గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్‌బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా మోద్వాదియా గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తన రాజీనామాతో ఆ పార్టీతో నాలుగు దశాబ్ధాల అనుబంధానికి గుడ్‌బై చెప్పారు.
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. అదే విధంగా పార్టీ నుంచి వైదొలగుతున్న విషయంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అర్జున్ మోద్వాదియా లేఖ రాశారు. ప్రజలకు సేవ చేయడంలో తాను నిస్సహాయుడిగా మారినట్లు భావిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అయోధ్యలో రామామందరం ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తిరస్కరించడం తన రాజీనామాకు కారణమని మోద్వాదియా తెలిపారు. కాంగ్రెస్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ప్రజల మనోభావాలను అంచనా వేయడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రాణ ప్రతిష్ట వేడుక దృష్టి మరల్చడానికి, అస్సాంలో గొడవలు సృష్టించడానికి రాహుల్ ప్రయత్నించారని మండిపడ్డారు.
గత నాలుగు దశాబ్దాలుగా త పట్ల చూపుతున్న అభిమానానికి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మోద్వాదియా గతంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విపక్ష నేతగా వ్యవహరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోద్వాదియా పోర్‌బందర్ నుంచి ఎన్నికయ్యారు.
చదవండి: ఆప్ హెడాఫీస్ ఖాళీకి డెడ్‌లైన్ విధించిన సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment