
సాక్షి, సూరత్ : గుజరాత్ సీఎంగా అహ్మద్ పటేల్‌ను అత్యున్నత పదవిలో నిలిపేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ముస్లింలకు పిలుపు ఇస్తూ సూరత్‌లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అహ్మద్ పటేల్ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో అహ్మద్ పటేల్ స్పందించారు. తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని కాదని, భవిష్యత్‌లోనూ సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు.
ఓటమి భయంతో బీజేపీ దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. పార్టీ చీఫ్‌గా ఎన్నికవనున్న రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచార బరిలో సర్వం తానై ముందుండి నడిపిస్తున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఏ ఒక్కరి పేరునూ ఇంతవరకూ ప్రతిపాదించలేదు. తాజా సర్వేల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందని వెల్లడవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బీజేపీని మట్టికరిపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, గుజరాత్‌లో 1998 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.