Priyanka Chopra And Nick Jonas Housewarming Pics: ప్రియాంక మెరిసిపోతూ.. నిక్‌ మురిసిపోతూ - Sakshi
Sakshi News home page

ప్రియాంక మెరిసిపోతూ.. నిక్‌ మురిసిపోతూ

Feb 11 2021 8:23 PM | Updated on Feb 12 2021 8:31 AM

Priyanka Chopra And Nick Jonas In A Pic From Their Housewarming - Sakshi

గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌లు కొత్త ఇంట్లోకి మారారు. ఈ సందర్భంగా గృహప్రవేశం వేడుకను నిర్వహించారు. దీనికోసం ప్రముఖ డిజైనర్‌ మసాబా గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ప్రియాంక అందంగా ముస్తాబైంది.  వైట్‌ ట్యునిక్‌పై ఆరెంజ్‌ కలర్‌ దుపట్టా జతచేసిన డిజైనర్‌ దుస్తుల్లో ప్రియాంక కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ముసాబా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక  2018లో డిసెంబర్‌ 2వ తేదీన నిక్‌ జోనస్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక కోసం ఆమె భర్త నిక్‌ ప్రత్యేకంగా లాస్‌ ఏంజెల్స్‌లో గతేడాది ఓ అందమైన విల్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు).లాక్‌డౌన్‌ సమయంలోనే ఈ దంపతులు కొత్త ఇంట్లోకి మారినట్లు ప్రియంక తన  ఆటోబయోగ్రఫి ‘అన్‌ఫినిష్డ్‌‌’లో వివరించింది. 

భారతీయ సాంప్రదాయల ప్రకారం..గృహప్రవేశం వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తండ్రి అశోక్ చోప్రాకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. ఆత్మకథలో ప్రియాంక ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు.

ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లతో ప్రియాంక బిజీబిజీగా గడుపుతోంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది వైట్‌ టైగర్‌’ జనవరి 13న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం  ‘టెక్ట్స్‌ ఫర్‌ యూ’  సినిమా షూటింగ్‌ ఇటీవల లండన్‌ పూర్తి చేసుకున్నారు. జిమ్‌ స్ట్రౌస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.ఇక ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, ‌‘కేజీఎఫ్’‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్‌’లో స్పెషల్‌ సాంగ్‌ కోసం చిత్రబృందం ప్రియాంకను సంప్రదించింది. 

చదవండి: (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి)
              (చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement