జవాబు కావాలి
‘‘కనీస ఆదాయం అనేది చట్టపరమైన హక్కా? కనీసం అంటే ఎంత? పేదలను ఎంపిక చేసే విధానం ఏంటి? బడ్జెట్ ఎంత? ఈ అదనపు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?– ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబులివ్వగలిగితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇది గొప్ప ఆలోచనగా అంగీకరించొచ్చు’’ – యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు
అభివృద్ధి
‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సరికొత్త ఒడిశా రాష్ట్ర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎవరూ నిరుద్యోగులుగా ఉండకుండా, ఎవరూ దారిద్య్రరేఖకు దిగువన లేకుండా చూస్తాం. ఒకే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి కాంగ్రెస్, బీజేడీలు ఒడిశా అభివృద్ధికి చేసిందేమీ లేదు’’ – అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు
లెక్కలు
‘‘నేషనల్ స్టాటస్టికల్ కమిషన్‌లో ప్రభుత్వేతర సభ్యులంతా రాజీనామా చేశారు. దీంతో మరో సంస్థ పళ్లుపీకి నిర్వీర్యం చేసినట్టే. తమ అసమర్థ పాలనలో జరిగిన అవకతవకల డేటా అంతటినీ దాచిపెట్టడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది’’ – అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీ
నియంతృత్వం
‘‘ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ, బలమైన ప్రధాని అనే అంశాలు వ్యవస్థలను బలహీనపరిచే రాజ్యాంగ నియంతృత్వానికి దారితీస్తాయి. అందువల్ల సంకీర్ణ ప్రభుత్వం చెడ్డదేమీ కాదు. డీమోనిటైజేషన్ లాంటి విధానపరమైన నిర్లక్ష్యపు ప్రయోగాలు జరుగవు. ఫెడరల్ స్ఫూర్తి విరాజిల్లుతుంది’’ – రూపా సుబ్రమణ్య జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment