అహ్మద్‌పటేల్‌కు కష్టాలు | Two more Gujarat congress MLA's submits resignation to speaker | Sakshi
Sakshi News home page

అహ్మద్‌పటేల్‌కు కష్టాలు

Published Fri, Jul 28 2017 12:18 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అహ్మద్‌పటేల్‌కు కష్టాలు - Sakshi

అహ్మద్‌పటేల్‌కు కష్టాలు

గాంధీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ తరఫున గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న అహ్మద్‌ పటేల్‌కు కష్టలొచ్చిపడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటం ఆయన్ను కలవరపెడుతోంది.

గురువారం ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. శుక్రవారం మరో ఇద్దరు ఎమ్మెల్యే తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల బలం క్షీణిస్తుండటంతో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అహ్మద్‌పటేల్‌ విజయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో వైపు గుజరాత్‌ నుంచి రాజ్యసభ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు స్మృతి ఇరానీ కూడా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement