Priyanka Chopra.
-
నన్ను డస్కీ అని పిలిచేవారు.. ప్రియాంక చోప్రా ఆవేదన
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ నటీమణుల్లో ఆమెది ప్రత్యేక స్థానం. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైంది బాలీవుడ్ భామ. ఇటీవలే ఆమె దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చారు. అయితే తాజాగా ఆమె కెరీర్లో జరిగిన కీలక సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్‌కు గురైనట్లు నటి వెల్లడించారు. ఆమెను డస్కీ అని పిలిచేవారని వాపోయారు. తొలి రోజుల్లో సహ నటుల కోసం సెట్లో గంటల తరబడి వేచి ఉండేదాన్ని అని ప్రియాంక చోప్రా చెప్పింది. 'డస్కీ' అంటే ఏమిటో నాకు తెలియదు? నేను తగినంత అందంగా లేనని అప్పుడు అనిపించిందని తెలిపింది. అంతేకాకుండా ఆమెను నల్లపిల్లి అని వెటకారంగా పిలిచేవారని బాలీవుడ్ నటి ఆనాటి అనుభవాలను వివరించింది. (ఇది చదవండి: మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా) నేను చాలా కష్టపడి పని చేయాల్సిన ఉంటుందని నమ్మకంతో ఉండేదానిని అని వెల్లడించింది. అయినప్పటికీ తోటి నటుల కంటే కాస్త ఎక్కువ ప్రతిభావంతురాలిగా భావించానని తెలిపింది. అయితే సహనటులు పొందిన వేతనంలో 10 శాతం కూడా తాను పొందలేదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సహనటుడి కోసం వేచి ఉండటం సరైందేనని భావించినట్లు ఆమె పేర్కొంది. ప్రియాంక చోప్రా ఫ్యాషన్‌లో జాతీయ అవార్డును అందుకుంది. ఆమె బర్ఫీ, 7 ఖూన్ మాఫ్, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో నటనకు అవార్డులు గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో మిస్ ఇండియాగా నిలిచిన ప్రియాంక ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 2002లో సన్నీ డియోల్‌తో ది హీరోతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియాంక ప్రస్తుతం సిటాడెల్లో కనిపించనుంది. బాలీవుడ్లో, ఆమె ఫర్హాన్ అక్తర్ మూవీ జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటించనుంది. -
నటి ప్రియాంక బిజినెస్ ప్లాన్స్: నా బ్యూటీకి దేశీ ఉత్పత్తులనే వాడతా
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందుకోసం నైకా బ్రాండ్ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ–కామర్స్ సంస్థ ఎఫ్ఎస్ఎన్తో డీల్ కుదుర్చుకుంది. అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) "అనోమలీ హెయిర్కేర్ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) -
ప్రియాంక వీడియోకి సమంత ఫిదా.. ఇంతకీ అందులో ఏముందంటే?
నాగ చైతన్యతో విడాకుల అనంతరం కెరీర్ పరంగా దూసుకెళ్తోంది సమంత. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. అలాగే యశోధ మూవీకి సంబంధించిన షూటింగ్‌ని కూడా కంప్లీట్ చేసుకుంది. వీటితో పాటు అటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమైంది. ఇప్పటికే డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో బీజీగా ఉన్నా... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది సామ్. ఇటీవల ఎక్కువగా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక మాటలు బాగా నచ్చాయంటూ.. హార్ట్ సింబల్ షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ అంతా ప్రియాంక వీడియోని వెతకడం ప్రారంభించారు. ఇంతకీ ఆ వీడియోలో ప్రియాంక ఏం చెప్పారంటే.. ‘నా చిన్నతనం నుంచి మా నాన్న, నాకు 9 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి మా అమ్మ అనేక విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. ‘నువ్వు ఏదైనా చేయాలకుంటే.. అంతకన్నా ముందు నువ్వు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. నువ్వు ఎవరి కూతురివి, ఎవరిని పెళ్లి చేసకుంటున్నావు అనేది ముఖ్యం కాదు. నీ కాళ్లపై నువ్వు నిలబడాలి’అని చెప్పేవాళ్లు. ఆ మాటలు నా మెదడులో బలంగా ఉండిపోయాయి. అందుకే నేను నా 12 ఏళ్ల వయసు నుంచి వాటిని ఆచరించడం మొదలు పెట్టా. ప్రతి ఏట నేను ఏయే స్థానాలకు వెళ్లాలనుకున్నానో నిర్ణయించుకొని, నా లక్ష్యాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నా’అని ప్రియాంక చెప్పుకొచ్చింది. -
నిక్ జోనాస్‌కు ప్రియాంక రొమాంటిక్ విష్.. ఇంకొన్ని పంచుకోవాలని
Priyanka Chopra Gives New Year Kiss To Nick Jonas: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, శుభాకాంక్షలు తెలపడం వంటివి ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. వీళ్లందరికన్నా భిన్నంగా రొమాంటిక్‌గా విష్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియాంక విష్ చేస్తూ నిక్ జోనాస్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు నిక్ జోనాస్. ప్రియాంక తనను ముద్దు పెట్టుకునే ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్లో నిక్ జోనాస్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు 'మై ఫరెవర్ న్యూ ఇయర్ కిస్ (ఎప్పటికీ నా కొత్త సంవత్సరపు ముద్దు)' అని లవ్ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నిక్, ప్రియాంక అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోని ఇలాంటి మరికొన్ని రొమాంటిక్ క్షణాలను తమతో పంచుకోవాలని కోరుతున్నారు. 2021లో ఈ జంట చాలా బిజీగా గడిపింది. ప్రియాంక, నిక్ జోనాస్ విడిపోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి ప్రియాంక చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) ఇదీ చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ? -
ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే
Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్ స్టార్ ప్రియాంక జోనాస్ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్ ఆఫ్ జోనాస్'గా ప్రస్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయెల్‌తో ముచ్చటించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్. ప్రియాంక, నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్, హాలీవుడ్) బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. So much love for @priyankachopra and seeing her be a part of this franchise. not often South Asian actors get booked in these parts. Talked about her exp on set and how the Indian culture is always with her. ❤️Always fearless in her endeavors. #southasian #PriyankaChopraJonas pic.twitter.com/slRA0fbCfd — Rasha Goel (@RashaGoel) December 16, 2021 ఇదీ చదవండి: 'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్.. -
ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్
Priyanka Chopra Shares The Matrix Resurrections New Poster: హాలీవుడ్ 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ స్టార్ కీన్ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్, జడా పింకెట్ స్మిత్, యహ్యా అబ్దుల్ మాటీన్ 2, జోనాథన్ గ్రోఫ్ ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ ప్రియాంక 'ఈ మ్యాట్రిక్స్ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్కి థియేటర్లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి.' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) భారతీయ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్టర్లో ప్రియాంక కనిపించకపోయేసరికి ప్రశ్నలు కురిపించిసాగారు. 'పోస్టర్లో మీరు ఎక్కడ ఉన్నారు' అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని మరోకరు రాశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక నల్లటి షేడ్స్ ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాల్గో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. -
ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన సహచర నటి దీపిక పదుకుణే స్థానాన్ని దక్కించుకుంది. జియో ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న దీపికా స్థానాన్ని ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. నాలుగు నెలల క్రితమే ఈ పదవి నుంచి దీపికా వైదొలిగింది. ఈ సందర్భంగా ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ సంస్ధ వచ్చే సంవత్సరానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ‘మామి’ బోర్డు సభ్యులు కో చైర్ పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ, ఫిల్మ్ డైరక్టర్ అనుపమ చోప్రా, అజయ్ బిజ్లీ, ఆనంద్ జీ మహీంద్రా, ఫర్హన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కౌస్తుభ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్ దేశ్‌ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ ఏకగ్రీవంగా ప్రియంకా చోప్రాను ‘మామి’ చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని తెలిపింది. మామిలోని సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఫిల్మ్‌ఫెస్టివల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. చైర్ పర్సన్‌గా ఎన్నికైన ప్రియంకా చోప్రాను మామి బోర్డ్ ట్రస్టీ ఇషా అంబానీ స్వాగతించింది. ప్రియాంక తన సారథ్యంలో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 22వ ‘మామి’ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరగనుంది. -
పదో తరగతిలో బాయ్‌ఫ్రెండ్.. ఓ రోజు ఇంట్లో అలా..ప్రియాంక లైఫ్ సీక్రెట్
గ్లోబల్ స్టార్ ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ప్రస్తుతం ఈమెకు హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతుంది .పైగా ఈమె పెళ్లి చేసుకున్నది కూడా హాలీవుడ్ కంపోజర్, నటుడు నిక్ జోనస్‌ను. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది ఈ గ్లోబల్ బ్యూటీ. ఎవరేమనుకున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడడం ప్రియాంకకి అలవాటు. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది ఆమె. తాజాగా ఈమె తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ అన్ ఫినిష్డ్ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది ప్రియాంక. తన పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ వింత సంఘటను కూడా చెప్పుకొచ్చింది. ‘పదోతరగతి చదువుతున్న సమయంలో ప్రియాంకకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడట. పేరు బాబ్. తన చలాకీతనం తనం చూసి ప్రేమ పడిపోయానని, అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పిన ప్రియాంక.. అతనితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన విషయాన్ని రివీల్ చేసింది. ఓ రోజు ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుండగా సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోనే దాచి పెట్టాను. ఆంటీని బయటకి పంపేంత వరకు లోపలే ఉండమని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చి అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అత్తయ్య సీరియస్ అయింది. నా జీవితంలో అత్తయ్యను అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు’అని పుస్తకంలో రాసుకొచ్చింది ప్రియాంక. -
న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా!
న్యూయార్క్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సినిమాల్లోనే కాకుండానే వ్యాపారం రంగంలోను దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె న్యూయార్క్‌లో ‘సోనా’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇది ఈ నెల చివరి వరకు అందరికీ అందుబాటులోకి రానుందని ప్రియాంక తెలిపారు. భర్త నిక్ జోనస్, తల్లి మధుచోప్రాలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కొత్త రెస్టారెంట్‌కు ప్రముఖ చెఫ్ హరినాయక్ ప్రధాన చెఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు. అనేక వెరైటీల ద్వారా రుచికరమైన భారత రుచులను అందించేందుకు థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్‌ను తన మిత్రులు మనీష్ గొయల్, డేవిడ్ రాబిన్ చూసుకొంటారన్నారు. కాగా, ప్రియాంకకు కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌ను లండన్‌లో చిత్రీకరిస్తోంది. ఇక ప్రియాంక ఇప్పటికే నటి, నిర్మాత, గాయనిగానూ మంచిపేరు గడించిన విషయం తెలిసిందే! చదవండి: మంచు హోటల్: ఎండాకాలంలో కూడా కరగదట -
ప్రియాంక మెరిసిపోతూ.. నిక్ మురిసిపోతూ
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు కొత్త ఇంట్లోకి మారారు. ఈ సందర్భంగా గృహప్రవేశం వేడుకను నిర్వహించారు. దీనికోసం ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ప్రియాంక అందంగా ముస్తాబైంది. వైట్ ట్యునిక్పై ఆరెంజ్ కలర్ దుపట్టా జతచేసిన డిజైనర్ దుస్తుల్లో ప్రియాంక కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ముసాబా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 2018లో డిసెంబర్ 2వ తేదీన నిక్ జోనస్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక కోసం ఆమె భర్త నిక్ ప్రత్యేకంగా లాస్ ఏంజెల్స్‌లో గతేడాది ఓ అందమైన విల్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు).లాక్డౌన్ సమయంలోనే ఈ దంపతులు కొత్త ఇంట్లోకి మారినట్లు ప్రియంక తన ఆటోబయోగ్రఫి ‘అన్ఫినిష్డ్’లో వివరించింది. 📸|| Some pics of Nick and Priyanka from her new book! pic.twitter.com/QzukPkW1MC — Daily Nick Jonas (@DailyNickJonas) February 8, 2021 భారతీయ సాంప్రదాయల ప్రకారం..గృహప్రవేశం వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తండ్రి అశోక్ చోప్రాకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. ఆత్మకథలో ప్రియాంక ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లతో ప్రియాంక బిజీబిజీగా గడుపుతోంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’ జనవరి 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ ఇటీవల లండన్ పూర్తి చేసుకున్నారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’లో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం ప్రియాంకను సంప్రదించింది. చదవండి: (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) (చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా) View this post on Instagram A post shared by House of Masaba (@houseofmasaba) -
ప్రియాంకకు ఏకంగా క్రికెట్ టీమే కావాలట!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎంత మంది పిల్లలు కావాలని అడిగిన ప్రశ్నకు ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చారు. నాకు పిల్లలంటే అంటే చాలా ఇష్టం. వీలైనంత ఎక్కువ మందిని కనాలని ఉంది. నిజంగా అదొక క్రికెట్ టీమ్ కావొచ్చేమో అంటూ చిలిపిగా నవ్వేశారు. ఈ సందర్భంగా తన కొత్త ఫోటోషూట్ పిక్స్‌ను షేర్ చేశారు. అంతేకాదు భర్త, పాప్ గాయకుడు నిక్కు తనకు వయసులో పదేళ్ల గ్యాప్ , కల్చరల్ గ్యాప్ గురించి అడిగినప్పుడు వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అసలు అలాంటి తేడాలు, అడ్డంకులేవీ తమ మధ్య లేవని, అందరిదంపతుల్లాగానే తామూ గడుపుతున్నామనిక్లారిటీ ఇచ్చారు. అడ్డంకులు గురించి ఆలోచించకుండా ఒకరి అలవాట్లను, ఇష్టాలను మరొకళ్లం అర్థం చేసుకుని జీవించాలి...నిక్ నీటిలో చేపలా కలిసిపోతాడు...సో ఏదీ కష్టం కాదని చెప్పారు. అలాగే కరోనా సంక్షోభం, క్వారంటైన్ సమయంలో భర్తతో ఎక్కువ సమయం గడిపే అవకాశం తనకు వచ్చిందని, ఇది నిజంగా చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎవరి కరియర్లో వాళ్లం బిజీగా ఉన్న టైంలో ఇంత టైం కలిసి గడపటం సాధ్యం కాదన్నారు. కాగా ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న ఈ గ్లోబల్ బ్యూటీ తాజాగా తన టీనేజ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇపుడు నెట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఒక సాధారణ అమ్మాయి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ సొంత చేసుకోవడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్గా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లడం లాంటి విషయాలతో తీసుకొస్తున్న తన అన్ఫినీష్డ్ బుక్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్రియాంక సిద్ధమవుతున్నారు. -
వారికి సాయం చేయండి: విరుష్క
విరుష్క వీరు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా అనుష్క శర్మ బిహార్, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. తాము కూడా వరద బాధితులకు సాయం చేస్తున్న ఆర్గనైజేషన్స్‌కు తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. రాపిడ్ రెస్పాన్స్, యాక్షన్ ఎయిడ్, గూంజ్ ఈ మూడింటి ద్వారా బిహార్, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను అనుష్క తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ మూడు స్వచ్చంధ సంస్థల లింక్‌లను కూడా షేర్ చేశారు. సాయం చేయాలనుకున్న వారు వీటి ద్వారా విరాళాలు అందించవచ్చని తెలిపారు. ‘కరోనాతో దేశం అల్లాడిపోతుంటే మరోవైపు బిహార్, అస్సాం ప్రజలు వరదలలో చిక్కుకుకొని విలవిలలాడుతున్నారు. మూడు ఆర్గనైజేషన్లు వారికి సహాయచర్యలు అందిస్తున్నాయి. మేం వారికి అండగా ఉంటున్నాం. మీరు కూడా ఈ సంస్థల ద్వారా సాయాన్ని అందించండి’ అని సోషల్‌మీడియా వేదికగా కోరారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Jul 29, 2020 at 10:30pm PDT ఇక మరోనటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా వరద బాధితులకు తాను, తన భర్త నిక్‌జోనస్ విరాళాలు అందించినట్లు తెలిపింది. తాను పుట్టిన బిహార్‌తో పాటు, అస్సాం కూడా భారీగా కురిసే వరదల్లో చిక్కుకుందని చెప్పారు. ‘మేం సాయం చేశాం. ఇప్పుడు ఇక మీ వంతు’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. మే 22 నుంచి అస్సాం, బిహార్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాంలో 16.8 లక్షల మంది వరద బాధితులు ఉండగా, బిహార్‌లో 30 లక్షల మందికి పైగా ఈ వరదల వల్ల ప్రభావితం అయ్యారు. చదవండి: బిహార్‌కు మరో చేదు వార్త #Biharfloods@nickjonas and I have made a donation, now it's your turn.@goonj: https://t.co/BHMYJa8ao1@FeedingIndia:https://t.co/lKFurhscCm 🙏 pic.twitter.com/CmE0bDI8gy — PRIYANKA (@priyankachopra) July 28, 2020 -
అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్
న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ఫస్ట్ లుక్ అనే టెలివిజన్ డీల్‌పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక స్పందిస్తూ.. హిందీ, ఇంగ్లిష్‌ల్లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తానని ప్రియాంక స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని తెలిపారు. ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్‌తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి : పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్) ‘భాష, భౌగోళిక బేధాలు లేకుండా ప్రపంచలోని ప్రతిభ ఒక చోట చేరి మరింత గొప్ప కంటెంట్ సృష్టించాలని ఓ నటిగా, నిర్మాతగా నేను కోరుకుంటాను. నా ప్రొడక్షన్ హౌస్ పర్పుల్ పెబెల్ పిక్చర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్‌తో కలిసి పనిచేయడం కొత్తదనానికి పునాది లాంటింది. అలాగే కథకురాలిగా నిరంతరం కొత్త ఐడియాలును అన్వేషించాలనేదే నా తపన. అవి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ముఖ్యంగా ఒపెన్ మైండ్స్, నూతన దృక్పథం కలిగి ఉండాలి. నా 20 ఏళ్ల కేరీర్లో దాదాపు 60 సినిమాలు చేసిన తర్వాత.. ఇప్పుడు దానిని సాధించే బాటలో ఉన్నట్టు నమ్ముతున్నాను’ అని తెలిపారు. (చదవండి : ఇండియా నుంచి ఈ ఇద్దరూ..) -
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫోటోలు
-
సంగీత దర్శకుడు వాజీద్‌ఖాన్ మృతి
-
రెండు నెలల తర్వాత బయటకు..
కరోనా వైరస్ కారణంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్‌తో కలిసి అమెరికాలోని లాస్ఎంజిల్స్లో ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు రెండు నెలల సుధీర్ఘ విరామం అనంతరం ఆమె బయటకు వచ్చారు. అమెరికాలో పరిస్థితి కాస్త సాధారణ స్థితికి రావడంతో మాస్క్ ధరించి ఆమె బయటకు వచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతకుముందు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న ప్రియాంక, నిక్ దంపతులు కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. (టాప్‌లో ప్రియాంక... సల్మాన్! ) ‘మన చుట్టూ ఎంతో మంది ఉండేవారు. ఇప్పడు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. షూటింగ్‌లను బాగా మిస్ అవుతున్నా’ అంటూ ప్రియంక పేర్కొంది. అంతేకాకుండా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. హిపాప్ డ్యాన్స్ నేర్చుకుంటూనే, తాజాగా పియానో కూడా నేర్చుకుంటుంది. స్వయంగా ఆమె భర్త నిక్ తనకు పియానో నేర్పిస్తున్నట్లు వెల్లడించింది. తనకెంతో ఇష్టమైన పియానోను తనకిష్టమైన వ్యక్తి నుంచి నేర్చుకుంటున్నట్లు పేర్కొంది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు 80 వేల మందిపైగా మరణించారు. -
నిక్, ప్రియాంక పార్టీ వీడియో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో భాగంగా వీరిద్దరూ ప్రేమగా హత్తుకుని, ముద్దాడిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. న్యూయర్ సందర్భంగా నిక్ జోనస్ తన సోదరుడితో కలిసి ఫ్లోరిడాలో లైవ్ మ్యూజిక్ షో ఇచ్చాడు. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, తహీరా కశ్యప్, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా కూడా పార్టీలో ఉన్నారు. వేడుకల్లో భర్త నిక్ జోనస్‌ను ఎంకరేజ్ చేస్తూ ప్రియాంక పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. కాగా నిక్ జోనస్ లైవ్ మ్యూజిక్ మధ్యలో స్టేజ్ కిందకు వచ్చి ప్రియాంకను స్టేజ్ మీదకు తీసుకెళ్లి హత్తుకుని ప్రేమతో ముద్దాడుతూ న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పారు. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నిక్, ప్రియాంకల ప్రపంచాన్ని మరిచిపోయి.. ప్రేమలో తేలిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గత ఏడాది ప్రియాంక నటించిన ‘స్కై ఈజ్ పింక్’ మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్ కుమార్ రావుతో కలిసి ‘ది వైట్ టైగర్’ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram Melting, melting 😍 The new years kiss 💋😭😍❤️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on Jan 1, 2020 at 2:33am PST -
కొత్త ఇంటి కోసం రూ. 144 కోట్లు?
ముంబై: ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక తన కొత్త ఇంటి కోసం ఏకంగా రూ. 144 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు లాస్ఏంజెలెస్లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్ ఇంట్లో ఈ జంట నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని అమ్మేసి ఓ కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకున్నారు. ఈ క్రమంలో లాస్ఏంజెలెస్లోని ఎన్సివో ప్రాంతంలోని విలాసవంతమైన ఓ ఇల్లును ప్రియాంక, నిక్ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు). అలాగే నూతన భవనం కోసం నిక్ ఆగస్టులో తన బ్యాచిలర్ పాడ్‌ను కూడా అమ్మేశాడని వార్తలు వెలువడుతున్నాయి. ఇక కొత్త ఇంటి కొనుగోలుతో లాస్ఏంజెలెస్లో స్థానిక రియల్ ఎస్టేట్ రికార్డులను ప్రియాంక-నిక్ జంట బద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ ఇంటిలో ఏడు బెడ్ రూమ్‌లు, 11 బాత్రూమ్లు, ఇంటి ముందు విశాలమైన స్థలంతోపాటు అత్యాధునికమైన వసతులలో కూడిన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిక్ సోదరుడు జో జోనస్ అతడి భార్య సోఫియో టర్నర్ సుమారు రూ. 101 కోట్లు(14.1) మిలియన్లు ఖర్చు చేసి నిక్ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో మరో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘కొత్త ఇళ్లు కొనుక్కోవడం, పిల్లలకు జన్మనివ్వడం ప్రస్తుతం నా లిస్టులో ఉన్న విషయాలు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. రాబోయే పదేళ్లలో కచ్చితంగా పిల్లలను కంటాను. నాకంటూ పిల్లలను కలిగి ఉండటమే నా డ్రీమ్’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ‘స్కై ఈజ్ పింక్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రియాంక ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో ‘వైట్ టైగర్’ చిత్రంలో నటిస్తున్నారు.. -
ఇన్నర్వ్యూ సండే స్పెషల్
నాకు ఎంగేజ్మెంట్ కాలేదు సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలను పట్టించుకోరు నిధీ అగర్వాల్. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నను మాత్రం ఆమె పట్టించుకోక తప్పలేదు. నిధి ఆన్లైన్ పేజీలోని రిలేషన్షిప్ స్టాటస్‌లో ‘ఎంగేజ్డ్’ అని ఉండడం చూసి అవాక్కయిన ఆ అభిమాని ఆ స్టాటస్‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశాడు. ‘‘మీకు ఎంగేజ్మెంట్ అయిందా!’’ అని షాక్ తిన్నట్లుగా అడిగాడు. దానికి సమాధానంగానే నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంగేజ్మెంట్ కాలేదు’ అని రెస్పాండ్ అయ్యారు. కాలేదన్న విషయానికి ఆ అభిమాని ఎంతగా సంతోషించాడో కానీ, అభిమానులు తనను ఇంతగా ఫాలో అవుతున్నందుకు మేఘాల్లో తేలిపోయారు నిధి. నిధికి ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. – నిధీ అగర్వాల్, (మోడల్, డాన్సర్, బాలీవుడ్ నటి) పచ్చడుంటే చాలు ‘‘పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. పచ్చడి లేకుండా ముద్ద గొంతు దిగదు. భోజనంలోకి మాత్రమే కాదు.. ఎందులోకైనా నాకు పచ్చడి ఉండాల్సిందే. శాండ్విచ్లోకి కూడా! చీజ్ శాండ్విచ్లోకైతే మామిడి కాయ పచ్చడి భలేగుంటుంది. మంచి కాంబినేషన్. ఏ దేశం వెళ్లినా నాకు ఈ అలవాటు పోదు. – ప్రియాంక చోప్రా, (‘ఈస్ట్ ఇండియా కామెడీ’ గ్రూపుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) మూడుసార్లు వెనక్కి ‘‘నా బుగ్గలు బూరెల్లా ఉన్నాయని, ఒళ్లు బొద్దుగా ఉందని మొదట నన్ను ఈ సీరియల్‌కి తీసుకోలేదు. ఇవే కారణాలతో ఆడిషన్లో మూడుసార్లు ఫెయిల్ అయి వెనక్కి వచ్చేశాను. నాలుగోసారి మాత్రమే నన్ను అదృష్టం వరించింది. అప్పటికి కొంచెం సన్నబడినట్లున్నాను. లైఫ్‌లో ఏదీ ఆశించిన వెంటనే దగ్గరకు వచ్చేయదు. ఓర్పు ఉండాలి. నా మొదటి పారితోషికం 300 రూపాయలు. ఒక క్యాటలాగ్ షూట్లో పాల్గొన్నందుకు ఇచ్చారు. ఆ మూడొందలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. – రీమ్ షేక్, (జీటీవీలో ఏడాదిగా ప్రసారం అవుతున్న ‘తుఝే హై రాబ్తా’ సీరియల్లో కల్యాణీ మల్హర్ పాత్రధారి) థ్యాంక్యూ ‘‘గాలిలో కాలుష్యం ఎక్కువైంది. ఊహిస్తుంటేనే భయంగా ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరం మన బాధ్యతగా చెట్లు పెంచాలి. థ్యాంక్స్ వరుణ్ తేజ్ గారూ.. ఈ పనికి నన్ను ప్రేరేపించినందుకు’’. – సాయిపల్లవి (వరుణ్‌తేజ్ ఇచ్చిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని స్వీకరించి మొక్కను నాటాక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్) -
‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ గ్లోబల్ కపుల్ ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లిన వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అందాల భామ ప్రియాంక సోమవారం తన భర్త నిక్ బర్త్ డే సందర్భంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రియాంక పెళ్లయిన తర్వాత నిక్ మొదటి బర్త్ డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు ప్రియాంక. గతంలో వారు సరదాగా, ఆనందంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫోటోలన్నింటిని వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ‘నీతో ఉండే ప్రతి రోజు ఓ కొత్త అనుభూతిని పొందుతాను.. నువ్వు నా జీవితానికి వెలుగువి, ప్రపంచంలోని అన్ని ఆనందాలకు నువ్వు అర్హుడివి నిక్, హ్యాపీ బర్త్ డే మై జాన్’ అంటూ హృదయాన్ని తాకే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రియంక నిక్‌లు కలిసి సరదాగా వంట చేస్తున్న క్లిప్స్, కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలలో వారు చేసిన అల్లరి ఫోటోలతో పాటు ప్రియాంక బర్త్ డేలో సందడి చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ది స్కై ఇజ్ పింక్’ ప్రమోషన్ వేడుక టొరంటోలో జరిగింది. అలాగే టొరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ది స్కై ఇజ్ పింక్ చిత్ర దర్శకుడైన సోనలీ బోస్, కో స్టార్స్ ఫర్హాన్ అక్తర్, రోహిత్ సరఫ్‌లతో కలిసి ప్రియాంక హజరయ్యారు. View this post on Instagram The light of my life. Everyday with you is better than the last. You deserve all the happiness in the world. Thank you for being the most generous loving man I have ever met. Thank you for being mine. Happy birthday Jaan. I love you @nickjonas A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Sep 16, 2019 at 11:41am PDT -
అతనో ‘పేపర్ టైగర్’.. పూజించడం మానేయండి!
బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర మరోసారి సల్మాన్‌ఖాన్‌పై విరుచుకుపడ్డారు. ‘భారత్’ సినిమా వసూళ్లలో వెనుకపడ్డ అతన్ని ‘పేపర్ టైగర్’గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం 'భారత్' బాక్సాఫీస్ రిపోర్టును పంచుకొంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘సల్మాన్ నటించిన భారత్ చిత్రానికి హైప్, భారీ ప్రమోషన్ కల్పించినా కనీసం ఒక వారంపాటు కూడా వసూళ్లు నిలకడగా రాబట్టలేకపోయింది. ఇలాంటి ఫిల్మీ సూపర్స్టార్లను ఏమని పిలవాలి?’ అని పేర్కొన్న ఆమె.. పేపర్ టైగర్ పేరిట హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇటువంటి వారిని పూజించడం మానుకోవాలని సల్మాన్ అభిమానులకు సలహా ఇచ్చింది. బాలీవుడ్ కండలవీరునిపై ఇలాంటి ట్వీట్లు చేయడం సోనాకి కొత్తేమి కాదు. భారత్ మూవీ నుంచి ప్రియాంక జోనస్ తప్పుకోవడంపై ట్వీట్ చేయడాన్ని తప్పుబడుతూ ఆమె గతంలో కూడా ఇలాగే ట్వీట్ చేశారు. ప్రియాంకను సమర్థిస్తూ తనదైన రీతిలో ట్వీట్‌తో ఘాటుగా జవాబిచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి.. ఆమెను చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ కూడా చేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన భారత్ మూవీలో సల్మాన్‌కు జోడిగా కత్రినా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే. -
అది నిజం కాదు!
ముంబై: బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ తారగా ఎదిగిన ప్రియాంక చోప్రా- బ్రిటన్ రాజకుటుంబం కోడలు మేఘన్ మర్కెల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరు కలిసి గతంలో పలుసార్లు దర్శనమిచ్చారు. అయితే, వీరిమధ్య గతకొంతకాలంగా పొసగడం లేదని, ఇద్దరూ మిత్రుల మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ప్రియాంక-నిక్ జోనస్ పెళ్లికి మేఘన్ మర్కెల్ రాలేదని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ‘ద సన్’ టాబ్లాయిడ్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్‌తో కలిసి ససెక్స్ డ్యూచెస్ అయిన మేఘన్‌ను కలిశారని, ఈ సందర్భంగా మేఘన్ కొడుకు, రాయల్ బేబీ ఆర్చీకి పలు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారని పేర్కొంది. ఈ కథనాలపై ప్రియాంక స్పందిస్తూ.. ఇది నిజంకాదని తేల్చింది. ‘కానుకలు ఇవ్వడం అనేది గొప్ప ఐడియానే. కానీ, ఈ కథనం నిజం కాదు. నేను ఓ పని నిమిత్తం టౌన్లో ఉన్నా. ఈ ‘విశ్వసనీయ వర్గాలు’ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి నిజాలు సరిచూసుకుంటే బాగుంటుంది’ అని పీసీ ట్వీట్ చేశారు. -
కేన్స్-2019లో తారల సందడి
-
అట్టహాసంగా ‘మెట్ గాలా 2019’
-
అట్టహాసంగా ‘మెట్ గాలా 2019’
-
వేదిక మీద ముద్దు.. వైరల్ వీడియో
హాలీవుడ్ హాట్ కపుల్ ప్రియాంకచోప్రా, నిక్ జోనస్ మధ్య అనుబంధం రోజురోజుకు పెనవేసుకుంటోంది. ఈ జంట ఎక్కడ ఉన్నా.. అందరి చూపులు వారిపైనే. తాజాగా జరిగిన బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు వీరు జంటగా వచ్చారు. ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్ బిల్బోర్డ్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టేజ్ మీద ఆడిపాడుతున్న సమయంలో అనూహ్యంగా భార్య ప్రియాంక వేపు వచ్చిన నిక్ జోనస్.. ఆమె వైపు బెండై అలా అలవోకగా ఒక కిస్ ఇచ్చారు. వీరి మధ్య ప్రణయబంధాన్ని చాటే ఈ ముద్దు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో ప్రియానిక్ జంట సందడి చేసింది. జోనస్ కుటుంబసభ్యులైన కెవిన్ జోనస్ భార్య డానియెల్ జోనస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్, ప్రియాంక అత్త డెనిస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన నిక్.. ‘మై వైఫ్ ఈజ్ హాట్’ అంటూ కామెంట్ పెట్టారు. View this post on Instagram The Jonai in Vegas. 😎 A post shared by Nick Jonas (@nickjonas) on May 1, 2019 at 6:21pm PDT View this post on Instagram 💎✨💎✨ A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on May 1, 2019 at 8:25pm PDT -
ప్రియాంక పడిపోయిందా..?
సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంక మెట్ల మీద నుంచి జారి పడబోయింది. అక్కడే ఉన్న తన భర్త ప్రియాంక పడిపోకుండా రెప్పపాటులో ఆమెని రక్షించాడు. ప్రియాంక మొదట కాస్త కంగారు పడినా తర్వాత ఒక్కసారిగా పగలబడి నవ్వింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అభిమానుల్ని కట్టిపడేసింది. ప్రియాంక, నిక్ జోనస్‌లు గత సంవత్సరం జోధ్‌పూర్‌లో డిసెంబర్ 1,2 తేదీలలో క్రైస్తవ, హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరుపుకున్నారు. పెళ్లికి ముందురోజు నిక్ తనకిచ్చిన సర్ప్రైజ్ని మర్చిపోలేనని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ ‘ ఆ రోజు నా గదిలో ముస్తాబవుతుండగా నిక్ వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లాడు. ఆ దారి పూలతో అందంగా అలంకరించి ఉంది. అక్కడ నా కోసం షూస్‌ని బహుమానంగా పెట్టి ఉంచాడు. దాంతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంద’ని చెప్పింది. అందులో ‘నువ్వు నా అదృష్టానివి. నువ్వు ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. నన్ను నీ భాగస్వామిగా ఎంపిక చేసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది’ అని రాసి ఉందని ప్రియాంక తన సంతోషాన్ని వెలిబుచ్చింది. పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందో రిసెప్షన్ వేడుకను అంతకన్నా ఘనంగా జరుపుకుంది ఈ కొత్తజంట. రిసెప్షన్‌ను 4 రోజులపాటు ఢిల్లీ, ముంబై, అమెరికా ఉత్తర కరొలినాలోని కార్లొట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. -
విడగొట్టారా?
ఇంగ్లీష్ అబ్బాయి.. ఈస్టిండియా అమ్మాయి... కాదే ప్రాంతము ప్రేమకు అనర్హము. ఇద్దరు మనసులూ కలిశాయి.. మనువాడాయి. ముడి పడి మూడు నెలలు కాలేదు. విడిపోవాలనుకుంటున్నారట. నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారరంటూ ‘నిక్యాంక’ అభిమానులకు షాక్ ఇచ్చింది హాలీవుడ్ మేగజీన్ ‘ఓకే’. వీళ్ల పెళ్లి ఇటీవలే వంద రోజులు దాటింది. ఈ జంట మరో వంద చూసే అవకాశం లేదన్నట్లుగా ఆ పత్రిక వార్తలు రాసింది. ఆత్మీయంగా ఉండే ఈ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని, నిక్, ప్రియాంక కటీఫ్ చెప్పుకున్నారని రాసుకొచ్చింది. ఇక.. నిక్యాంకల ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలంటే.. లాస్ ఏంజెల్స్‌లో లవ్ చేసుకున్న వీళ్లిద్దరి పెళ్లి వేడుకలకు ఉదయ్‌ఘడ్ ప్యాలెస్ వేదికయింది. రెండు పెళ్లిలు (ఇరు సంప్రదాయల ప్రకారం), నాలుగు రిసెప్షన్లతో ఇద్దరు ఒక్కటయ్యారు. వారంలో మిగతా ఐదు రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్నా.. వీకెండ్ వస్తే విడదీయలేనంతగా హాలీడేలు, అవుటింగ్‌లకు వెళ్తున్నారు. ఇద్దరి అన్యోన్యత చూసి వీళ్ల వివాహం సూపర్ హిట్ అనుకున్నారంతా. సినిమా 150 రోజులు ఆడకముందే విడిపోతున్నారని హాలీవుడ్ మీడియా టాక్. ‘‘పని, పార్టీ, ఖర్చు ఇలా ప్రతీ విషయంలో నిక్యాంకకు వాగ్వివాదాలు జరుగుతుంటాయట. పెళ్లికి ముందు వరకూ కూడా ప్రియాంక చాలా కూల్ అని, తేలికగా తీసుకునే మనిషి అనుకున్నారట నిక్. పెళ్లి తర్వాత తనలోని కంట్రోల్ చేసే తీరు, టెంపర్ చూశాడట. ఒకవేళ విడిపోతే మాత్రం ఇద్దరిమధ్య ఆర్థికపరమైన గొడవలు చాలా తలెత్తే అవకాశం ఉండదని కూడా సదరు పత్రిక పేర్కొంది’’ అని తెలిపింది. కానీ ఇదంతా ఉత్తుత్తి వార్తే అని, మియామీలో నిక్యాంక హాలీడే ఎంజాయ్ చేస్తున్నారని మరో వార్త. ఇదిలా ఉంటే తన మరిది ఫ్రాంక్లిన్ జోనస్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంగా శుక్రవారం ట్వీటర్ ద్వారా ప్రియాంక అభినందనలు తెలిపారు. మరి.. మనస్పర్థలు ఉంటే ప్రియాంక ట్వీట్ చేస్తారా? అన్నది కొందరి అభిప్రాయం. ఆ పత్రికే వీరిద్దరినీ విడగొట్టిందని కొందరు అంటుంటే, ఆటపట్టించడానికి ఆ వార్త రాసిందని కొందరు అంటున్నారు. ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే.. ప్రియాంక పెళ్లికి ముందే నిక్ తండ్రి కోర్టు కేసులో తలమునకలై ఉన్నారు. అప్పుల్లో ఉన్నట్లు కూడా సమాచారం. అవి తీర్చే క్రమంలో ప్రియాంక బ్యాంక్ అకౌంట్లోంచి కూడా కొంత డబ్బు తగ్గుతుందట. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి ప్రధాన కారణం అనే ప్రచారం జరుగుతోంది. మరి నిజమెంత? -
ప్రియాంకాపై కోపమా?
సల్మాన్ ఖాన్ ఇటీవల ‘భారత్’కు గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. మరి.. నెక్ట్స్ సినిమాకు సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుంటారా? అంటే లేదు. త్వరలో ‘దబాంగ్ 3’ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. ఇందులో హీరోయిన్గా ప్రియాంకా చోప్రాను తీసుకుకోవాలని భావించారట టీమ్. కానీ ‘భారత్’ సినిమాలో కథానాయికగా ప్రియాంక తప్పుకున్నారు. అందుకని ఆమెను హీరోయిన్గా తీసుకోవడానికి అభ్యంతరం తెలుపుతున్నారట సల్మాన్. పెళ్లి కారణంగా, హాలీవుడ్ సినిమాల వల్ల ‘భారత్’ నుంచి తప్పుకుంటున్నానని ప్రియాంక వివరణ ఇచ్చినప్పటికీ సల్మాన్‌కి కోపం తగ్గనట్లుంది. -
ఓషోస్
ఓసోస్.. అంత కథ ఉందా!?! ఓషో శిష్యురాలి మీద తీసేంత సినిమా కథ!ప్రతి మగాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఈ.. స్త్రీ వెనుక ఓషో ఉన్నాడు. అప్పుడది ఓషో కథ అవుతుంది కానీ.. ఆ స్త్రీ కథ అవుతుందా?అవుతుంది. ఆమె మామూలు స్త్రీ కాదు. అందం చందం, క్రైమ్ డివైన్ మిక్స్ అయిన స్త్రీ. పేరు షీలా. ఆమె పేరు మీదే ప్రియాంకా చోప్రా ఇప్పుడుబయోపిక్ తియ్యబోతున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్‌డేకి ఒక రోజు ముందు హాలీవుడ్ మూవీ ‘ఈజెంటిట్ రొమాంటిక్’ విడుదల అవుతోంది. సెటైరికల్ ఫ్యాంటసీ కామెడీ. నటాలీ అనే బొద్దుగా ఉండే ఒక ఆర్కిటెక్ట్.. న్యూయార్క్‌లో తన కెరీర్‌ని నిర్మించుకుంటూ ఉంటుంది. రొమాన్స్, కామెడీ ఉన్న సినిమాలంటే ఆమెకు పిచ్చి. వాటిని చూసి ఊహల్లోకి వెళ్లిపోతుంటుంది. అలాగని ప్రేమంటే ఆమెకు ఇష్టమేమీ ఉండదు. ఓ రోజు సబ్వేలో వెళుతుంటే ఓ దొంగను తప్పించుకోబోయి, ఓ గుంజకు కొట్టుకుని కింద పడి స్పృహ కోల్పోతుంది. తర్వాత కళ్లు తెరిచి చూసేసరికి వేరే ఏదో లోకంలో ఉంటుంది. అది ప్రేమలోకం! ఆ లోకంలో కూడా తను ప్రేమలో పడదు. అయితే తన ప్రేమలో పడే వ్యక్తి కోసం నటాలీ వెదుకుతుంటుంది. నటాలీ ప్రేమకథకు ఇవాళ్టి మన ‘ఫ్యామిలీ’ స్టోరీకి ఏ కొంచమో తప్ప ఏమాత్రం సంబంధం లేదు. ఆ ‘ఏ కొంచెమో’.. ప్రియాంకా చోప్రా! ‘ఈజెంటిట్ రొమాంటిక్’ చిత్రంలో ప్రియాంక చిన్న పాత్ర వేశారు. చిన్నదే కానీ, సినిమాకు కీలకమైనది. యోగా అంబాసిడర్ క్యారెక్టర్. ఇంచుమించు అదే పాత్రలో త్వరలోనే పూర్తి స్థాయి హీరోయిన్గా ఓ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక నటించబోతున్నారు. అందులో ప్రియాంక ఆధ్యాత్మిక ఆశ్రమవాసిగా కనిపిస్తారు. 76 ఏళ్ల ఆస్కార్ అవార్డు దర్శకుడు బ్యారీ లెవిన్సన్ ఆ చిత్రానికి డైరెక్టర్. నిర్మాత ప్రియాంకే. షూటింగ్ మొదలు కాలేదు. టైటిల్ ఖరారైంది. ‘మా ఆనంద్ షీలా’! ‘ఓషో’ భగవాన్ రజనీష్ భక్తురాలే ఆనంద్ షీలా. రజనీష్ ఆశ్రమంలో చేరాక ‘మా ఆనంద్ షీలా’ అయ్యారామె. షీలా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. ఈ 69 ఏళ్ల వయసులో ఆమె ఎలాంటి జీవితం గడుపుతున్నారో ఎవరికీ తెలియదు. (రెండు నర్సింగ్ హోమ్లైతే నడుపుతున్నారు). భక్తురాలు ఆధ్యాత్మిక జీవితమే కదా గడుపుతారు. కావచ్చు. అయితే నేరస్థురాలిగా ఆమె గడిపిన జీవితమే ఎక్కువ. ఆ పాపాలేమైనా ఆమెను వెంటాడుతూ ఉంటాయా?! చెప్పలేం. ప్రియాంక నిర్మించబోతున్న షీలా బయోపిక్‌లో షీలా ఆధ్యాత్మిక జీవితంతో పాటు, షీలా నేరగ్రస్థ జీవనం రెండూ మిళితమై ఉండబోతున్నాయి. భక్తిభావం, నేరస్వభావం రెండూ కలగలిసి ఉన్న స్త్రీ మూర్తి షీలాను రెండు సబ్జెక్టులుగా విడదీసి సినిమా తియ్యడం సాధ్యం కాదు కాబట్టి! రజనీష్ ధ్యానముద్రలతో ఆయనకు దగ్గరై, ఆయనకు మరింత దగ్గరవడానికి దారి తప్పి తనకు తెలియకుండానే నేర ప్రపంచంలోకి వెళ్లిపోయిన భక్తురాలు షీలా. అటెంప్ట్ టు మర్డర్, సెకండ్–డిగ్రీ అసాల్ట్, ఇల్లీగల్ వైర్–టాపింగ్, ఆర్సన్, ఇమిగ్రేషన్ ఫ్రాడ్.. ఇన్ని కేసులలో ఆమె దోషి. వీటన్నిటికన్నా పెద్ద నేరం మరొకటి ఉంది. మరొక నేరం కాదు. అగ్రరాజ్యాన్నే దిగ్భ్రాంతిపరచిన నేరం!భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్య. 1984లో ప్రపంచానికి పెద్ద వార్త. శ్రీమతి గాంధీ హత్య జరగకుండా ఉండి ఉంటే, అదే ఏడాది యు.ఎస్‌లో జరిగిన ఒక ఘటన ప్రపంచానికి పెద్ద వార్త అయి ఉండేది! ఆ ఏడాది ఒరెగాన్ రాష్ట్రంలోని డాలెస్ సిటీలో అకస్మాత్తుగా 750 మందికి పైగా మంచాన పడ్డారు. వాళ్లంతా లోకల్‌గా ఉన్న పది రెస్టారెంట్లలో సలాడ్ తిన్నవారే. అంతకన్నా ముఖ్యం.. వాళ్లంతా వాస్కో కౌంటీ ఎన్నికల్లో ఓటేయవలసిన వాళ్లు. అయితే ఆ ఈటింగ్‌కి, ఈ ఓటింగ్‌కి మధ్య లింకు ఉంటుందని ఎవరు ఊహిస్తారు?మెడికల్ రిపోర్ట్లు చూస్తే ఆ పది రెస్టారెంట్లలో సలాడ్స్ తిని జబ్బున పడిన ఆ ఏడొందల యాభై మందిలో ‘సాల్మొనెల్లా’ బ్యాక్టీరియా బయటపడింది! టైఫాయిడ్ వచ్చేది ఈ బ్యాక్టీరియా వల్లనే. తాగిన నీరు, తీసుకున్న ఆహారం కలుషితమైనదైతే సాల్మొనెల్లా ఒంట్లోకి ప్రవేశించి, మనిషిని కుంగదీస్తుంది. నూటనాలుగు డిగ్రీల జ్వరం వస్తుంది. చెమటలు పడతాయి. విరేచనాలు అవుతాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఒంటిపై గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయి. జ్వరం తగ్గనని మొరాయిస్తుంటుంది. లేవలేరు. కూర్చోలేరు. పడుకుని ఉండడమే. ఇంట్లో పడుకుని ఉన్నవాళ్ల దగ్గరికి బ్యాలెట్ బాక్సు రాదు కదా. అలా ఆ మొత్తం ఓట్లన్నీ పోలవకుండా అలా మంచంపైనే ఉండిపోయాయి! ఎవరికి లాభం? పోలీస్ ఎంక్వయిరీ మొదలైంది. మొదలైంది కానీ, వెంటనే మొదలు కాలేదు. మొదలు కావాలంటే మొదట అనుమానం రావాలి. డాలెస్ ప్రాంతంలో ఒకేసారి ఇన్ని ఓట్లు ఎందుకు పోల్ అవలేదని ఆరా తీస్తే ఈ టైఫాయిడ్ కేసులు బయటపడ్డాయి. టైఫాయిడ్ ఎందుకొచ్చిందని ఆరా తీస్తే రెస్టారెంట్లలో తిన్న ఫుడ్ బయటపడింది. రెస్టారెంట్లన్నిటిలో ఒకేసారి ఫుడ్ ఎలా కలుషితం అయిందని ఆరా దీస్తే ‘మా’ ఆనంద్ షీలా’ బయటపడింది. ఆమెను ఇంటరాగేట్ చేస్తే.. అసలు విషయం బయటపడింది! ‘మా’ ఆనంద్ షీలా.. భగవాన్ శ్రీ రజనీష్ రైట్ హ్యాండ్. ఒరెగాన్ స్టేట్ వాస్కో కౌంటీలో ‘రజనీష్పురం’ ఉంది. రజనీష్పురంలో రజనీష్ లేనప్పుడు ఆదేశాలన్నీ ‘మా’ ఆనంద్ షీలావే. అలా ఆమె ఇచ్చిన ఒక రహస్య ఆదేశంతోనే డాలెస్ రెస్టారెంట్లలోని ఆహార పదార్థాలలోకి ‘సాల్మొనెల్లా’ బ్యాక్టీరియా చేరింది!బ్యాక్టీరియా తనకై తను చేరితే కలుషితం. మనుషులు చేర్చితే.. బయోటెర్రర్ ఎటాక్. యు.ఎస్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా చరిత్రలోనే తొలి బయోటెర్రర్ ఎటాక్! తొలి మాత్రమే కాదు, చివరిది కూడా. మళ్లీ ఇంతవరకు అలాంటి ఎటాక్ అక్కడ జరగలేదు. వాస్కో కౌంటీ ఎన్నికల్లో రజనీష్ అనుచరులు కొందరు పోటీ చేస్తున్నారు. వారి గెలుపు అవకాశాలను పెంచడానికే ‘మా’ ఆనంద్ షీలా బయోటెర్రర్ ఎటాక్ చేయించారని విచారణలో బయటపడింది. ‘మా’ షీలాకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది. 39 నెలల శిక్షాకాలం తర్వాత మంచి ప్రవర్తనపై విడుదలైంది. స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. శ్రీమతి గాంధీ హత్య జరగకుండా ఉండి ఉంటే అమెరికా బయోటెర్రర్ దాడి ఘటన పెద్ద వార్తే అయి ఉండేదని అనుకోవడం ఎందుకంటే.. ప్రపంచానికి బయోటెర్రర్ దాడులు కొత్త కాకపోయినా, అమెరికాలో జరగడం కొత్తే. అమెరికాపై అలాంటి ప్రయోగం చెయ్యాలంటే గట్స్ ఉండాలి. అయితే ‘మా’ ఆనంద్ షీలా కు గట్స్ కంటే కూడా భగవాన్ రజనీష్ మీద ఆరాధనా భావమే ఎక్కువగా ఉంది. అందుకే ఆయన కోసం ఏమైనా చేయాలనుకుంది. చేసింది. భగవాన్ శ్రీ ‘ఓషో’ రజనీష్‌ది ఇండియా. మధ్యప్రదేశ్‌లో జన్మించారు. అతడికన్నా పద్దెనిమిదేళ్లు చిన్నదైన మా ఆనంద్ షీలాది కూడా ఇండియానే. పుట్టింది గుజరాత్లో. ఈ రెండు స్వదేశీ ఆత్మలు విదేశాల్లో ఏకమయ్యాయి. షీలా అసలు పేరు షీలా అంబాలాల్. రజనీష్ ఆశ్రమానికి వచ్చాక ‘మా’ ఆనంద్ షీలా అయింది. అతడికి ప్రియ శిష్యురాలైంది. ఈ ఆనంద్ ఎవరో తెలీదు. బహుశా షీలాలోని ఆనంద భావన అయుంటుంది. ప్రియాంక ఈమె జీవితకథను సినిమాగా తీయడానికి ఎందుకు ఎంచుకున్నారో వివరాలు వెల్లడి కాలేదు. ‘ఎలెన్ షో’ అతిథిగా వెళ్లినప్పుడు మా ఆనంద్ షీలాపై తను సినిమా తియ్యబోతున్నట్లు మాత్రమే చెప్పారు. బహుశా.. ఓషోలోని దివ్యతేజస్సు షీలాను ఆకర్షించిన విధంగానే.. ‘ఈజెంటిట్ రొమాంటిక్’ చిత్రంలోని యోగా అంబాసిడర్ పాత్ర ప్రియాంకను షీలాపై సినిమా తీసేలా ప్రేరేపించి ఉండొచ్చు. ‘ఓషో’ సన్నిధిలో షీలా 1981 నుంచి 1985 వరకు ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఆమె చాలా చురుగ్గా ఉన్నారు. వివిధ దేశాలలోని ప్రతినిధులతో ఓషో తరఫున చాలాసార్లు ఆమే సంప్రదింపులు, చర్చలు, సమావేశాలు జరిపేవారు. ఓషో మాటల్లోని ఆకర్షణ శక్తి.. షీలా చూపుల్లోని సమ్మోహన శక్తి ఆ నాలుగేళ్లూ ఈ భూగోళాన్ని ధ్యానముద్ర వేయించాయి. ఓషోపై 1974 నుంచి 2018 వరకు దాదాపు పది సినిమాలు వచ్చాయి. ఏడాది క్రితం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఓషో జీవితం ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ అనే పేరుతో ఆరు పార్టులుగా రిలీజ్ అయింది. వాటన్నిటికీ నేరేషన్ షీలానే. షీలాపై తొలిసారి వస్తున్న చిత్రం మాత్రం ప్రియాంక తియ్యబోతున్నదే. రజనీష్పురం షీలా తండ్రే షీలాను భగవాన్ రజనీష్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె ఓషోకు ప్రియ శిష్యురాలు అయ్యారు. పుణెలోని ‘ఓషో మెడిటేషన్ సెంటర్’కు, ఓరెగాన్‌లోని ‘రజనీష్పురం’ ఆశ్రమానికి మధ్య షీలా తరచు ప్రయాణిస్తూ ఓషో సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తుండేవారు. యు.ఎస్.లోని ఓరెగాన్ ప్రశాంతంగా ఉండే విశాలమైన ఎడారి ప్రదేశం. జనాభా తక్కువ. రజనీష్పురంలోని ఆశ్రమం ధ్యానానికి అపరిచితులు వచ్చిపోతుండటంపై.. లోపల అసాంఘిక, అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రజనీష్పురం ఉనికి కష్టం అయింది. షీలా రంగంలోకి దిగి, స్థానిక మండలిలో ఎన్నికల్లో ఓషో అనుచరులను పోటీకి నిలబెట్టారు. వాళ్లు గెలిస్తే కనుక ఫిర్యాదులు చేసేవారిని అడ్డుకోవచ్చని ఆమె ఆలోచన. ప్రత్యర్థులకు ఓట్లు పడకుండా ఉండడం కోసం ఆమె చివరికి బయోటెర్రర్ ఎటాక్‌కి కూడా తెగించారు. 1990లో రజనీష్ చనిపోయాక, అంతకుముందే షీలా స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. ఆ తర్వాతి నుంచి రజనీష్పురం తన వైభవాన్ని కోల్పోతూ వచ్చి ఆ స్థలం కూడా చేతులు మారిపోయింది. -
మా బావ వజ్రం
గతేడాది డిసెంబర్లో ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్‌ల వివాహం ఎంత సందడిగా జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ పెళ్లి సమయంలో ప్రియాంకా చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రాకు ‘జూతా చుపాయి’గా సందడిలో నిక్ 5 లక్షల రూపాయలను ఇచ్చినట్లు బాగా ప్రచారం జరిగింది. జూతా చుపాయీ అంటే.. పెళ్లి కొడుకు పాద రక్షలను మరదలు దాచేస్తుంది. అవి కావాలంటే బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అప్పుడు పెళ్లి కొడుకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. పరిణీతీకీ నిక్ 5 లక్షలు ఇచ్చారని బాలీవుడ్లో చెప్పుకున్నారు. ‘‘ఆయన ఎంత విలువైన బహుమతి ఇచ్చారో మీకు తెలీదు. నిక్ మమ్మల్ని షాక్‌కు గురి చేశారు’’ అని పెళ్లి వేడుకలప్పుడు పరిణీతి ట్వీట్ చేశారు. ఇటీవల ఈ విషయం గురించి ఓ టీవీ షోలో పెదవి విప్పారామె. ‘‘జూతా చుపాయి అప్పుడు మా బావ నిక్ ఓ ట్రేని తీసుకురమ్మని తన బంధువులకు సైగ చేశారు. అందులో ఉన్న డైమండ్ రింగ్స్‌ను మాకిచ్చారు. అంత విలువైన బహుమతిని ఊహించలేదు. దాంతో అంతా షాక్ అయ్యారు. నిక్ ఈజ్ బెస్ట్. మా అక్కకు మంచి భర్త దొరికాడు. మంచి వ్యక్తి’’ అని బావని పొగిడారు పరిణీతి. అంటే ‘మా బావ వజ్రం’ అని చెబుతున్నట్లే కదా. -
తారలపై విసుర్లు
సోషల్ మీడియాలో బాలీవుడ్ తారలపై బాడీ షేమింగ్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లేదో ఫొటో పోస్ట్ చేస్తారు. వీళ్లు దానిపై కామెంట్ చేస్తారు. దీపికా పదుకోన్ నలుపు రంగు సింగిల్ పీస్ డ్రెస్ ధరించి పోస్ట్ చేసిన ఫొటోలో చాలా బక్కగా ఉన్నారు. ‘ఎముకలున్నాయి, మరి స్కిన్ ఎక్కడ? అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ప్రియాంక చోప్రా తన పెదవుల్ని ముందుకు తెచ్చి తీసుకున్న సెల్ఫీపై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇంత బండ పెదవులేమిటని! దిషా పటానీ అయితే ‘బక్క’తనానికి పీక్ గ్రేడ్ అయిన ‘పీల’ స్థాయికి బాడీషేమింగ్‌కి గురయ్యారు. పరిణీతి చోప్రా బొద్దుగా ఉంటారు. తిండి తగ్గించమని ఆమెకు కొన్ని వేల ఉచిత సలహాలు లభించాయి. తనిష్ట చటర్జీ ఒంటి రంగు మీద ఓ కామెడీ షోలో షేమింగ్ జరిగింది. నవ్వుతూ నవ్వుతూనే తనది ‘రోస్టెడ్ స్కిన్’ అన్నందుకు తనిష్ట చాలా బాధపడ్డారు. అనేరి వజానీ టీవీ నటి. ఆమె తన బక్కపలుచని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టీపెట్టగానే∙బాడీ షేమింగ్ మొదలైంది. ‘చీపురు పుల్ల’ అంటూ. ఇలియానాను కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ చేశారట. నడుము కింది భాగం ఎక్కువగా ఉంటుందని. ఇవన్నీ ఇలా ఉంచితే సాటి నటే తన సహనటిని షేమ్ చేసిన ఉదంతం కూడా ఉంది. ‘ఆ మనిషికి హెడ్‌లైట్ ఎక్కడుంటుందో, బంపర్ ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం. కాలేజీ పిల్లలు నయం. తీరుగా కనిపిస్తారు’ అని భైరవి గోస్వామి.. కీర్తీ సనన్‌పై ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తప్పు కదా. ఎప్పటికి ఎదుగుతాం?! -
ప్రియానిక్ ముచ్చటగా మూడో రిసెప్షన్
-
ముంబయిలో ప్రియాంక చోప్రా, నిక్ వివాహ విందు
-
ప్రియానిక్ రిసెప్షన్‌కు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అదేరీతిలో మంగళవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో రిసెప్షన్న్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. మోదీ, ప్రియానిక్లతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, వారికి విషెస్ చెప్పారు. (పైళ్లైపోయిందోచ్..!) రిసెప్షన్లో ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. మోదీ రాకతో ప్రియానిక్లతో పాటు వారి కుటుంబసభ్యులు తెగ సంబరపడిపోయారు. గతంలో కూడా విరాట్ కోహ్లి-అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా మోదీ హజరైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు జరిగిన సంగీత్, మెహందీ వేడుకలతో పాటు పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. (కన్నీటి పర్యంతమైన ప్రియాంక!) థ్యాంక్స్ చెప్పిన ప్రియాంక ఎన్నికల బిజీలోనూ తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియాంక చోప్రా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మా రిసెప్షన్‌కు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. మీ దీవెనలు, మీరు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’అంటూ ప్రియాంక పేర్కొన్నారు. (సరదాల సంగీత్) View this post on Instagram Congratulations @priyankachopra and @nickjonas. Wishing you a happy married life. A post shared by Narendra Modi (@narendramodi) on Dec 5, 2018 at 1:15am PST View this post on Instagram A heartfelt thank you to our Hon'ble Prime Minister Shri @narendramodi ji for gracing us with your presence. Touched by your kind words and blessings. @nickjonas A post shared by Priyanka Chopra (@priyankachopra) on Dec 5, 2018 at 1:42am PST -
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌ల రిసెప్షన్ ఫోటోలు
-
ప్రియానిక్‌ల పెళ్లి వేడుక
-
ప్రిన్స్ భార్య రానట్లే!
పెళ్లి తేదీ దగ్గర పడటంతో పెళ్లి పనులు ముమ్మరం చేశారు ‘ప్రియానిక్’ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్). డిసెంబర్ 3న జో«థ్పూర్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. నవంబర్ 28న సంగీత్‌తో వీరి షాదీ సంబరాలు మొదలవుతాయట. ఈ సంగీత్ కార్యక్రమంలో నిక్ పాటలతో అలరించనున్నారట. అలాగే ఈ ఇద్దరూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‌కు కాలు కదపనున్నారట. దీనికోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ హెగ్డేను ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం ప్రియాంక తన కొత్త చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నవంబర్ 26 వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటారు. పెళ్లికి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రియాంక ప్రియ మిత్రురాలు, హాలీవుడ్ నటి, ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిని మేఘన్ మార్కెల్ మాత్రం ఈ వేడుకకు రాలేరని సమాచారం. ఆమె వివాహ వేడుకకు ప్రియాంక హాజరయ్యారు. మరి.. మేఘన్ ఎందుకు రారంటే.. ఆమె గర్భవతి అని సమాచారం. మాకేం కావాలంటే.. సాధారణంగా పెళ్లికి ఏం బహుమతులు తీసుకువెళ్లాలో అని తర్జన భర్జన పడుతుంటారు బంధువులు, సన్నిహితులు. కానీ తన పెళ్లికి హాజరయ్యేవాళ్లకు అలాంటి ఇబ్బందేం పెట్టదలచుకోలేదు ప్రియాంక. తమకేం కావాలో చిట్టీ రాసి మరీ వివరంగా చెప్పారు. దీన్నే ‘బ్రైడల్ రిజస్ట్రీ’ అంటారు. ఈ పద్ధతి విదేశాల్లో చాలా కామన్. అంటే తమకు ఏం కావాలో వాటన్నింటినీ లిస్ట్ రాసి పెళ్లికి బహుమతులు తీసుకురావాలనుకున్న వాళ్ల శిరోభారం తగ్గిస్తుంటారు వధూవరులు. టీవీ, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి మాత్రమే కాకుండా తన పెంపుడు కుక్క డయానా కోసం పింక్ కలర్ రెయిన్ కోట్, జీపీయస్ ట్రాకర్, పెట్ బెడ్ కూడా లిస్ట్‌లో ఉంచారు ప్రియాంక. దీనిని అమేజాన్ షాపింగ్ సైట్లో ఉంచారు. ఈ బ్రైడల్ రిజస్ట్రీలో సేవాభావం కూడా ఉంది. ఈ వెడ్డింగ్ రిజిస్ట్రీ ద్వారా యూనిసెఫ్ సంస్థకు లక్ష డాలర్లు విరాళంగా ఇవ్వనున్నారు అమేజాన్ వాళ్లు. -
ప్రియాంక మెడలో పది కోట్లు!
పెళ్లి పనులతో బిజీబిజీగా ఉన్నారు కాబోయే వధూవరులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. ఇంకా పెళ్లి తేదీ అధికారికంగా ఫిక్స్ కాలేదు కానీ పెళ్లిసందడి మాత్రం మొదలైపోయింది. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రా బ్రైడల్ షోవర్ ఫంక్షన్లో హ్యాపీహ్యాపీగా చిందేశారు. ఈ ఫంక్షన్ కోసం ఆమె దాదాపు 10 కోట్ల విలువైన జ్యుయలరీని అలంకరించుకున్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రాకు కాబోయే భర్త నిక్ జోనస్ ఓ ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘రూల్స్ అన్నీ బ్రేక్ చేశాం. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఓ మధురమైన జ్ఞాపకంగా నా బ్రైడల్ షోవర్ జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సంగతి ఇలా ఉంచితే...ఈ ఫంక్షన్లో సోనాలి బింద్రే, నీతూ కపూర్ కూడా మెరిశారు. క్యాన్సర్ చికిత్సకోసం సోనాలి, భర్త రిషి కపూర్ హెల్త్ చెకప్ కోసం నీతూ కపూర్ న్యూయార్క్‌లో ఉన్నారు. ప్రియాంకా, నిక్ జోనస్‌ల వివాహం డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో జరగనుందని టాక్. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనాలి బోస్ దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా ‘ది స్కై ఈజ్పింక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. జైరా వసీమ్, ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
అనాథ చిన్నారులతో చిందేసిన హిరోయిన్
-
ప్రియాంక ఎంగేజ్మెంట్ ఫోటోస్
-
ప్రియాంక, నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్
-
ప్రియాంకకు ట్యాగ్.. అభాసుపాలైన కాంగ్రెస్..
సాక్షి, హైదరాబాద్ : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. భూ పరీక్షల ల్యాబ్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్దాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్‌ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ఆ ట్వీట్ చేసింది. యూపీఏ హాయాంలో 1141 భూ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు చెబుతూ ప్రియాంక చతుర్వేదిని ట్యాగ్ చేయబోయి, ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. దాంతో ట్విట్టర్లో కాంగ్రెస్‌పై జోకులు పేలాయి. వాటితో నాలుక్కరచుకున్న పార్టీ సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఐదేళ్ల కిందట ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్లో ఆ పార్టీ క్షమాపణలను కూడా కోరింది. -
ఆ నటికి కళ్లుచెదిరే రెమ్యూనరేషన్
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ సైతం చుక్కలను తాకుతోంది. బాలీవుడ్ సూపర్స్టార్లకు దీటుగా ఆమె పారితోషికం వసూలు చేస్తోంది. అమెరికన్ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్టార్‌గా మారిన ప్రియాంకకు తాజాగా సల్మాన్ సరసన భారత్ మూవీలో నటించేందుకు చిత్ర నిర్మాతలు ఏకంగా 6.5 కోట్లు ముట్టచెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారత్‌ను సుల్తాన్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ తెరకెక్కిస్తున్నారు. సల్మాన్, ప్రియాంకతో పాటు మూవీలో దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కు సందడి చేయనున్న ఈ సినిమాను సల్మాన్ బావ మరిది అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు. ఇక అమెరికన్ సింగర్, బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రియాంక త్వరలోనే వివాహంతో ఒక్కటి కావాలని వీరు నిర్ణయించుకున్నట్టు సమాచారం. -
పరువు తీసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్
నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా క్వాంటికో ఎపిసోడ్లో హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, అది కాస్త వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె చేసిన వ్యవహారం తాలూకూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అవార్డుల వేడుకకు హాజరైన ప్రియాంక అక్కడి వ్యాఖ్యాతతో మాట్లాడుతూ... ‘భారతీయ సినిమాలు అంటే ఏం ఉండదు.. కేవలం నడుము(హిప్) మరియు పై భాగం(బూ*) ఆడించటమే. అక్కడి చిత్రాల్లో అలా స్టెప్పులేస్తే సరిపోతుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సరదాగా మూమెంట్స్ చేసి మరీ చూపించారు. తన క్రేజ్‌ను పెంచుకోడానికి దిగజారి భారతీయ చలన చిత్రపరిశ్రమ పరువు తీయాలా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు. పాత వీడియోనే... అయితే తర్వాత అది 2016 ఎమ్మీ అవార్డు వేడుకల తాలూకూ వీడియో అన్నది తేలింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వైఖరిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఆ వీడియోను బయటకు దులిపిన కొందరు దానిని వైరల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత.. అదే స్థాయిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.. టూరిజం క్యాలెండర్ కోసం చేసిన ఓ ఫోటో షూట్లో హాట్ హాట్‌గా ఫోజులివ్వగా, ఆ అంశం అసెంబ్లీని కుదిపేసింది కూడా. (నటి హాట్ ఫోటో.. అసెంబ్లీలో దుమారం) According to @priyankachopra - Bollywood in a Nutshell pic.twitter.com/nykaU9ZFnl — Rishi Bagree 🇮🇳 (@rishibagree) 9 June 2018 Indian movie is all about Hips and Boobs. According to mentality retired @priyankachopra. pic.twitter.com/fpzYD8IEQU — Hardik Bhatt 🧘♂️ (@iHardikB) 9 June 2018 I have just unfollowed @priyankachopra on Twitter and decided not to watch any of her movies/shows from now on. I request everyone to do the same. #BoycottPriyanka — Shusmita Rani 🇮🇳 (@ShusmitaRani) 9 June 2018 Humari billi hume hi meow .#Shame #PriyankaChopra #Quantico #quantico3 pic.twitter.com/vY8cgwqJM1 — Hunट₹₹♂ (@nickhunterr) 9 June 2018 Unexpected from Priyanka Chopra tbh describing our movies in that way is so so wrong ffs Indian movies are known for family drama & music & dance.. since when it is about boobs hips @priyankachopra which planet you live in? Cool banne ki ghatya koshish saali chutyaah. https://t.co/fRFiykPuPu — Zahra ♛ (@BreadAurJam) 9 June 2018 Disgusting of Priyanka Chopra to demean Bollywood. Bollywood makes worldclass movies. Even the recent ones like Dangal, Padman are fantastic. Looks like she has acted mostly in such low grade movies. https://t.co/qNzj5LrsUC — Arun Rao (@bigsanturi) 9 June 2018 Ha :@priyankachopra ne Bollywood me bahut boob's and hips hilayenge honge #castingcouch ke samne tabhi movies mili hogi😠😠😠😠 Insulting indian culture is her fashion now a days.. — Ticks (@ticks1301) 9 June 2018 Awesome! What else to expect from a wannabe firangan. So movie like Barfi where u were praised for your performance is also about that, right @priyankachopra ? Want to see how far ur arrogance with that irritating fake accent & plastic beauty will take u.Continue selling ur soul. https://t.co/9CWRMNZFRk — 🇮🇳 Shweta Singh (@swetassingh1) 9 June 2018 -
ఊహించని వివాదం
హాలీవుడ్ చిత్రాలు, టీవీ సీరియళ్ల కోసం గత రెండున్నరేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆఖరి నిముషంలో అప్రతిష్టను మూటగట్టుకుని భారత్‌కు బయల్దేరి వస్తున్నారు! అమెరికన్ టెలివిజన్ డ్రామా థ్రిల్లర్ ‘క్వాంటికో’లో సి.ఐ.ఎ ఏజెంటుగా నటిస్తున్న ప్రియాంకను ఆ సీరీస్ తాజా ఎపిసోడ్ ‘ది బ్లడ్ ఆఫ్ రోమియో’లోని ఒక సన్నివేశం ఆమె ఊహించని విధంగా ‘దేశద్రోహి’గా నిలబెట్టింది! న్యూయార్క్‌పై అణ్వాయుధ దాడి చేయబోతున్న ఒక పాకిస్తానీ.. ప్రియాంకకు పట్టుబడినప్పుడు ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది! దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. అయితే ఈ సన్నివేశంలో నటించడం ద్వారా ప్రియాంక.. భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని, భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. ‘‘భారతీయుల అభిమానం వల్ల స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా..?’’ అని ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఆన్లైన్లో ఈ నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న ఎ.బి.సి.కి (అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ) తాకడంతో డిస్నీ నెట్వర్క్ సంస్థ అయిన ఎ.బి.సి. వెంటనే భారతీయులను క్షమాపణ కోరుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధానంగా ప్రియాంక నిర్దోషి అని చెప్పడానికే ఎ.బి.సి. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘ఆ సన్నివేశానికి మనసు నొచ్చుకున్న మా వీక్షకులకు మా స్టూడియోతో పాటు, ‘క్వాంటికో’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్లూ క్షమాపణ కోరుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలన్న ఆలోచన ప్రియాంకది కాదు. స్క్రిప్టు, డైరెక్షన్ కూడా ఆమెవి కావు. స్టోరీ లైన్లో కానీ, క్యాస్టింగ్‌లో కానీ ఆమె ప్రమేయం లేదు. పూర్తిగా కల్పితం అయిన ఈ సీరీస్‌లోని సన్నివేశంలో అనుకోకుండా ఇలా కొందరి మనసులు గాయపడ్డాయి’’ అని ఎ.బి.సి. క్షమాపణతో పాటు, వివరణ కూడా ఇచ్చింది. లో రేటింగ్స్ రావడంతో ఇటీవల కొంతకాలం ‘క్వాంటికో’ ఆగి, మొదలైంది. త్వరలో ముగియబోతోంది కూడా. దాంతో జూౖలñ లో షూటింగ్ మొదలు కాబోతున్న ‘భరత్’ చిత్రం (సల్మాన్‌ఖాన్ హీరో)లో హీరోయిన్గా నటించడానికి ప్రియాంక ఇండియా బయల్దేరబోతుండగా ఈ వివాదం చుట్టుకుంది. -
దేశాన్ని అవమానించే సీరియల్లో నటిస్తావా..!
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 వ తేదీన ప్రసారం అయిన ఏపిసోడ్లోని దృశ్యాలపై పలువురు ఇండియన్ నెటిజన్లు మండిపడుతున్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ పేలుళ్లకు యత్నించింది భారతీయులే అనే విధంగా ఆ సీరియల్లో చూపెట్టడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టకు చెడ్డ పేరు తీసుకొచ్చే సీరియల్లో నటిస్తావా అంటూ ప్రియాంకపై సోషల్ మీడియాలో విమర్శలు కురిస్తున్నారు. అసలు ఏం చూపెట్టారు : ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారని’ ట్విటర్లో నెటిజన్లు పోస్ట్ చేశారు. ఇలాంటి సీరియల్లో ప్రియాంక ఎలా నటిస్తుందని పలువురు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రియాంకపై, క్వాంటికో యూనిట్‌పై ట్విటర్ వేదికగా దాడికి దిగారు. క్వాంటికో మొదటి సీజన్ విజయవంతమైనప్పటికి, రెండో సీజన్లో ఈ సీరియల్‌కు రేటింగ్‌లు దారుణంగా పడిపోవడంతో మూడో సీజనే చివరిదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. -
నీరవ్ మోదీ స్ఫూఫ్ యాడ్ చూశారా?
-
నటి హాట్ ఫోటో.. అసెంబ్లీలో దుమారం
గువాహటి : నటి ప్రియాంక చోప్రా హాట్ ఫోటో అస్సాం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టూరిజం క్యాలెండర్ కోసం చేసిన ఫోటో షూట్లో ఆమె హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. క్లీవేజ్ షోతో ఉన్న ఆమె ఫోటోలు రాష్ట్రం మొత్తం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. ‘అది(ఆమె ధరించిన గౌన్) అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా?. నటీమణులు పద్ధతైన దుస్తుల్లో కనిపించాలే తప్ప.. ఇలా అర్ధనగ్న ప్రదర్శనలకు దిగటం ఏంటి? అంటూ విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేలు నందితా దాస్, రుప్జ్యోతి కుర్మిలు అసెంబ్లీలో చర్చ లేవనెత్తి వెంటనే ప్రియాంకను అంబాసిడర్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీనిపై అస్సాం పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా వివరణ ఇస్తూ ప్రియాంకను వెనకేసుకొచ్చారు. ‘కాంగ్రెస్ చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోంది. అసలు ఆ ఫోటోల్లో అసభ్యత ఎక్కుడుందో తెలీటం లేదు. ఏదైనా సంప్రదాయక వేడుకలు జరిగినప్పుడు ధోవతి, చీరలు అంటూ అంతే పద్ధతితో కనిపించాలి. కానీ, ఇది పర్యాటక శాఖకు సంబంధించిన అంశం. విదేశీయులు కూడా వస్తుంటారు. అలాంటి వారికి ఆహ్వానం ఆకర్షణీయంగా ఉండాలి. చీరల్లో పిలిస్తే ఎవరూ రారు. అయినా అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుంది’ అంటూ తెలిపారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, గతంలో బెర్లిన్ నగరంలో ప్రియాంక.. ప్రధాని మోదీని కలిసిన సమయంలో అసభ్యకరమైన దుస్తులు, కాలి మీద కాలేసుకుని కూర్చోని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమెపై విమర్శలు వినిపించాయి. విమర్శలకు దారి తీసిన ఫోటో ఇదే -
నీరవ్ మోదీపై నటి దావా.. అంతా ఉత్తదే!
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ బ్యాంక్‌ను నిలువునా ముంచిన నీరవ్ మోదీపై దావా వేసినట్లు వస్తున్న వార్తలపై నటి ప్రియాంక చోప్రా స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నీరవ్‌కు చెందిన డైమండ్ కంపెనీపై దావా వేసిన వార్త అవాస్తవం’ అని అందులో ఆమె పేర్కొన్నారు. అయితే భారీ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీతో ఆమె చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో మాత్రమే ఉన్నారని.. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాను ఆమె తీసుకుంటున్నారని ప్రియాంక వ్యక్తిగత కార్యదర్శి శుక్రవారం మీడియాకు తెలియజేశారు. గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన నగల కంపెనీ ప్రకటనలో నటించింది. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీపై దావా వేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. -
ఇలా కనిపించి అలా మాయం!
ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌ని హాలీవుడ్ ప్రముఖులతో పాటు మన ప్రియాంకా చోప్రా కూడా ప్రకటించాల్సి ఉండగా అది జరగలేదు. నటుడు–దర్శకుడు ఆండీ సెర్కిస్, నటి టిఫ్ఫనీ హ్యాడిష్ నామినేషన్స్ ప్రకటించారు. ప్రియాంకా చోప్రా ఒక వీడియో ద్వారా ఉత్తమ సినిమాటోగఫ్రీ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న వారి గురించి పేర్కొన్నారు. అంతే.. అదే వీడియోలో సల్మా హయక్, మిచెల్లీ రోట్రిగ్యూజ్, రెబెల్ విల్సన్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. కాగా, ప్రియాంకా చోప్రా సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో బిజీగా ఉన్నారు. ‘బేవాచ్’ తర్వాత ఆమె హాలీవుడ్లో మరో చిత్రం చేస్తున్నారు. ‘ఎ కిడ్ లైక్ జేక్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే ఆమె అక్కడికి వెళ్లారు. ఈ ఫెస్టివల్ యూఎస్‌లో జరుగుతోంది. నామినేషన్స్ ప్రకటించింది కూడా యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లోనే. కాకపోతే సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నది న్యూయార్క్‌లో. అక్కణ్కుంచి లాస్ ఏంజిల్స్‌కి ఫ్లైట్‌లో వెళ్లినా కనీసం ఐదు గంటలు పడుతుందట. ఆ టైమ్ కేటాయించలేక నామినేషన్ అనౌన్స్మెంట్కి ప్రియాంక వెళ్లలేకపోయారని తెలుస్తోంది. అందుకే, వీడియోను విడుదల చేశారని సమాచారం. ఆ వీడియోలో ఇలా కనిపించి అలా మాయమయ్యారు ప్రియాంక. -
క్యాష్ చోప్రా
ప్రియాంకా చోప్రా ఈ ఏడాది సంపాదన 68 కోట్ల రూపాయలు! సిగ్గుండాలి.. ఆడపిల్ల పర్సులో ఎంతుందో తీసి చూడ్డానికి. అబ్బెబ్బే అపార్థం చేసుకున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క ఆడ కూతురు ప్రియాంక. ‘ఏ లెక్కన?’ అని చూస్తే, ఇదిగో ఈ లెక్కన అని చూపించింది ఫోర్బ్స్. అవార్డుల ఫంక్షన్లో ఐదు నిమిషాలు కనిపించడానికి ప్రియాంకా చోప్రా 5 కోట్లు డిమాండ్ చేసింది! మళ్లీ.. సిగ్గుండాలి. ఆడపిల్ల అంత గట్టి అమౌంట్ అడిగిందంటే.. బాయ్స్‌గా మనం ఎంత గర్వపడాలి? అది మానేసి, ‘అమ్మో! అంతా!’ అనడం ఏమిటి? విషయం ఏంటంటే.. ఫోర్బ్స్ లెక్క నిజం. ఫైవ్ మినిట్స్‌కి ఫైవ్ క్రోర్స్ అన్నది అబద్ధం. ‘ఫైవ్ కి ఫైవ్ అట కదా’ అని ముంబైలో మొన్న విరాట్, అనుష్కల రిసెప్షన్లో ఎవరో అడిగితే ప్రియాంక పెద్దగా నవ్వేసింది. ‘వినడానికి నాక్కూడా బాగుంది’ అంది. ‘అయితే నిజం కాదా.. పోనీ అంత కాకపోయినా, ఈ మధ్య మీరు మగవాళ్లకు దీటుగా çసంపాదిస్తున్నారట కదా, ఎంత వెనకేసి ఉంటారేంటి?’ అని ఇంకో క్వొశ్చన్. అందుక్కూడా నవ్వే సమాధానం. ‘సంపాదన కోసం ఎప్పుడూ నేను చూడలేదు. సంతోషాన్నే చూసుకున్నాను. నేను ఏం చేసినా అది నా సంతోషం కోసమే. సంతోషంతో పాటు డబ్బూ వస్తుంటే.. అదీ సంతోషమే కదా’.. అని çఫక్కున మళ్లీ ఒక నవ్వు. మొత్తానికి ఒక గట్టి అమ్మాయి మన మగధీర సెలబ్రిటీలకు ఇన్నాళ్లకు పోటీ ఇస్తోంది. -
క్షమాపణ కోరిన ప్రియాంక.. ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: 'నన్ను క్షమించండి..' అంటూ ఉత్తరప్రదేశ్, బరేలీ ప్రజలను కోరారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. అదేంటి.. బరేలీ వాసులకు నటి క్షమాపణ ఎందుకు చెప్పారనేగా మీ సందేహం. ఆ వివరాలిలా.. బరేలీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకను విశిష్ట అతిథిగా ఆహ్వానించగా, కచ్చితంగా హాజరవుతానని ఆమె మాటిచ్చారు. నటి రానుందని బరేలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అలంకరించారు. ఆమెను చూడాలని వర్సిటీ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు ప్రియాంక కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే ప్రియాంక ఈవెంట్‌కు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఢిల్లీలో దట్టమైన పొగ, పొగమంచు కారణంగా తాను ఈవెంట్‌కు హాజరు కాలేకపోయానని, సోషల్ మీడియా ద్వారా క్షమాపణ కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ కాలేదని వాతావరణం అనుకూలించలేదన్న ప్రియాంక.. బరేలీ వర్సిటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు. -
బై బై బాలీవుడ్.. హాయ్ హాయ్ హాలీవుడ్
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ‘క్వాంటికో’ టీవీ షోలో హాట్ హాట్‌గా కనిపించి, హాలీవుడ్లో సెటిలైపోయిన ప్రియాంక, పూర్తిగా అక్కడికే మకాం మార్చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ‘బేవాచ్’ అనే సినిమాలో నటించారామె! ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ప్రియాంకకు మాత్రం బాగానే పేరొచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇక ‘ఎ కిడ్ లైక్ జేక్’ పేరుతో ఆమె నటించిన ఓ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘బేవాచ్’లాగా ఇది పాపులర్ జానర్ సినిమా కాకపోయినా, ఈ సినిమాకూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ఆ క్రేజ్‌కు తోడు జనవరిలో యూఎస్‌లో జరగనున్న సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ కిడ్ లైక్ జేక్’ ప్రదర్శితం కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 29 దేశాల నుంచి ఎంపిక చేసిన సినిమాలతో సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 18 నుంచి 28 వరకు పదిరోజుల పాటు జరగనుంది. అక్కడ ప్రీమియర్ ముగిశాకే ‘ఎ కిడ్ లైక్ జేక్’ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. రెండో సినిమాకే ప్రియాంక హాలీవుడ్లో తన బ్రాండ్‌ను సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే మరో రెండు, మూడు సినిమాలు చేసి ప్రియాంక అక్కడికి షిఫ్ట్ అయిపోతారనే టాకే ఎక్కువ వినిపిస్తోంది! -
అప్పుడు దీపికా.. ఇప్పుడు ప్రియాంక..!
ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గుర్తింపు పొందారు. లండన్‌లోని ఈస్ట్రన్ ఐ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఏసియన్ వుమెన్ పేరుతో ఆన్లైన్ పోల్‌ను నిర్వహిస్తోంది. అంతేకాక ఈ పోల్‌లో ఐదుసార్లు మొదటిస్థానంలో నిలిచి ప్రియాంక చోప్రా రికార్డు సృష్టించారు. ప్రియాంకకి సోషల్ మీడియాలో అత్యంత ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇస్టాగ్రామ్‌లో 20 మిలియన్ల పైన ఫాలోయర్స్ ఉన్నారు. ఈ వారపత్రిక 2016లో నిర్వహించిన పోల్‌లో దీపికా పడుకొణె అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె ఈ సంవత్సరం మూడోస్థానంలో నిలిచారు. దీనిపై ప్రియాంక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ‘ ఇది నా ఘనత కాదు. ఆన్లైన్లో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి.. నా జెనిటిక్స్ వారసత్వానికే ఈ గౌరవం దక్కుతుందని’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఇండియా బుల్లితెర నటి నియా శర్మ రెండో స్థానంలో నిలిచారు. టాప్-10 లో నిలిచిన బామలు: 1. ప్రియాంక చోప్పా(ఇండియా) 2. నియా శర్మ 3. దీపికా పడుకొణె 4. ఆలియా భట్ 5. మాహిర్ ఖాన్(పాకిస్తాన్) 6.ద్రష్టి దమనీ 7. కత్రినాకైఫ్ 8.శ్రద్ధాకపూర్ 9. గౌహర్ ఖాన్ 10. రుబినా డిలాక్లు నిలిచారు. అత్యంత వయసు ఉన్న అతిలోక సుందరి శ్రీదేవి(54) ఈ జాబితాలో 45వ స్థానంలో నిలవ్వడం గమనార్హం. -
ప్రియాంక చోప్రా మొబైల్ చూస్తే.. షాకింగే!
పరిచయం అక్కర్లేని పేరు... ప్రియాంక చోప్ర. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ హాట్ స్టార్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తిరుగులేని ఐడెంటిటీ ప్రియాంక సొంతం. హాలీవుడ్లో నటించిన క్వాంటికో సీరియల్లో అమెరికన్ల మనసును కొల్లగొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకు.. ఫోన్‌కు మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ఎన్ని వస్తుంటాయనే దానిపై చాలామందికి సందేహాలు ఉండడం సహజం. అదే సమయంలో ఎన్నింటికి ప్రియాంక రిప్లై ఇస్తుందనేది కూడా ఆసక్తికరం. ప్రియాంకు సంబంధించిన ఈ ఆసక్తిర విషయంపై ఆమె సహచర నటుడు అలన్ పావెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతంఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా ఫోన్ ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో.. అక్షరాలా 2 లక్షల 57 వేల 623 చదవని మెయిల్స్ ఉన్నాయి. ఈ సంఖ్య చుట్టూ రెడ్‌మార్క్ వేసి మరీ అలెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Guys ... guys ... don't ever email @priyankachopra ... she apparently NEVER reads it! This is is the record ... I defy anyone to beat it. #unbelievable #ithoughtiwasbad #commaplacementconfusesme A post shared by Alan Powell (@alanpowell10) on Dec 5, 2017 at 4:17pm PST -
సన్నీ తర్వాతే..
ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పడుకోన్.. వంటి స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కు నెట్టేసి టాప్ ప్లేస్‌లో నిలిచారు హాట్ బ్యూటీ సన్నీ లియోన్. యాహూ సెర్చింగ్‌లో ఎక్కువమంది వెతికిన సెలబ్రిటీల జాబితాలో సన్నీ లియోన్ తొలి స్థానం పొందారు. యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ–2017 జాబితాలో సన్నీ మొదటి స్థానం దక్కించుకోగా ప్రియాంకా చోప్రా రెండో స్థానంలో నిలిచారు. మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కత్రినాకైఫ్, దీపికా పడుకోన్, కరీనా కపూర్, మమతా కులకర్ణి నిలిచారు. నటుల్లో దివంగత వినోద్ ఖన్నా టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. కమెడియన్, యాంకర్ కపిల్ శర్మ రెండో స్థానంలో నిలవగా, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
సిక్కులను చంపించింది.. ఫోటో దిగుతారా?
సాక్షి, సినిమా : ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదాస్పదంగా మారింది. తన కటుంబ సభ్యులు ఇందిరతో దిగిన ఓ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతే కొందరు అసభ్యపదజాలంతో ప్రియాంకను తిడుతూ కామెంట్లు పెట్టారు. అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం ఫోటో అంటూ షేర్ చేయగా.. ఫోటోలో ప్రియాంక తల్లి, పిన్ని, తాత ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వచ్చాయి. అయితే ఆ కామెంట్లలో చాలా మట్టుకు బండ బూతులు ఉండటం విశేషం. ఇందిరా గాంధీ సిక్కులను ఊచకోత కోయించిందని.. అలాంటి వ్యక్తితో ఫోటో దిగటానికి మీ కుటుంబానికి సిగ్గు లేదా? అని కొందరు.. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మీరూ ఇలా నేతల ఫోటోలు షేర్ చెయ్యకండని కొందరు కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లను ప్రియాంక పట్టించుకోలేదు. ఇక వివాదాలు ప్రియాంకకు కొత్తేం కాదు. గతంలో మోదీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవటం, జాతీయ జెండాను చున్నీలా చుట్టుకోవటం, అస్సాంపై అనుచిత వ్యాఖ్యలు... తదితర వివాదాల్లో ఆమె చిక్కుకున్న విషయం తెలిసిందే. An amazing old photo my masi(aunt) @neelaakhouri sent over with her,my mother @madhumalati ,my late grand parents Madhu Jyotsna and Manhar krishna Akhouri with the late former PM of India Indira Gandhi. #just #Roots #history #family ❤️🙏🏼 A post shared by Priyanka Chopra (@priyankachopra) on Oct 30, 2017 at 6:55pm PDT -
ఉగ్రదాడి నుంచి బయటపడ్డ హీరోయిన్
న్యూయార్క్ : ఉగ్రదాడి నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి ప్రియాంక ఇంటికి మధ్య దూరం కేవలం ఐదు బ్లాకులేనట. ఇదే విషయాన్ని ప్రియాంక ట్విటర్ వెల్లడించింది. ‘‘హాలీవుడ్ టీవీ సీరియల్ క్వాంటికో -3 సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నా.. ఇంటి దగ్గర అంతా కోలాహలం, సైరన్ల మోత, ఎటు చూసినా పోలీసులు.. నాకు అప్పడే తెలిసింది కొన్ని క్షణాల కిందట ఇక్కడ ట్రక్కు దాడి జరిగిందని’’ అని ఆమె ట్విటర్లో తెలిపారు. ట్రక్కు దాడిని ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో మరణించివారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న ఆమె ట్వీట్ చేశారు. This happened 5 blocks from my home,As I drive back home from work,Dreary sirens remind me that this is the state of the world #nyc #peace 😞 — PRIYANKA (@priyankachopra) 1 November 2017 Nyc.. As resilient as ever. I❤️u. My condolences to everyone affected by this tragedy. — PRIYANKA (@priyankachopra) 1 November 2017 -
నాకెవరు సాటిలేరు
ప్రియాంక చోప్రా.. ఈ జనరేషన్ యాక్టర్స్‌కు ఒక ఇన్స్పిరేషన్. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలన్న స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్. హీరోలకు సమాంతరంగా హీరోయిన్ స్టేటస్ ఉండాలని... పెద్దపెద్ద ప్రయోగాలే చేసిన స్టార్. మిస్ వరల్డ్. బాలీవుడ్లో సూపర్‌స్టార్. సింగర్‌గానూ సక్సెస్. హాలీవుడ్ పిలిస్తే అక్కడా సూపర్ అనిపించుకున్న అచీవర్. ఇప్పుడు ప్రియాంక ప్రపంచమంతటా వినిపించే పేరు. మనల్ని మనం బలంగా నమ్మితే వచ్చే సక్సెస్ ఇది. నన్నెవ్వరూ ‘రీప్లేస్’ చెయ్యలేరు! ‘‘సినీ పరిశ్రమలో హీరోయిన్ అనే ప్లేస్‌కి ఎప్పుడూ ఆప్షన్స్ ఉంటాయి. ఎవ్వరైనా, ఎవ్వరినైనా రీప్లేస్ చేయొచ్చు!’’ ప్రియాంక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక నిర్మాత ఆమెతో చెప్పిన మాటలివి. ప్రియాంక మనసులో బలంగా నాటుకున్నాయి ఈ మాటలు. తాను ఆ మాటకు సమాధానం చెప్పాలనుకుంది. కష్టపడింది. సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రియాంకే గర్వంగా చెప్పుకుంటుంది ఈ మాట, ‘‘నన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు!’’ మాటలతో సరిపెట్టలేదు! ‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకున్న రోజు, ప్రియాంక, తన స్పీచ్‌లో మదర్ థెరిస్సా ప్రస్తావన తెచ్చింది. ఈ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ ఎవరంటే మదర్ థెరిస్సా పేరే చెబుతానని ప్రియాంక అంది. అవి కేవలం మెప్పు పొందడానికి అన్న మాటలు కానే కాదు. ఎందుకు కాదో ప్రియాంక చోప్రా ఫౌండేషన్‌పై ఆడపిల్లల చదువుకు, సమాజంలో ఆడవాళ్లు వెనకబడిపోవడాన్ని ప్రశ్నించే కార్యక్రమాలకు, యూనిసెఫ్ తరపున కాంపెయిన్స్కు తన సమయాన్ని, సంపదను వెచ్చిస్తోన్న ప్రియాంక చోప్రా చర్యలే చెబుతాయి. ఇలా ప్రియాంక పేరు చెప్తే ఆమెలోని ఈ కోణం కూడా ఎప్పుడూ కనిపిస్తూ, వినిపిస్తూ ఉండే గొప్ప విషయం. ‘క్వాంటినో స్టార్’.. రెమ్యునరేషన్లో నెం. 1 ప్రియాంక చోప్రాకు ‘క్వాంటినో’ అనే అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు, ఆమె మెప్పించలేదని అన్నారు. అయితే ఆ టీవీ సిరీస్ విడుదలయ్యాక ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. ‘బే వాచ్’ అనే ఓ హాలీవుడ్ సినిమా కూడా చేసింది. టెలివిజన్ నటీమణుల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది మన ప్రియాంకే! ఫోర్బ్స్ జాబితాలో టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది. ఎవ్వరూ గుర్తించలేదు.. అందరూ ఓన్ చేసుకున్నారు! ప్రియాంక చోప్రా కెరీర్‌ను ఈ ఒక్క లైన్లో చెప్పేయొచ్చు. ఆమె రావడం రావడమే సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోలేదు. మొదట్లో అసలెవ్వరూ ఆమెను నటిగా కూడా గుర్తించలేదు. కొన్ని కమర్షియల్ సక్సెస్‌లు వచ్చాయి. గుర్తింపు వచ్చింది. ‘ఫ్యాషన్’ అనే సినిమా మాత్రం ప్రియాంక చోప్రా అన్న ఒక బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్, అమెరికన్ టీవీ సిరీస్‌లో అవకాశం, హాలీవుడ్ సినిమాలో అవకాశం.. ఇప్పుడు ప్రియాంక.. అందరూ ఓన్ చేసుకున్న సూపర్‌స్టార్. మాటల తూటాలు! ప్రియాంక చోప్రా చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కనిపిస్తూనే ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆమె వస్త్రధారణపై చాలా విమర్శలు వచ్చాయి. దానికి ‘‘ఇలాంటి అనవసరమైన కామెంట్లకు స్పందించేంత ఖాళీగా లేను నేను.’’ అని ఘాటైన సమాధానం ఇచ్చింది ప్రియాంక. ఒకసారెప్పుడో ‘మీకు ఒకరు రింగు తొడిగి ప్రపోజ్ చేసే వారు ఉండాలని అనుకోరా?’ అనడిగితే, ‘‘పిల్లలు కనడానికి తప్ప నాకు మగతోడు అవసరం లేదు.’’ అని రిప్లై ఇచ్చింది. -
ప్రియాంకా చోప్రా రాయని డైరీ
మాధవ్ శింగరాజు ఇండియాపై బెంగ పట్టుకుంది. అమెరికా నాకు కొత్తేం కాదు. టీనేజ్‌లో ఇక్కడే చదువుకున్నాను.. ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండి. టీనేజ్‌లో అయినా, ఈ థర్టీఫోర్ ఇయర్స్ ఏజ్‌లో అయినా ఇండియా ఇండియానే. ‘‘ఈ మాట బయటికి అంటే ఉద్యోగాలు పోతాయ్ ఆంటీ’’ అని నవ్వుతూ అంటుంది నా కజిన్ కూతురు. వాళ్ల ఆఫీస్‌లోనూ ఒక హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడట. ‘‘ఏమంటాడు.. ఇండియాను పొగిడితే పింక్ స్లిప్ ఇస్తానంటాడా?’’ అన్నాను. అది నవ్వింది. ‘‘అలా ఏం కాదు ఆంటీ.. పింకీ అంటాడు నన్ను, నా లిప్స్ పింకిష్గా ఉంటాయట. ‘షిట్’ అన్నాన్నేను. ఆ సాయంత్రమే పిలిచి, ‘ఇండియాలో మన బ్రాంచికి అవసరమట. వెళ్తావా?’ అని అడిగాడు. ‘వెళ్లను’ అన్నాను. ‘మరి షిట్ అని ఎందుకన్నావ్?’ అన్నాడు. ‘లిప్స్ జనరల్‌గా పింకిష్గానే కదా సర్ ఉండేది’ అన్నాను. వాడు వదిల్తేనా! ‘నీ లిప్స్ స్పెషల్’ అంటాడు’ అని పడీపడీ నవ్వుతూ చెప్పింది అది. నిన్న యాన్ ఫ్యూలేవైడర్ నన్ను అడిగింది. ‘‘ప్రియాంకా.. మీ కంట్రీలో కూడా ఎవరైనా హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడా’’ అని. యాన్ పెద్ద పత్రికకు చీఫ్ ఎడిటర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ల గురించి ఆమెకు తెలియకుండా పోతుందా? ఔటాఫ్ ఇంట్రెస్ట్.. ఊరికే అడిగి ఉంటుంది. ‘‘టెల్ అజ్ మిస్ ప్రియాంక.. ఇండియాలో మీరు పెద్ద స్టార్ కదా. మీకలాంటి అనుభవాలేమీ లేవా?’’ అని యాన్ మళ్లీ అడిగింది. నవ్వాన్నేను. ‘‘ఏ కంట్రీలోనైనా ఒక్కడే హార్వీ వైన్‌స్టీన్ ఉంటాడని ఎందుకు అనుకుంటున్నారు మిస్ యాన్’’ అన్నాను. అక్కడున్న అమ్మాయిలంతా గలగల నవ్వారు. ఇంటికొచ్చేశాను. అలసటగా ఉంది. ప్రతిచోటా హార్వీ వైస్స్టీన్ టాపిక్కే. మరో ట్రంప్ అయిపోయాడు ఈ హాలీవుడ్ ప్రొడ్యూసర్. ఎందుకిలా పెద్ద పెద్ద మగాళ్లంతా అమ్మాయిల వెంట పడి వేధించుకు తింటారు? ఎందుకంటే పవర్! పవర్లో మగాడు.. ఊరికే చేతికండల్ని చూసుకుని తృప్తి పడే మామూలు మగాడిలా.. తన పవర్‌ని తన చేతికింద ఉన్న అమ్మాయిలకు ఫ్లెక్స్ చేసి చూపించి తృప్తి పడుతుంటాడు. కూర్చోమంటే కూర్చునే అమ్మాయి, నిలుచోమంటే నిలుచునే అమ్మాయి అతడి పవర్ ఇగోని శాటిస్ఫై చేస్తుంది. తనకు లొంగని స్త్రీ కాళ్లు, చేతులు కదలకుండా చేయడానికి మగవాడికి తెలిసిన విద్య.. ఆమె ఉద్యోగాన్ని పోగొట్టడం. ఆమె కెరీర్‌పై దెబ్బ కొట్టడం. అదేనా పవర్! ‘ఎ కిడ్ లైక్ జేక్’ కంప్లీట్ అయింది. ‘ఈజెంట్ ఇట్ రొమాంటిక్’ కంప్లీట్ కావస్తోంది. బ్రేక్ దొరికితే ఇండియాకి వెళ్లి రావాలి. అక్కడా ఇదే అడుగుతారేమో.. హాలీవుడ్లో మీకు చాన్స్‌లు ఇవ్వడం కోసం హార్వీ వైన్స్టీన్లాంటి వాళ్లెవరైనా మిమ్మల్ని కూడా.. అంటూ. చెప్పాలి. అమ్మాయిల్లో పవర్ లేకపోతే కదా, బయటి పవర్లకు లొంగిపోవడం! -
అలాంటి కామోన్మాదులు అంతటా ఉంటారు
సాక్షి, సినిమా : హాలీవుడ్ ఇప్పుడు ఏ ఇద్దరు సెలబ్రిటీలు కలుసుకున్నా హర్వే వెయిన్‌స్టెన్ ఉదంతం గురించే చర్చించుకుంటున్నారు. మూవీ మొఘల్‌గా పేరుబడ్డ ఆ పెద్దాయన ఇలాంటి పాడు పనులు చేసుంటాడని ఊహించలేదని ఆయనతో పని చేసిన మేల్ ఆర్టిస్టులు చెబుతున్నారు. దీనికి తోడు ఆయనపై ఆరోపణలు చేసే నటీమణుల జాబితా నానాటికీ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి ఎగిరిపోయి.. అక్కడ పాగా వేసిన బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ వ్యవహారంపై స్పందించింది. మెయిరే క్లెయిర్ పవర్ ట్రిప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. హర్వే లాంటి కామాంధులు అంతటా ఉంటారని చెబుతోంది. అవకాశాల పేరిట ఎర వేసి శారీరకంగా వాడుకోవాలని చూడటం ఉన్మాద చర్యని పిగ్గీ చోప్స్ అంటోంది. అంతేకాదు తమ కలలను నిజం చేసుకోవాలని వచ్చే వారిని ఎలా వేధింపులకు గురిచేస్తారో వివరించింది. అలాంటి వాటికి లొంగాల్సిన పనిలేదు. అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉండాలి. వస్త్రధారణ లాంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా స్వతంత్ర్యగా తీసుకోలేకపోతున్నారు. అది మారాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని నిరోధించండి అంటూ మహిళలకు పిలుపునిచ్చింది. తాజాగా అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, నటి కల్కి కోయిచ్లిన్ హర్వే లాంటి వాళ్లు బాలీవుడ్‌లోనూ ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు వాళ్లు బయటపడతారని కామెంట్లు చేసి కలకలమే రేపింది. -
వీళ్లు వీకెండ్‌ని ఎలా గడిపేస్తారు?!
బాలీవుడ్ స్టార్స్ గురించిన వ్యక్తిగత విషయాలు.. ఈ వారం వారే చేస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక అభిమానులకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు.. షూటింగ్ లేని సమయాల్లో ఏం చేస్తుంటారు? పిల్లలతో సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తారన్న విషయం తెలుసుకేందుకు ఉత్సాహం చూపిస్తారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్స్.. కూడా తమతమ వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.. ఈ వారం అలా ఫరాన్ అక్తర్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితరుల తమ పర్సనల్ లైఫ్‌ని షేర్ చేసుకున్నారు.. ఆ వివరాలు మీ కోసం. ఫరాన్ అక్తర్ వీలు చిక్కితే చాలు.. ఫరాన్ అక్తర్ తన ఇద్దరు కుమార్తెలు శాక్య, అకీరాలతో సమయాన్ని గడిపేస్తారు. వారితో గడిపిన క్షణాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. తాజాగా చిన్న కుమార్తె అకీరాతో గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 55 వేల లైకులు వచ్చాయి. The angel on my right shoulder .. ❤️ #akistagram A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Oct 13, 2017 at 11:24pm PDT షాహిద్ కపూర్ ఈ మధ్యే తండ్రి అయిన షాహిద్ కపూర్.. తన ముద్దులబిడ్డ మిషా కకూర్ను ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు 7 లక్షలకు పైగా లైకులు.. వచ్చాయి. Best feeling ever. A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Oct 13, 2017 at 11:16pm PDT ప్రియాంక చోప్రా క్వాటికోతో హాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాను వాడుకోవడంలో చాలా ముందుంటారు. తాజాగా ప్యాటీ జెన్కిన్స్, ఆక్టివా స్పెన్సర్, కెల్లీ క్లార్క్సన్, మిషెల్లీ పిఫర్లతో కలిసి ప్రియాంక చోప్రా పవర్ ఉమెన్ అనే కార్యక్రమానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను ఇప్పటి వరకూ 3 లక్షలమంది లైక్ చేశారు. Today I shared the stage with incredible women who I admire. My belief was reaffirmed that the power of women is undeniable. I stand shoulder to shoulder with every women who speaks up and stands for what’s right. Thank you @variety for acknowledging what women are, what we do, and what we can do, and thank you to all the men and women who came out to support us this afternoon. #powerofwomen @variety @therealoctaviaspencer @kellyclarkson #pattyjenkins #michellepfeiffer @avamaybee A post shared by Priyanka Chopra (@priyankachopra) on Oct 13, 2017 at 10:16pm PDT షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ శనివారం పాత స్నేహితులతో అంటూ ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఫరాఖాన్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాంషు శర్మ, కరణ్ జోహార్ తదితరలు ఉన్నారు. ఈ ఫొటోను ఇప్పటివరకూ 28 వేల మంది లైక్ చేశారు. Film people!! At mannat with old friends n new.. @iamsrk @karanjohar @aanandlrai @himanshusharmaa A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on Oct 14, 2017 at 1:20pm PDT -
అప్పట్లో నాకిన్ని తెలివితేటలు లేవు
‘‘అప్పుడు నా వయసు 18. ఏం చేయాలో తెలియదు. ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాదు. మేనేజర్లు లేరు. గాడ్‌ఫాదర్ అస్సలే లేరు. తిరనాళ్లలో తప్పిపోయినట్టుగా అనిపించింది’’ అని ఇటీవల ఓ సందర్భంలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, సినిమాల్లోకి వచ్చినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రియాంకా చోప్రా. హీరోయిన్ అయిన తర్వాత నాలుగేళ్లకు తనకు సినిమా పరిశ్రమ గురించి కొంచెం అర్థం అయ్యిందని తెలిపారామె. ప్రస్తుతం రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్.. ఇలా తనకన్నా చిన్నవాళ్లతో సినిమాలు చేస్తున్నారు ప్రియాంక. ఆ విషయం గురించి మట్లాడుతూ -‘‘కొత్తగా సినిమాల్లోకొచ్చినవారిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. సినిమా పరిశ్రమ గురించి అవగాహన చేసుకోవడానికి నాకు నాలుగేళ్లు పడితే, వీళ్లకి నాలుగు సినిమాలకే అంతా అర్థమైపోతోంది. ఆ విషయంలో నాకన్నా వాళ్లే బెస్ట్. ఒక్క హిట్ వస్తే, చక్కగా పారితోషికం పెంచేస్తున్నారు. ఉపయోగపడే సినిమాలనే ఒప్పుకుంటున్నారు. కానీ, కెరీర్ ఆరంభించిన కొత్తలో నాకీ తెలివితేటలు ఉండేవి కాదు. చేయకూడని సినిమాలు కొన్ని చేశాను. అనుభవం పెరిగే కొద్దీ నా తెలివితేటలు కూడా పెరిగాయి. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని. ఒకప్పుడున్న భయాలు, సందేహాలు ఇప్పుడు లేవు. ఏ నిర్ణయాన్ని అయినా చాలా క్లారిటీగా తీసుకునే నేర్పు ఉంది’’ అని చెప్పారు.