Ahmed Patel
-
ఆప్‌కు భారుచా సీటు: ‘అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాలు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా గురుజరాత్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నాయ. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు రెండు సీట్లను ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, ఆప్ పొత్తుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti — Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024 తాజాగా అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఎక్స్ ‘ ట్విటర్’ వేదికగా స్పందించారు. ‘భారుచా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు తెలుపుతున్నా. కాంగ్రెస్, ఆప్ పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’ అని ఆమె తెలిపారు. గుజరాత్లో పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు కేటాయించింది. ఈ క్రమంలో మంతాజ్ ఖాన్ ఆ స్థానంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంనే ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. #WATCH | On seat-sharing between Congress and AAP and the Bharuch seat of Gujarat going to AAP, Faisal Ahmed Patel, Congress leader and son of Senior Congress leader late Ahmed Patel says, "...My party workers and I are not happy and we wanted this decision to not be taken but if… pic.twitter.com/QUCkOV8aIv — ANI (@ANI) February 24, 2024 మరోవైపు.. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ కూడా స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. గాంధీ కుటుంబం నా కుటుంబంతో సమానం. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’అని తెలిపారు. ‘పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు, నేను సంతోషంగా లేము. ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. కావున మేము దాన్ని అనుసరిస్తాం. పార్టీ నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం’ అని ఫైసల్ పేర్కొన్నారు. చదవండి: ఆప్, కాంగ్రెస్‌ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే.. -
గుజరాత్లో పెద్దాయన లేనిలోటు స్పష్టం.. కాంగ్రెస్‌లో ఆ ఒక్కడు లేకపోతే అంతేనా?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. దీంతో వీటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే గుజరాత్‌ను వదిలేసి రాహుల్ ఇంకెక్కడో యాత్రలు చేశారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. ఢిల్లీని వదలలేదు. ఫలితంగా గుజరాత్లో దశదిశ లేక బొక్కాబొర్లా పడింది హస్తం పార్టీ. హస్తానికి ఏమైంది? 2014 నుంచి ప్రతిపక్షంలో ఉంటోన్న కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత రావొచ్చని ముందుగా అంచనాలు వచ్చినా.. కాంగ్రెస్‌లో ఆ జోషే కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్లు అడ్రస్ లేరు. రాహుల్ ఒకరోజు అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. కొత్త అధ్యక్షుడు ఖర్గే నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారు. అహ్మద్ పటేల్ లేకుంటే అనాథే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 41.44 ఓట్ షేర్‌తో 77 సీట్లు గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‌కు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు నీరుగారి పోయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అహ్మద్ పటేల్ లేని గుజరాత్ కాంగ్రెస్ అనాథలా మారింది. ఎలక్షనీరింగ్ లేదు.. ప్రచార వ్యూహాల్లేవు.. నేతల హంగామా అసలే లేదు.. అంతా మిస్సింగ్. అంతా చేయిచ్చారు! 2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, హైకమాండ్ నిర్ణయరాహిత్యం కలిసి ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్. 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీపై పాటిదార్లు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని ప్రచారం జరిగినా.. దానిని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలు మాత్రం కాంగ్రెస్ క్యాంప్‌లో కనిపించలేదు. రాజస్థాన్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అహ్మద్ పటేల్ లేకపోవడంతో.. గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది అధిష్టానం. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటుంటే.. రాజస్థాన్ మోడల్ అన్నారు గెహ్లాట్. అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుజరాత్‌లోనూ అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పరువు కాపాడుకోలేకపోయింది. ఈ లెక్కన రాజస్థాన్ మోడల్ హస్తానికి ఏ రకంగాను చెప్పుకోదగ్గ క్రెడిట్‌లోకి రాలేదు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మోదీ సర్కార్‌ను కూల్చేందుకే.. గుజరాత్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హ్యాండ్!
గుజరాత్ అల్లర్లపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2002 నాటి అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికేంచేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిట్ వెల్లడించింది. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్వా సెతల్వాద్‌కు హ్యాండ్ ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే, 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. విచారణలో భాగంగా.. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని సిట్ తెలిపింది. అలాగే, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. సెతల్వాద్, శ్రీకుమార్‌లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. జూలై రెండవ తేదీన సెతల్వాద్, శ్రీకుమార్‌లను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. Shri @Jairam_Ramesh issues statement on the false allegations against Late Sri Ahmed Patel pic.twitter.com/Txder7qojx— Congress Sevadal (@CongressSevadal) July 16, 2022 మరోవైపు.. సిట్ నివేదికను, దివంగత అహ్మాద్ పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మరణించిన వారిని కూడా వదలడం లేదని విరుచుకుపడింది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, వారు ఏది చెబితే అది చేస్తోందని విమర్శించింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై అహ్మాద్ పటేల్ కుమార్తె స్పందించారు. సిట్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ కుట్రలో నిజంగా తన తండ్రికి పాత్ర ఉంటే కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదని ఆమె ప్రశ్నించారు. కాగా అహ్మాద్ పటేల్ 2020లో మరణించిన విషయం తెలిసిందే. Full Reporthttps://t.co/CxYcsB4pRy— Organiser Weekly (@eOrganiser) July 16, 2022 -
కాంగ్రెస్‌కు అహ్మద్ పటేల్ కుమారుడు షాక్!
అహ్మదాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చేదు ఫలితాల ఫలితంగా కాంగ్రెస్ కష్టాలు మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకత్వ లేమి, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల్లోనూ నిస్పృహ నెలకొంది. ఈనేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పేలా లేదు. దివంగత నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ (41) హస్తం పార్టీపై అసమ్మతి ప్రకటించారు. అధిష్టానం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదని... తన దారి తాను చూసుకుంటానంటూ ట్విట్టర్లో బాంబు పేల్చారు. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ట్వీట్‌తో ఫైసల్ ఆప్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు మార్చి 27న కూడా ఫైసల్ అసెంబ్లీ ఎన్నికల రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. పార్టీతో పనిలేకుండా బరూచ్ నుంచి నర్మదా జిల్లా వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. 7 సీట్లలో విజయం సాధించేందుకు తన టీమ్ ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌కు ఫైసల్ ‘చేయి’ ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉండగా.. గత రెండేళ్లలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, అశ్వని కుమార్, ఆర్పీఎన్ సింగ్ వంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. -
అమీషా.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
Late Congress Leader Ahmed Patel Son Proposes To Heroine Ameesha Patel: బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్. నాని, నరసింహుడు చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈమె గత కొంతకాలంగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఫైజల్ 41వ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..అంటూ అమీషా సైతం ట్విట్టర్లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. దీనికి ఫైజల్ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే నెటిజన్లు ఈ చాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కాగా గతంలో ఫైజల్ జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండెపోటుతో ఈమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్ అమీషా ప్రేమలో పడ్డాడు. ఫైజల్ కంటే అమీషా పటేల్ నాలుగేళ్లు పెద్దది. -
అహ్మద్ పటేల్ అల్లుడి ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ: నగదు అక్రమ చెలామణీ కేసులో దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అల్లుడు ఇర్ఫాన్ అహ్మద్ సిద్దిఖీ , నటులు డీనో మోరియా, సంజయ్ ఖాన్, డీజే అఖ్వీల్‌లకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెలిపింది. సంజయ్ ఖాన్‌కు చెందిన రూ. 3 కోట్లు, డీనో మోరియాకు చెందిన రూ. 1.4 కోట్లు, డీజే అఖ్వీల్‌కు చెందిన రూ. 1.98 కోట్లు, సిద్దిఖీకి చెందిన రూ. 2.41 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప్రధాన ప్రమోటర్లైన, ప్రస్తుతం పరారీలో ఉన్న నితిన్ సందేసర, చేతన్ సందేసర కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపింది. -
రాజస్తాన్‌లో మళ్లీ రాజకీయ అలజడి!
జైపూర్: భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్‌లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీటీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఆరంభంలో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన అనుచర వర్గంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి మద్దుతు తెలుపడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు 10కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రజిత్ సింగ్ ఆరోపించారు. బీటీపీ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారని మహేంద్రజిత్ సింగ్ ఆరోపిస్తున్న వీడియోని బీజేపీ చీఫ్ సతీష్ పూనియ నవంబర్ చివర్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. బీజేపీతో కుమ్మక్కైన కాంగ్రెస్! కాగా పంచాయితీ ఎన్నికల సందర్భంగా, తమ పార్టీ మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీతో చేతులు కలిపిందని బీటీపీ ఆరోపించింది. 27 స్థానాలు గల దుర్గాపుర్ జిల్లాలో కేవలం 8 స్థానాలు గల బీజేపీ, జిల్లా ప్రముఖ్ స్థానాన్ని ఎలా గెలుచుకుంటుందని, ఇది కాంగ్రెస్ , బీజేపీ చీకటి ఒప్పందంని విమర్శించింది. ఇది నమ్మక ద్రోహమని భవిష్యతులో కాంగ్రెస్‌తో అసలు జత కట్టమని బీటీపీ తెలిపింది. కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ రాజస్తాన్‌లోని 222 పంచాయతి సమితిలోని 4371 సీట్లలో ఎన్నికలు జరగగా అధికార కాంగ్రెస్ పార్టీ 1852 గెలుచుకోగా, బీజేపీ 1989 సీట్లలో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 439 సీట్లలో గెలుపొందారు. ఎన్డీఏ లో మిత్రపకక్షాం ఆర్ఏల్పీ 60 సీట్లు గెలుచుకుంది. సీపీఐ-ఎం 26 స్థానాలలో విజయాని కైవసం చేసుకుంది. 21 జిల్లా పరిషత్‌లో జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలలో బీజేపీ తన అధ్యికతను ప్రదర్శించింది. బీజేపీ 353, కాంగ్రెస్ 252, ఆర్ఎల్పీ 10, సీపీఐ-ఎం 2, స్వతంత్రులు 18 స్థానాలలో గెలిచారు. గత నెలలో జరిగిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు కైవసం చేసుకుంది. అనుహ్యంగా పంచాయితీ ఎన్నికల్లో ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. దీంతో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. మరోసారి రాజకీయ అలజడి! పంచాయితీ ఫలితాలతో రాజస్తాన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 19 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌తో బయటకు వచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మాణం అనివార్యమైంది. 200 మంది సభ్యులు గల అసెంబ్లీలో 105 సొంత బలంతో పాటు ..16 మంది ఇతర ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో గహ్లోత్ విశ్వాస తీర్మాణంలో నెగ్గారు. ఇందులో 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరుగురు బీఎస్పీ సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరు కాక 13 మంది స్వతంత్రులు , ఒక ఆర్ ఎల్ డీ సభ్యుడు గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దతు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికిన 121 మంది సభ్యులలో 21 మంది మంత్రులుగా ఉన్నారు. గరిష్టంగా 30 మంది మంత్రులుగా ఉండవచ్చు. దీంతో మిగిలిన 100 మంది సభ్యులలో 9 మందికి మాత్రమే మంత్రి అయ్యే అవకాశం ఉంది. గహ్లోత్ 9 మంది సభ్యులకు మంత్రి పదవులు, 10 మందికి పార్లమెంట్ కార్యదర్శులుగా, 40 మందిని వివిధ బోర్డులకు కమిషనర్లుగా, 20 మందిని శాసనసభ కమిటీ అధ్యక్షులుగా, 12 మందికి పైగా సభ్యులను స్థానిక సంస్థల అధిపతులుగా నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలతో చేర్చించున్నట్టు, సొంత పార్టీ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. సంవత్సరం ఆరంభంలో రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరతను పరిష్కరించడానికి సోనియా గాందీ ప్యానెల్ ఏర్పరరిచిన విషయం తెలిసిందే ఇందులో అహ్మద్ పటేల్ సభ్యుడు. పటేల్ తన రాజకీయ అనుభవంతో సచిన్ పైలట్‌ని అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇటువంటి పరిస్థితులలో బీటీపీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు బయటకు రావడం, అలాగే పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూడటం వంటి పరిణామాలు అన్ని బీజేపీకి కలిసొచ్చే అంశాలు. బీటీపీ శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీలో ఆకర్షించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కి ప్రతికూలంగా పరిణమించనున్నాయి. -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
‘పాతబస్తీలో బంకర్లు ఉన్నాయా?’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు హిందూ-ముస్లిం ఎజెండాగా మారుతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన లేకపోవడం బాధాకరం అన్నారు. అనంతరం వీహెచ్ గ్రేటర్ వార్‌పై మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ చూసిన కేటీఆర్, కేసీఆర్ ఫోటోలే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు..ఆయనకు ఎలా తెలిసింది?. అక్బరుద్దీన్ కేవలం ముస్లిం ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మతం ముసుగులో ప్రజలని రెచ్చగొడుతున్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ముస్లింలకు న్యాయం చేయలేదు. పాతబస్తీలో బంకర్స్, ట్యాంకర్లు ఉన్నాయా అని వీహెచ్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. (ఆమె ముస్లిం కాదు : ఒవైసీ) ‘ఎవరి మాటలు వారు మాట్లాడుతున్నారు.. ఇలాంటి వారిని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను. ఒక దుబ్బాక లో గెలిచినంత మాత్రాన పొంగి పోవద్దు. మేము చేసిన చిన్న పొరపాటు వల్ల తప్పిదం జరిగింది. ఎవరు మా పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదు. రక్తపాతం చేసి ఓట్లు తీసుకోవాలని బండి చూస్తున్నారు.. మహారాష్ట్ర, బీహార్ వెళ్లినవ్ ఎవరికి లాభం చేశావు అసద్’ అని వీహెచ్ ప్రశ్నించారు -
అహ్మద్ పటేల్ మృతి.. సోనియా భావోద్వేగం
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) మరణంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వాసానికి, అంకితభావానికి ఆయన మారుపేరు. పూర్తి నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు. సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. అహ్మద్ పటేల్‌కు ఉన్న దయాగుణమే ఇతరుల కంటే ఆయనను మరింత ప్రత్యేకంగా నిలిపింది’’ అని అహ్మద్ పటేల్‌తో పార్టీకి, తనకు ఉన్న అనుబంధాన్ని సోనియా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇక గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన అహ్మద్ పటేల్ సోనియా గాంధీ ఆంతరంగికుడిగా పేరొందిన విషయం విదితమే. కాగా కరోనా సోకడంతో పది రోజుల క్రితం(నవంబర్ 15న) ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.(చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత) అహ్మద్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి: ప్రధాని మోదీ అహ్మద్ పటేల్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘అహ్మద్ పటేల్ జీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితంలోని అత్యధిక కాలం ప్రజాసేవలోనే గడిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన కుమారుడు ఫైజల్‌తో మాట్లాడాను. అహ్మద్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి’’అని ప్రార్థించారు. Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace. — Narendra Modi (@narendramodi) November 25, 2020 మిమ్మల్ని మిస్సవుతాం: రాహుల్ గాంధీ ‘‘ఇదొక విషాదకరమైన రోజు. కాంగ్రెస్ పార్టీ పిల్లర్ అహ్మద్ పటేల్. పార్టీ కోసమే ఆయన జీవితాన్ని ధారబోశారు. కఠిన సమయాల్లో వెన్నంటే ఉన్నారు. ఆయన ఒక వెలకట్టలేని ఆస్తి. మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతాం. ఫైజల్, ముంతాజ్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. It is a sad day. Shri Ahmed Patel was a pillar of the Congress party. He lived and breathed Congress and stood with the party through its most difficult times. He was a tremendous asset. We will miss him. My love and condolences to Faisal, Mumtaz & the family. pic.twitter.com/sZaOXOIMEX — Rahul Gandhi (@RahulGandhi) November 25, 2020 -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్ 1న ట్విటర్ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన అహ్మద్ పటేల్ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. -
అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసు, సందేశార సోదరుల బ్యాంకు స్కామ్‌లకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఈడీ అధికారులు గురువారం నాలుగోసారి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం అహ్మద్ పటేల్‌ను విచారించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను చివరిసారిగా ఈడీ ఈనెల 2న పదిగంటల పాటు ప్రశ్నించింది. ఈడీ అధికారులు మూడు సెషన్స్‌లో తనను 128 ప్రశ్నలు అడిగారని అంతకుముందు అహ్మద్ పటేల్ చెప్పారు. ఇది రాజకీయ వేధింపు చర్యేనని, ఎవరి ఒత్తిళ్లపై వారు (దర్యాప్తు అధికారులు) పనిచేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. కాగా జూన్ 27, జూన్ 30, జులై 2న మూడుసార్లు అహ్మద్ పటేల్‌ను విచారించిన ఈడీ అధికారులు ఇప్పటివరకూ 27 గంటల పాటు ప్రశ్నించారు.మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అహ్మద్ పటేల్ ప్రకటనను ఈడీ అధికారులు రికార్డు చేశారు. చదవండి : ఐటీ నోటీసులపై స్పందించిన అహ్మద్ పటేల్ కాగా, వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్ సందేశార, చేతన్ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు. ఈ వ్యవహారంతో అహ్మద్ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు మరోసారి అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లతో ఉన్న ఆయనకున్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. -
చైనాను టార్గెట్ చేయలేక మాపై వేధింపులా!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం తమపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మనీల్యాండరింగ్ కేసులో తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించిన ఘటన వేధింపు రాజకీయాలకు తాజా ఉదాహరణని ఆ పార్టీ పేర్కొంది. కేంద్రం చైనాను టార్గెట్ చేసేందుకు బదులు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను వేధింపులకు గురిచేయడం ఇందుకు తాజా ఉదంతమని ఆ పార్టీ నేత మనీష్ తివారీ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్‌పై మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అహ్మద్ పటేల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మనీష్ తివారీ మోదీ సర్కార్‌ను ఆక్షేపిస్తూ ట్వీట్ చేశారు. ఈ కేసులో అహ్మద్ పటేల్‌తో పాటు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖిలను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. గల్వాన్ ఘటనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక చైనా దళాల చేతిలో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. చదవండి : ఇంధన ధరలతో కేంద్రం దగా -
మరోసారి అహ్మద్ పటేల్‌కు ఈడీ సెగ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు మరోసారి ఈడీ సెగ తగిలింది. మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్‌ను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం ఢిల్లీలోని ఆయన నివాసంలో విచారించనున్నారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల శనివారం అహ్మద్ పటేల్ నివాసంలో 8 గంటలపాటు సుదీర్ఘంగా ఆయనను విచారించిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటిక్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు ఇవ్వగా, కరోనావైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చిన కారణంగా విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. (అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం) ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ 5వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో నిరర్ధక అస్తులుగా మారాయి. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మోసం ఆరోపణలు మొత్తం 8,100 కోట్ల రూపాయలకు చేరాయి. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కేసుకు సంబంధించి అహ్మద్ పటేల్ పాత్రపై ఈడీ విచారణ సాగిస్తోంది. స్టెర్లింగ్ బయోటిక్‌కు చెందిన సందేశర సోదరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నైజీరియాలో దాక్కున్న స్టెర్లింగ్ బయోటిక్ ప్రమోటర్లు నితిన్, చేతన్‌ను భారత దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు ఏజెన్సీలు ప్రయత్నం చేస్తున్నాయి. (అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు) -
అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: సందేశార సోదరుల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(70)ను సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఢిల్లీలోని అహ్మద్ పటేల్ ఇంట్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలంటూ అహ్మద్ పటేల్‌కు ఇటీవలే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విచారణకు రాలేనని తేల్చిచెప్పారు. దీంతో ఈడీ బృందం నేరుగా అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లింది. వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్ సందేశార, చేతన్ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు. ఈ వ్యవహారంతో అహ్మద్ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ ఆయనను ప్రశ్నించింది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. 30న మరోసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. -
అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకే అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే కేసులో గతంలో ఓసారి అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులను కలవలేకపోయానని ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొందని ఆహ్మద్ తెలిపారు. (ఐటీ నోటీసులపై అహ్మద్ పటేల్ స్పందన) ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీకి సంబంధించి 5,000 వేల కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వీరు నైజీరియాలో దాక్కున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. -
చక్ర బంధంలో చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్–13ఏ ప్రకారం రాజకీయ పార్టీలు రూ.2,000 వరకూ విరాళాలను నగదు రూపంలో తీసుకోవచ్చు. అంతకంటే అధిక మొత్తాన్ని విరాళంగా స్వీకరించాల్సి వస్తే చెక్ రూపంలో గానీ.. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు హవాలా మార్గంలో రూ.550 కోట్లను ఎన్నికల విరాళంగా చేరవేసినట్లు బాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పెండ్యాల శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డాక్యుమెంట్ల ద్వారా ఐటీ శాఖ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.550 కోట్లను విరాళంగా సేకరించడంపై విచారణకు హాజరు కావాలని సెక్షన్–131 కింద ఐటీ శాఖ తొలుత ఫిబ్రవరి 11న అహ్మద్ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. రెండోసారి ఫిబ్రవరి 18న ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుకూ అహ్మద్ పటేల్ స్పందించలేదు. దాంతో మార్చి 5న ఐటీ శాఖ మరోసారి నోటీసు జారీ చేసింది. ఈసారి విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అహ్మద్ పటేల్‌ను హెచ్చరించింది. అహ్మద్ పటేల్‌ను విచారించిన తర్వాత ఆయనకు హవాలా మార్గంలో నిధులు చేరవేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి, విచారిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. - ఐటీ శాఖ ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు కాంట్రాక్టు సంస్థల్లో సోదాలు చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా, నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేష్, నరేన్ చౌదరి(డీఎన్సీ ఇన్ఫ్రా), మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్(అవెక్సా ఇన్ఫ్రా) నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. - పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీగా అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు రూ.550 కోట్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ద్వారా హవాలా మార్గంలో చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వాటి ఆధారంగానే అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేశారు. - ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లుగా వసూలు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖర్చుల కోసం చంద్రబాబు సమకూర్చారని ‘సాక్షి’ అప్పట్లోనే వెల్లడించింది. - హవాలా మార్గంలో చంద్రబాబు చేరవేసిన నిధులను అహ్మద్ పటేల్.. అదే పద్ధతిలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సన్నిహిత కాంట్రాక్టు సంస్థలకు, కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే డీకే శివకుమార్‌ను ఈ అంశంపై విచారించిన ఐటీ శాఖ.. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌తోపాటు ఆయన సన్నిహిత కాంట్రాక్టు సంస్థలను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. - అహ్మద్ పటేల్‌ను, కమల్‌నాథ్ సన్నిహితులను విచారించిన తర్వాత.. అక్రమ లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది. - విచారణలో చంద్రబాబు వెల్లడించే అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. రంగంలోకి ఎస్ఎఫ్ఐవో! - చంద్రబాబు నిర్వహించిన హవాలా రాకెట్‌ను తీవ్రమైన ఆర్థిక నేరంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు(ఎస్ఎఫ్ఐవో) పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమైంది. - ఐటీకి సమాంతరంగా ఈ నేరంపై విచారణ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐవో డైరెక్టర్ అమర్దీప్సింగ్ భాటియా నిర్ణయించారు. - చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎస్ఎఫ్ఐవో బృందాలు రంగంలోకి దిగనున్నాయి. -
ఐటీ నోటీసులపై అహ్మద్ పటేల్ స్పందన
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ స్పందించారు. రూ. 550 కోట్ల లావాదేవీలపై తనకు నోటీసులు వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరఫున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని.. త్వరలోనే ఐటీ శాఖ ఇచ్చిన సమన్లపై స్పందిస్తానని తెలిపారు. తనకు ఇ- మెయిల్ ద్వారా రెండు సమన్లు వచ్చాయని.. పార్లమెంటు సమావేశాల తర్వాత ఐటీ శాఖ ఎదుట హాజరవుతానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఐటీ దాడుల గురించి శుక్రవారం ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. (చదవండి: అమరావతి నుంచి.. అహ్మద్ పటేల్‌కు!) కాగా అక్టోబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు దేశవ్యాప్తంగా 40 చోట్ల జరిగిన ఐటీ శాఖ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, పుణెతో పాటు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. అయితే ఆనాటి నుంచి తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అహ్మద్ పటేల్ విచారణకు హాజరుకాలేదు. కాగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నేత, సీఎం కమల్‌నాథ్ ఇంట్లో 20 కోట్ల నగదు దొరికినట్లు ప్రచారం జరిగింది. ఇక హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలో రెండో విడత తనిఖీలు జరిపిన ఐటీ అధికారులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాసరావు ఇంట్లో కీలక ఆధారాలు లభించిన విషయం విదితమే. మొత్తం ఉమ్మడి ఏపీ నుంచి రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వేర్వేరు మార్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రూ.2వేల కోట్లు చేరినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కంపెనీకి భారీ కాంట్రాక్టు ఇచ్చారని.. రూ.2652 కోట్ల పనులకు సంబంధించిన ఆ కాంట్రాక్టు నుంచి 20శాతం ముడుపులు పుచ్చుకునేలా ఒప్పందం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ముడుపులకు సంబంధించి ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరకడంతో వాటి ఆధారంగా... మొత్తం రూ.700 కోట్ల మేర ముడుపులకు ఒప్పందం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. వాటి ప్రకారం..ఈ మొత్తంలో ఒకే విడతలో ఏపీ ప్రముఖుడికి రూ.150కోట్ల ముడుపులు అందాయి... మిగిలిన రూ.550 కోట్ల ముడుపులు పొలిటికల్ ఫండింగ్ కోసం మరో మార్గంలో పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు చేరాయి. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా... అహ్మద్ పటేల్‌కు రూ.550 కోట్ల ముడుపులపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. -
ఐటీ నోటీసులపై స్పందించిన అహ్మద్ పటేల్
-
హవాలా రాకెట్‌కు బాబే నేతృత్వం!
-
అమరావతి నుంచి అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా..
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ‘సాక్షి’ గతంలో వెల్లడించిన అంశాలు అక్షర సత్యమని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈనెల 11న అహ్మద్ పటేల్‌కు నోటీసులు జారీ చేసిన ఐటీ అధికారులు 14వతేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానంటూ విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో అహ్మద్‌పటేల్‌కు ఈనెల 18న ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తమ ఎదుట విచారణకు హాజరై రూ.400 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ స్పష్టం చేయడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), ఎస్ఎఫ్ఐవో(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) రంగంలోకి దిగాయి. పారని పథకం.. చంద్రబాబు అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టుల నుంచి పేదల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వరకు అన్నిట్లో అంచనా వ్యయాలను పెంచేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన చంద్రబాబు అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ పంచన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు కావడం, రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు ఎత్తులు చిత్తయ్యాయి. హవాలా రాకెట్‌కు బాబే నేతృత్వం! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేస్తున్న కొన్ని కాంట్రాక్టు సంస్థల లావాదేవీలపై డేగ కన్ను వేసిన ఐటీ శాఖ చంద్రబాబు హవాలా రాకెట్‌కు నేతృత్వం వహిస్తున్నట్లు అనుమానించింది. గతేడాది నవంబర్ మొదటి వారంలో ఢిల్లీ, ముంబై, ఈరోడ్, పుణే, ఆగ్రా, గోవాలలో భారీ మౌలిక సదుపాయాల సంస్థల (కాంట్రాక్టు సంస్థలు) కార్యాలయాల్లో 42 చోట్ల ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. బోగస్ బిల్లుల ద్వారా రూ.3,300 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు గుర్తించింది. ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రముఖుడికి రూ.150 కోట్లకుపైగా ముడుపులు ముట్టాయనేందుకు పక్కాగా ఆధారాలు సేకరించినట్లు గత నవంబర్ 11న కేంద్ర ప్రత్యక్ష పెట్టుబడుల మండలి(సీబీడీటీ) అధికార ప్రతినిధి సురభి అహ్లూవాలియా ప్రకటించారు. అధిక ధరలకు ప్రతిఫలంగానే! తాత్కాలిక సచివాలయం, పట్టణ పేదల గృహ నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ‘ఆంధ్ర ప్రముఖుడు’ రూ.150 కోట్లకుపైగా ముడుపులు అందుకున్నట్లు నిర్థారణకు వచ్చిన ఐటీ శాఖ చంద్రబాబు కమీషన్ల బాగోతంలో ఇది మచ్చుకు మాత్రమేనని తేల్చింది. షాపూర్జీ పల్లోంజీ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈనెల 6 నుంచి 10 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మూడు కాంట్రాక్టు సంస్థల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. చంద్రబాబు కమీషన్ల బాగోతంలో స్వల్ప భాగం రూ.రెండు వేల కోట్లకుపైగా అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా, లోకేశ్ సన్నిహితులు కిలారు రాజేష్, నరేన్ చౌదరి(డీఎన్సీ ఇన్ఫ్రా), మాజీ మంత్రి ప్రత్తిపాటి తనయుడు శరత్(అవెక్సా ఇన్ఫ్రా) నివాసాలు, కార్యాలయాల్లో వేలాది డాక్యుమెంట్లు, 16కిపైగా బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణన.. చంద్రబాబు నిర్వహించిన హవాలా రాకెట్‌ను తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణిస్తున్న ఎస్ఎఫ్ఐవో దీనిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమైంది. ఐటీకి సమాంతరంగా విచారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐవో డైరెక్టర్ అమర్దీప్సింగ్ భాటియా నిర్ణయించారు. ఈ బృందాలు రెండు రోజుల్లో రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. నల్లధనాన్ని హవాలా మార్గంలో విదేశీలకు చేరవేసి అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో కాంట్రాక్టు సంస్థల్లోకి రప్పించి దారి మళ్లించడాన్ని బట్టి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన ఈడీ విభాగం అధికారులు ఐటీ శాఖ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. మాజీ పీఎస్ నుంచి కీలక ఆధారాలు.. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీ అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా ఓ కాంట్రాక్టర్ సాయంతో హవాలా మార్గంలో చేర్చారనేందుకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలోనే రూ.వేల కోట్ల నల్లధనాన్ని హవాలా మార్గంలో చంద్రబాబు తరలించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇక చంద్రబాబు మిగతా సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయితే పెద్ద ఎత్తున నల్లధనం వెలుగుచూసే అవకాశం ఉందని, ఇందులో అధిక శాతం కాంగ్రెస్ అధిష్టానానికి చేరి ఉంటుందని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఆ దిశగా విచారణను వేగవంతం చేసింది. -
కాంగ్రెస్ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అందులోని వివరాల ప్రకారం ఆ పార్టీకి రూ. 856 కోట్లను సమీకరించగా, అందులో రూ. 820.9 కోట్లు ఖర్చయినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ట్రెజరర్ అహ్మద్ పటేల్ సంతకం చేసిన పత్రాలను ఈసీకి అందించారు. ఇందులో ఎన్నికల వ్యవహారాల కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేయగా, రూ. 194 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ దగ్గర మొత్తం రూ. 315.88 కోట్లు మిగిలినట్లు తెలిపింది. ఇందులో రూ. 265 కోట్లు బ్యాంకులో ఉండగా, రూ. 50 కోట్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 516 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు బీజేపీ రూ. 714 కోట్లు ఖర్చుచేయగా 2019 వివరాలు వెల్లడించాల్సి ఉంది. (చదవండి: ‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు) -
ఎలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆగస్టు 21వ తేదీన నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న చిదంబరాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారివెంట చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్ నేతలు ఆయనతో దాదాపు అర్ధగంట సేపు ముచ్చటించారు. రాజకీయ అంశాలు ముఖ్యంగా కశ్మీర్ గురించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి వీరి మధ్య చర్చ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జైల్లో ఉన్న చిదంబరం సోమవారం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. జైలు వర్గాల ప్రకారంచ ప్రస్తుతం చిదంబరం ఆరోగ్యంగా ఉన్నారు. -
‘రాజీవ్‌ను బీజేపీయే బలితీసుకుంది’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలోకి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లాగడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ హత్యకు బీజేపీదే బాధ్యతని మండిపడ్డారు. రాజీవ్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్ధలు హెచ్చరించినా అదనపు భద్రత కల్పించేందుకు అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం నిరాకరించడాన్ని బీజేపీ సమర్ధించిందని గుర్తు చేశారు. విద్వేషం కారణంగానే రాజీవ్ తన ప్రాణాలు కోల్పోయారని, తనపై తప్పుడు ఆరోపణలకు బదులిచ్చేందుకు ఆయన మన మధ్య లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ హయాంలో గాంధీ కుటుంబం తమ సొంత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని మోదీ విరుచుకుపడిన మరుసటి రోజు పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత జలాల వద్ద నిఘాను పర్యవేక్షించాల్సిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను పదిరోజుల పాటు రాజీవ్ కుటుంబ సభ్యుల విహార యాత్రకు ఉపయోగించుకున్నారని మోదీ మండిపడ్డారు. -
30 ఏళ్లుగా ఒక్క ముస్లిం నెగ్గలేదు
ఎప్పుడో 1984 ఎన్నికల్లో.. ఆ రాష్ట్రం నుంచి ముస్లిం అభ్యర్థి అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతే.. ఆ తర్వాత ఇప్పటి దాకా ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా జాతీయ పార్టీల తరఫున (కాంగ్రెస్, బీజేపీ) అక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నిక కాలేదు. 30 ఏళ్లుగా లోక్‌సభకు జాతీయ పార్టీల నుంచి ఒక్క ముస్లిం కూడా ఎన్నిక కాని ఆ రాష్ట్రం గుజరాత్. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ జనాభాలో 9.5 శాతం ముస్లింలు ఉన్నారు. 1974లో అహ్మద్‌పటేల్ బరుచ్ స్థానం నుంచి గెలిచారు. 1989 ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. గుజరాత్ రాష్ట్రం ఆవిర్భవించాక 1962లో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి జొహారా చావ్డా నుంచి గెలిచారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ముస్లింలు అహ్మద్ పటేల్ (బరుచ్), ఇషాన్ జాఫ్రీ (అహ్మదాబాద్) మాత్రమే గెలుపొందారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ముస్లింలు లోక్‌సభకు వెళ్లడం అదే మొదటి, చివరిసారి. గుజరాత్లో ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం బరుచ్. ప్రస్తుతం అక్కడున్న 15.64 లక్షల ఓటర్లలో 22.2 శాతం ముస్లింలే. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరుచ్లో ఎనిమిది మంది ముస్లింలను నిలబెట్టింది. వారిలో అహ్మద్ పటేల్ ఒక్కరే గెలిచారు. అహ్మద్ పటేల్ 1977, 1982, 1984 ఎన్నికల్లో వరసగా ఇక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి కేవలం ఏడుగురు ముస్లిం అభ్యర్థులు మాత్రమే జాతీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా కాంగ్రెస్ తరఫునే నిలబడ్డారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 334 మంది పోటీచేశారు. వారిలో 67 మంది ముస్లింలే. అయితే, ఈ 67 మందిలో 66 మంది ఇండిపెండెంట్లుగానో, ఎస్పీ వంటి ఇతర పార్టీల తరఫునో పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి ఒక్కరే మక్సద్ మీర్జా నిలబడ్డారు. 1962 నుంచి 2014 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్లో 3,154 మంది పోటీ చేస్తే వారిలో జాతీయ పార్టీల తరఫున పోటీ చేసిన ముస్లింలు 15 మందే.వీరిలో ఏడుగురు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు.అయితే, రాష్ట్రంలో బీజేపీ తరఫున ఇంత వరకు ఒక్క ముస్లిం కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.రాష్ట్రంలో ముస్లింలు సామాజికంగానే కాక రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. 2002 అల్లర్ల తర్వాత వారి ప్రాతినిధ్యం మరీ తగ్గిపోయింది’ అన్నారు సామాజిక శాస్త్రవేత్త కిరణ్ దేశాయ్. -
బీజేపీ కంచుకోటపై కాంగ్రెస్ నజర్
అహ్మదాబాద్ : బీజేపీకి కంచుకోటగా 1991 నుంచి ఆ పార్టీకే పట్టంకడుతున్న బారుచ్ స్ధానం నుంచి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పటేల్ ఇదే స్ధానం నుంచి 1977, 1980, 1984లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. మరోవైపు భారతీయ ట్రైబల్ పార్టీతో (బీటీపీ) పొత్తు నేపథ్యంలో సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, బీటీపీలు చర్చల్లో మునిగితేలుతుండగా బరూచ్ స్ధానంపై చిక్కుముడి వీడలేదు. బీటీపీ నేత చోటుభాయ్ వసవా హస్తం గుర్తుతో పోటీచేయాలని కాంగ్రెస్ కోరుతుండగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో వసావకు సన్నిహితుడైన అహ్మద్ పటేల్ పేరును కాంగ్రెస్ తెరపైకి తీసుకువచ్చింది. పటేల్ అభ్యర్థిత్వానికి బీటీపీ సహకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గిరిజన ప్రాబల్య ప్రాంతమైన బరూచ్‌లో ప్రతిసారీ గిరిజన నేతకే అక్కడి ఓటర్లు పట్టం కడుతుండటంతో బీటీపీతో పొత్తు తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, తమ ప్రాబల్యం నిలుపుకునేందుకు బీజేపీ చెమటోడుస్తోంది. -
మోదీ కోసమే షెడ్యూల్ ఆలస్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియరనేత, కేంద్రమాజీ మంత్రి అహ్మద్ పటేల్ కేంద్ర ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పర్యటనలు ముగిసే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకుండా సీఈసీ ఆలస్యంచేస్తోందని అన్నారు. ఆయన అనుమతి తీసుకుని షెడ్యూల్‌ను ప్రకటించాలని ఈసీ చూస్తోందని, ఎన్నికల చివరి క్షణంలో కూడా మోదీ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని హోదాలో దేశమంతా పర్యటిస్తూ ఎన్నికల హామీలను ఇస్తున్నారని అహ్మద్ పటేల్ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధాని పర్యటన సందర్భంగా 538 కోట్లు విలువచేసే హామీలు ఇచ్చారని, ఇదంతా ఎన్నికల స్టంటేనని పేర్కొన్నారు. (ఈ వారంలోనే ‘సార్వత్రిక’ షెడ్యూల్) ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, మరో నెలరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని ఈసీని కోరారు. గతంలో గుజారాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహిరించిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులంతా దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారని ఇదంతా ఎన్నికల వ్యూహాంలో భాగమేనని పేర్కొన్నారు. ఈసీ వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం అహ్మద్ పటేల్ వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. Is the Election Commission waiting for the Prime Minister’s “official” travel programs to conclude before announcing dates for General Elections? — Ahmed Patel (@ahmedpatel) 4 March 2019 -
పాక్ జలఖడ్గంపై కేంద్ర ప్రకటన విడ్డూరం
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన నీటి వాటాను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. కశ్మీర్, పంజాబ్‌లలో ప్రాజెక్టులు కట్టి పాక్‌కు నీటి వాటాను తగ్గించాలని 2016లోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్‌కు నీటివాటాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాక్‌పై దేశ ప్రజలకున్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయమేమిటంటే!! ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అందుకే తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారని భారత్ ఆరోపిస్తోంది. దీంతో సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న నీటి వాటాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. (పాక్‌పై జలఖడ్గం) -
‘ముందుగానే బడ్జెట్ లీక్’
న్యూఢిల్లీ: కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అందులోని కీలకాంశాలు బయటకు పొక్కాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి తెలిపారు. ప్రభుత్వ వర్గాలే ఈ వివరాలను మీడియాకు లీక్ చేశాయని ఆయన ఆరోపించారు. వీటికి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇవే అంశాలు మధ్యంతర్ బడ్జెట్లో ఉన్నాయని వెల్లడించారు. బడ్జెట్‌ను ముందుగానే బయటకు లీక్ చేయడం చాలా సీరియస్ విషయమని, గోప్యత ఉల్లంఘనకు కిందకు వస్తుందని చెప్పారు. మోసకారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగా బడ్జెట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వర్ణించారు. గత నాలుగేళ్లలో వీటికి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు గాలం వేసేందుకే బడ్జెట్లో తాయిలాలు ప్రకటించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. (ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం) -
సోషల్ మీడియా
జవాబు కావాలి ‘‘కనీస ఆదాయం అనేది చట్టపరమైన హక్కా? కనీసం అంటే ఎంత? పేదలను ఎంపిక చేసే విధానం ఏంటి? బడ్జెట్ ఎంత? ఈ అదనపు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?– ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబులివ్వగలిగితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇది గొప్ప ఆలోచనగా అంగీకరించొచ్చు’’ – యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు అభివృద్ధి ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సరికొత్త ఒడిశా రాష్ట్ర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎవరూ నిరుద్యోగులుగా ఉండకుండా, ఎవరూ దారిద్య్రరేఖకు దిగువన లేకుండా చూస్తాం. ఒకే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి కాంగ్రెస్, బీజేడీలు ఒడిశా అభివృద్ధికి చేసిందేమీ లేదు’’ – అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు లెక్కలు ‘‘నేషనల్ స్టాటస్టికల్ కమిషన్‌లో ప్రభుత్వేతర సభ్యులంతా రాజీనామా చేశారు. దీంతో మరో సంస్థ పళ్లుపీకి నిర్వీర్యం చేసినట్టే. తమ అసమర్థ పాలనలో జరిగిన అవకతవకల డేటా అంతటినీ దాచిపెట్టడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది’’ – అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీ నియంతృత్వం ‘‘ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ, బలమైన ప్రధాని అనే అంశాలు వ్యవస్థలను బలహీనపరిచే రాజ్యాంగ నియంతృత్వానికి దారితీస్తాయి. అందువల్ల సంకీర్ణ ప్రభుత్వం చెడ్డదేమీ కాదు. డీమోనిటైజేషన్ లాంటి విధానపరమైన నిర్లక్ష్యపు ప్రయోగాలు జరుగవు. ఫెడరల్ స్ఫూర్తి విరాజిల్లుతుంది’’ – రూపా సుబ్రమణ్య జర్నలిస్ట్ -
హేళన చేయొద్దు; మోదీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానిని అవహేళన చేస్తూ మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రభుత్వం గట్టి సమాధానమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లో పౌరుల భద్రతను పట్టించుకోకుండా నరేంద్ర మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేస్తానడం విడ్డూరంగా ఉందని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అమెరికా అఫ్గనిస్తాన్‌లో ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ మాట్లాడుతూ...‘ భారత ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. 2004 నుంచి అఫ్గనిస్తాన్‌లో రోడ్లు, డ్యాముల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఈ విషయాలన్నీ ట్రంప్‌నకు ఒకసారి గుర్తుచేస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. (ప్రధాని మోదీపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు) భారత ప్రధానిని హేళన చేయడం ఆపండి ‘ప్రియమైన ట్రంప్ గారు.. భారత ప్రధానిని వెక్కిరించడం ఆపండి. అఫ్గనిస్తాన్ విషయంలో అమెరికా ఇచ్చే ఉపన్యాసాలను వినాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఆ దేశ పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సాయం చేసింది. మానవతా దృక్పథంతో కూడిన వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం అవసరమే. మా అఫ్గానీ సోదరసోదరీమణులకు మేము అండగా ఉంటాం’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా ట్రంప్ తీరును విమర్శించారు. Dear Mr. Trump, Stop mocking India’s PM India dosn’t need sermons from the U.S on Afghanistan Under Dr Manmohan Singh, India helped build Afghan National Assembly Humanitarian needs to strategic economic partnership, we are one with our Afghani brothers & sisters pic.twitter.com/DlK9BM9XsZ — Randeep Singh Surjewala (@rssurjewala) January 3, 2019 -
కాంగ్రెస్ ‘వార్ రూమ్’ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు బుధవారం ఏఐసీసీ వార్ రూమ్‌లో భేటీ అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని, ఈ లోపే క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుందని భేటీలో నిర్ణయించారు. గత నెలలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతలో ఇంకా వెనకబడే ఉన్నామని పలువురు ప్రస్తావించారు. ఎన్డీయేను అధికారం నుంచి దింపేందుకు అవసరమైన వ్యూహాలపై భేటీలో చర్చించారు. అయితే, విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడం బీజేపీకి లాభించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ప్రస్తావించిన ఖర్గే, అహ్మద్ పటేల్ తదితర నేతలు వాటిని అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. కీలక రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుపై ఒక అవగాహన, స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు, రాష్ట్రాల్లోని పీసీసీలకు మధ్య సమన్వయం అవసరమని పలువురు సూచించారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ‘ఏక వ్యక్తి సైన్యం’లా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన సంస్థాగత బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, పార్టీలో రాష్ట్రాల వారీగా సీనియర్లు, యువ నేతల మధ్య సయోధ్యకు, సహకారానికి రాహుల్ ప్రయత్నించాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు విజయావకాశాలు బలంగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందన్నారు. -
కాంగ్రెస్‌కు రెబెల్స్ బెడద
-
సెంటిమెంటే అస్త్రం.. అతిరథ మహారథుల ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే కారణమనే సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్‌పటేల్ బుధవారం వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్‌గా వెళ్లే కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైరాంరమేశ్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు.వీరప్పమొయిలీ, జైపాల్లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా, కుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్‌చౌహాన్, నారాయణస్వామిలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు. సర్దుకు పోండి.. మేం అండగా ఉంటాం ‘మహాకూటమి’కారణంగా కుదుర్చుకున్న పొత్తుల వల్ల నష్టపోతున్న స్థానాలు, పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ పెద్ద కసరత్తే చేసింది.అభ్యర్థుల ఖరారుకు ముందే రాష్ట్రానికి చెందిన 15 మంది వరకు నేతలను ఢిల్లీకి పిలిపించి వార్‌రూంలో చర్చించిన పార్టీ అధిష్టానం... అభ్యర్థిత్వాల ఖరారు కోసం మరోమారు బృందాలను పంపింది. మొదటి దఫాలో కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావులు హైదరాబాద్‌కు వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 మంది నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బెట్టుగా ఉన్న మరికొందరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఇద్దరు సీనియర్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది. కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, ఎస్.జైపాల్‌రెడ్డిలు గత రెండురోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ఇక బుధవారమే హైదరాబాద్ నగరానికి చేరుకున్న జైరాంరమేశ్ కూడా ఇదే పనిలో ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తోటకూర జంగయ్యయాదవ్ వద్దకు కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జెట్టి కుసుమకుమార్‌లతో కలపి బోడుప్పల్‌కు వెళ్లి మరీ జంగయ్యకు సర్దిచెప్పారు. ఈ చర్యలతో రెబెల్స్ బెడద అంతగా లేకుండా నివారించుకోగలిగారు. మరోవైపు శివకుమార్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.ప్రచారం, వ్యూహాలు, అంతర్గత సమస్యలపై ఆయన టీపీసీసీ ముఖ్యులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈనెల 23న జరగనున్న సోనియా, రాహుల్‌ల సభను జయప్రదం చేసేందుకు జైరాంరమేశ్ కూడా ఆయనకు తోడయ్యారు. ఇచ్చామన్న సెంటిమెంటుతో... పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. బుధవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ కూడా హైదరాబాద్ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్ శేరిలింగం పల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ అనునయించారు. ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏమిస్తామన్నది ఇప్పుడు చెప్పడం ధర్మం కాదని అయితే బిక్షపతి యాదవ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేందుకు అంగీకరించారని అహ్మద్ పటేల్ విలేకరులకు తెలిపారు.పటేల్ వెంట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి తదితరులు ఉన్నారు. మహిళా నేతలతో.. ప్రచారం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేతలనూ రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతికి తోడు తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జడ్చర్లలో రోడ్‌షో చేసిన ఖుష్బూ వచ్చే వారంలో మరిన్ని చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈమెతో పాటు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. -
‘మృగరాజు రక్షణకు వెయ్యికోట్లు ఇవ్వండి’
అహ్మదాబాద్ : అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న గుజరాత్ గిర్ మృగరాజుల రక్షణకు తక్షణమే వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలాగే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ, పర్యవేక్షణ లోపంతోనే సింహాలు మృతి చెందాయని ఆరోపించారు. గిర్ అటవీ సమీపంలోని అక్రమ రిసార్ట్స్‌లను వెంటనే తొలిగించాలని, గుజరాత్ సింహాల రక్షణ కోసం వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గుజరాత్ సింహాలకు పులులకిచ్చే ప్రాధాన్యతనే ఇస్తూ.. టైగర్ ప్రాజెక్ట్‌లా.. లయన్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. (చదవండి: మృగరాజుకు వైరస్ సోకిందా?) మోదీకి ఓ గుజరాతీగా.. గిర్ సింహాలు గుజరాత్ ఆత్మగౌరవమనే విషయం తెలుసన్నారు. వాటి రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్‌ను తెప్పించాలని, సింహాల కోసం వెటర్నరీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌తో దాదాపు 15 రోజుల్లోనే 23 సింహాలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: వైరస్‌తోనే గిర్ సింహాల మృతి) చదవండి: మృగరాజుకు ఎంత కష్టం! -
పటేల్ నియామకం వెనక మతలబేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా అహ్మద్ పటేల్‌ను నియమించడం వెనక పెద్ద మతలబే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్థికంగా నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏడాదిలోగా పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండడమే కాకుండా ఈ ఏడాది చివరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సినవే. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భారీ ఎత్తున పార్టీకి నిధులు సమీకరించాల్సి ఉంది. 20 ఏళ్ల క్రితం పార్టీక కోశాధికారిగా పనిచేసిన అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెల్సిందే. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అహ్మద్ పటేల్, ప్రభుత్వానికీ, పార్టీకి వారధిగా పనిచేశారు. ఆయనకు పార్టీ దిగువస్థాయి కార్యకర్త నుంచి అధిష్టానం నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మరోపక్క కార్పొరెట్ ప్రపంచంతో పరిచయం ఉండడమే కాకుండా కార్పొరెట్ దిగ్గజాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అపార పార్టీ నిధులు కలిగిన భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో అంతంత మాత్రం నిధులతో ఎదుర్కోవడం కష్టమని భావించే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి పదవికి పటేల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న మోతీలాల్ వోరాకు గత కొన్నేళ్లుగా నిధుల సమీకరణలో సహకరిస్తూ పరోక్ష కోశాధికారిగా పనిచేశారని, ఇప్పుడు అధికారికంగా కోశాధికారి అయ్యారని పార్టీ ఆఫీస్ బేరర్ ఒకరు వ్యాఖ్యానించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెల్సి అప్పటి వరకు ఆ పార్టీ వెంట ఉండి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ ప్రముఖులు బీజేపీ వైపు మళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అవడంతో పార్టీ నిధుల పరిస్థితి బాగా దిగజారింది. ఆ పార్టీ ప్రస్తుతం పంజాబ్, మిజోరమ్, పుదుచ్ఛేరిలో మాత్రమే అధికారంలో ఉండగా, కర్ణాటకలో సంకీర్ణ భాగస్వామి అధికారంలో కొనసాగుతోంది. ఈ కారణంగా ఆర్థిక వనరుల సమీకరిణకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణకు పార్టీ నాయకులపైనే ఆధారపడుతోంది. నిధులను సామర్థ్యం ఉన్న కారణంగానే మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కమల్‌నాథ్‌ను పార్టీ నియమించింది. ఇదే కారణంగా ఒడిశా పీసీసీ చీఫ్‌గా మళ్లీ నిరంజన్ పట్నాయక్‌ను పార్టీ మళ్లీ నియమించింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచి నిధుల సమీకరణకు గత మూడేళ్లుగా మోతీలాల్ వోరా చేసిన ప్రయత్నించలేదు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు బూటు’ ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అంబానీకి మోదీ ప్రభుత్వం మేలు చేసిందంటూ కార్పొరెట్ దిగ్గజాల లక్ష్యంగా రాహుల్ విమర్శలు చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి. -
కాంగ్రెస్ కోశాధికారిగా అహ్మద్ పటేల్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన కోశాధికారిగా సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న మోతిలాల్ వోరా... కొత్తగా సృష్టించిన పరిపాలనా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పటేల్ గతంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 1996–2000 మధ్య కాలంలో కూడా ఏఐసీసీ కోశాధికారిగా విధులు నిర్వర్తించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ సంస్థాగత పదవుల్లో కొన్ని మార్పులు చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మని కరణ్‌సింగ్ స్థానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌గా ఎంపికచేశారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితురాలిగా ఎంపికయ్యారు. లియుజిన్హో ఫాలేరియో ఈశాన్యరాష్ట్రాల(అస్సాం మినహా) ఇన్చార్జీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నిధుల సమీకరణలో ఆయనే కీలకం.. గాంధీ కుటుంబానికి విధేయుడైన 70 ఏళ్ల అహ్మద్ పటేల్ సుమారు 18 ఏళ్ల తరువాత మళ్లీ ఏఐసీసీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు, పార్టీ నిధుల కటకటతో అల్లాడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మితభాషి, మృదుస్వభావిగా పేరున్న పటేల్ తెర వెనక నుంచే వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట. 2004–14 మధ్య సోనియాకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన సమయంలోనే ఆయన తన సమర్థతను చాటుకున్నారు. ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు పటేల్ కీలకం కానున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్లను పక్కనపెట్టి, యువకులకే పెద్దపీట వేస్తున్నారని వినిపిస్తోంది. రాహుల్‌కు సన్నిహితుడైన కనిష్కసింగ్కు కోశాధికారి పదవి కట్టబెడతారని ఊహాగానాలు వినిపించినా, అవన్నీ తప్పని తేలింది. -
ఏఐసీసీలో కీలక నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏఐసీసీలో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ ట్రెజరర్‌గా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మోతీలాల్ ఓహ్రా స్థానంలో అహ్మద్ పటేల్ ఈ పదవిని చేపడతారు. సోనియా గాంధీకి కార్యదర్శిగా పనిచేసిన అహ్మద్ పటేల్ గతంలోనూ పార్టీ కోశాధికారిగా వ్యవహరించడంతో ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు ట్రెజరర్‌గా పటేల్ నియామకానికి రాహుల్ మొగ్గుచూపారు. ఇక కరణ్ సింగ్ స్ధానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మను రాహుల్ నియమించారు. అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జ్గా లుజిన్హో సలేరియోను నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను శాశ్వత ఆహ్వానితులుగా నియమిస్తూ రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్, జనార్థన్ ద్వివేది, కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే వంటి సీనియర్లను తప్పిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన బృందాన్ని తీసుకున్న తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు. -
సుప్రీంను ఆశ్రయించిన అహ్మద్ పటేల్
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజ్యసభ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చాలని గుజరాత్ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ అహ్మద్ పటేల్ అప్పీల్‌ను విచారించనుంది. కాగా గుజరాత్ నుంచి రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి బల్వంత్‌సింహ్ రాజ్పుట్ గుజరాత్ హైకోర్టులో జులై 9న పిటిషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు ఇద్దరు రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాజ్పుట్ తన పిటిషన్లో ప్రశ్నించారు. అహ్మద్‌పటేల్ 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూర్‌లోని రిసార్ట్‌లో అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా అవినీతి విధానాలను ఆశ్రయించారని ఆయన ఆరోపించారు. అయితే రాజ్పుట్ పిటిషన్ విచారణార్హమైనదని కాదంటూ దాన్ని కొట్టివేయాల్సిందిగా గుజరాత్ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని అహ్మద్ పటేల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఐదవ సారి గెలుపొంది పెద్దల సభకు ఎన్నికయ్యారు. తమ ఎమ్మెల్యేలు ఇద్దరు బహో గొహిల్, రాఘవ్ భాయ్‌లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటమే కాకుండా, తమ బ్యాలెట్ పత్రాలను బీజేపీ చీఫ్ అమిత్ షాకు చూపారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో వీరి ఓట్లు చెల్లవని ఈసీ స్పష్టం చేయడంతో అహ్మద్ పటేల్ గెలుపు మరింత సులువైంది. -
మమత, అహ్మద్ పటేల్ భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. చాణక్యపురిలోని బంగ్లా భవన్‌కు చేరుకున్న పటేల్.. మమతతో విపక్ష పార్టీల ఏకీకరణపై చర్చించారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సోనియా గాంధీ సూచనల మేరకే పటేల్, మమత భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేయడంలో మమత కీలకపాత్ర వహిస్తున్నారు. ఇందులో భాగం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ భేటీలో చర్చించారు’ అని తృణమూల్ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నప్పటికీ.. వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీశ్ వస్తే మళ్లీ చేర్చుకుంటాం: కాంగ్రెస్ బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఆయనను మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ అన్నారు. 2013లో నరేంద్రమోదీని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక జేడీయూ తన 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. 2015 బిహార్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమి ఏర్పాటు చేసి గెలిచి, మళ్లీ 2017లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేతో చేతులు కలిపింది. 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, జేడీయూల మధ్య సయోధ్య లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గోహిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ప్రణబ్ దా.. మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనబోతుండటంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రణబ్ సహచరులైన కాంగ్రెస్ నేతలు ఆయన తీరుపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రణబ్ తీరుపై స్పందించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి అత్యంత కీలకమైన అనుచరుడిగా పేరొందిన ఆయన.. ‘ప్రణబ్ దా.. మీ నుంచి ఇది ఆశించలేదు’ అని ట్వీట్ చేశారు. ప్రణబ్ తీరును ఆయన కూతురు షర్మిష్టా ముఖర్జీ కూడా తప్పుబట్టారు. నాగ్‌పూర్‌కు వెళ్లడం ద్వారా బూటకపు కథనాలను సృష్టించేందుకు బీజేపీ-ఆరెస్సెస్‌కు కావాల్సినంత అవకాశం కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను రాజకీయాలను వీడుతాను కానీ, కాంగ్రెస్ పార్టీని వీడబోనని షర్మిష్ట పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడిగా, లౌకికవాదిగా జీవితమంతా బీజేపీని, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ను తీవ్రంగా విమర్శించిన ప్రణబ్ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటం రాజకీయ దుమారం రేపుతోంది. -
పటేల్ ట్వీట్‌తో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో నెట్టగా తాజాగా మరో నేత అహ్మద్ పటేల్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో పార్టీని సెల్ఫ్‌గోల్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభంపై బీజేపీని విమర్శించే క్రమంలో పటేల్ చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 2014 నుంచి పతనమవుతున్న ఆహారోత్పత్తుల ధరలు వ్యవసాయ సంక్షోభానికి సంకేతంగా నిలుస్తాయని ఆయన ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో రైతుల ఆదాయం తగ్గిపోయిందని, ఈ నాలుగేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేవలం 3.6 శాతమే పెరిగాయని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ వేగంగా స్పందించింది. కేంద్రం విధానాలతో ఆహారోత్పత్తుల టోకు ధరల సూచీ దిగివస్తోందని..ఇది వినియోగదారులకు సానుకూల పరిణామమని వ్యాఖ్యానించింది. ‘అహ్మద్భాయ్..యూపీఏ హయాంలో అధిక ఆహార ద్రవ్యోల్భణం ఉండేదని అంగీకరించినందుకు ధన్యవాదాలు..రైతుల రాబడి పెంచుతూనే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నియంత్రిస్తోందని’ పటేల్ ట్వీట్‌కు బదులిస్తూ బీజేపీ నేత జయంత్ సిన్హా బదులిచ్చారు. కాంగ్రెస్ నేతలు నోరు జారడంతో పార్టీకి ఇబ్బందులు ఎదురవడం ఇటీవల ఇది రెండోసారి కావడం గమనార్హం. అలీఘర్‌లో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ చేతులకు ముస్లింల రక్తం మరకలు అంటాయని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఖుర్షీద్ వ్యాఖ్యలపైనా బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్లింల రక్తమే కాదు సిక్కుల రక్తాన్నీ కళ్లచూసిందని ఆరోపించింది. -
'మేఘాలయ మాదే.. అమ్మమ్మ దగ్గరకు వెళితే నేరమా?'
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర, నాగాలాండ్‌లో ఓటమిని అంగీకరించింది. ఓటమిగల కారణాలపై విశ్లేషించి పార్టీని మరింత బలంగా పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ అన్నారు. గతంలో నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకోగా ఈసారి కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఒక త్రిపుర గతంలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ కూడా ఖాతా తెరవలేకపోయింది. అయితే, మేఘాలయలో మాత్రం 2013లో 28 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి మాత్రం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస తరుపున అహ్మద్‌పటేల్ అధికారిక ప్రకటన చేశారు. 'మేఘాలయలో మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. త్రిపుర, నాగాలాండ్‌లో మాత్రం ఓడిపోయాం' అని ఆయన అన్నారు. ఇక ఓ పక్క ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ గాంధీ విదేశాలకు వెళతారా అని బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన విమర్శలపై అహ్మద్‌పటేల్ స్పందించారు. ఆయన అనవసరంగా మాట్లాడుతున్నారని, ఎవరైనా వారి అమ్మమ్మ దగ్గరకు వెళితే నేరం అవుతుందా అని ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం గిరిరాజ్ ప్రవృత్తిని బయటపెట్టుకోవడం తప్ప మరొకటి కాదని ఆయన ప్రతిదాడి చేశారు. -
అహ్మద్ పటేల్‌పై ఈడీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రాజకీయ సలహాదారు హోదాలో ఒక వెలుగు వెలిగిన అహ్మద్ పటేల్‌కు ఊహించిన సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణాల మోసానికి సంబంధించి ఒక కార్పొరేట్ సంస్థను ఈడీ విచారిస్తున్న సమయంలో.. అహ్మద్ పటేల్, ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖీల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో వీరిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వడోదర కేంద్రంగా పనిచేస్తున్న సందేశార గ్రూప్ ఆఫ్ సంస్థలు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సందేశార సంస్థల డైరెక్టర్ సునీల్ యాదవ్‌ను విచారించించిరు. ఈ విచారణలోనే సునీల్ యాదవ్, అహ్మద్ పటేల్ కుటుంబ సభ్యుల పేర్లను ఈడీకి వెల్లడించింనట్లు సమాచారం. సునీల్ ఇచ్చిన లిఖితపూర్వక సాక్ష్యంలో సందేశార గ్రూప్ యజమాని చేతన్ సందేశార, ఆయన సహచరుడు గగన్ ధావన్ భారీ మొత్తంలో సొమ్మును సిద్ధిఖీకి ఇచ్చినట్లు ఆరోపించారు. చేతన్ సందేశార తరపున భారీ నగదును ఫైజల్ పటేల్‌కు పంపించినట్లు తెలిపారు. చేతన్ సందేశార తరచూ అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్ళేవారని కూడా సునీల్ తెలిపారు. న్యూఢిల్లీలోని 23,మదర్ క్రెసెంట్‌లో అహ్మద్ పటేల్ నివాసం ఉంది. దీనిని సందేశార ప్రస్తావించినపుడు, ‘హెడ్‌క్వార్టర్స్ 23’ అని అభివర్ణించేవారని సునీల్ పేర్కొన్నారు. సిద్ధిఖీని జే2 అని, ఫైజల్‌ను జే1 అని సంబోధించేవారని పేర్కొన్నారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం నమోదు చేశారు. అందువల్ల దీనిని కోర్టులో సాక్ష్యంగా అనుమతిస్తారు. కేసేంటి? సందేశరా గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తాజా పరిణామాలపై స్పందించేందుకు అహ్మద్ పటేల్ నిరాకరించారు. -
'రాహుల్ హార్డ్‌వర్క్ సూపర్ .. పార్టీనే ఫెయిల్'
సాక్షి, న్యూఢిల్లీ : బలమైన వ్యూహాలు, ప్రభావమంతమైన నిర్వహణా లోపంవంటివి ఈ ఎన్నికల్లో తమ పార్టీలో కనిపించాయని రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. ఈ విషయంలో బీజేపీ ముందుందని చెప్పారు. సోనియాగాంధీకి కీలక సలహాదారుగా వ్యవహరించిన ఆయన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉన్న ఉత్సాహాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. రాహుల్ తన ప్రచార హోరుతో పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారని, ప్రధాని నరేంద్రమోదీకి కంటే కూడా ఎక్కువ ప్రతిస్పందన ఆయన ప్రచారానికి వచ్చిందని కొనియాడారు. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ ఊపును పార్టీ కార్యకర్తలు ఓట్ల రూపంలో మలచలేకపోయారని ఈ విషయాన్ని తాము పరిశీలనలోకి తీసుకుంటున్నామని అన్నారు. 'మరికొంత శ్రద్ద తీసుకొని ఉంటే మేం మరో ఏడు నుంచి ఎనిమిది సీట్లు పొందే వాళ్లం. గుజరాత్ ప్రజలు బీజేపీతో అలసిపోయారని మాకు తెలుసు. వారెవరు కూడా బీజేపీతో సంతోషంగా లేరు. వారు బీజేపీని ఓడించాలనుకున్నారు. మా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు బలంగానే పనిచేశారు. కానీ, భాగస్వామ్య పార్టీ అభ్యర్థులు మాత్రం సరిగా పనిచేయలేకపోయారు' అని చెప్పారు. ఏదీ ఏమైనా రాహుల్ మాత్రం బాగా కష్టపడ్డారని, ఆయన చేయగలిగిందల్లా చేశారని, ఓట్లు సంపాధించుకునే బాధ్యత మాత్రం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని అని, రాహుల్ ప్రచారాన్ని వారి వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు. -
‘గుజరాత్ సీఎం అభ్యర్థి అహ్మద్ పటేల్’
సాక్షి, సూరత్ : గుజరాత్ సీఎంగా అహ్మద్ పటేల్‌ను అత్యున్నత పదవిలో నిలిపేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ముస్లింలకు పిలుపు ఇస్తూ సూరత్‌లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అహ్మద్ పటేల్ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో అహ్మద్ పటేల్ స్పందించారు. తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని కాదని, భవిష్యత్‌లోనూ సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. ఓటమి భయంతో బీజేపీ దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. పార్టీ చీఫ్‌గా ఎన్నికవనున్న రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచార బరిలో సర్వం తానై ముందుండి నడిపిస్తున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఏ ఒక్కరి పేరునూ ఇంతవరకూ ప్రతిపాదించలేదు. తాజా సర్వేల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందని వెల్లడవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బీజేపీని మట్టికరిపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, గుజరాత్లో 1998 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. -
‘అహ్మద్ పటేల్‌కు ఐసిస్‌తో సంబంధాలు’
న్యూఢిల్లీ/రాజ్‌కోట్: ఓ ఐసిస్ ఉగ్రవాది ఇన్నాళ్లూ గుజరాత్లో పనిచేసిన వైద్యశాలకు, ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ పటేల్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం ఇద్దరిని అరెస్టు చేసింది. వారిలో కసీం స్టింబర్‌వాలా అనే వ్యక్తి భహ్రూచ్ జిల్లా అంకాలేశ్వర్‌లోని సర్దార్ పటేల్ వైద్యశాలలో పనిచేసేవాడు. అరెస్టవ్వడానికి ముందే రాజీనామా చేశాడు. ఈ ఆసుపత్రికి 2015 వరకు పటేల్ ధర్మకర్తగా ఉన్నారు. పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. 2015 వరకు వైద్యశాలకు పటేల్ ధర్మకర్తగా ఉంటే, అరెస్టైన వ్యక్తి ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడనీ, పటేల్‌పై ఆరోపణలు చేసి బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. -
ఆ ఎంపీకి ఉగ్రవాదులతో సంబంధాలు
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : ఈమధ్య అరెస్టయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదితో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు సంబంధాలున్నాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆరోపించారు. అహ్మద్ పటేల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యలను అహ్మద్ పటేల్, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. రెండురోజుల కిందట గుజరాత్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీస్) అధికారులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఖాసిం స్టింబర్‌వాలా అన వ్యక్తి అహ్మద్ పటేల్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్న సర్దార్ పటేల్ ఆసుపత్రిలో టెక్నీషిన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్‌లు ప్రజలకు వివరణ ఇవ్వాలని విజయ్ రూపానీ గాంధీనగర్‌లో డిమాండ్ చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయో ఒక్కసారి ఊహించుకోవాలని ఆయన తెలిపారు. ఖాసిం స్టింబర్వాలాను అరెస్ట్ చేయడానికి కేవలం రెండు రోజుల ముందే ఆసుపత్రిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని విజయ్ రూపానీ చెప్పారు. ఈ విషయమే అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. విజయ్ రూపానీ వ్యాఖ్యలపై ఎంపీ అహ్మద్ పటేల్ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులకు అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ సిబ్బందికి అభినందనలు అని అహ్మద్ పటేల్ చెప్పారు. అంతేకాక వారిపై దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి శిక్షించాలని కోరారు. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాక ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం.. దీనిపై రాజకీయాలు వద్దని ఆయన ట్వీట్ చేశారు. -
అహ్మద్ పటేల్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు దేవుడు ఒకటిచ్చి ఒకటి తీసుకుంటాడు. రాజ్యసభలో నాకు చోటిచ్చి, హమీద్‌జీ సీటు లాగేసుకున్నాడు. దేవుడు ఒకటడిగితే ఇంకోటి ఇస్తాడు. ఉపరాష్ట్రపతిగా గోపాలకృష్ణ గాంధీని ఇమ్మంటే వెంకయ్య నాయుడిని ఇచ్చాడు. హమీద్‌జీ ప్లేస్‌లో వెంకయ్య నాయుడిని ఊహించడం కష్టంగా ఉంది. ఊహేముందీ? వాస్తవమే! వచ్చి సీట్లో కూడా కూర్చున్నాడు. శుక్రవారం అయింది, శనివారం అయింది. ఈ శుక్రవారాలు, శనివారాలు ఇక్కడితో అయిపోయేవి కావు. వర్షాకాలాల్లో వర్షాకాల శుక్రవారాలు, వర్షాకాల శనివారాలు ఉన్నట్లే.. శీతాకాలాల్లో శీతాకాల శుక్రవారాలు, శీతాకాల శనివారాలు ఉంటాయి. ఇవి కాకుండా.. బడ్జెట్ కాల శుక్రవారాలు, బడ్జెట్ కాల శనివారాలు!! వారంలో వట్టి శుక్రవారాలు, శనివారాలు మాత్రమే ఉండవు కదా. ఇరవై నాలుగేళ్లుగా రాజ్యసభకు వచ్చిపోతున్నాను. ఎప్పుడూ నేనిలా రోజుల్ని, వారాల్ని లెక్కేసుకోలేదు! ఇంకో ఐదేళ్లు వెంకయ్య నాయుడిని చూస్తూ గడపాలి. నయం, రాజ్యసభ సభ్యుడికి ఉన్నట్లు, రాజ్యసభ ఛైర్మన్‌కి ఆరేళ్ల టెన్యూర్ లేదు. ఉండుంటే,æఇంకో ఏడాది ఆయన్ని శీతాకాలాల్లో, వర్షాకాలాల్లో, బడ్జెట్ కాలాల్లో చూస్తూ గడపవలసి వచ్చేది. ఇవాళ నేను నిద్ర లేవగానే సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుడిని ఒకటే కోరుకున్నాను. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిశాక, మళ్లీ ఆయన్నే రాష్ట్రపతిని చెయ్యకుండా, ఆ స్థానంలోకి వెంకయ్య నాయుడు వెళ్లేలా చూడు దేవుడా అని వేడుకున్నాను. అలా కాకుండా, హమీద్జీలా మళ్లీ వెంకయ్య నాయుడే రెండోసారి కూడా ఉపరాష్ట్రపతిగా కొనసాగితే రాజ్యసభలో నేను అదనంగా ఇంకో ఏడాది వెంకయ్య నాయుడిని చూస్తూ గడపవలసి వస్తుంది. ఒకవేళ నేను మళ్లీ ఇంకోసారి రాజ్యసభ సభ్యుడిని అయితే ఇంకో నాలుగేళ్లు వెంకయ్య నాయుడికి ఎదురుపడుతూనో, వెంకయ్య నాయుడు ఎదురు పడకూడదని అనుకుంటూనో గడపాలి. నాయుడి మీద నాకేం కోపం లేదు. నాయుడు ముఖంలో నాకు నవ్వు కనిపించదు. నవ్వు కనిపించని ముఖాల్ని నేను అస్సలు చూడలేను. నవ్వు కనిపించని ముఖం నాయుడిదైనా, నాయుడిది కాకపోయినా నాకది మోదీ ముఖంలానో, అమిత్‌షా ముఖంలానో కనిపిస్తుంది. పాపం వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్వు ముఖం పెట్టాలని చాలా ట్రై చేశాడు. మోదీ, అమిత్‌షా నవ్వలేదు. వెంకయ్య నాయుడినీ నవ్వనివ్వలేదు. మోదీ రాజ్యాంగ శక్తి. అమిత్‌షా రాజ్యాంగేతర శక్తి. శక్తులు నవ్వవు. ఒకరితో కలవ్వు. మోదీ, అమిత్ కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కలిసి లేరని నాకు అనిపిస్తుంది. కలిసి లేకున్నా కలిసి ఉన్నట్లు కనిపించే శక్తులు ఎప్పటికైనా డేంజర్. -
ఇకనైనా కాంగ్రెస్ రాత మారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి రాజ్యసభకు ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. 16 ఏళ్లపాటు తెరవెనక నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించిన అహ్మద్ పటేల్ విజయం పార్టీ కార్యకలాపాల్లో ఓ మలుపు కాబోతున్నదని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వరుస పరాజయాలతో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు తెచ్చేందుకు పటేల్ విజయం ఎంతో దోహదపడుతుందని వారంటున్నారు. ఆయన మళ్లీ పార్టీపై మునుపటి పట్టును సాధించగలరని వారు ఆశిస్తున్నారు. సోనియా గాంధీ కుమారుడిగా, రాజకీయ వారసుడిగా పార్టీ వ్యవహారాల్లో ప్రత్యక్ష పాత్ర వహిస్తున్న రాహుల్ గాంధీకి అహ్మద్ పటేల్ ఎప్పటికీ సమానుడు కాలేరు. రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్న నాటి నుంచి అహ్మద్ పటేల్ పార్టీ వ్యవహారాలకు కాస్త దూరం జరిగిన మాట కూడా వాస్తవమే. కాంగ్రెస్‌లో పార్టీ పునర్ వ్యవస్థీకరణ అంత సులభం కాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న చొరవకు పలు చోట్ల పార్టీ పెద్దలు అడ్డు తగులుతూ వచ్చారు. అందుకని ఇంతవరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను పూర్తిగా రాహుల్ గాంధీకి అప్పగించలేక పోయారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన విధేయుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు అవినాశ్ పాండేకు పార్టీలో పదోన్నతి కల్పించి ప్రధాన కార్యదర్శి హోదాలో రాజస్థాన్ పార్టీ వ్యవహారాలను అప్పగించడంలో విజయం సాధించారు. అలాగే పిఎల్ పునియా, ఆర్పీఎన్ సింగ్, ఆశా కుమారి, ఏ చల్లా కుమార్‌లకు రాష్ట్ర పార్టీల బాధ్యతలను అప్పగించడంలోనూ రాహుల్ గాంధీ తన పంథా నెగ్గించుకున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలైన కమల్ నాథ్, గులామ్ నబీ ఆజాద్, అంబికా సోని లాంటి వారిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మళ్లీ తీసుకున్నారు. అలాగే అహ్మద్ పటేల్ విధేయులైన మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలకు కూడా ప్రధాన కార్యదర్శులుగా తిరిగి తీసుకోవడమే కాకుండా ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను అప్పగించారు. దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నేతల బాధ్యతలను కుదించారు. గోవాలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నేపథ్యంలో దిగ్విజయ్‌ను గోవా, కర్ణాటక, తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ప్రస్తుతం ఏపీ ఇంచార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. పార్టీ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికవడం పార్టీ విజయంగా కంటే వ్యక్తిగతంగా ఇది పటేల్‌కు విజయమని చెప్పవచ్చు. ఇక ఆయన తన విజయాన్ని పార్టీ విజయంగా మల్చాల్సిన అవసరం ఉంది. రానున్న గుజరాత్ ఎన్నికల్లో అహ్మద్ నిర్వహించే పాత్రపై ఇటు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. -
కొత్త ముఖం కోసం కాంగ్రెస్ కసరత్తు!
మహాకూటమిలో నితీశ్ స్థానంలో మమత మమతా బెనర్జీతో అహ్మద్ పటేల్ కీలక చర్చలు తమ పార్టీని చీల్చే కుట్ర అన్న జేడీ(యూ) న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలపడం, తమిళనాలోని అధికార పార్టీ అన్నాడీఎంకే.. మోదీ ప్రభుత్వానికి చేరువవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్లో సమావేశం కానున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలను ఒకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొని విజయం సాధించిన సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఈ సమావేశానికి తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. విపక్ష నేతలందరినీ ఈ భేటీకి తీసుకొచ్చే బాధ్యతను నెత్తినవేసుకున్నారు. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో గురువారం రాత్రి అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. ఆమెతో 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ రోజు జరగనున్న సమావేశం అజెండా గురించి చెప్పడంతో పాటు, మమత ప్రధాన పాత్ర పోషించాలన్న విషయాన్ని పటేల్ గట్టిగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకోవడంతో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఆమెను మహాకూటమి తరపున ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సొంత పార్టీలోనే సమస్యలతో సతమతమవుతుండటంతో మాయావతి పేరు పరిశీలనకు రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మమత బెనర్జీని మహాకూటమిలో క్రియశీలకపాత్ర పోషించాలని అహ్మద్ పటేల్ కోరినట్టు తెలుస్తోంది. అయితే మర్యాదపూర్వకంగానే మమత బెనర్జీని కలిసినట్టు పటేల్ తెలిపారు. 'ఫైర్ బ్రాండ్'గా ముద్రపడిన మమత మహాకూటమికి ముఖ్యనేతగా మారాతారా, లేదా అనేదానిపై ఈ రోజు సమావేశంలో స్పష్టత రానుంది. కాగా, ఈ రోజు జరగనున్న సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించి చీల్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని జేడీ(యూ) నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. -
'గుజరాత్ ఈసారి మాదే.. బీజేపీది కాదు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయాన్ని సొంతం చేసుకొని మరోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కీలక ప్రకటన చేశారు. గుజరాత్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలే లక్ష్యంగా పనిచేస్తానంటూ పరోక్షంగా చెప్పారు. తన గెలుపు గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని, పార్టీ వర్గమంతా కొత్త శక్తిని నింపుకొందని అన్నారు. 'నేను నమ్మకంతో చెబుతున్నాను.. మేం గుజరాత్‌ను కూడా గెలుస్తాం. బీజేపీ దీనిని(రాజ్యసభ ఎన్నికలను) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇది వారి ఓటమి' అని ఆయన అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ 1995 నుంచి ఆ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు నచ్చిన విధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. -
అమిత్ షాకు పటేల్‌పై అంత కక్ష ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ అంశానికి మాత్రమే మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, అలా ఎందుకు జరగలేదు? గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారం ఎన్నికలు అత్యంత సాదాసీదా జరగాల్సి ఉండగా, ఆద్యంతం ఎందుకు ఉత్కంఠభరితంగా సాగాయి ? అమిత్ షా విజయాన్ని కీర్తించాల్సిన పత్రికల పతాక శీర్షికలు అహ్మద్ పటేల్ ఐదవసారి విజయానికి ఎందుకు పట్టంగట్టాయి? అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధేయుడు, పార్టీ వ్యూహకర్త అమిత్ షా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌గా పోటీ జరగడమే కారణమా? రాజకీయ చాణక్యంలో ఎవరిది పైచేయో తేల్చేసే ఎన్నికలు అవడం వల్లనా! వీరిద్దరి మధ్య రాజకీయ పోటీ వ్యక్తిగత పోటీగా మారడానికి కారణాలేమైనా ఉన్నాయా? ఇంతకు విజయం ఎవరిది? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికలు ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీలోని బలబలాల ప్రకారం అధికార బీజేపీకి రెండు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. రెండు సీట్లకు బీజేపీ అమిత్‌షా, స్మతి ఇరానీ పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ చక్రం తిప్పుతున్న అహ్మద్ పటేల్‌ను బరిలోకి దించింది. ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగుతాయని, ఇటు అమిత్ షా, అటు అహ్మద్ పటేల్‌లు విజయం సాధిస్తారని రాజకీయ, మీడియా వర్గాలు భావించాయి సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్‌సింహ్ వఘేలా పార్టీకి గుడ్‌బై చెప్పడం, ఆ తర్వాత ఆయన ఆరుగురు విదేయులు పార్టీకి రాజీనామా చేయడంతో అమిత్ షా బుర్రలో కొత్త ఆలోచన పుట్టింది. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ను అమిత్ షా రాజ్యసభకు నిలబెట్టారు. దీంతో కంగారు పడిన కాంగ్రెస్ పార్టీ తన గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాకకలోని ఓ రిసార్ట్‌కు తరలించింది. అయినప్పటికీ 15 కోట్ల రూపాయల చొప్పున తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనేందుకు అమిత్ షా ప్రయత్నించారని శక్తిసింహ్ గోయిల్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చిన బెంగళూరు రిసార్ట్ యజమాని, కాంగ్రెస్ మంత్రి ఇంటిపై, రిసార్ట్‌పై సీబీఐ దాడులు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సీబీఐ దాడులు చేయించిందనే ఆరోపణలు బలంగా వచ్చాయి. గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఇన్ని మలుపులు ఉన్నాయి కనుక సాదాసీదాగా జరగాల్సిన ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా కొనసాగాయి. అహ్మద్ పటేల్‌ను లక్ష్యంగా చేసుకొని అమిత్ షా ఎందుకు ఇంత తెగింపుకు దిగారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం మిగిలే ఉంది. 2010లో జరిగిన షొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో తనను జైలుకు పంపించారన్న కక్షతోనే అమిత్ షా, పటేల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. పటేల్ పన్నిన చక్రవ్యూహంలో భాగంగానే నాడు సీబీఐ తనను కేసులో అరెస్ట్ చేసిందన్నది అమిత్ షా నమ్మకం. అమిత్ షా వ్యక్తిగతంగా తనపై కక్ష పెంచుకున్నారని అహ్మద్ పటేల్ గత నెలలో బహిరంగంగా వ్యాఖ్యానించడం, అహ్మద్ పటేల్‌పై కక్షకు షోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాను జైలుకు పంపించడమే కారణమని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. వరుసగా రాజ్యసభకు నాలుగుసార్లు విజయం సాధించిన అహ్మద్ పటేల్‌ను ఓడించినట్లయితే ఇటు తన వ్యక్తిగత కక్ష తీరినట్లు ఉంటుందని, ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయంతో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి నైతిక స్థయిర్యం కూడా లేకుండా పోతుందని అమిత్ షా భావించినట్లు అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్కిన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరుతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంతకు ఈ పోరాటంలో విజేతలెవరు? పార్టీ ఎమ్మెల్యేలను తనవెంట ఐక్యంగా ఉంచేందుకు అహ్మద్ పటేల్ అలియాస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్‌పుత్‌కు ఓటేసినట్లు వీడియో సాక్షిగా చూపించారు. అందుకు వారి ఓట్లను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వాటిని ఓట్లుగా పరిగణించాల్సిందేనంటూ బీజేపీ పార్టీ ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను ఎన్నికల కమిషన్ వద్దకు రాయబారం పంపింది. తీవ్ర ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం మధ్య చర్చోప చర్చలు జరిపిన ఎన్నికల కమిషన్ చివరకు ఎన్నికల నిబంధనలకు శిరసావహిస్తూ ఇద్దరు రెబెల్ కాంగ్రెస్ శాసన సభ్యుల ఓట్లు చెల్లదని ప్రకటించడంతో అహ్మద్ పటేల్‌కు అంతిమ విజయం లభించింది. ఇంతకు విజేతలెవరో విజ్ఞులకు తేల్చి చెప్పాల్సిన అవసరం లేదు. -
అదృష్టం కలిసొచ్చి..
అర్ధరాత్రి అటు గుజరాత్‌లోనూ, ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ హైడ్రామా.. ఎత్తులకు పైఎత్తులతో సాగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్ గెలుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ. చివరికి ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఈసీ ప్రకటించడంతో 44 ఓట్లతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు! దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికల్లో పటేల్ తన బలంతో గెలిచారని అనేకంటే బీజేపీ మూడో అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ రెబల్స్ పొరపాటు వల్లే గట్టెక్కారని అనడం సబబుగా ఉంటుందేమో. తమ బ్యాలట్ పత్రాలను బహిరంగంగా ప్రదర్శించడం వారి పొరపాటు. ఈ ఎన్నికల్లో పటేల్ వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. తమ క్యాంపులోని 44 మందికి తోడు ఇద్దరు ఎన్సీపీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతుతో తమ బలం 47కు చేరుతుందన్నది ఆయన అంచనా. కానీ చివరికి దక్కింది 44 ఓట్లే. రెబల్స్ ఎమ్మెల్యేల ఓట్లూ చెల్లి ఉంటే కోటా ఓటు(తొలి ప్రాధాన్య ఓట్లతో గెలవడానికి కావలసిన ఓట్ల సంఖ్య) 45గా ఉండేది. అదే జరిగి ఉంటే పటేల్‌కు 44 ఓట్లే వచ్చాయి కాబట్టి రెండో ప్రాధాన్య ఓట్ల ఆధారంగా విజేతను తేల్చే పరిస్థితి వచ్చేది. పటేల్ విజయావకాశాలూ తగ్గేవి. సత్తా చూపలేకపోతున్న కాంగ్రెస్.. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.19 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. పైగా రాష్ట్రంలో బీజేపీకి పటిష్ట నాయకత్వమూ లేదు. మోదీ హవా, అమిత్ షా వ్యూహరచనపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటీదార్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో విపక్ష కాంగ్రెస్ సమరోత్సాహంతో ఉండాలి. మిగతా పార్టీల నేతలనూ తనవైపు ఆకర్షించగలగాలి. రాజ్యసభకు పటేల్ ఎన్నిక నల్లేరు మీద నడక కావాలి. కానీ వాస్తవం మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులను నీరుగార్చాలని బీజేపీ వ్యూహం పన్నింది. జాతీయస్థాయి కీలకనేత ఓడిపోతే కాంగ్రె స్ డీలాపడుతుందని భావించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించింది. వ్యూహం ఫలించడంతో ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం శంకర్‌సిన్హ్ వాఘేలా సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మూడో అభ్యర్థి బల్వంత్íసిన్హ్ రాజ్‌పుత్‌కు ఓటేశారు. ఈ ఎన్నికలకు ముందే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ఆలస్యంగా మేలుకుని గత నెలాఖర్లో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించింది. సోమవారం తిరిగి గుజరాత్‌కు తీసుకొచ్చి, ఓటేసేదాకా శిబిరంలోనే ఉంచింది. అయినప్పటికీ వీరిలో ఒకరు(కరమ్సింహ్ మక్వానా) బీజేపీకి ఓటేశారు! ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెప్పారు. పటేల్‌తో సహా కాంగ్రెస్ నేతలెవరూ దీన్ని పసిగట్టలేకపోయారు. పటేల్‌కు 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు, మరొకటి ఇతర పార్టీ నుంచి పడింది. ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు, జేడీయూ ఎమ్మెల్యే ఒకరు తాము పటేల్‌కు ఓటేశామని బాహాటంగా చెప్పారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరు పటేల్‌కు వేయలేదని పటేల్ దక్కిన 44 ఓట్లు తేటతెల్లం చేస్తున్నాయి. వీరిద్దరూ పటేల్‌కు ఓసేసి ఉంటే 45 ఓట్లు దక్కేవి. ఈ ఇద్దరిలో ఎవరు పటేల్‌కు ఓటేశారన్నది మిస్టరీగా మారింది. ఈ మొత్తం తతంగంలో కాం గ్రెస్ మంగళవారం సాయంత్రం చూపిన కార్యదక్షత ఆ పార్టీ పరువు కాపాడింది. రెబల్ ఓట్లు చెల్లవంటూ చిదంబరం సహా పలువురు నేతలు ఈసీని కలసి గట్టి వాదనలు వినిపిం చారు. ఏదేమైనా పటేల్‌ది ‘సాంకేతిక’ విజయం మాత్రమేనని, సంబరాలు జరుపుకోవాల్సినంత ఘన విజయం కాదని నిపుణులు అంటున్నారు. -
అహ్మద్ పటేల్‌కు 44 ఓట్లు
ఉత్కంఠభరిత పోరులో కాంగ్రెస్ నేత విజయం - సునాయాసంగా గెలుపొందిన అమిత్ షా, స్మృతి ఇరానీ - బీజేపీకి ఓటేసిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు అహ్మదాబాద్/న్యూఢిల్లీ: ఆద్యంతం ఉత్కంఠభరితంగా, వివాదాస్పదంగా సాగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌పై విజయం సాధించారు. పటేల్‌కు 44 ఓట్లు, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్‌పుత్‌కు 38 ఓట్లు వచ్చాయి. మంగళవారం రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోహిల్, రాఘవ్జీభాయ్ పటేల్ బ్యాలట్ పత్రాలను తమ పార్టీ ప్రతినిధికి కాకుండా బీజేపీ చీఫ్ అమిత్‌షాకు చూపారని కాంగ్రెస్ ఆరోపించడం, టీవీ ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల సంఘం వారి ఓట్లు చెల్లవని ప్రకటించడం తెలిసిందే. దీంతో ఒక అభ్యర్థి గెలవడానికి కావలసిన ఓట్ల సంఖ్య 45 నుంచి 44కు తగ్గింది. గ్రెస్, బీజేపీ.. ఈసీని ఆశ్రయించిన అనంతరం అర్ధరాత్రి దాటాక కౌంటింగ్ నిర్వహించారు. బీజేపీ నుంచి రెండు స్థానాలకు పోటీ చేసిన ఆ పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెరో 46 ఓట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు. అమిత్ షా తొలిసారి రాజ్యసభలో ప్రవేశిస్తుండగా, ఇరానీ పెద్దల సభకు తిరిగి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజకీయ సలహాదారైన పటేల్ ఐదోసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. పటేల్ విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. తుదుపరి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలు: పటేల్ ‘సత్యమే గెలుస్తుంది. ఇది నా విజయం మాత్రమే కాదు. అధికార దుర్వినియోగం, నిస్సిగ్గుగా వాడిన ధనబలం, కండబలాల ఉమ్మడి ఓటమి కూడా’ అని పటేల్ గెలుపు అనంతరం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు, ఒకే కుటుంబంలా కలసి పనిచేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జేడీయూ ఎమ్మెల్యే చోటూ వాసవ తనకు ఓటేసినందుకు పటేల్ ఆ పార్టీ నేత శరద్ యాదవ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. పటేల్ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాంధీనగర్‌లోని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. ‘ఈ ఎన్నికలు నా జీవితంలో అత్యంత కష్టమైనవి. నా విజయం పార్టీ కార్యకర్తల్లో అమిత ఉత్తేజం నింపింది. ఈ ఏడాదిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లు సాధించడమే మా తదుపరి లక్ష్యం’ అని అన్నారు. పెద్ద పోరాటంలో గెలిచినందుకు పటేల్‌ను అభినందిస్తున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. పటేల్‌ను శరద్ యాదవ్ కూడా అభినందించారు. కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవన్న ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తానని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చెప్పారు. మరోపక్క.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసిన తమ 8 మంది గుజరాత్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో శంకర్‌సిన్హ్ వాఘేలా, ఆయన తనయుడు మహేందర్ సిన్హ్, రాఘవ్జీ పటేల్, భోలాభాయ్ గోహిల్ తదితరులు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఆరుగురిని కూడా బహిష్కరించాలని అధిష్టానానికి సిఫార్సు చేశానని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ ఆరుగురిలో ముగ్గురు బీజేపీలో చేరడం తెలిసిందే. అమిత్ షా, ఇరానీలకు మోదీ అభినందన రాజ్యసభకు ఎన్నికైన అమిత్ షా, స్మృతి ఇరానీలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తిచేసుకున్నందుకు కూడా షాను అభినందించారు. ఆయన సారథ్యంలో పార్టీ దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించిందని కొనియాడారు. కాంగ్రెస్ సమస్యల పరిష్కర్త సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న 67 ఏళ్ల అహ్మద్ పటేల్ గాంధీ–నెహ్రూ కుటుంబానికి నమ్మిన బంటు. కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కర్తగా, వ్యూహనిపుణుడిగా పేరొందారు. పార్టీ బాధ్యతల్లో తలమునకలై ఉన్న ఆయన కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వంలో చేరాలన్న వినతిని మృదువుగా తోసిపుచ్చారు. భరూచ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన పటేల్ స్వయంకృషితో రాజకీయాల్లో పైకెదిగారు. గుజరాత్ నుంచి ఏడు పర్యాయాలు(మూడుసార్లు లోక్‌సభకు, నాలుగుసార్లు రాజ్యసభకు) ప్రాతినిధ్యం వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ–1 ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. -
సస్పెన్స్ థ్రిల్లర్.. బీజేపీకి షాక్
- తనదికాని మూడో స్థానం కోసం పోరి ఖంగుతిన్నబీజేపీ - కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం - రాత్రంతా హైడ్రామా.. 6గంటలు ఆలస్యంగా కౌంటింగ్ - హస్తం పార్టీకి కలిసొచ్చిన ఈసీ నిర్ణయం - అమిత్‌షాకు షాకిచ్చిన బీజేపీ రెబల్! మొత్తం స్థానాలు: 3 పోలైన ఓట్లు: 176, చెల్లని ఓట్లు: 2 మొదటి స్థానంలో స్మృతి ఇరానీకి: 45 (మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపు) రెండో స్థానంలో అమిత్ షాకు: 46(మొదటి ప్రాధ్యాన్య ఓటుతో గెలుపు) మూడో స్థానంలో అహ్మద్ పటేల్‌కు: 44 (మొదటి ప్రాధాన్య ఓటుతో గెలుపు) ఓడిన అభ్యర్థి బల్వంత్ సిన్హ్ రాజ్‌పుత్‌కు: 39 (బీజేపీ 31+ 7కాంగ్రెస్ రెబల్ ఓట్లు) అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం సస్సెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. బుధవారం తెల్లవారుజామున 2గంలకు తుదిఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు సునాయాసంగా గెలుపొందగా, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కాషాయదళం ఖంగుతిన్నది. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ 44 ఓట్లు సాధించి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పటేల్ గెలుపులో మలుపులివి.. సంచలనం రేపిన వీడియో: అహ్మద్ పటేల్‌ను ఎలాగైనాసరే దెబ్బకొట్టాలనుకున్న బీజేపీ.. శంకర్ సింన్హ్ వాఘేలా నేతృత్వంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకుంది. అనుకున్న ప్రకారమే వారంతా బీజేపీకి ఓటేశారు. కానీ అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు.. బ్యాలెట్ పత్రాలను బీజేపీ ఏజెంట్‌కు చూపించారు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజి కాస్తా రట్టుకావడం సంచలనంగా మారింది. దీంతో ఆ ఇద్దరి ఓట్లను రద్దుచేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఈసీని ఆశ్రయించారు. ఆరు గంటలు ఆలస్యంగా కౌంటింగ్: కాంగ్రెస్ రెబల్స్ బీజేపీకి ఓటేసిన వీడియోను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తున్న సమయంలోనే.. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం.. బ్యాలెట్ పేపర్‌ను చూపించిన ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఓట్లు చెల్లవని ఈసీ తేల్చిచెప్పింది. ఈ కారణంగా కౌంటింగ్ ప్రక్రియ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44కు కుదింపు: ఓటేసిన 176 మందిలో ఇద్దరి ఓట్లు చెల్లకుండా పోవడంతో అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44కు తగ్గింది. ఆ రకంగా ఈసీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. పటేల్‌కు ఓటేయని కాంగ్రెస్ ఎమ్మెల్యే: పోలింగ్ మొదలయ్యే సమయానికి చీలక వర్గం ఓట్లు పోను, కాంగ్రస్కు 44 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. కానీ వారిలో 43 మంది మాత్రమే అహ్మద్ పటేల్‌కు ఓటేశారు! గెలుపు కోసం అవసరమైన ఆ ఒక్క ఓటు ఎవరు వేశారనేదానిపై భిన్నవాదనలు నడుస్తున్నాయి. అమిత్ షాకు షాకిచ్చిన బీజేపీ రెబల్?: అహ్మద్ పటేల్‌ను ఓడించే దిశగా పలు వ్యూహాలు రచించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే నితిన్‌భాయ్ పటేల్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. నితిన్.. కాంగ్రెస్ అభ్యర్థి పటేల్‌కు ఓటు వేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం తమకు దక్కిన ఆ ఒక్క ఓటు.. జేడీయూ ఎమ్మెల్యే ఛోటుభాయ్ వాసవ లేదా ఎన్సీపీ ఎమ్మెల్యేదో లేక గుజరాత్ పరివర్తన్ పార్టీ(జీపీపీ) ఎమ్మెల్యేదో అయి ఉంటుందని భావిస్తోంది. పొలిటికల్ టెర్రరిజం: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీది రాజకీయ ఉగ్రవాదమని, అర్ధ,అంగబలంతో గెలవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. చివరికి సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. తనకు ఓటేసిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. -
ముమ్మాటికి గెలుపు నాదే: అహ్మద్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అహ్మద్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలపై ఈరోజు ఉదయం 9.30 గంటలకే అభ్యంతరం తెలిపామని ఆయన తెలిపారు. అయితే రిటర్నింగ్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అహ్మద్ పటేల్ ఆరోపించారు. కాగా తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సంఘంపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టం అవుతోందని కాంగ్రెస్ నేత అర్జున్ మోద్వాదియా ఆరోపించారు. వీడియో పుటేజీని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా పరిశీలించాలని కోరితే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని, దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, అంబికా సోనీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు అయ్యారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు, తాజా పరిణామాలు, భవిష్యత కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కాగా వైరల్ ఫీవర్ కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ భేటీకి గైర్హాజరు అయ్యారు. గుజరాత్ రాజ్యసభకు ఇవాళ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంపై ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారని, తాము బీజేపీకి ఓటు వేసినట్లు వారిద్దరూ అమిత్ షాకు చెప్పిన వీడియో రికార్డు అయినట్లు కాంగ్రెస్ నేత శక్తికాంత్ గోహిల్ తెలిపారు. వీడియో పుటేజీని ఇవ్వాలని కోరుతామని, ఒకవేళ వీడియో ట్యాంపరింగ్ చేస్తే అది క్రిమినల్ యాక్ట్ కిందకు వస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. ఇవాళ ఉదయం తమ గెలుపు ఖాయమన్న కాంగ్రెస్ ...ఇప్పుడు ఓటమి భయంతోనే ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తదితరులు సీఈసీని కలిశారు. కౌంటింగ్ తక్షణమే ప్రారంభించాలని కోరారు. -
కాంగ్రెస్‌లో ‘గుజరాత్’ టెన్షన్!
నేడు రాజ్యసభ ఎన్నికలు.. ► అహ్మద్ పటేల్ గెలుపుపై ఉత్కంఠ ► చివరిక్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ.. బీజేపీకి మద్దతు ► విజయానికి ఒక్క ఓటు దూరంలో పటేల్.. ► జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీపై కాంగ్రెస్ ఆశలు అహ్మదాబాద్: గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సోనియా రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఓడించి గట్టి షాక్ ఇవ్వాలని బీజేపీ, ఎలాగైనా గెలిచి దీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గుజరాత్లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌లు, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్‌లు బరిలో ఉన్నారు. పటేల్ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. ప్రస్తుతం 44 మందే ఉన్నారు. మిత్రపక్షం ఎన్సీపీకి చెందిన రెండు ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది. బీజేపీకి ఓటేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ సూచించారు. అయితే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చెప్పడం గమనార్హం. మారిన పరిస్థితితో కాంగ్రెస్ ఇప్పుడు జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అలాగే కాంగ్రెస్ మాజీ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా వర్గం ఎమ్మెల్యేలూ మద్దతిస్తారనే నమ్మకంతో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పాటు నోటా ఆప్షన్‌ను ఎంచుకుంటే పటేల్ ఓటమి ఖాయమని బీజేపీ అంచనా. వాఘేలా తిరుగుబాటుతో తప్పిన లెక్కలు కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో గత నెల్లో వాఘేలా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేల్ని రక్షించుకునేందుకు వారిని బెంగళూరు రిసార్టుకు తరలించారు. వీరితో పాటు జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉండగా ఆ ఓట్లపైనే పటేల్ గెలుపు ఆధారపడింది. నిజానికి పటేల్ నామినేషన్ సమయంలో ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండడం గమనార్హం. వాఘేలా వర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో కొందరు తమకే ఓటేస్తారని కాంగ్రెస్ ఆశతో ఉంది. బీజేపీకి ఉన్న బలంతో రెండు స్థానాల్లో సులువుగా విజయం సాధిస్తుండగా.. మూడో అభ్యర్థికి ఆ పార్టీ వద్ద 31 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. విజయం సాధించాలంటే అభ్యర్థి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో నాలుగో వంతుతో పాటు అదనంగా ఒక ఓటు సాధించాలి. నా గెలుపు ఖాయం: అహ్మద్ పటేల్ తన గెలుపుపై అహ్మద్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. ‘44 ఓట్లు కాదు ఇంకా ఎక్కువే వస్తాయి. గెలవడానికి కావాల్సిన∙బలం మాకుంది. మా ఎమ్మెల్యేలపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’ అని చెప్పారు. ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు ఇస్తారని పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ మాజీ నేత వాఘేలా మాత్రం తన వర్గం ఎమ్మెల్యేల మద్దతుపై దాటవేత ధోరణిలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వంతో తానసలు టచ్‌లో లేనని, బీజేపీకి మద్దతుపై చర్చల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని చెప్పను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అనేది ఎమ్మెల్యేకి వ్యక్తిగత ఆస్తిలాంటిది’ అని చెప్పారు. 1977 నుంచి అహ్మద్ పటేల్ తాను మంచి స్నేహితులమని.. ఇప్పుడు కూడా ఆ బంధం అలాగే కొనసాగుతుందని, అది రాజకీయాలకు అతీతమని అన్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. ఈగల్టన్ టు నిజానంద కొద్ది రోజులుగా బెంగళూరులోని ఈగల్టన్ రిసార్టులో మకాం వేసిన 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం వారిని పొరుగునే ఉన్న ఆనంద్ జిల్లాలోని నిజానంద రిసార్ట్‌కు తరలించారు. రక్షాబంధన్ కోసం వారి కుటుంబసభ్యులూ రిసార్ట్‌కు వచ్చారని, మంగళవారం ఓటింగ్ కోసం ఎమ్మెల్యేల్ని గాంధీనగర్‌కు తీసుకెళ్తామని కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ దోషి చెప్పారు. కాగా రిసార్టు లోపల పోలీసు రక్షణను ఎమ్మెల్యేలు తిరస్కరించడంతో వెలుపల బలగాల్ని మోహరించారు. ఎమ్మెల్యేలకు రక్షణగా రిసార్టులో కాంగ్రెస్ కార్యకర్తల్ని మోహరించారు. -
నెంబర్ గేమ్‌లో పటేల్ నెగ్గేనా..?
ఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయంపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికవనుండగా తగినంత సంఖ్యాబలం ఉండటంతో బీజేపీ నుంచి అమిత్ షా, స్మతీ ఇరానీ సులభంగా విజయం సాధించనున్నారు. మూడో అభ్యర్థిగా అహ్మద్ పటేల్ ఎన్నికపై కాంగ్రెస్‌లో కలవరం వ్యక్తమవుతున్నది. ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీ మద్దతుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్ ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది. సీనియర్ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ శిబిరంలో ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అహ్మద్ పటేల్ గెలవాలంటే ఆ పార్టీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రత్యర్థికి ఓటు వేస్తారనే వార్తలూ కాంగ్రెస్ క్యాంప్‌లో కలకలం రేపుతున్నాయి. అహ్మద్ పటేల్ నెగ్గాలంటే ఎన్సీపీ మద్దతు అనివార్యం. మరి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పటేల్ గెలుపు కోసం ఎలాంటి కసరత్తు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై తనకు పూర్తి నమ్మకం ఉందని... క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు మెజార్టీ ఉందని తెలిసి మూడో అభ్యర్థిని బరిలో దించడం బీజేపీ దుర్నీతికి నిదర్శనమని అహ్మద్ పటేల్ విమర్శించారు. -
ఉలిక్కిపడ్డ కాంగ్రెస్.. ఇంత నీచమా అంటూ గగ్గోలు!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యేలు బెంగళూరులో బస చేసిన రిసార్ట్‌పై, కర్ణాటక కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులతో ఉలిక్కిపడ్డ హస్తం అధినాయకత్వం.. ఇది బీజేపీ కుద్ర రాజకీయాలకు నిదర్శనమంటూ ఆక్రోశం వెళ్లగక్కింది. గుజరాత్లో రాజ్యసభ సీటు గెలిచేందుకే బీజేపీ ఇంతటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని విరుచుకుపడింది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన బెంగళూరులోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్‌పై ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులు నిర్వహించడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బీజేపీ నీచమైన ఎత్తుగడలతో కుట్ర పన్ని.. గుజరాత్లో రాజ్యసభ సీటు గెలువాలని భావిస్తోంది. మొదట ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపింది. అది విఫలం కావడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన బీజేపీ సర్కారు ఇప్పుడు కాంగ్రెస్‌పై ఐటీ దాడులు జరుపుతోంది' అని కాంగ్రెస్ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. 'ఒక్క రాజ్యసభ సీటు కోసం బీజేపీ అసాధారణమైనరీతిలో క్షుద్ర రాజకీయాలకు దిగుతోంది. మొదట ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంది. ఇప్పుడు ప్రతి సర్కారు ఏజెన్సీని వాడుకుంటోంది. ఐటీ దాడులు బీజేపీ నైరాశ్యాన్ని, నిస్పృహను చాటుతోంది' అని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అహ్మద్ పటేల్‌ను ఓడించడం ద్వారా కాంగ్రెస్‌ను గట్టిగా దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. దీంతో మరింతమంది ఎమ్మెల్యేలు జారుకోకుండా ఉండేందుకు మొత్తం 44 మందిని బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించింది. కర్ణాకటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారని భావించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ నేతలపై, ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌పై ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేశాయి. -
ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 15 కోట్లు!
తమ ఎమ్మెల్యేలను బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ ఆరోపణలు సాక్షి, బెంగళూరు/దొడ్డబళ్లాపురం: బీజేపీ వల నుంచి తమ గుజరాత్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బెంగళూరుకు తరలించామని కాంగ్రెస్ నేతలు ఆదివారం చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార బీజేపీలోకి చేర్చుకునేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు వల వేస్తున్నారన్నారనీ.. ఐటీ, సీబీఐ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించడం తెలిసిందే. ఇక్కడ తమ ప్రభుత్వం ఉండడంతో వారిని భద్రంగా కాపాడుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. డీకే శివకుమార్ ఆదివారం ఈగల్టన్ రిసార్ట్ సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలందరినీ మీడియాకు చూపించారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదనీ, వారి ఫోన్లను లాక్కోలేదని ఆయన చెప్పారు. తమ ఎమ్మెల్యేల హత్యకు కూడా బీజేపీ పథకం పన్నిన సమాచారం అందడంతో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. -
టార్గెట్ అహ్మద్ పటేల్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ గాంధీల తర్వాత మూడో స్థానంలో ఉన్న సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుందా? గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పటేల్ ఓటమి కోసం పావులు కదుపుతోందా? దీని కోసమే మూడో అభ్యర్థిని బరిలోకి దించిందా? గుజరాత్ రాజకీయ పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి! ఓడితే కాంగ్రెస్ లోపలా ప్రభావం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సుదీర్ఘకాలంగా సలహాదారుగా ఉన్న పటేల్ ఇందిర, రాజీవ్, పీవీ నరసింహారావుల హయాం నుంచి పార్టీలో ఒక వెలుగు వెలుగుతున్నారు. కాంగ్రెస్‌లో సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత ఆయన. రాహుల్ వర్గానికి పటేల్‌తో పొసగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఐదోసారి రాజ్యసభకు పోటీ చేస్తున్న పటేల్‌ను ఓడిస్తే కాంగ్రెస్ అంతర్గత సమీకరణాల్లో భారీ మార్పులు వస్తాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే గుజరాత్లో కాంగ్రెస్‌కి భారీ దెబ్బ తగులుతుంది. దీని కోసం కాషాయ దళం.. కాంగ్రెస్‌ను చీల్చి, మూడో అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఇప్పటికే గుజరాత్ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలను ప్రకటించిన బీజేపీ మూడో అభ్యర్థిగా.. గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను పోటీలో నిలిపింది. రాజ్‌పుత్.. వారం కిందట కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలాకు బంధువు. రాజ్‌పుత్ సహా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు శుక్రవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో 182 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి ప్లేటు ఫిరాయించే అవకాశముంది. అహ్మద్ పటేల్ గెలవాలంటే 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీని కోసం కాంగ్రెస్ మరింత మంది గోడదూకకుండా చూసుకోవాలి. కాంగ్రెస్‌కు ఒక జేడీయూ, ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే తాజా పరిణామాలు పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసంతృప్తులను పటేల్ శాంతపరుస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో వాఘేలా వర్గానికి చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థి మీరా కుమార్‌కు కాకుండా ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు ఓటేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలతో పాటు ఇటీవలే కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌లు రాజ్యసభకు నామినేషన్లను దాఖలు చేశారు. స్మృతి ఇరానీ రాజ్యసభ సభ్యత్వం ఆగస్టు 18 తో ముగియనుంది. -
అహ్మద్‌పటేల్‌కు కష్టాలు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ తరఫున గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న అహ్మద్ పటేల్‌కు కష్టలొచ్చిపడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటం ఆయన్ను కలవరపెడుతోంది. గురువారం ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. శుక్రవారం మరో ఇద్దరు ఎమ్మెల్యే తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం క్షీణిస్తుండటంతో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అహ్మద్‌పటేల్ విజయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో వైపు గుజరాత్ నుంచి రాజ్యసభ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు స్మృతి ఇరానీ కూడా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్
న్యూఢిల్లీ: గుజరాత్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు నరేంద్ర మోదీ 13 ఏళ్ల పాలన కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బలిపశువు త్యాగం బీజేపీని కాపాడలేదని ఘాటు వ్యాఖ్య చేశారు. 'గుజరాత్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు 2 ఏళ్ల ఆనందీబెన్ పాలన కారణం కాదు. 13 ఏళ్ల మోదీ పాలనే కారణమ'ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఆనందీబెన్ పటేల్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ పరిణామంపై స్పందించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆనందదీబెన్ రాజీనామాకు సిద్ధపడ్డారని శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. 2017లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. 13 years of Modi rule, not 2 years of Anandiben are responsible for Gujarat burning. Sacrificing the scapegoat won't save the BJP — Office of RG (@OfficeOfRG) 2 August 2016 -
నా తప్పుంటే ఉరి తీయండి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ ఒప్పందంలో తన తప్పు ఉన్నట్లు రుజువైతే తనను ఉరితీయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. బీజేపీ తనమీద చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, వాళ్లు అసలు తన పేరు ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు. అసలు తాను ఆ ఫైలుమీద ఏమీ రాయలేదని, అది తన చేతిరాత కాదని చెప్పారు. ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే వాళ్లు విచారణ చేయాలని అన్నారు. ప్రభుత్వం వద్ద ఈ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే.. వాళ్లు సభలో ప్రకటన చేయాలని మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. హెలికాప్టర్ల కాంట్రాక్టు పొందడానికి అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ దాదాపు రూ. 120-125 కోట్ల వరకు భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఇటలీ హైకోర్టు తన తీర్పులో నిర్ధారించడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అగస్టా సంస్థ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆయన సన్నిహితుడు అహ్మద్ పటేల్, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులతో లాబీయింగ్ చేసినట్లు కోర్టు తన పరిశీలనలో తెలిపింది. -
మోడీ డీడీ ఇంటర్వ్యూపై దుమారం
* బీజేపీ నేత పచ్చి అబద్ధాలాడుతున్నారన్న అహ్మద్ పటేల్ * ఇంటర్వ్యూకు కోతపై విచారణకు బీజేపీ డిమాండ్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దూరదర్శన్కిచ్చిన ఇంటర్వ్యూపై వివాదం మరింత ముదిరింది. మోడీ వ్యాఖ్యలు ఆధార రహితం, పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ చీఫ్ సోనియూగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు.తమ మధ్య సాన్నిహిత్యం ఉంద న్న మోడీ వ్యాఖ్యలను పటేల్ ఖండించారు. ‘కాంగ్రెస్‌లో నాకున్న చాలా మంచి స్నేహితుల్లో అహ్మద్ భాయ్ ఒక రు. అరుుతే ఇప్పుడంతగా లేదు. ఆయనకేదో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. కనీసం నేను చేసే ఫోన్లకు కూడా స్పందించకుండా తప్పిం చుకుంటున్నారు..’ అని మోడీ దూరదర్శన్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పటేల్ మాత్రం ఇదంతా రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ఎన్నికల నేపథ్యంలో అయోమయూన్ని, అనుమాన మేఘాలు సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. గుజరాత్ సీఎం నుంచి తానేమైనా లబ్ధి పొందినట్టుగా ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రజా జీవితం నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను మోడీ కార్యాలయంలో కానీ, నివాసంలో కానీ ఎన్నడూ ఆయనతో భేటీ కాలేదని తేల్చిచెప్పారు. 80వ దశకంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మోడీ తన వద్దకు వస్తే తాను భోజనానికిఆహ్వానించేవాడినని తెలిపారు. మోడీ ఇంటర్వ్యూకు దూరదర్శన్ కత్తెర వేసిందనే ఆరోపణల నేపథ్యంలో అసలు వివా దం తలెత్తింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇలా జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రియూంక తన కుమార్తె లాంటిదని మోడీ ఇంటర్వ్యూలో అనలేదని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.ఎవరి జోక్యంతో ఇం టర్వ్యూకు కోత వేశారో విచారణ జరపాలన్నారు. ఈ ఆరోపణలను దూరదర్శన్, ప్రభుత్వం ఖండించాయి. -
'మోడీవన్నీ అబద్ధాలే.. ఆయన నా స్నేహితుడు కాదు'
బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తనకెప్పుడూ స్నేహితుడు కాడని సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. తామిద్దరం తరచు కలిసేవారిమని, తామిద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని మోడీ చెప్పడం చాలా హాస్యాస్పదమని అన్నారు. మోడీ అలా చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించడానికే ఆయనలా చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి తాను ఏమైనా తీసుకున్నట్లు ఆయనవద్ద ఆధారాలుంటే నిర్భయంగా బయట పెట్టాలి తప్ప ఇలా చెప్పడం సరికాదని అన్నారు. తన సొంత పార్టీలోనే ఎవరితోనూ స్నేహంగా ఉండని మోడీ... తనతో స్నేహం చేయడం ఎలా సాధ్యమని అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. మోడీని ఆయన ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ ఎప్పుడూ కలవలేదని, అలాగే ఆయన కూడా తనతో కలిసి ఎప్పుడూ భోజనం చేయలేదని స్పష్టం చేశారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అహ్మద్ పటేల్, తాను మంచి స్నేహితులమని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనలా లేరని, బహుశా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండటంవల్లే తనను తప్పించుకుని తిరుగుతున్నారని మోడీ చెప్పారు. పటేల్‌ను తానెప్పుడూ అహ్మద్ భాయ్ అనలేదని, బాబూ భాయ్ అనేవాడినని అన్నారు. దాన్నే అహ్మద్ పటేల్ ఇప్పుడు నిర్ద్వంద్వంగా ఖండించారు. -
కెప్టెన్‌కు ఆఫర్!
* చేతికి చిక్కేనా? * రెండు రోజుల్లో నిర్ణయం *చెన్నైకు విజయకాంత్ సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధం అయ్యారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ డీఎండీకే యువజన నేత సుదీష్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సింగపూర్ నుంచి విజయకాంత్ రాగానే, తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొన్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌కు లోక్‌సభ ఎన్నికలు డిమాండ్‌ను పెంచాయి. ఆ పార్టీకి ఉన్న పది శాతం ఓటు బ్యాంక్ తమకు కలిసి రావాలన్న కాంక్షతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఉరకలు తీస్తున్నాయి. తొలుత కాంగ్రెస్, డీఎండీకే, డీఎంకేల నేతృత్వంలో కూటమి ఆవిర్భవిస్తుందని సర్వత్రా భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే శ్రమించింది. ఆయన నిర్ణయాలకు అంగీకరించడంతో పాటుగా ఢిల్లీ వేదికగా మంతనాలు జరిగి ఉన్నాయి. బీజేపీ సీనియర్లతో డీఎండీకే యువజన నేత సుదీష్ చర్చలు సైతం జరపడంతో ఇక ఆ కూటమిలోకి డీఎండీకే వెళుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, బీజేపీ వెంట డీఎండీకే వెళ్ల కుండా కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. కాంగ్రెస్ ఆఫర్: విజయకాంత్ వస్తే, ఎన్నికల అనంతరం ఆయన ఏ కోరిక కోరినా ఇచ్చే ఆఫర్‌ను కాంగ్రెస్ ప్రకటించినట్టు తెలిసింది. తన ప్రతినిధి రాజ్యసభలో అడుగు పెట్టాలన్న ఆశతో విజయకాంత్ ఉన్న విష యం తెలిసిందే. అదే సమయంలో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల ఖర్చును సైతం భరించేందు కు ముందుకు రావాలన్న డిమాండ్‌ను జాతీయ పార్టీలకు కెప్టెన్ చెప్పారు. విజయకాంత్ అనేక డిమాండ్లు పెట్టినా, అందులో కొన్నింటికి బీజేపీ తలొగ్గింది. అయి తే, సీట్ల పందేరం వద్ద వివాదం సాగుతుండడంతో పొత్తుల ప్రకటనపై జాప్యం నెలకొంది. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం విజయకాంత్ గాలం వేసింది. డీఎంకే తమతో కలసి వచ్చినా, రాకున్నా డీఎండీకే, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా అభ్యర్థులు నిలబెట్టి సత్తాను చాటే రీతిలో వ్యూహ రచన చేస్తున్నారు. మంతనాలు: విజయకాంత్ తమ ముందు గతంలో ఉంచిన డిమాండ్లన్నింటికీ తలొగ్గేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ నేతలు సుదీష్‌తో ఆదివారం భేటీ కావడంతో పాటుగా సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్‌తో ఫోన్లో మాట్లాడించినట్టు తెలిసింది. విజయకాంత్ చెన్నైకు రాగానే, తనతో మాట్లాడించాలని సుదీష్ దృష్టికి అహ్మద్ పటేల్ తీసుకెళ్లినట్టు సమాచారం. సుదీష్ చెంతకు వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు విజయకాంత్ చెన్నైకు రాగానే, ఆయన ఇంటి మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. డీఎండీకేకు రాజ్యసభ సీటుతో పాటుగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవుల్ని సైతం ఆఫర్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ ఆఫర్‌కు విజయకాంత్ తలొగ్గేనా? అన్నది రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది. సింగపూర్ వెళ్లిన విజయకాంత్ సోమవారం అర్ధరాత్రి లేదా, మంగళవారం చెన్నైకు చేరుకునే అవకాశం ఉందని, రెండు రోజుల్లో పొత్తులపై తన నిర్ణయాన్ని తమ నేత తప్పకుండా ప్రకటిస్తారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వెంకటేషన్ పేర్కొనడం గమనార్హం. -
మోడీ చాయ్‌వాలా కాదు..కాంట్రాక్టర్
అహ్మదాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి , గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ‘చాయ్ వాలా’ ప్రచారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ రంగంలోకి దిగారు. మోడీ చాయ్‌వాలా కాదని, ఆయనో కేంటీన్ కాంట్రాక్టరని సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి పటేల్ చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ఆరంభించారని, అదంతా ఆయన ఆడే నాటకంలో ఓ భాగమేనని పటేల్ పేర్కొన్నారు. ఆయనో కాంట్రాక్టర్ అనే విషయాన్ని చాయ్‌వాలాల సంఘం తనకు చెప్పిందని మోడీ పేరెత్తకుండా ఇక్కడ శనివారం జరిగిన ‘స్వరాజ్ కుచ్’ సభలో పాల్గొన్న అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. అత్యంత ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని కుర్చీకి నిచ్చెన వెయ్యాలని అనుకుంటున్నారని మోడీపై మండిపడ్డారు. మోడీ చెప్పే గుజరాత్ మోడల్ నకిలీదని, గాంధీ, పటేల్ భావజాలమే అసలైన గుజరాత్ మోడల్ అని పటేల్ అభిప్రాయపడ్డారు. అయాచితంగా పదవిలోకి వచ్చిన వారికి ఆకస్మికంగా తానో చాయ్‌వాలానని, రామభక్తుడినని గుర్తొస్తుందని విమర్శించారు. గుజరాత్ ప్రథమ స్థానంలో ఉందని మోడీ చెపుతుంటారని, అయితే అది అథమం నుంచి ప్రథమం అని ఎద్దేవా చేశారు. -
మూడు రోజులు హస్తినలో మకాం.. టీ కాంగ్రెస్ నేతల నిర్ణయం
టీ కాంగ్రె స్ నేతల నిర్ణయం... సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే వారు ఢిల్లీకి వెళుతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసి కేంద్రం, హైకమాండ్‌లోని పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా దాదాపు 90 మంది వరకు హస్తినకు వెళుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు శనివారం తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, ఆంటోనీ, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ కలిసేందుకు నిర్ణయించారు. ఇటీ వలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి వెళతారా? లేదా? అనేది పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలను కోరనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భయాందోళనలను పారదోలేందుకు తగిన భరోసా కూడా కేంద్రం తరఫున ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తొందరగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా ఒత్తిడి చేయడానికే ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. -
అహ్మద్ పటేల్‌తో సీమాంధ్ర నేతల భేటీ
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో బుధవారం ఇక్కడ భేటి అయ్యారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఆయనకు వివరించారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులు అర్థమవుతున్నాయని పటేల్ తమతో అన్నట్టు భేటీ అనంతరం సీమాంధ్ర నాయకులు చెప్పారు. రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లలేమని, అలాగని ఇప్పటికప్పుడు ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని పటేల్ తమతో అన్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విషయాలన్నింటినీ పార్టీ అధినేత సోనియా గాంధీ దృష్టికి తీసుకెళతానని చెప్పినట్టు సీమాంధ్ర నాయకులు చెప్పారు. -
హ్యూమరం: కుదిరితే కప్పు కాఫీ
ఢిల్లీలో సోనియాతో కీలక సమావేశం. సమస్యలపై నిలదీసైనా సరే పరిష్కారం కోరాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా మూకుమ్మడిగా వెళ్ళారు. సోనియా వస్తున్నట్టు తెలియగానే అందరిలో వణుకు మొదలైంది. అహ్మద్‌పటేల్ వచ్చి అందరికి ఉన్ని శాలువాలు కప్పాడు. సోనియా వచ్చింది. వణుకుతూ అందరూ నిలబడ్డారు. ఎందుకైనా మంచిదని కొందరు గుంజీలు తీసారు. ‘‘చలి లేకపోయినా మీరు వణుకుతున్నందుకు సంతోషంగా ఉంది. వణకడం మన సంస్కృతి’’ అంటూ కాఫీ తెమ్మని చెప్పింది. ‘‘ఇప్పుడు మీరు తాగుతున్న కాఫీ బ్రెజిల్ నుంచి, కెటిల్ జర్మనీ నుంచి, కప్పులు బర్మా నుంచి, చెంచాలు...’’ అనగానే ఇద్దరు ముగ్గురు నాయకులు లేచి నిలబడ్డారు. ‘‘నేను చెబుతున్నది స్పూన్ల గురించి. అన్నీ విదేశాల నుంచి వస్తే మరి మనదేశం నుంచి ఏమీ రాలేదా అని మీకు అనుమానం రావచ్చు. ఈ కాఫీ తయారు చేసినవాడు మనవాడే’’ అంటూ వంటవాడిని పిలిచింది. వంటవాడు వచ్చి ‘‘అమ్మగారూ కాఫీ మీద కవిత్వం చెప్పమంటారా?’’అని, ‘‘కాఫీ తాగినవాడికి అవుతుంది రుణమాఫీ.. డికాషన్‌తో రాదు రియాక్షన్.. ఇంటికి పైకప్పు లేకపోయినా తాగు కప్పు కాఫీ.. అన్నిటికి కాపీ రైట్ వున్నపుడు కాఫీకెందుకు లేదు కాపీరైట్’’ నాయకులంతా వహ్వావహ్వా అన్నారు. అహ్మద్‌పటేల్ ఉత్సాహపడి తాను కూడా అందుకున్నాడు. ‘‘సూఫీ కవులు చెప్పారు కాఫీ గురించి.. కాపీ కవులు కూడా చెప్పారు.. టోపీ పెట్టేవాడు, పెట్టించుకునేవాడు ఇద్దరూ కలిసి తాగాలి కాఫీ.. అప్పుడే డెమాక్రసీకి టేకాఫ్’’ ‘‘వహ్వా..వహ్వా..’’ సోనియా సంతోషపడి ‘‘ఈ కాఫీని షుగర్‌తో తాగొచ్చు, లేకుండా తాగొచ్చు.. షుగర్ వుంటే తగ్గుతుంది లేకుంటే వస్తుంది. దీన్ని డాక్టర్స్ డైలమా అంటారు’’అంది. ‘‘క్యా డైలాగ్ హై’’ చిదంబరం వచ్చి కాఫీకి పుట్టినిల్లు తమిళనాడని పొగిడి తానూ కూడా కవిత్వం చెబుతానని రంగంలోకి దిగాడు. ‘‘కాఫీ ఇనక్కుపోలే మనక్కుపోలే ఎండ్రపొంగలే దీపావళి’’ అన్నాడు. మనవాళ్ళు వెంటనే వహ్వావహ్వా అన్నారు. ‘‘ఎన్నయ్యా వహ్వా? ఇప్పుడు నేను మాట్లాడింది తమిళం కానేకాదు. అదేం భాషో నాకు కూడా తెలియదు. ఢి ల్లీలో జరిగే ప్రతిదానికీ వహ్వా అని అని మన పార్టీని మాఫీ చేసారు మేడం ’’ అని ఇరికించాడు తమిళతంబి. సోనియాకి కోపమొచ్చింది. నాయకులకు చలిజ్వరమొచ్చింది. అహ్మద్‌పటేల్ కంబళ్ళు తెచ్చి కప్పేసరికి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. బయట ప్రెస్వాళ్ళు మైకులతో చుట్టుముట్టగానే ‘‘చర్చలు వాడిగా వేడిగా జరిగాయి. కాఫీ తాగినంత సులభంగా సమస్యలను పరిష్కరిస్తానని సోనియా చెప్పారు’’అని బ్రీఫింగ్ ఇచ్చారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం కొరడాతో కొట్టుకున్న తెలుగుదేశం నాయకులు జనానికి శ్రమ తగ్గించారు. తెలుగుభాషలో చిరంజీవికి నచ్చే ఒకే ఒక్క పదం?పదవి. హరికృష్ణపై దేశం నాయకుల కామెంట్? హరీ... ఏమిటీ కిరికిరి! తెలుగు అంటే సోనియాకు ఎందుకు నచ్చదు? ఇటలీతో దేన్నీ పోల్చడం ఆమెకు ఇష్టముండదు. (తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు.) కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్య: స్టీరింగ్, చక్రాలు లేకుండా బండి నడపడం ముఖ్యమంత్రికే సాధ్యం. టీకొట్టు కామెంట్ ఇంట్లో ఉల్లి లొల్లి, బయట ఢిల్లీ లొల్లి. -
ఆ నలుగురు...!
సంపాదకీయం: దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి పూనుకునే ముందు ఎలా ప్రవర్తించాలో, ఆ పరిష్కార ప్రక్రియలో అందరి భాగస్వామ్యమూ తీసుకోనట్టయితే ఏమవుతుందో తల వాచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చినట్టుంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. కొంపలంటుకున్నాక బావి తవ్వడానికి ప్రయత్నించినట్టున్న ఈ కమిటీ ఏం చేస్తుంది, పరిస్థితిని ఎలా చల్లారుస్తుందన్న సంగతలా ఉంచితే... రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు ‘నలుగురి’ అవసరం పడిందని స్పష్టంగానే తెలుస్తోంది. గత పది రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదంటే కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాకు సిద్ధపడాల్సివచ్చింది. పార్లమెంటులో గళం ఎత్తాల్సివచ్చింది. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని వాదించేవారు సైతం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుబట్టక తప్పడంలేదు. తీసుకున్న నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనదనుకున్నా, తమ ప్రయోజనాలకు మరెంతగా ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నా... దాన్ని అమలుచేయడానికి పూనుకునేముందు ఒక పద్ధతిని పాటించాలని, ఆ ప్రక్రియలో అందరి సహాయసహకారాలూ తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు అనుకోలేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించగల వర్గాల అభిప్రాయాలేమిటో తెలుసుకోవడానికి లేదా వారి అపార్థాలనూ, అపోహలనూ పోగొట్టడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండుపై తమకు అలవాటైన కుట్రపూరిత మనస్తతత్వంతోనే వారు ఆలోచించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తున్నవారి మనోభావాలతో తమ స్వీయ ప్రయోజనాలను రంగరించి ఎవరూ అడగని ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకురావడం వెనకున్నది ఈ కుట్ర బుద్ధే. తెలంగాణ సమస్యపై భిన్న పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయని, అదేవిధంగా తామూ చెప్పామని అంటున్న కాంగ్రెస్ నేతల వాదన నయవంచన తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఊరుకోలేదు. అధికారంలో ఉన్నది గనుక ఆ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అసలు అధికారికంగా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందే తాము ఏం చేయబోతున్నారో వారు లీకులు ఇచ్చారు. తమ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీలో చర్చించకముందే, యూపీఏలో తమ భాగస్వామ్యపక్షాల వారితో మాట్లాడకముందే ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారని... ఆ రెండు సమావేశాలూ లాంఛనప్రాయమైన ముద్రలు వేయించుకోవడానికేనని పత్రికలు చదువుతున్నవారికి, చానెళ్లు చూస్తున్నవారికి అర్ధమైంది. ఇక్కడి నాయకులకు ఆ మాత్రం విలువైనా ఇవ్వలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకులైతే, అధికారంపై మమకారం లేనివారే అయితే వీరందరూ ఆ క్షణంలోనే పదవులనుంచి వైదొలగేవారు. అలా చేయలేకపోయారు సరిగదా... ఆంటోనీ కమిటీకి అలవిమాలిన ప్రాముఖ్యతనిస్తూ ఇప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయిందట. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకూ తదుపరి చర్యలు ఉండవట. ఆ కమిటీకి ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర పార్టీలవారూ అభిప్రాయాలు చెప్పవచ్చునట. ఇంతవరకూ వచ్చాక కూడా తమ కబుర్లతో ఇంకా జనాన్ని మభ్యపెట్టగలమని వారనుకుంటున్నారు. ఆంటోనీ కమిటీ మౌలికంగా కాంగ్రెస్ కమిటీ. ఆ కమిటీకి ‘హై పవర్’ అని విశేషణం తగిలించినంతమాత్రాన దానికి అధికార ప్రతిపత్తి రాదు. విభజనవల్ల సమస్యలున్నాయనుకునేవారు ప్రభుత్వంతో మాట్లాడాలని చూస్తారు. తమ మనోభావాలను అది పట్టించుకోవాలని ఆశిస్తారు. అది వినడం లేదనుకున్నప్పుడు దాని మెడలు వంచడానికి ప్రయత్నిస్తారు. అంతేతప్ప కాంగ్రెస్‌కు చెందిన కమిటీని కలవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఏముంటుంది? కలిసి ఏమి మాట్లాడతారు? కొంతవరకూ కాంగ్రెస్ పార్టీకి అది ఉపయోగపడవచ్చు. ఉద్యమాల పర్యవసానంగా పార్టీకి ఉత్పన్నమైన సంకటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దానికి వివరించడానికి ప్రయత్నించవచ్చు. లేదా రాయల తెలంగాణ వంటి తమ రహస్య అజెండాకు దీన్ని వేదికగా చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏర్పాటుచేసుకున్న కమిటీని లోకకల్యాణం కోసం ఆవిర్భవించిన సంస్థగా చిత్రించబోవడం నయవంచన. ఇంతకూ కమిటీలో ఉన్నవారికి విభజనానంతర పరిణామాలపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న భయాలపైగానీ, మొత్తంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైగానీ అవగాహన ఉందనడానికి దాఖలాలు లేవు. అంతటి అవగాహన, శక్తి వీరికుంటే సీడబ్ల్యూసీలోనో, కోర్ కమిటీలోనో విభజన ప్రక్రియకు సంబంధించి మెరుగైన విధానం రూపుదిద్దుకునేది. ముఖ్యంగా గత నాలుగేళ్లలోనూ అన్ని వర్గాల వారితోనూ, అన్ని స్థాయిల్లోనూ చర్చించే ప్రజాస్వామిక ప్రక్రియ అమలయ్యేది. ఇదేమీ లేదు సరిగదా... రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తూ అసలే ఆగ్రహంతో రగులుతున్న రాష్ట్రాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక అస్తిత్వమూ కలిగిన రాయలసీమ ప్రాంత ప్రజలను ఇలాంటి ప్రతిపాదనలతో తాము అపహాస్యం చేస్తున్నామని, వారి మనోభావాలను గాయపరుస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరిచి పోతున్నారు. అడిగింది తెలంగాణ అయితే, పనిలో పనిగా రాయలసీమను విడదీసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందులో భాగంగానే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పోకడలు తెలిసినవారందరూ సరిగానే అంచనా వేస్తున్నారు. ఇలాంటి చేష్టలవల్ల కాంగ్రెస్ మరింత అధోగతిపాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. కనీసం అవసానదశలోనైనా ఈ సంగతిని గ్రహించడం ఆ పార్టీ పెద్దల ఆరోగ్యానికి మంచిది.