న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకే అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే కేసులో గతంలో ఓసారి అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులను కలవలేకపోయానని ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొందని ఆహ్మద్ తెలిపారు. (ఐటీ నోటీసులపై అహ్మద్ పటేల్ స్పందన)
ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీకి సంబంధించి 5,000 వేల కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వీరు నైజీరియాలో దాక్కున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment