న్యూఢిల్లీ: విషసర్పం, విషకన్య, పనికిమాలిన కుమారుడు. ఇలా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు శ్రుతి మించుతున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహించింది. పార్టీలు, స్టార్ ప్రచారకులు సంయమనం పాటించాలంటూ హితవు పలికింది.
ఆమోదనీయం కాని పదజాలంతో ఎన్నికల వాతావరణాన్ని పాడుచేయొద్దని సూచించింది. కోడ్‌కు అనుగుణంగా హుందాగా నడచుకోవడం పార్టీ ల విధి అని స్పష్టం చేసింది. మరోవైపు, బీజేపీ స్టార్ ప్రచారకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విద్వేష ప్రసంగాలతో కర్ణాటక ప్రజలను రెచ్చగొట్టజూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రచారం చేయకుండా వారిపై తక్షణం నిషేధం విధించాలని ఈసీని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment