
గాంధీనగర్: గుజరాత్‌లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.
గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM
— ANI (@ANI) March 8, 2025