పెళ్లి పనులతో బిజీబిజీగా ఉన్నారు కాబోయే వధూవరులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. ఇంకా పెళ్లి తేదీ అధికారికంగా ఫిక్స్ కాలేదు కానీ పెళ్లిసందడి మాత్రం మొదలైపోయింది. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రా బ్రైడల్ షోవర్ ఫంక్షన్‌లో హ్యాపీహ్యాపీగా చిందేశారు. ఈ ఫంక్షన్ కోసం ఆమె దాదాపు 10 కోట్ల విలువైన జ్యుయలరీని అలంకరించుకున్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రాకు కాబోయే భర్త నిక్ జోనస్ ఓ ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
‘‘రూల్స్ అన్నీ బ్రేక్ చేశాం. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఓ మధురమైన జ్ఞాపకంగా నా బ్రైడల్ షోవర్ జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సంగతి ఇలా ఉంచితే...ఈ ఫంక్షన్‌లో సోనాలి బింద్రే, నీతూ కపూర్ కూడా మెరిశారు. క్యాన్సర్ చికిత్సకోసం సోనాలి, భర్త రిషి కపూర్ హెల్త్ చెకప్ కోసం నీతూ కపూర్ న్యూయార్క్‌లో ఉన్నారు. ప్రియాంకా, నిక్ జోనస్‌ల వివాహం డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో జరగనుందని టాక్. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనాలి బోస్ దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా ‘ది స్కై ఈజ్‌పింక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. జైరా వసీమ్, ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ప్రియాంక మెడలో పది కోట్లు!
Published Thu, Nov 1 2018 12:09 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment