ప్రియాంక పడిపోయిందా..? | Nick Jonas Saves Priyanka Chopra From Falling Down The Stairs | Sakshi
Sakshi News home page

ప్రియాంక పడిపోతుంటే నిక్‌ ఏం చేశాడు.?

Published Mon, Apr 8 2019 4:49 PM | Last Updated on Mon, Apr 8 2019 5:04 PM

Nick Jonas Saves Priyanka Chopra From Falling Down The Stairs - Sakshi

సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్‌ నటి ప్రియాంక మెట్ల మీద నుంచి జారి పడబోయింది. అక్కడే ఉన్న తన భర్త ప్రియాంక పడిపోకుండా రెప్పపాటులో ఆమెని రక్షించాడు. ప్రియాంక మొదట కాస్త కంగారు పడినా తర్వాత ఒక్కసారిగా పగలబడి నవ్వింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అభిమానుల్ని కట్టిపడేసింది. ప్రియాంక, నిక్‌ జోనస్‌లు గత సంవత్సరం జోధ్‌పూర్‌లో డిసెంబర్‌ 1,2 తేదీలలో క్రైస్తవ, హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరుపుకున్నారు. పెళ్లికి ముందురోజు నిక్‌ తనకిచ్చిన సర్‌ప్రైజ్‌ని మర్చిపోలేనని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ప్రియాంక మాట్లాడుతూ ‘ ఆ రోజు నా గదిలో ముస్తాబవుతుండగా నిక్‌ వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లాడు. ఆ  దారి పూలతో అందంగా అలంకరించి ఉంది. అక్కడ నా కోసం షూస్‌ని బహుమానంగా పెట్టి ఉంచాడు. దాంతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంద’ని చెప్పింది. అందులో ‘నువ్వు నా అదృష్టానివి. నువ్వు ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. నన్ను నీ భాగస్వామిగా ఎంపిక చేసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది’ అని రాసి ఉందని ప్రియాంక తన సంతోషాన్ని వెలిబుచ్చింది. పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందో రిసెప్షన్‌ వేడుకను అంతకన్నా ఘనంగా జరుపుకుంది ఈ కొత్తజంట. రిసెప్షన్‌ను 4 రోజులపాటు ఢిల్లీ, ముంబై, అమెరికా ఉత్తర కరొలినాలోని కార్లొట్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement