్నింటిని వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ‘నీతో ఉండే ప్రతి రోజు ఓ కొత్త అనుభూతిని పొందుతాను.. నువ్వు నా జీవితానికి వెలుగువి, ప్రపంచంలోని అన్ని ఆనందాలకు నువ్వు అర్హుడివి నిక్, హ్యాపీ బర్త్ డే మై జాన్’ అంటూ హృదయాన్ని తాకే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రియంక నిక్‌లు కలిసి సరదాగా వంట చేస్తున్న క్లిప్స్, కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలలో వారు చేసిన అల్లరి ఫోటోలతో పాటు ప్రియాంక బర్త్ డేలో సందడి చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ది స్కై ఇజ్ పింక్’ ప్రమోషన్ వేడుక టొరంటోలో జరిగింది. అలాగే టొరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ది స్కై ఇజ్ పింక్ చిత్ర దర్శకుడైన సోనలీ బోస్, కో స్టార్స్ ఫర్హాన్ అక్తర్, రోహిత్ సరఫ్‌లతో కలిసి ప్రియాంక హజరయ్యారు. View this post on Instagram The light of my life. Everyday with you is better than the last. You deserve all the happiness in the world. Thank you for being the most generous loving man I have ever met. Thank you for being mine. Happy birthday Jaan. I love you @nickjonas A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Sep 16, 2019 at 11:41am PDT -
ఇల్లు.. పిల్లలు కావాలి
ప్రస్తుతం తన ఆలోచనలు రెండు విషయాల మీదే ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఓ హాలీవుడ్ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ– ‘‘ఓ బేబీకి జన్మనివ్వడం, లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇల్లు కొనుక్కోవడం అనే విషయాల గురించి ఈ మధ్య ప్లాన్ చేస్తున్నాను. మనమెక్కడ సంతోషంగా ఉంటామో అదే ఇల్లు అని నమ్ముతాను. మనం ప్రేమించే వాళ్లు మన చుట్టూ ఉండాలి.. అంతే’’ అన్నారు. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా
'స్కై ఈజ్ పింక్' సినిమా సీన్ చూసి తన భర్త నిక్ జొనాస్ కన్నీరు పెట్టుకున్నారని బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తెలిపారు. షోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ' స్కై ఈజ్ పింక్' చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా గతేడాది డిసెంబర్లో తన పెళ్లికి నాలుగు రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని ప్రియాంక తెలిపారు. 'నా పెళ్లికి నాలుగు రోజులు ముందు స్కై ఈజ్ షూటింగ్లో ఉన్నాను. పెళ్లి పనులు మొత్తం సెట్ నుంచే చూసుకున్నాని, దానికి మా నిర్మాతలు సహకరించారని పేర్కొన్నారు. ఆరోజు క్లైమాక్స్ షూట్ తర్వాత కేక్ పార్టీ ఉండడంతో మా టీంతో కలిసి నిక్‌ను ఆహ్వానించాము. కానీ నిక్ ముందుగానే రావడం, అదే సమయంలో మేము సినిమాకు సంబంధించి ఒక బలమైన సీన్ చేస్తున్నాం. నా పక్క నుంచి ఏదో శబ్దం వినపించడంతో, వెంటనే పక్కకు తిరిగి చూడగా.. ఆ సమయంలో నిక్ ఏడుస్తూ కనిపించాడని' ప్రియాంక పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డైరక్టర్ బోస్ స్పందిస్తూ.. '' ప్రియాంక ! నువ్వు నీ భర్తని ఏడిపించేశావు. నిజంగా ఇది చాలా గొప్ప సీన్ అని'' పేర్కొన్నారు.