భువనేశ్వర్: క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో తమ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌట్రేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సురేష్కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు.
జటానీ నియోజకవర్గం నుంచి సురేష్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు మన్మథ్ రౌట్రే బిజూ జనతాదళ్ అభ్యరి్థగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కుమారుడిగా మద్దతుగా నిలుస్తున్నారని, బీజేడీ నేతలతో వేదికను పంచుకుంటున్నారని సురేష్ కుమార్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్‌తో తనది ఐదు దశాబ్దాల అనుబంధమని, తనను బహిష్కరించినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బహిష్కరణపై అధిష్టానంతో మాట్లాడతానని సురేష్కుమార్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment