కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా | Gujarat Polls Mohansinh Rathva A 10 Time MLA Quit Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్‌బై.. బీజేపీలో చేరిక!

Published Tue, Nov 8 2022 7:26 PM | Last Updated on Tue, Nov 8 2022 7:26 PM

Gujarat Polls Mohansinh Rathva A 10 Time MLA Quit Congress Party - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా మరో సీనియర్‌ నేత, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సింగ్‌ రథ్వా రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకుపైగా ప్రతిపక్షంలోనే కూర్చున్న కాంగ్రెస్‌కు ఆయన రాజీనామాతో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లయింది. మంగళవారం తన రాజీనామాను గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగదీశ్‌ థాకోర్‌కు అందించారు.  

78 ఏళ్ల మోహన్‌సింగ్‌ రథ్వా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీ తీర్థ పుచ్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చోటా ఉదయ్‌పుర్‌(గిరిజన ప్రాతం) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. 2012కు ముందు పావి జెట్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈసారి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు రథ్వా. కానీ, ఆయన కుమారుడు రాజేద్రసింగ్‌ రథ్వాను తన స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. తన నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: నోట్ల రద్దుపై రాహుల్‌ వీడియో.. ‘పేపీఎం’ అంటూ మోదీపై ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement