డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్‌: అళగిరి | Take me in party or face consequences | Sakshi
Sakshi News home page

డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్‌: అళగిరి

Published Tue, Aug 28 2018 2:54 AM | Last Updated on Tue, Aug 28 2018 2:54 AM

Take me in party or face consequences - Sakshi

మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్‌ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement