Senior MLA
-
ఒడిశాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బహిష్కరణ
భువనేశ్వర్: క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో తమ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌట్రేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సురేష్‌కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. జటానీ నియోజకవర్గం నుంచి సురేష్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు మన్మథ్ రౌట్రే బిజూ జనతాదళ్ అభ్యరి్థగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కుమారుడిగా మద్దతుగా నిలుస్తున్నారని, బీజేడీ నేతలతో వేదికను పంచుకుంటున్నారని సురేష్ కుమార్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్‌తో తనది ఐదు దశాబ్దాల అనుబంధమని, తనను బహిష్కరించినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బహిష్కరణపై అధిష్టానంతో మాట్లాడతానని సురేష్‌కుమార్ స్పందించారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సింగ్ రథ్వా రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకుపైగా ప్రతిపక్షంలోనే కూర్చున్న కాంగ్రెస్‌కు ఆయన రాజీనామాతో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లయింది. మంగళవారం తన రాజీనామాను గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్ థాకోర్కు అందించారు. 78 ఏళ్ల మోహన్‌సింగ్ రథ్వా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీ తీర్థ పుచ్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చోటా ఉదయ్‌పుర్(గిరిజన ప్రాతం) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. 2012కు ముందు పావి జెట్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు రథ్వా. కానీ, ఆయన కుమారుడు రాజేద్రసింగ్ రథ్వాను తన స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. తన నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నోట్ల రద్దుపై రాహుల్ వీడియో.. ‘పేపీఎం’ అంటూ మోదీపై ఫైర్ -
నువ్వా.. నేనా !
సాక్షి, గుంటూరు: స్కూల్ సీటు విషయంలో జరిగిన చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దాడికి పాల్పడ్డ వారి పక్షాన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ రాజీ ప్రయత్నాలు చేస్తుండగా.. స్కూల్ యాజమాన్యానికి మద్దతుగా నిలిచిన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో స్కూల్ సీటు వివాదం కాస్తా అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు రేపింది. ఈ వ్యవహారాన్ని నేతలిద్దరూ ప్రిస్టేజ్‌గా తీసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. దాడి ఘటనపై ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కీలక సూత్రధారుల్ని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తలలు పట్టుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాలంటూ సీనియర్ ఎమ్మెల్యే, వద్దంటూ ఎమ్మెల్సీ భీష్మించుకు కూర్చోవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్కూల్ సీటు వివాదంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు ఢీ అంటే ఢీ అంటుండటం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. వివాదం మరింత ముదరక ముందే చినబాబు వద్ద పంచాయతీ పెట్టి గొడవను సద్దుమణచాలనే యోచనలో కొందరు జిల్లా నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో సీటు కోసం వెళ్లిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనుచరులు సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. దీనిపై సీసీ ఫుటేజ్‌లతో స్కూల్ యాజమాన్యం పట్టాభీపురం పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే, 13 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడానికి ఎమ్మెల్సీ ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి రాజీ కుదురుస్తానంటూ ఎమ్మెల్సీ చెప్పడంతో పోలీసులు సైతం కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్కూల్ యాజమాన్యం కూడా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని, ఆ తరువాతే రాజీ అంటూ పోలీసులపై ఒత్తిడి పెంచడంతో వివాదం ముదిరింది. ఎమ్మెల్సీ పలుమార్లు స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసినా రాజీకి రాని పరిస్థితి. దీంతో స్కూల్ సీటు వివాదం కాస్తా ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుగా మారింది. మంత్రి వర్గ విస్తరణ సమయంలో సైతం వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీపడటంతో అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గతంలో ఉన్న విభేదాల వల్లే స్కూల్ సీటు విషయంలో జరిగిన గొడవను ఇద్దరూ ప్రిస్టేజ్‌గా తీసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఈ వివాదం ముదిరి పాకాన పడకముందే చల్లార్చాలనే ఉద్దేశంతో జిల్లా టీడీపీ నేతలు కొందరు చినబాబు వద్ద పంచాయితీ పెట్టి వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
అధినేతపై కాలుదువ్విన సీనియర్ నేత
⇔ రణమా? శరణమా? ⇔ యుద్ధం ప్రకటించి తటపటాయింపు ⇔ అయోమయంలో అనుచర గణం తూర్పు గోదావరి : అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్నీ తానై చక్రం తిప్పిన తలపండిన రాజకీయ నాయకుడాయన. ఎన్టీఆర్ నమ్మిన బంటుల్లో ఒక బంటు ఆయన. ఒకటీ రెండూ కాదు.. రాజకీయాల్లో ఏకంగా ఆరు పదుల వయసు దాటిన ఆరితేరిన నాయకుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ వృద్ధ నేతకు అసలు సీటు ఇవ్వడానికి అధినేత ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేశారు. చారిత్రక నగరంలో సీటు ఆశించగా.. దానికి పొరుగున ఉన్న స్థానం ఇవ్వడంతో ఎలాగోలా సర్దుకుని ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటువంటి నాయకుడు.. సీనియర్ ఎమ్మెల్యే.. మంత్రి పదవి ఆశించడంలో తప్పేముంటుంది? ఇప్పుడున్న మంత్రులకు మించిన అర్హతలు తనకున్నాయని ఆయన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఎంతో అనుభవ శూరుడినైన తనకే మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహావేశాలతో అధినేతపైనే కత్తి దూసి యుద్ధరంగంలోకి దూకేశారు. ఎంతటి ధీశాలైనా ఆయుధాలు సిద్ధం చేసుకున్నాకే బరిలోకి దిగుతాడు. ఒకసారంటూ దిగాక మరణమా? శరణమా? రెండింటిలో ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆ నాయకుడు అధినేతపై మాటల తూటాలైతే పేల్చారు తప్పితే.. యుద్ధానికి ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. అందుకు ఆయనకు ధైర్యం సరిపోవడం లేదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆ నేత పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించిన రోజు చూపిన దూకుడు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. రాజీనామా ఉపసంహరణపై అధినేత నుంచి రాయబారం వస్తుందని ఆశిస్తున్నారని, అందువల్లనే మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటికి అధినేతకంటే చిన్నవాడైన ఓ నాయకుడు వచ్చాడు. ఆయన కూడా తనకున్న పరిచయంతోనే కలిసేందుకు వచ్చానని చెప్పారు. అంటే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతను పూర్తిగా సోదిలో లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే అధినేత విడిచిపెట్టేశారా? అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అడుగు ముందుకేశాక ఆలోచనెందుకో? అసలు యుద్ధానికి కాలు దువ్వినప్పుడే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అటువంటిది ముందుకు అడుగు వేసేశాక ఇప్పుడు ఆలోచించడానికేముంటుంది? అధినేత ఏమైనా సామాన్యుడా? పదవి కోసం పిల్లనిచ్చిన మామ, మహా నాయకుడినే వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న ఘనుడు. అటువంటి నేతను ఢీకొట్టేందుకు ముందుకు వచ్చాక ఇక వెనక్కు తగ్గకూడదు. తగ్గారో చతుర్విధ ఉపాయాల్లో ఆరితేరిపోయిన ఆ అధినేత ముందు నిలవడం కష్టమే. యుద్ధ క్షేత్రంలో ముందుకు వెళ్లడమా లేక అస్త్రాలు విడిచిపెట్టి వెనకడుగు వేయడమా తేల్చుకోలేక నాలుగురోడ్ల కూడలిలో నిలబడ్డట్టుగా ఉంది ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి. అన్నీ తెలిసిన నాయకుడి పరిస్థితే అలా ఉండడంతో.. ఇక ఆయననే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న అరడజను మంది వందిమాగదులు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. గాలికొదిలేసినట్టేనా? రాష్ట్రంలో మంత్రి పదవులు రాని ఎందరో అసంతృప్తవాదులను బుజ్జగింపులు, హెచ్చరికలతో దారికి తెచ్చుకున్న బాబు.. ఈ వృద్ధతరం నేతను గాలికొదిలేశారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి తప్పు చేశామా అని ఆ నాయకుడు అంతర్మధనం చెందుతున్నారని కేడర్ చెబుతోంది. మరోపక్క అధినేత రాయబారం పంపకపోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. రాష్ట్రంలో మరే నాయకుడూ ఈ సీనియర్ ఎమ్మెల్యే స్పందించిన స్థాయిలో స్పందించ లేదనే చెప్పొచ్చు. అందుకే పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఏమైనా ఆదేశాలు వస్తాయా? అనే మీమాంసలో కూడా ఆ నాయకుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇదే అవకాశంగా ఈ వృద్ధ నాయకుడంటే పడని మరో ఇద్దరు నేతలు అధిష్టానం నిర్ణయం కోసం కాచుకుని కూర్చున్నారు. నగరంలో పార్టీ పగ్గాలు తమలో ఒకరికి అప్పగిస్తారనుకుంటూ ఆశల పల్లకీలో వారిద్దరూ ఊరేగుతున్నారు. అధినేతపై విమర్శలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ నాయకుడు లేకుండా వారిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలను ఆర్భాటంగా చేస్తున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల దగ్గర నుంచి, చినబాబు జిల్లా పర్యటన వరకూ అన్నింటా తామే అన్నట్టుగా వారిద్దరూ చేసుకుపోవడం వెనుక చారిత్రక నగరంలో పార్టీని గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో తన తనయుడికి పగ్గాలు అప్పగించాలని పరితపిస్తున్న ఓ నాయకుడు అధినేతకు పితూరీలపై పితూరీలు మోస్తున్నారట! అధినేత మనసులో ఏముందో, తలపండిన నాయకుడి భవిష్యత్తు ఏమవుతుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
‘ఆట’కట్టు!
* దాచేపల్లి పేకాట క్లబ్‌కు తాళం * ఎమ్మెల్యే పీఆర్కే సవాల్‌తో క్లబ్‌పై దృష్టిసారించిన పోలీసు ఉన్నతాధికారులు * ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న క్లబ్ * మాజీ ఎమ్మెల్యే జంగాపై డీఎస్పీ అనుచిత ప్రవర్తనపై ఐజీ ఆగ్రహం * తీరు మార్చుకోవాలంటూ డీఎస్పీకి క్లాస్ సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో నెల రోజులుగా నడుస్తున్న పేకాట క్లబ్‌కు తాళాలు పడ్డాయి. గత నెల 29న నడికుడి మార్కెట్ యార్డులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతి, అక్రమ మైనింగ్, పేకాట క్లబ్ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించడం, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఎమ్మెల్యే పీఆర్కేను గృహ నిర్బంధం చేయడం, మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత జంగా కృష్ణమూర్తిపై గురజాల డీఎస్పీ చేయిచేసుకోవడం వంటి సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టి పల్నాడులోని అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలపై పడింది. పేకాట క్లబ్‌ను ఎందుకు మూయించలేదు? పేకాట క్లబ్ నడుస్తున్నా స్థానిక పోలీసు అధికారులు ఎందుకు మూయించలేదంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిని మూయించినట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటో తేదీన గురజాల డీఎస్పీ నాగేశ్వరరావును తన కార్యాలయానికి పిలిపించిన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ పల్నాడు ప్రాంతంలో నడుస్తున్న పేకాట క్లబ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత నెల 29న దాచేపల్లి పోలీస్‌స్టేçÙన్లో పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలపై డీఎస్పీ అమానుషంగా దాడిచేసి, లాఠీతో కొట్టిన విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పల్నాడు ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐజీ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. పోలీసు బాధ్యతలను ఏవిధంగా నిర్వర్తించాలి.. ప్రజాప్రతినిధులతో ఎలా నడుచుకోవాలనే విషయంపై డీఎస్పీకి ఐజీ క్లాస్ పీకినట్లు తెలిసింది. మొత్తానికి జిల్లాలో ఓ డివిజనల్ స్థాయి అధికారిని ఐజీ తన కార్యాలయానికి పిలవడంతో పాటు అనధికారికంగా నడుస్తున్న పేకాట క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో ‘క్లబ్’ పల్నాడు ప్రాంతంలో పేకాట క్లబ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో కొంతకాలం మూతపడ్డా గత నెల మొదటి వారంలో మళ్లీ తెరిచి యధేచ్ఛగా పేకాట ఆడిస్తున్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో పేకాట క్లబ్ నడుస్తుండటంతో పోలీసులు సైతం దీనిజోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే సవాల్.. పేకాట క్లబ్ కారణంగా రైతులు, యువకులు డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోరాటం చేయడంతో పాటు పేకాట క్లబ్ వద్దకు వచ్చి బండారం బట్టబయలు చేస్తానంటూ సవాల్ చేయడంతో జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో పేకాట క్లబ్‌పై దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతోనే గురువారం సాయంత్రం క్లబ్‌కు తాళాలు పడినట్లు చెబుతున్నారు. అయితే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తున్న క్లబ్ మూతపడటంతో మళ్లీ దాన్ని తెరిపించేందుకు సదరు సీనియర్ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనేక మంది పోలీసులు క్లబ్‌ను మూయించినప్పటికీ తిరిగి తెరిపించిన ఆ ఎమ్మెల్యే ఈసారి కూడా పేకాట క్లబ్‌ను తెరిపించి జిల్లాలో తన పరపతిని కాపాడుకోవాలని పరితపిస్తున్నట్లు తెలుస్తోంది.