expelled from party
-
ఒడిశాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బహిష్కరణ
భువనేశ్వర్: క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో తమ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌట్రేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సురేష్‌కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. జటానీ నియోజకవర్గం నుంచి సురేష్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు మన్మథ్ రౌట్రే బిజూ జనతాదళ్ అభ్యరి్థగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కుమారుడిగా మద్దతుగా నిలుస్తున్నారని, బీజేడీ నేతలతో వేదికను పంచుకుంటున్నారని సురేష్ కుమార్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్‌తో తనది ఐదు దశాబ్దాల అనుబంధమని, తనను బహిష్కరించినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బహిష్కరణపై అధిష్టానంతో మాట్లాడతానని సురేష్‌కుమార్ స్పందించారు. -
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ!
లఖ్‌నవూ: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాంపుర్ సదర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే నవాబ్ కాజిమ్ అలి ఖాన్‌పై వేటు వేసినట్లు యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ‘రాంపుర్ బైపోల్లో బీజేపీ అభ్యర్థికి మీరు మద్దతుగా నిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా మిమ్మల్ని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం.’అని పేర్కొన్న లేఖను మాజీ ఎమ్మెల్యే నవాజ్ కాజిమ్ అలి ఖాన్‌కు పంపించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్ కిషోర్ శుక్లా. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ శాసనసభ్యత్వం రద్దయిన క్రమంలో.. రాంపుర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప అనివార్యమైంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాంపుర్ సదర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఖాన్.. ఓడిపోయారు. 2016లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీ చదవండి: పోలీసులకు ఎదురుపడిన క్రిమినల్స్.. సినిమాను తలపించిన సీన్..! -
అళగిరి బల ప్రదర్శన
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు. అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు. -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
శశికళపై జయలలిత వేటు
-
శశికళపై జయలలిత వేటు
అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు వేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే.. రాజీనామా చేయడానికి తిరస్కరించిన శశికళ.. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడమే కాక, అక్కడ కన్నీరు కూడా పెట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను.. అన్నాడీఎంకే ఎంపీ శశికళ చెంపమీద కొట్టిన విషయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే. పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వ్యవహరించారంటూ శశికళపై జయలలిత మండిపడ్డారు. ఆదివారం నాడు పోయస్ గార్డెన్స్‌కు వెళ్లి వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.