అహ్మదాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోట్ల వర్షం కురిపించారు. ఓ ఫోక్ సింగర్‌పై పోటాపోటీగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. అందుకు సంబంధించిన వీడియో ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌లో చక్కర్లు కొడుతోంది.
గుజరాత్ ఎమ్మెల్యే అంబరీష్ దర్(ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు), బీజేపీ ఎమ్మెల్యే పూనమ్‌బెన్ మాదమ్ ఇద్దరూ తమ అనుచరులతో కలిసి గిర్ సోమ్‌నాథ్ పట్టణంలో ఫోక్ సాంగ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అక్కడ సింగర్ కీర్తిదన్ గధ్వి తన ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఇద్దరూ పోటాపోటీగా డబ్బులు వెదజల్లారు. కార్యక్రమం అయ్యాక అదంతా పోగేస్తే రూ.25లక్షలకు పైగానే అని తేలింది.
కాగా, బీజేపీ నేతపై మైక్రోఫోన్‌తో దాడికి పాల్పడినందుకు.. సభా కార్యక్రమాలకు అడ్డుపడినందుకు అంబరీష్ దర్‌తోపాటు మరో ఎమ్మెల్యే ప్రతాప్ దుధత్‌ను మూడేళ్లపాటు అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment