extreme Comments
-
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం
శివమొగ్గ/రాయ్‌చూర్: కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అంటూ జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్‌చూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈ సెక్స్ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే సెకన్లలో ప్రజ్వల్‌ను అరెస్ట్చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్‌ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి?’’ అని మోదీని రాహుల్ నిలదీశారు. కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు ‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్‌ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్‌ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు. ‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్‌కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్ రేపిస్ట్ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు. సమానత్వం కోరితే నక్సలైట్లు అంటున్నారు ‘‘సమానత్వం కోరితే వారిని బీజేపీ చీఫ్ నడ్డా నక్సలైట్ అంటున్నారు. దళితులు, వెనుకబడిన వాళ్లు, గిరిజనులు సమానత్వం కావాలంటున్నారు. అంతమాత్రాన వారంతా నక్సలైట్లు అయిపోతారా? ఇలా మాట్లాడిన నడ్డా వెంటనే తన పార్టీ చీఫ్ పదవికి రాజీనామాచేయాలి. నడ్డా వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్‌చేశారు. -
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్‌స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
పిల్ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు: సుప్రీంకు కేంద్రం హితవు
న్యూఢిల్లీ: ప్రజాహిత వాజ్యాల (పిల్)ను విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం హితవు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని స్పష్టం చేసింది. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. దేశంలోని 1,382 జైళ్లలో ఖైదీల పరిస్థితి అమానవీయంగా ఉందంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా, అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్, జడ్జీల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఏజీ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు. కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. లక్షన్నర కోట్లతో ఏమైనా చేయొచ్చుగా.. ఏజీ వ్యాఖ్యలకు న్యాయమూర్తులు స్పందిస్తూ ‘ మా తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు. మా తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా? నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 30 వేల కోట్ల రూపాయలతో మీరు వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా, జైలు సంస్కరణలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జైళ్లలో పెరుగుతున్న ఖైదీల రద్దీ సహా ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది. -
షా వ్యాఖ్యలు అమర్యాదకరం
కోలారు/ముళబాగిలు/కేజీఎఫ్: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్ష పార్టీల నేతలను జంతువులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీజేపీ నాయకులూ విలువలేని వారని అమిత్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంద న్నారు. మోదీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు పాములు, ముంగి సలు, కుక్కలు, పిల్లుల్లా ఏకమవుతున్నాయని అమిత్ అనడం తెల్సిందే. ‘అమిత్, బీజేపీ, ఆరెస్సెస్‌ల అభిప్రాయం ప్రకారం దేశంలో ఇద్దరే జంతువులు కారు. వారిలో ఒకరు మోదీ. మరొకరు అమిత్. వీరు జంతువులుగా భావించే మిగతా వారిలో దళి తులు, మైనారిటీలే కాదు అడ్వాణి, జోషి, గడ్కారీ సైతం ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్షాలు పాములు, కుక్కలు: అమిత్
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాడాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఆయన పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులతో పోల్చారు. తర్వాత ఆ పార్టీలను జంతువులతో పోల్చడం తన ఉద్దేశం కాదని షా వివరణ ఇచ్చారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ర్యాలీలో అమిత్ పాల్గొన్నారు. ‘2019 ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వరదలు వచ్చినప్పుడు అంతా కొట్టుకుపోతుంది. వటవృక్షం (మర్రి చెట్టు) మాత్రమే వరదను తట్టుకుని నిలబడుతుంది. పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులు ఇతర జంతువులన్నీ అప్పుడు వరద నుంచి తమను తాము కాపాడుకోవడానికి వటవృక్షం మీదకే చేరుతాయి. ప్రధాని మోదీ అనే వరద కారణంగా ఆ జంతువులు, సరీసృపాలన్నీ ఎన్నికల కోసం దగ్గరవుతున్నాయి’ అని షా తన ప్రసంగంలో అన్నారు. ప్రతిపక్ష పార్టీలను జంతువులతో పోల్చడం అమిత్ దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ఇవి ఆయన ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. నా ఉద్దేశం అది కాదు.. తర్వాత షా మీడియాతో మాట్లాడుతూ సారూప్య సిద్ధాంతాలు లేని పార్టీలన్నీ మోదీ భయం వల్లనే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘పాముకు, ముంగిసకు ఎన్నో తేడాలున్నాయి. ఎంతో భిన్నమైన ఎస్పీ, బీఎస్పీలు కలసి ఇటీవల బీజేపీపై పోటీ చేశాయి. కూటమి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి పార్టీల సిద్ధాంతాలు కూడా వేర్వేరు. కానీ ఎన్నికల కోసం అవి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని అన్నారు. రిజర్వేషన్లను తొలగించం.. తొలగించనివ్వం ర్యాలీలో రిజర్వేషన్లపై షా మాట్లాడుతూ ‘రాహుల్, పవార్ (కాంగ్రెస్, ఎన్సీపీల అధ్యక్షులు)! ఇది వినండి. రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు. మీరు అలా చేయాలనుకున్నా మేం చేయనివ్వం’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను తాము ఎత్తేయాలనుకుంటున్నట్లు రాహుల్, మరికొందరు దుష్ప్రచారం చేస్తున్నారనీ, అది పూర్తిగా అబద్ధమని షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకూ ఎంతో చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో ఓటేయాల్సిందిగా ప్రజలను కోరతామనీ, ప్రతిపక్షాల్లాగా ఒట్టి హామీలు ఇవ్వబోమన్నారు. సిద్ధరామయ్య చెబుతున్నట్లు తాను జైన మతస్తుడను కాదనీ, హిందూ వైష్ణవుడనని చెప్పారు. -
'తాగి, సోయితప్పి కాల్చుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు'
♦ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై తీవ్ర వ్యాఖ్యలు ♦ కనీస ఆధారాలను పరిశీలించని ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి ♦ తాగి, సోయితప్పి కాల్చుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు ♦ మరణ వాంగ్మూలం కూడా తాగుబోతు రాతేనన్న విచారణాధికారి ♦ ఏఎస్పీ తీరుపై పోలీసు వర్గాల్లోనే విస్మయం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పైఅధికారుల అవినీతి, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఉదంతంపై విచారణ పక్కదారి పడుతోంది. ఆ విచారణ ఎలా జరగబోతోందనే దానిపై విచారణ అధికారి ప్రతాప్‌రెడ్డి అప్పుడే ‘స్పష్టత’ ఇచ్చారు. విచారణ బాధ్యతలు చేపట్టి 12 గంటలు గడవక ముందే.. కనీసం ప్రాథమిక సమాచార సేకరణ కూడా లేకుండానే... రామకృష్ణారెడ్డి ఆత్మహత్య అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామకృష్ణారెడ్డి తాగి, సోరుుతప్పి కాల్చుకున్నాడని.. తెలుగు భాష కూడా సరిగా రాయలేక పోయాడని.. మరణ వాంగ్మూలం కూడా తాగుబోతు రాతలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనీసం వైద్యుల ధ్రువీకరణ తీసుకోకుండానే ప్రతాప్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కనీస పరిశీలన కూడా లేకుండానే.. ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డికి విచారణ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి.. గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సిద్దిపేట డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్లు రాసిన పోలీసులను పిలిచి, వారి నుంచి ప్రాథమిక వివరాలను తీసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరణ వాంగ్మూలం అంటే ఆత్మ ప్రభోదమని న్యాయస్థానాలు కూడా భావిస్తాయి. కానీ విచారణ అధికారి ప్రతాప్‌రెడ్డి మాత్రం సూసైడ్ నోట్ మీద కనీస ప్రాథమిక పరిశీలన, పరిశోధన లేకుండానే తాగుబోతు రాతలుగా అభివర్ణించారు. తాగి విచక్షణ కోల్పోయాడు కాబట్టి పోతూ పోతూ అధికారుల మీద రాసిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రామకృష్ణారెడ్డి మద్యం తాగి ఉన్నాడా, లేదా అన్న అంశాన్ని వైద్య నివేదికలు మాత్రమే తేల్చాలి. రామకృష్ణారెడ్డి మృతదేహానికి గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు బాలకృష్ణ పోస్టుమార్టం చేశారు. ఆయన నివేదిక ఇవ్వలేదు. కనీసం డాక్టర్ నుండి షార్ట్ రిపోర్టును విచారణాధికారి తీసుకోలేదు. ఇవేమీ లేకుండానే రామకృష్ణారెడ్డి తాగి, విచక్షణ కోల్పోరుు కాల్చుకున్నారని చెప్పడాన్ని బట్టి విచారణాధికారి ఆంతర్యమేమిటో స్పష్టమవుతోందని కొందరు పోలీసులే పేర్కొంటున్నారు. ఆత్మ సంఘర్షణనూ తప్పుబట్టిన అధికారి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఎస్సై రామకృష్ణారెడ్డి చావుకు బతుకుకు మధ్య మూడున్నర గంటల పాటు అంతర్మథనం చెందారు. తనకు ఆప్తులు అనుకున్న వారితో మాట్లాడారు. అధికారులు తనను వేధిస్తున్న తీరును వివరించారు. ఆదుకోవాలని అర్థించారు. తనపై పోలీసు అధికారి, ఇతర పోలీసులతో కూడా మాట్లాడారు. భార్యకు ఫోన్ చేసి ‘నేను పోతున్నా.. పిల్లలు జాగ్రత్త’ అని చెప్పారు. తీవ్రంగా ఆత్మ సంఘర్షణకు లోనయ్యారు. ఇలా లోనైన వారిలో కాళ్లు, చేతులు వణకడం.. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం, సరిగా రాయలేకపోవడం వంటివి జరుగుతాయని... రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కూడా అలాంటి సంఘర్షణ మధ్య రాసినదేనని మానసిక నిపుణులు అంటున్నారు. విచారణాధికారి మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ అంశంపై శుక్రవారం మాట మార్చిన విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎస్సై ఆత్మహత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ హైదరాబాద్: ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్చా ర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదికను ఈ నెల 30లోగా తమకు అందివ్వాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతాప్‌రెడ్డిని తప్పించాలి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతల నుంచి ప్రతాప్‌రెడ్డిని తప్పించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విచారణ అధికారి ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి ప్రకటన చేశారని.. వ్యతిరేక సాక్షులు రావద్దనేలా సంకేతాన్ని పంపారని విమర్శించారు. అలాంటి అధికారితో న్యాయం జరగదని.. ఈ ఘటనపై సీబీసీఐడీ అధికారులతో విచారణ జరపాలని కోరారు.