కోలారు/ముళబాగిలు/కేజీఎఫ్: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్ష పార్టీల నేతలను జంతువులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీజేపీ నాయకులూ విలువలేని వారని అమిత్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంద న్నారు.
మోదీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు పాములు, ముంగి సలు, కుక్కలు, పిల్లుల్లా ఏకమవుతున్నాయని అమిత్ అనడం తెల్సిందే. ‘అమిత్, బీజేపీ, ఆరెస్సెస్‌ల అభిప్రాయం ప్రకారం దేశంలో ఇద్దరే జంతువులు కారు. వారిలో ఒకరు మోదీ. మరొకరు అమిత్. వీరు జంతువులుగా భావించే మిగతా వారిలో దళి తులు, మైనారిటీలే కాదు అడ్వాణి, జోషి, గడ్కారీ సైతం ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment