న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకేరకమైన దత్తత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దత్తత చట్టం, సంరక్షణ బాధ్యత, వివక్షా పూరితంగా ఉన్నాయనీ, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని ఉల్లంఘిస్తున్నందున దత్తతకు సంబంధించిన యూనిఫాం మార్గదర్శకాలు ఉండాలని కోరారు. ప్రస్తుత దత్తత పద్ధతి వివక్షా పూరితంగా ఉందనీ, హిందువులకు ప్రత్యేక చట్టం ఉంది, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు, పార్శీలకు ఎటువంటి చట్టం లేదని, తెలిపారు. (మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్)
Comments
Please login to add a commentAdd a comment