New Dellhi
-
ఇండియా ఓపెన్ టోర్నీ.. సింధు సత్తాకు సవాల్
న్యూఢిల్లీ: స్వదేశంలో మరోసారి సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్, సైనా నెహ్వాల్ నేటి నుంచి మొదలయ్యే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మాజీ చాంపియన్ పీవీ సింధు నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో... ప్రపంచ 31వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గత ఏడాది ఇదే టోర్నీ సెమీఫైనల్లో సుపనిద చేతిలో సింధు ఓడిపోగా... మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో గతంలో ఆడిన రెండుసార్లూ సైనాకు ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో సింధు, సైనాలకు తొలి రౌండ్లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ భారత్‌కే చెందిన ప్రణయ్‌తో తొలి రౌండ్లో ఆడనున్నాడు. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో వీరిద్దరు తలపడగా ప్రణయ్ పైచేయి సాధించాడు. బుధవారం జరిగే మరో తొలి రౌండ్ లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 3–9తో వెనుకంజలో ఉన్నాడు. చదవండి: Australian Open 2023: శ్రమించి... శుభారంభం India Open - The biggest badminton tournament held in India will see the world's best players in action in Delhi from 17 January. 🏸@BAI_Media #IndiaOpen pic.twitter.com/cM4ZiB3lFm — Doordarshan Sports (@ddsportschannel) January 16, 2023 -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్‌ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్‌ప్రీత్‌ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన హర్‌ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్‌కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్‌ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 0.8% తగ్గి $1,975.69కు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.5% తగ్గి 1,978.80 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.2,000కి పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.2050కి పైగా తగ్గి రూ.52,230కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.49,723 నుంచి రూ.47,843కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.49,800 నుంచి రూ.48,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.1600 తగ్గింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.52,580కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.3,000కి పైగా తగ్గి రూ.68,837కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. #Gold and #Silver Opening #Rates for 10/03/2022#IBJA pic.twitter.com/coh4GaBHax — IBJA (@IBJA1919) March 10, 2022 (చదవండి: టాటా మోటార్స్ బంపరాఫర్.. ఈ కార్లపై భారీ తగ్గింపు) -
శ్మశాన వింత! చితిపై పడుకోబెట్టబోతుంటే హఠాత్తుగా కళ్లు తెరిచి..
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం.. నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు. చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్! -
ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై..
న్యూఢిల్లీ: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని సంభాల్‌కు చెందిన తను పనినిమిత్తం ఢిల్లీ వచ్చింది. శనివారం ఉదయం కశ్మీరీ గేట్‌కు వెళ్లేందుకు ఖజురిఖాస్‌లో ఆ మహిళ ఐటీఓ ప్రాంతంలో ఆటో ఎక్కింది. అయితే ఆ సమయంలో ఆటోడ్రైవర్ మహిళ చెప్పిన ప్రదేశానికి కాకుండా యమున బ్రిడ్జి సమీపంలోని ఓ రూమ్‌కు తీసుకువెళ్లి, అక్కడ అతనితో పాటు మరో ముగ్గరు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. అనంతరం తనని ఆ ఆటోడ్రైవర్ కశ్మీరీ గేట్ వద్ద వదిలేసి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరిక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: దొంగతనంలో కొత్త టెక్నిక్.. ధూమ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు -
కంటి ఆపరేషన్ చేయించుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. గురువారం ఉదయం ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. President Ram Nath Kovind underwent cataract surgery at Army Hospital (Referral & Research), New Delhi today morning. The surgery was successful and he has been discharged from the hospital: Ajay Kumar Singh, Press Secretary to the President pic.twitter.com/DQcxf0Wnf8 — ANI (@ANI) August 19, 2021 -
బీజేపీలోనే కొనసాగుతా
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌తో పాటు, తాను కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నామన్న ఊహాగానాలకు బీజేపీనేత తూళ్ళ వీ రేందర్‌గౌడ్ తెరదించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దేవేందర్‌గౌడ్‌ని కలిసిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను కలిసిన అనంతరం వీరేందర్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిపై ఉన్న గౌరవంతోనే మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమను కలిశారని, వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంజయ్‌తో చర్చించినట్లు వీరేందర్‌గౌడ్ తెలిపారు. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్‌తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు. టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు 13,23,567 కి చేరుకోగా.. 300 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కోవిడ్ వల్ల 19,344 మంది మృతి చెందారు. ఆదివారం 61,552 మందికి పరీక్షలు చేయగా, దీనిలో 49,787 ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 11,765 మందికి వేగంగా యాంటిజెన్ పరీక్షలు జరిగాయి. కాగా పాజిటివ్ కేసులు స్వల్వంగా తగ్గి 86,232 కు చేరుకున్నాయి. కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ ఉన్న 52,263 మంది ఇంటి నుంచే కోలుకుంటున్నారు. రాజధానిలో లాక్డౌన్ పొడగింపు దేశ రాజధానిలో కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు. మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్నారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పలు వర్గాలకు చెందిన వారితో చర్చించిన అనంతరం లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. 14 రాష్ట్రాల్లో లాక్డౌన్! ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 4,000 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన బంగారం ధరలు మంగళ, బుధవారం స్వల్పంగా తగ్గాయి. మళ్లీ నేడు భారీగానే బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.400 వరకు పెరుగగా, ఢిల్లీలో రూ.350 వరకు పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,352 నుంచి రూ.46,706కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,783 నుంచి రూ.42,852కు చేరుకుంది. అలాగే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,444 నుంచి రూ.67,953కు పెరిగింది. ఒక చోట బంగార ధర పెరుగుదల తక్కువగా ఉంటే, మరో చోట ఎక్కువగా ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని వెళితే మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: జూన్ నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి -
మహిళలపై నేరాలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గాయి. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన క్రైమ్ రికార్డు జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మహిళల మీద జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే 2,111 తగ్గాయని ఆ నివేదిక వెల్లడించింది. 2020 సెప్టెంబర్ వరకు 7,236 కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాదివతో పోలీస్తే 22.58 శాతం తక్కువ. గతేడాది 9,347 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మహిళళపై జరుగుతున్న అత్యాచారాలు కూడా 29.8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఢిల్లీలో ఐపీసీ సెక్షన్ 376 కింద 1,132 కేసులు నమోదయ్యాయి. అదే 2019లో ఈ కేసుల సంఖ్య 1613గా ఉంది. ఇదిలా ఉండగా ఐపీసీ సెక్షన్ 509 ( మహిళలను అవమానించడం) కింద నమోదయిన కేసుల సంఖ్య 312 రెట్లు పెరిగాయి. ఈ కేసులు 2019లో 333 నమోదు కాగా, 2020లో వీటి సంఖ్య ఒక్కసారిగా 1,374కు పెరిగింది. ఇక వరకట్న వేధింపులకు సంబంధించి 2020లో సెప్టెంబర్ 15వరకు 89 కేసులు నమోదు కాగా 2019లో వీటి సంఖ్య 107గా ఉంది. మొత్తం మీద 2020లో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగానే తగ్గింది. మహిళల కిడ్నాప్‌ల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇది లాక్డౌన్ కారణంగా తగ్గిందా? భద్రతా ప్రమాణాలు పెంచడం వల్ల తగ్గింద అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి -
జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్’ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు. కోవిడ్–19 కారణంగా రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల మధ్య, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ, నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కెమిస్ట్రీలో ఒక ప్రశ్న తొలగింపు జేఈఈ మెయిన్స్ ఫైనల్ ఆన్సర్ కీని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దీనిలో రోజు వారీగా, సెషన్ వారీగా ప్రశ్న ఐడీ, సరైన సమాధానం ఐడీలను విడుదల చేసింది. 3వ తేదీన ఉదయం సెషన్లో ఇచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పుగా ఉండడంతో దాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రశ్నకు సంబంధించి ఆ సెషన్లో పరీక్ష రాసిన వారికి 4 మార్కులు కలపనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. చదవండి: తెలంగాణ విద్యార్థులే టాప్! -
అన్ని మతాలకూ ఒకే దత్తత చట్టం కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకేరకమైన దత్తత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దత్తత చట్టం, సంరక్షణ బాధ్యత, వివక్షా పూరితంగా ఉన్నాయనీ, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని ఉల్లంఘిస్తున్నందున దత్తతకు సంబంధించిన యూనిఫాం మార్గదర్శకాలు ఉండాలని కోరారు. ప్రస్తుత దత్తత పద్ధతి వివక్షా పూరితంగా ఉందనీ, హిందువులకు ప్రత్యేక చట్టం ఉంది, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు, పార్శీలకు ఎటువంటి చట్టం లేదని, తెలిపారు. (మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్) -
అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకే అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే కేసులో గతంలో ఓసారి అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులను కలవలేకపోయానని ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొందని ఆహ్మద్ తెలిపారు. (ఐటీ నోటీసులపై అహ్మద్ పటేల్ స్పందన) ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీకి సంబంధించి 5,000 వేల కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వీరు నైజీరియాలో దాక్కున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. -
ఆ పుకారు వల్లే ఢిల్లీ అల్లర్లు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో కలిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ తీశారు. అయితే వీరు జఫరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో డయల్పూర్‌లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌పై దుండగులు మూక దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశారని ఛార్జిషీటులో ప్రస్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు) అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించినప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అతను ఛాంద్ బాగ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఇక సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ
సాక్షి, ఢిల్లీ: బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది. ఎవరితోనూ అపాయింట్మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి చవిచూశారు. -
రాష్ట్రాల సహకారం లేనిదే అమలు కుదరదు : పీకే
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రశ్న : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మీరు ట్వీట్ చేశారు. మీ పార్టీ ఏమో పార్లమెంటులో మద్దతిచ్చింది. దీనిపై మీరేమంటారు? జవాబు : పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాను. మా పార్టీ కూడా మొదట సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ తర్వాత వైఖరిని మార్చుకుంది. దీనిపై మా అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ను అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందేంటంటే సీఏఏ, ఎన్నార్సీలను వారు వేర్వేరుగా చూస్తున్నారు. సీఏఏకు మద్దతిచ్చినా, ఎన్నార్సీకి మద్దతివ్వనని, అది బీహార్‌కు అవసరం లేదని ఆయన నాకు భరోసానిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. ప్రశ్న : ఈ చట్టాలను బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలని మీరు పిలుపునిచ్చారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప మిగతా ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. వారంతా మీ సూచనను పాటిస్తారని అనుకుంటున్నారా? జవాబు : దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేగా అర్థం. ఇప్పుడు బీజేపీ దేశ ప్రజలు మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 61 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కదా. వారి సంగతేంటి? ఈ 61 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే నేను వ్యతిరేకించమని చెప్పేది. ప్రశ్న : కానీ, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు లేదు కదా? జవాబు : వ్యతిరేకించే అధికారం రాజ్యాంగం ప్రకారమైతే లేదు. కానీ రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం ఈ చట్టాన్ని దేశంలో అమలు చేయగలదా? ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీ చేపడితే రేయింబవళ్లు కష్టపడినా మూడేళ్లు పట్టింది. అలాంటిది దేశం మొత్తం అమలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది. అది కూడా కేంద్రం మాత్రమే చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండి. ప్రశ్న : మరి పార్లమెంటులో మీ పార్టీ సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం ద్వంద వైఖరి కాదా? జవాబు : ఇది ద్వంద వైఖరి కాదు. పైన చెప్పినట్టు సీఏఏ, ఎన్నారర్సీలకు మధ్య లింకు ఉంటుందని వారు బహుశా ఊహించి ఉండరని అనుకుంటున్నాను. ప్రశ్న : బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో మీ పార్టీ జేడీయూ భాగస్వామి కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జవాబు : మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను. కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు. -
తర్వాత ఎన్నార్సీయే : జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం మండిపడ్డారు. మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయని చురకంటించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. 28, 30 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి భారత పౌరసత్వం లేనందున ఇల్లు కట్టుకోలేరు. పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు పట్టవు. వారికి కావాల్సిందల్లా రాజకీయమే’ అంటూ ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టం తర్వాత సమీప భవిష్యత్తులో ఎన్నార్సీ కూడా ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సంస్కరణలతో దేశం అభివృద్ధి పయనంలో సాగుతోందని వెల్లడించారు. చదవండి : పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్ -
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్‌లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్‌లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్‌లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్‌లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్‌దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్‌లో ఇన్నింగ్స్‌కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్‌లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్‌లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
పుకారు వార్తలతో చనిపోయిన వారి సంగతేంటి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా, మతపరమైన హత్యలనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఉత్తర భారత దేశంలో గోమాంసం పేరిట జరిగిన హత్యలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి.. ఇతర కారణాలతో జరిగే మూక హత్యలపై మౌనం వహిస్తోందని ఆరోపించారు. నకిలీ వార్తల వ్యాప్తితో.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే పుకార్లను నమ్మి ప్రజలు అనుమానితులను హత్య చేసిన ఘటనలు యూపీఏ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు 2012లో 16, 2013లో 14 జరిగాయనీ.. వీటిపై ఏ మీడియా సంస్థ కూడా డిబేట్ పెట్టలేదని విమర్శించారు. ‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరిగినప్పుడు స్థానికంగా అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. ఆతర్వాత మరచిపోతారు. కానీ ప్రజల చేతిలో హతమైన వారి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు’అని మంత్రి అన్నారు. ఇలాంటి హత్యలను గుర్తించి టీవీలలో చర్చించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన మీడియాకు సూచించారు. కాగా, గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా మంది బిచ్చగాళ్లు, వేరే రాష్ట్రాల వారు ప్రజల చేతిలో దాడికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. -
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసే వీలుంది. గత నెలలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను కేంద్రానికి సూచించింది. వీరిలో జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హృతికేశ్ రాయ్‌లు రాజస్తాన్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరనుంది. సుప్రీంకోర్టులో 59,331 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జూలై 11న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. -
కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..
న్యూఢిల్లీ: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్ఎస్ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్ఎస్ఐటీ క్యాంపస్ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్ క్యాంటీన్ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశం.. అరెస్ట్
న్యూఢిల్లీ : విమానాశ్రయంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ...తన పేరు ఉబైద్ లాల్ అని, శ్రీనగర్‌కు వెళ్తున్న తన తల్లిని చూడటానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. టెర్మినల్ 3 లోకి ఎలా ప్రవేశించావని పోలీసులు ప్రశ్నించగా అతను సవరించిన విమాన టికెట్‌ను చూపించి లోనికి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉబైద్ లాల్‌ను ఢిల్లీ పోలీసులకు అప్పగించి... అతనిపై మోసం, నేరపూరిత దుర్వినియోగం కేసు నమోదు చేశారు. కాగా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అంతకు మందే సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్ జాతీయుడైన రాజ్ధనోటా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్ లోపలికి వచ్చేశాడు. అతను తన భార్య, కుమారుడిని చూడటానికే ఇలా చేశానని విచారణలో ఒప్పుకున్నాడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో విమనాశ్రయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. చదవండి : విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు -
రాష్ట్రపతిని కలిసిన ఏపీ గవర్నర్ బిశ్వభూషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన తొలి రోజు పర్యటనలో భాగంగా గురువారం భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం డిల్లీ చేరుకున్న గవర్నర్.. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. గవర్నర్ హోదాలో దేశాధ్యక్షుడిని తొలిసారి కలుసుకున్న హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులను వివరించారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయిడు, హోం మంత్రి అమిత్ షా లను గవర్నర్ కలవనున్నారు. గవర్నర్ బిశ్వభూషన్తోపాటు కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎడిసి మాధవ రెడ్డి, ఆంధ్రా భవన్ అధికారులు ఉన్నారు.